The India-Russia friendship is not restricted to their respective capital cities. We have put people at the core of this relationship: PM
A proposal has been made to have a full fledged maritime route that serves as a link between Chennai and Vladivostok: PM
India and Russia realise the importance of a multipolar world. We are working together on many global forums like BRICS and SCO: PM

యువ‌ర్ ఎక్స్‌లెన్సీ అధ్య‌క్షుడు శ్రీ పుతిన్‌,
 
మిత్రులారా,
న‌మ‌స్కారాలు,
DobreVecher!

యావ‌త్తు ప్ర‌పంచం లో  ఎక్కడ‌యితే ముందుగా తొలి సంధ్య చోటు చేసుకొంటుందో, ఎక్క‌డ‌యితే మ‌న ర‌ష్యన్ మిత్రుల అడ్డ‌గింపు అనేదే లేన‌టువంటిదైన విజ‌యం తాలూకు స్వ‌భావం యావ‌త్తు ప్ర‌పంచాని కి ప్రేర‌ణ‌నిచ్చిందో, మ‌రి అలాగే ఎక్క‌డ‌యితే 21వ శ‌తాబ్దం లో మాన‌వ వికాసం తాలూకు నూత‌న గాథ‌ లు లిఖింప‌బ‌డుతున్నాయో- అటువంటి ఒక గొప్ప కార్య స్థ‌ల‌మైన వ్లాదివోస్తోక్ కు విచ్చేయ‌డం నాకు ఎంతో సంతోషం గా ఉంది.  మ‌రి నా ప్రియ మిత్రుడు మాన్య శ్రీ పుతిన్ పంపిన ఆహ్వానం వ‌ల్ల ఇది సాధ్య‌ప‌డింది.  దీని కి గాను నేను నా మిత్రుడు, అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నా హృద‌యాంత‌రాళం లో నుండి ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.  వ్లాదివోస్తోక్ ను సంద‌ర్శించేందుకు భార‌త‌దేశం యొక్క ప్ర‌ధాన మంత్రి ఒకరి కి ల‌భించిన‌టువంటి ప్ర‌త్యేక అధికారం తో కూడిన అవ‌కాశమే ఈ ఆహ్వానం.  ఇందుకు గాను నేను నా స్నేహితుడు, అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు కృత‌జ్ఞుడి నై వుంటాను.

 అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ తో పాటు నేను భార‌త‌దేశాని కి మ‌రియు ర‌ష్యా కు మ‌ధ్య చోటు చేసుకొన్న 20వ వార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాల్గొన‌డం ఒక ఆనంద‌దాయ‌క‌మైన‌ చారిత్ర‌క కాక‌తాళీయ ఘ‌ట‌న గా ఉన్న‌ది.  2001వ సంవ‌త్స‌రం లో ఎప్పుడ‌యితే ఇండో – ర‌ష్య‌న్ సమిట్ ర‌ష్యా లో ఒక‌టో సారి జ‌రిగిందో అప్పుడు నా మిత్రుడు శ్రీ పుతిన్ ర‌ష్యా అధ్య‌క్షుని గా ఉండ‌గా నేనేమో అప్ప‌టి ప్ర‌ధాని అట‌ల్ జీ కి చెందిన ప్ర‌తినిధివ‌ర్గం లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్నాను.  అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ యొక్క మ‌రియు నా యొక్క రాజ‌కీయ ప్ర‌స్థానం లో రెండు దేశాల మ‌ధ్య స్నేహ స‌హ‌కారాలు శ‌రవేగం గా వ‌ర్ధిల్లి, చాలా దూరం పాటు ప‌య‌నించాయి.  ఇదే కాలం లో మ‌న ప్ర‌త్యేక‌మైన‌టువంటి మ‌రియు విశేషాధికారాల‌తో కూడిన‌టువంటి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మ‌న దేశాల వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల కు ఉప‌యోగ‌ప‌డ‌ట‌ం ఒక్కటే కాకుండా, మరొక విధం గా చెప్పాలి అంటే, దాని ని మేము ప్ర‌జ‌ల యొక్క అభివృద్ధి తో, వారి ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాల తో జోడించాము కూడాను.  అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ మ‌రియు నేను ఈ సంబంధాన్ని ప్రాతినిధ్యం ద్వారా, విశ్వాసం ద్వారా స‌హ‌కారం లో స‌రిక్రొత్త శిఖ‌రాల కు తీసుకుపోయాము.  మ‌రి దీని తాలూకు కార్య సిద్ధులు కేవ‌లం ప‌రిమాణాత్మ‌క‌మైన మార్పుల‌నే కాదు, గుణాత్మ‌క‌మైన మార్పుల‌ ను కూడా తీసుకు వ‌చ్చాయి.  ఒకటోది, మేము స‌హ‌కారాన్ని ప్ర‌జా రంగం పరిధి లో నుండి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి, దాని కి ప్రైవేటు ప‌రిశ్ర‌మ యొక్క అపార‌మైన‌టువంటి శ‌క్తి ని జ‌త ప‌ర‌చాము.  ఈ రోజు న మనము డ‌జ‌న్ ల కొద్దీ వ్యాపార‌పు ఒప్పందాల ను క‌లిగివున్నాము.

ర‌క్ష‌ణ వంటి వ్యూహాత్మ‌క రంగాల లో సైతం భార‌త‌దేశం లో రెండు దేశాల జాయింట్ వెంచ‌ర్ కంపెనీ లు ఉత్ప‌త్తి చేసే ర‌ష్య‌న్ సామ‌గ్రి తాలూకు విడి భాగాల కు సంబంధించి నేడు కుదిరిన ఒప్పందం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్స‌హిస్తుంది.  ఈ ఒప్పందం, ఇంకా ఈ సంవ‌త్స‌రం ఆరంభం లో ఎకె-203 కు సంబంధించిన జాయింట్ వెంచ‌ర్ లు మ‌న ర‌క్ష‌ణ సంబంధ స‌హ‌కారాని కి కొనుగోలుదారు- అమ్మ‌కందారు ల‌తో కూడిన ప‌రిమిత ప‌రిధి కి ఆవ‌ల స‌హ ఉత్ప‌త్తి యొక్క ఘన పునాది ని ఏర్ప‌ర‌చిన చ‌ర్య‌లు గా ఉన్నాయి.  భార‌త‌దేశం లో ర‌ష్యా తో క‌ల‌సి ప‌ర‌మాణు ప్లాంటు ల సంఖ్య ను పెంచ‌డ‌మ‌నేది కూడా ఈ రంగం లో మ‌న మ‌ధ్య సిస‌లైన భాగ‌స్వామ్యాన్ని అభివృద్ధి ప‌రుస్తున్న‌ది.   రెండోది, మనం మన సంబంధాల ను భార‌త‌దేశం లోని రాష్ట్రాల రాజ‌ధానులు మ‌రియు ర‌ష్యా కు వెలుప‌లి ప్రాంతాల రాజ‌ధానుల కు అతీతంగా  పెంపొందింప చేసుకొంటున్నాము.  ఒక ప‌క్క‌ నేను చాలా కాలం పాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉండ‌టం మ‌రియు ర‌ష్యా యొక్క భూ భాగాల లోని అవ‌కాశాలు మ‌రియు శ‌క్తి సామ‌ర్ధ్యాల ను గురించిన అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు తెలిసివుండటం వల్ల ఇది ఆశ్చ‌ర్యాన్ని రేకెత్తించే అంశమేమీ కాదు.  ఈ కార‌ణం గా ఆయ‌న ఈస్ట‌ర్న్ ఎక‌నామిక్ ఫోర‌మ్ ను ఒప్పించ‌డం మ‌రియు భార‌త‌దేశం వంటి ఒక వైవిధ్యం తో కూడిన దేశం తో అది సంధానింప‌బ‌డ‌టాని కి ఉన్న‌టువంటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవ‌డం స్వాభావిక‌మే.  దీని ని మీరు ఎంత‌ గా అభినందించినా సరే, అది త‌క్కువే అవుతుంది.

ఆయ‌న ఆహ్వానాన్ని అందుకొన్న వెనువెంట‌నే, ఈ విష‌యం లో మేము చాలా గంభీరం గా స‌న్న‌ద్ధులం కావ‌డం మొద‌లుపెట్టాము.  దీని కోసం భార‌త‌దేశ వాణిజ్య మంత్రి, నాలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో పాటు 150 మంది కి పైగా వ్యాపార రంగ ప్ర‌ముఖులు వ్లాదివోస్తోక్ కు త‌ర‌లి వ‌చ్చారు.  దూర ప్రాచ్య ప్రాంత ప్ర‌త్యేక దూత తో, దూర ప్రాచ్యం లోని 11 మంది గ‌వ‌ర్న‌ర్‌ల తో స‌మావేశం కావ‌డం చాలా చ‌క్క‌ని ఫ‌లితాల‌ ను ఇచ్చింది.  రాష్ట్రాల‌ కు మ‌రియు ప్రాంతాల కు మ‌ధ్య సంబంధాలు ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను క‌నుగొన్నాయి.  బొగ్గు, వ‌జ్రం, గ‌ని త‌వ్వ‌కాలు, రేర్ అర్థ్, వ్య‌వ‌సాయం, క‌ల‌ప, కాగితం- గుజ్జు మ‌రియు ప‌ర్య‌ట‌న‌ రంగాలు అనేక నూతనమైన అవ‌కాశాల ను ప్ర‌సాదించాయి.  సంధానాన్ని పెంచ‌డం కోసం మ‌రి ఇప్పుడు వ్లాదివోస్తోక్ కు, చెన్నై కు మ‌ధ్య స‌ముద్ర మార్గాన్ని కూడా ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.  మూడోది, మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మేము చాలా మేర‌కు వివిధీక‌రించాము.  దాని కి కొత్త పార్శ్వాల‌ ను జోడించాము.  ర‌ష్యా కు, భార‌త‌దేశాని కి మ‌ధ్య ఒక్క చ‌మురు గ్యాస్ ఒప్పందాలు మాత్ర‌మే కాకుండా ఒక దేశం మ‌రొక దేశం యొక్క హైడ్రోకార్బ‌న్ రంగం లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ని రీతి లో పెట్టుబ‌డి పెట్ట‌డం అనేది ప్ర‌స్తుతం ప‌తాక శీర్షిక‌ కు ఎక్కేటటువంటి ముఖ్యాంశం.  ఈ రంగం లో స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఓ 5 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి క‌లిగిన మార్గ సూచీ మ‌రియు దూర ప్రాచ్య ప్రాంతాల‌ లో, ఆర్క్ టిక్ లో హైడ్రో కార్బ‌న్ లు, ఇంకా ఎల్ ఎన్ జి అన్వేష‌ణ‌ లో స‌హ‌క‌రించుకోవాల‌ని స‌మ్మ‌తించ‌డ‌మైంది.  అంత‌రిక్షం లో మ‌న సుదీర్ఘ సాన్నిహిత్యం వినూత్న శిఖ‌రాల ను తాకుతోంది.  భార‌త‌దేశ వ్యోమ‌గాములు భార‌తీయ మాన‌వ స‌హిత రోద‌సి యాత్ర అయిన‌టువంటి ‘గ‌గ‌న్‌యాన్’ కై ర‌ష్యా లో శిక్ష‌ణ ను అందుకోనున్నారు.  రెండు ప‌క్షాల పెట్టుబ‌డుల పూర్తి సామ‌ర్ధ్యాన్ని అందుకోవ‌డం కోసం ఒక పెట్టుబ‌డి ప‌రిర‌క్ష‌ణ ఒప్పందాన్ని త్వ‌ర‌లో కుదుర్చుకోవాల‌ని మేము అంగీకారాని కి వ‌చ్చాము.  భార‌త‌దేశం యొక్క ‘ర‌ష్యా ప్ల‌స్ డెస్క్’ మ‌రియు ర‌ష్యా యొక్క ఫార్ ఈస్ట్ ఇన్‌ వెస్ట్‌మెంట్ ఎండ్ ఎక్స్‌పోర్ట్  ఏజెన్సీ కి చెందిన ముంబ‌యి కార్యాల‌యం ప‌ర‌స్ప‌ర పెట్టుబ‌డుల కు రంగాన్ని సిద్ధం చేస్తాయి.

మిత్రులారా,

మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాని కి నూత‌న అధ్యాయాల‌ ను కూడా జోడించ‌డం జ‌రుగుతోంది.  రెండు దేశాల కు మ‌ధ్య త్రివిధ ద‌ళాల విన్యాసం ‘ఇంద్ర‌-2019’ మ‌న మ‌ధ్య విస్త‌రిస్తున్న విశ్వాసాని కి సంకేతం గా నిలుస్తోంది.   ఎప్పుడు అవ‌స‌రం ఎదురుప‌డినా స‌రే, ర‌ష్యా మ‌రియు భార‌త‌దేశం ప్ర‌పంచం లోని సాధార‌ణ ప్ర‌దేశాల లో మాత్ర‌మే క‌ల‌సి ప‌ని చేయ‌డం కాకుండా ఆర్కిటిక్ లో, అంటార్కిటికా లో కూడా క‌ల‌సి ప‌ని చేస్తాయి.  ప్ర‌స్తుత యుగం లో శాంతి కోసం మ‌రియు స్థిర‌త్వం కోసం బ‌హుళ ధ్రువ ప్ర‌పంచం అత్యంత అవ‌స‌రం అన్న సంగ‌తి ఇరు దేశాల కు మ‌హా బాగా తెలిసిందే.  మ‌రి ఈ బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించాలి అంటే మ‌న స‌హ‌కారం, స‌మ‌న్వ‌యాల యొక్క పాత్ర ముఖ్య‌మైంది అవుతుంది.  ఈ కార‌ణం గా బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’)లో, ఎస్‌సిఒ లో, ఇంకా ఇత‌ర ప్ర‌పంచ వేదిక‌ల లో మనం స‌న్నిహితం గా స‌హ‌క‌రించుకొంటున్నాము.  ఈ రోజు న మేము అనేక ప్రాంతీయ మ‌రియు ప్ర‌పంచ అంశాల పై దాప‌రికం లేకుండా సార్ధ‌క చ‌ర్చ‌ల‌ ను జ‌రిపాము.  భార‌త‌దేశం ఒక స్వేచ్ఛాయుత‌మైన‌, భ‌ద్ర‌మైన‌, అవిభాజ్యమైన‌, శాంతియుత‌మైన మ‌రియు ప్రాజాస్వామ్య‌ యుత‌మైన అఫ్గానిస్తాన్ ను చూడాల‌ని ఆకాంక్షిస్తోంది.  ఏ దేశం యొక్క ఆంత‌రంగిక వ్య‌వ‌హారాలలోనైనా బాహ్య ప్ర‌మేయం త‌గ‌దు అని మ‌న ఇరు ప‌క్షాలు చెప్తున్నాయి.  భార‌త‌దేశం యొక్క స్వేచ్ఛాయుత‌మైన, దాప‌రికం లేన‌టువంటి స‌మ్మిళిత‌మైన ఇండో- ప‌సిఫిక్ వైఖరి పట్ల కూడా ఒక ఫ‌ల‌ప్ర‌ద‌మైన‌టువంటి చ‌ర్చ ను మేము జ‌రిపాము.  సైబ‌ర్ సెక్యూరిటీ, ఉగ్ర‌వాద నిరోధం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ల వంటి రంగాల లో ర‌ష్యా మ‌రియు భార‌త‌దేశం స‌హ‌క‌రించుకొంటాయ‌ని, ఆయా అంశాల‌ లో ప‌టిష్టీక‌ర‌ణ‌ కు కృషి చేస్తాయ‌ని అంగీక‌రించాము.  వ‌చ్చే సంవ‌త్స‌రం లో పులుల సంర‌క్ష‌ణ అంశం పై ఒక ఉన్న‌త స్థాయి చ‌ర్చా వేదిక ను నిర్వ‌హించాల‌ని ర‌ష్యా, ఇంకా భార‌త‌దేశం అంగీక‌రించాయి.

ఈ ఆహ్వానాన్ని పంపినందుకుగాను నా మిత్రుడు, అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నేను మ‌రొక్కమారు నా యొక్క అమిత కృత‌జ్ఞ‌త ను వ్య‌క్తం చేస్తున్నాను.  ఆయ‌న తో క‌ల‌సి రేప‌టి రోజు న ఈస్ట‌ర్న్ ఎక‌నామిక్ ఫోర‌మ్ కు హాజ‌రు కావ‌డం కోసం నేను నిరీక్షిస్తున్నాను.  వ‌చ్చే సంవ‌త్స‌రం లో వార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం కోసం అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ భార‌త‌దేశాన్ని ఎప్పుడెప్పుడు సంద‌ర్శిస్తారా అని నేను ఎదురుచూస్తున్నాను.  2020వ సంవ‌త్స‌రం లో బ్రిక్స్ మ‌రియు ఎస్‌సిఒ స‌మావేశాల కు ర‌ష్యా అధ్య‌క్ష‌త ను వ‌హించ‌నుంది.  అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ ఆధ్వ‌ర్యం లో ఈ సంస్థ లు సాఫ‌ల్య‌త లో నూత‌న రికార్డుల ను సృష్టిస్తాయ‌ని నేను న‌మ్ముతున్నాను.  దీని కోసం భార‌త‌దేశం మ‌రియు వ్యక్తిగతం గా నా త‌ర‌ఫున సైతం అన్ని ర‌కాల స‌హాయం అందించడం జరుగుతుంది.  

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు

 
SpasibaBalshoi!

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage