22 lakh houses to be constructed in UP, 21.5 already approved, 14 lakh families already got their housing unit
Guru Saheb’s life and message inspires us to take on the challenges while following the path of service and truth: PM Modi
Uttar Pradesh is among the states that are moving the fastest on building houses for the poor: PM Modi
Aatmnirbhar Bharat is directly linked to the self-confidence of the country’s citizens and a house of one’s own enhances this self-confidence manifold: PM

‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న - గ్రామీణ్’ ప‌థ‌కం లో భాగం గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో 6 ల‌క్ష‌ల‌కు పైగా ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జ‌రిగిన కార్య‌క్ర‌మం లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భం లో ల‌బ్ధిదారుల‌తో ఆయ‌న మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ల‌తో పాటు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాల్గొన్నారు.

‘ప్ర‌కాశ్ ప‌ర్వ్’ సంద‌ర్భం లో ల‌బ్ధిదారుల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. గురు గోవింద్ సింహ్ జీ ‘ప్ర‌కాశ్ ప‌ర్వ్’ ను పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌ కు శ్రీ మోదీ న‌మ‌స్సులను అర్పించారు. ఈ శుభ‌ప్ర‌ద‌ సంద‌ర్భం లో దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. గురు సాహిబ్ త‌న ప‌ట్ల ఎంతో కృప‌ ను వ‌ర్షించార‌ని, మ‌రి ఆయ‌న‌ కు సేవ చేసేందుకు త‌గినంత అవ‌కాశాన్ని కూడా ఇచ్చార‌ని తాను భావిస్తున్నాన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. స‌త్యం, సేవ ల మార్గాన్ని అనుస‌రిస్తూనే, స‌వాళ్ళ‌ ను స్వీక‌రించడం లో గురు సాహ‌బ్ జీవితం, గురు సాహ‌బ్ సందేశం మ‌న‌కు ప్రేర‌ణ‌ ను ఇస్తున్నాయన్నారు. స‌త్యం, సేవ‌ల భావ‌న నుంచేఈ స్థాయి బ‌లం, సాహ‌సాలు అంకురిస్తాయని, గురు గోవింద్ సింహ్ జీ చూపిన ఈ మార్గంలో దేశం ముందుకు సాగిపోతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పేద‌ల, వంచనకు గురైన వర్గాల, దోపిడీ బారిన ప‌డ్డ వ‌ర్గాల వారి జీవ‌నం లో మార్పు ను తీసుకు రావ‌డానికి ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ని విధం గా కృషి జ‌రుగుతోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అయిదు సంవ‌త్స‌రాల క్రితం ‘పిఎమ్ ఆవాస్ యోజ‌న’ ను ఆగ్ రా లో తాను ప్రారంభించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు కు తెచ్చారు. ఈ ప‌థ‌కం భార‌త‌దేశం లో ప‌ల్లెల ముఖ‌చిత్రాన్ని మార్చివేయ‌డానికి నాంది పలికింద‌న్నారు. ఈ ప‌థ‌కం ల‌క్ష‌ల కొద్దీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌తో ముడిప‌డివుంద‌ని, పేద‌ల‌లో కెల్లా అత్యంత పేద‌రాలికి సైతం తాను ఒక ఇంటి య‌జ‌మాని ని కాగ‌లుగుతాననే విశ్వాసాన్ని ఇచ్చింద‌న్నారు.

పేద‌ ప్రజల కోసం ఇళ్ళ‌ను నిర్మించ‌డం లో అత్యంత వేగం గా ముందుకు పోతున్న రాష్ట్రాల‌ లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కూడా ఒక రాష్ట్రం గా ఉందంటూ ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ రోజు న రాష్ట్రం లో 6 ల‌క్ష‌ల కుటుంబాల వారు వారి బ్యాంకు ఖాతాల లో 2600 కోట్ల రూపాయ‌ల‌కు పైగా అందుకొంటార‌ని ఆయ‌న తెలియ‌జేశారు. ఈ 6 ల‌క్ష‌ల కుటుంబాల‌ లో 5 ల‌క్ష‌ల కుటుంబాల వారు ఒక‌టో కిస్తీ ని అందుకొంటార‌ని, ఈ మాట‌ల‌కు 5 ల‌క్ష‌ల కుటుంబాల స‌భ్యుల‌ కు వారి జీవిత కాలం నిరీక్ష‌ణ ముగిసిన‌ట్లే అని అర్థం అని ఆయ‌న వివరించారు. అదే మాదిరి గా, 80 వేల కుటుంబాల వారు వారి రెండో కిస్తీ ని అందుకోబోతున్నారని, దీనికి రాబోయే శీత‌కాలం నాటిక‌ల్లా వారు వారి సొంత ఇంటి ని ఏర్ప‌ర‌చుకోబోతున్నార‌నేదే అర్థం అని ప్ర‌ధాన మంత్రి విడమరచి చెప్పారు.

‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ దేశ పౌరుల ఆత్మవిశ్వాసం తో నేరు గా ముడిపడివుంద‌ని, ఒక వ్య‌క్తి తాలూకు ఇల్లు ఈ ఆత్మవిశ్వాసాన్ని అనేక రెట్లు పెంచుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. త‌న‌కంటూ ఒక సొంత ఇంటిని క‌లిగివుండ‌డం జీవితానికి ఒక హామీ ని తీసుకు వ‌స్తుంద‌ని, అంతేకాకుండా పేద‌రికం నుంచి వెలికి రాగ‌ల‌మ‌న్న ఆశ‌ను కూడా ఇది క‌ల్పిస్తుంద‌న్నారు.

ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల పాల‌న కాలాల్లో పేద‌ల‌కు వారి కంటూ ఒక ఇంటి ని ఏర్ప‌ర‌చుకొనేందుకు ప్ర‌భుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందుకోగ‌లుగుతామన్న విశ్వాసం లేక‌పోయింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇదివ‌ర‌క‌టి ప‌థ‌కం లో గృహాల నాణ్య‌త సైతం ఆశించిన మేర‌కు లేదు అని కూడా ఆయ‌న అన్నారు. పేద‌వారు త‌ప్పుడు విధానాల తాలూకు తీవ్రమైన దాడి కి లోనుకావలసి వ‌చ్చింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ దుర‌వ‌స్థ‌ ను దృష్టి లో పెట్టుకొని, ప్ర‌తి పేద కుటుంబానికి ఒక ఇంటి ని- స్వాతంత్య్రానికి 75 సంవ‌త్స‌రాలు పూర్తికాక ముందే- స‌మ‌కూర్చాలి అనే ల‌క్ష్యం తో ‘పిఎమ్ ఆవాస్ యోజ‌న’ ను మొద‌లు పెట్ట‌డ‌మైంద‌న్నారు. ఇటీవ‌లి కొన్నేళ్ళ కాలం లో 2 కోట్ల గృహాల ను నిర్మించ‌డం జ‌రిగింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం అందించిన దాదాపు 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల తోడ్పాటు తో ‘పిఎమ్ ఆవాస్ యోజ‌న’ లో భాగంగా సిద్ధ‌మైన 1.25 కోట్ల గృహాలు ఉన్నాయని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రం లోని ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాలు ప్ర‌తిస్పందించ‌క పోవ‌డాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో 22 ల‌క్ష‌ల గ్రామీణ నివాసాలు నిర్మాణం కావ‌ల‌సి ఉంద‌ని, వాటిలో 21.5 ల‌క్ష‌ల ఇళ్ల కు నిర్మాణ అనుమ‌తుల‌ను ఇవ్వ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 14.5 ల‌క్ష‌ల ప‌రివారాలు చాలా వ‌ర‌కు వాటి గృహాల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హాయాము లో ఈస‌రికే అందుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

గ‌త కాలం లో ఎదురైన చెడ్డ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొంటూ, కొన్ని అంశాల‌పైన శ్ర‌ద్ధ వహించడం జరిగిందంటూ, వాటిలో ఒక ఇంటిని ఏర్ప‌ర‌చుకోవాల‌నే ఆశ‌ ను కోల్పోయిన పేద కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది ఒక‌టో అంశ‌ం అని, కేటాయింపు లో పార‌ద‌ర్శ‌క‌త్వ‌ం అనేది రెండో అంశ‌ం అని, ఇంటి యాజ‌మాన్య హ‌క్కు ను ముఖ్యం గా మ‌హిళ‌ల‌కు ఇవ్వాలి అనేది మూడో అంశ‌ం అని, సాంకేతిక విజ్ఞానం అండ‌ తో ప‌ర్య‌వేక్ష‌ణ జ‌ర‌పాలి అనేది నాలుగో అంశ‌ం అని, ఒక్కొక్క ఇంటి కి అన్ని ప్రాథ‌మిక స‌దుపాయాల‌ ను జోడించాలి అనేది ఆఖ‌రి అంశ‌ం అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. క‌చ్చా ఇళ్ళ‌ లో నివ‌సిస్తున్న పేద కుటుంబాల‌కు, స్థానిక శ్రామికుల‌కు, చిన్న రైతుల‌కు, భూమి లేని శ్రామికుల‌కు ఈ ఇళ్ళతో ప్రయోజనం లభిస్తోందన్నారు. ఈ ఇళ్ళు చాలా వ‌ర‌కు కుటుంబం లోని మ‌హిళ‌ ల పేరులతోనే ఉన్నాయని, ఈ కారణంగా మహిళ‌ల‌కు సాధికార‌త క‌ల్ప‌న అనే అంశానికి ఈ పథకంలో పెద్ద పీట వేయడ‌మైంద‌ని శ్రీ మోదీ అన్నారు. భూమి లేని కుటుంబాల వారు భూమి తాలూకు ద‌స్తావేజు ప‌త్రాల‌ను అందుకొంటున్నార‌ని, అవినీతి ని నివారించడానికే సొమ్ము అంత‌టి ని ల‌బ్ధిదారు ఖాతాలోకి నేరు గా బ‌దిలీ చేయ‌డం జ‌రుగుతోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల‌ కు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ కు మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని, గ్రామీణ ప్ర‌జ‌ల జీవితాన్ని ప‌ట్ట‌ణ జ‌నాభా మాదిరి గా అంత స‌ర‌ళంగానూ మార్చాలి అన్న‌దే ధ్యేయ‌ం అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. అందువ‌ల్ల స్నాన‌పు గ‌ది, విద్యుత్తు దీపాల సౌక‌ర్యం, వాటర్ క‌నెక్ష‌న్‌, గ్యాస్ క‌నెక్ష‌న్ ల వంటి ప్రాథ‌మిక స‌దుపాయాల‌ను కూడా ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ కు క‌ల‌ప‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. మౌలిక స‌దుపాయాల కోస‌మ‌ని ఒక పేద వ్య‌క్తి అటూ ఇటూ తిరిగి విసిగి వేసారిపోకూడ‌ద‌న్న‌దే ల‌క్ష్యం ఆయ‌న వివ‌రించారు.

ప‌ల్లె వాసుల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డం లో ‘పిఎమ్ స్వామిత్వ యోజ‌న’ పెద్ద మార్పు ను తీసుకు వ‌స్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప‌థ‌కం అమ‌లైన మార్గ‌ద‌ర్శ‌క రాష్ట్రాల‌ లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఒక‌టి గా ఉంద‌న్నారు. ఈ ప‌థ‌కం లో భాగంగా ప‌ల్లె వాసులు వారి భూమితో పాటే ఇంటి తాలూకు యాజ‌మాన్య ప‌త్రాల‌ ను కూడా అందుకొంటార‌న్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో వేల కొద్దీ గ్రామాల‌ లో స‌ర్వేక్ష‌ణల కు డ్రోన్ ల‌ను ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌ల సంప‌త్తి వివ‌రాలు ప్ర‌భుత్వం వ‌ద్ద న‌మోదై ఉండే విధం గా మ్యాపింగ్ ప్ర‌క్రియ సాగుతోంద‌ని, దీనితో భూమి వివాదాలు ఒక కొలిక్కి వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం లోని అతి పెద్ద ప్ర‌యోజ‌నమల్లా ప‌ల్లె వాసులు వారి ఇళ్ళ‌ ను త‌న‌ఖా పెట్ట‌డం ద్వారా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోగ‌లుగుతార‌నేదే అని ఆయ‌న చెప్పారు. ఇది గ్రామీణ సంప‌త్తి ధ‌ర‌ల‌ పై ఒక సానుకూల ప్ర‌భావాన్ని ప్రసరింపచేస్తుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రం లో 8.5 వేల గ్రామాల‌ లో ఈ ప‌ని ముగిసింద‌ని, ప్ర‌జ‌లు స‌ర్వేక్ష‌ణ ముగిసిన తరువాత డిజిట‌ల్ స‌ర్టిఫికెట్ లను అందుకొంటున్నార‌ని చెప్పారు. 51 వేల‌కు పైగా ఆ త‌ర‌హా స‌ర్టిఫికెట్ లను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఇప్ప‌టికే పంపిణీ చేయ‌డమైందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు

ఎప్పుడైతే ఎక్కువ‌గా ప‌థ‌కాలు ప‌ల్లెల‌కు చేరుకొంటున్నాయో, సౌక‌ర్యాలు పెర‌గ‌డం ఒక్క‌టే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా వేగ‌గ‌తి ని అందుకొంటోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘ప్ర‌ధాన మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌’ లో భాగం గా నిర్మించిన ర‌హ‌దారులు గ్రామ ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రం గా మార్చివేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. 6 ల‌క్ష‌ల‌కు పైగా ప‌ల్లెల‌ కు వేగ‌వంత‌మైన ఇంట‌ర్ నెట్ ను అందుబాటు లోకి తీసుకురావ‌డానికి ఆప్టిక‌ల్ ఫైబ‌ర్స్ ద్వారా ప‌ని జ‌రుగుతోంద‌న్నారు. ఈ ప‌థ‌కం ప‌ల్లె వాసుల‌ కు కొత్త ఉద్యోగ అవ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తుంద‌న్నారు. క‌రోనా కాలం లో తిరిగి వ‌చ్చిన ప్ర‌వాసి శ్రామికుల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి 10 కోట్ల కూలి దినాల‌ను క‌ల్పించ‌డం ద్వారా దేశం లో అగ్ర‌ స్థానంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నిలచింద‌న్నారు. ఇది ప‌ల్లె వాసుల జీవ‌న సౌల‌భ్యాన్ని మెర‌గు ప‌ర‌చింద‌ని ఆయ‌న చెప్పారు. జీవ‌న సౌల‌భ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి ‘ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం’, ‘నేశ‌న‌ల్ న్యూట్రిష‌న్ మిశ‌న్‌’, ల వంటి వివిధ కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌ంటూ ఆయా ప‌థ‌కాల‌ను గురించి ఒక్క‌టొక్క‌టి గా ప్రధాన మంత్రి ప్ర‌స్తావించారు. ‘ఉజాలా ప‌థ‌కం’ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు ఒక కొత్త గుర్తింపు ను ఇచ్చిందన్నారు. ఎక్స్ ప్రెస్ వే ల వంటి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప‌థ‌కాల గురించి ఆయ‌న చెప్తూ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ప్రారంభం అయిన ఎఐఐఎమ్ఎస్‌ యుపి లో అభివృద్ధి ప‌రుగు పెట్టేట‌ట్లు చేయ‌డం లో స‌హాయ‌కారి గా నిలుస్తుందన్నారు. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి పెద్ద కంపెనీ లు అనేకం తరలిరావడానికి ఇదే కార‌ణం అంటూ ఆయ‌న ప్రస్తావించారు. ‘వ‌న్ డిస్ట్రిక్ట్ వ‌న్ ప్రొడ‌క్ట్’ ద్వారా చిన్న కంపెనీల‌ కు సైతం అవ‌కాశాలు దక్కుతున్నాయి, ఈ ప‌థ‌కం లో స్థానిక చేతివృత్తుల వారు ల‌బ్ధి ని పొందుతున్నారని ఆయ‌న అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones