I dedicate this (Seoul Peace) award to the 1.3 billion people of India for giving me the opportunity to serve them: PM Modi
India’s growth story is not only good for the people of India but also for the entire world: PM Modi
The time has come for all right-thinking nations to join hands to completely eradicate terrorist networks: PM Modi

సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేశన్ చైర్ మన్ శ్రీ క్వాన్ ఇ హైక్‌, 

నేశనల్ అసెంబ్లీ స్పీక‌ర్ శ్రీ మూన్ హీ శాంగ్‌, 

సంస్కృతి శాఖ మంత్రి శ్రీ డూ జాంగ్ హాన్‌, 

ఐక్య‌ రాజ్య‌ స‌మితి పూర్వ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ శ్రీ బాన్ కి మూన్‌, 

సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేశన్ కు చెందిన ఇత‌ర స‌భ్యులు,

విశిష్ట వ్యక్తులు, 

మహిళలు మరియు సజ్జనులు, 

మిత్రులారా, 

న‌మస్కారం.

आन्योंग
हा-सेयो
योरा-बुन्न

అంద‌రికీ శుభాభినంద‌న‌లు

సియోల్ శాంతి బ‌హుమ‌తి ని నాకు ప్ర‌దానం చేయ‌డం నాకు ద‌క్కిన గొప్ప గౌర‌వం గా భావిస్తున్నాను.  ఈ శాంతి బ‌హుమ‌తి వ్య‌క్తిగ‌తం గా నాకు ల‌భించిన‌ట్టుగా నేను భావించ‌డం లేదు.  ఇది భార‌తీయులంద‌రికీ ల‌భించిన బ‌హుమ‌తి.  భార‌త‌దేశం ఈ ఐదు సంవత్సరాల లో సాధించిన విజ‌యానికిగాను ఇది ల‌భించింది.  1.3 బిలియ‌న్ మంది భార‌తీయుల శ‌క్తి సామ‌ర్థ్యాలు, నైపుణ్యాల ఫ‌లితం గా ఇది ల‌భించింది.  కాబ‌ట్టి వారంద‌రి త‌ర‌ఫున నేను ఈ బహుమతి ని స్వీక‌రిస్తూ నా కృత‌జ్ఞ‌త‌ ను తెలియజేస్తున్నాను.  ‘వ‌సుధైక కుటుంబ‌క‌మ్‌’ .. అంటే యావత్తు ప్ర‌పంచ‌ం ఒకే కుటుంబ‌ం అనే సందేశాని కి కార‌ణ‌మైన తాత్విక‌త‌ కు గుర్తింపు గా ఈ బహుమతి ల‌భించింది.  యుద్ధ‌ రంగం నుండి శాంతి సందేశాన్ని అందించిన సంస్కృతి కి ఈ అవార్డు ద‌క్కుతుంది.  మ‌హాభార‌త యుద్ధ‌క్షేత్రాన్నుండి కృష్ణ భ‌గ‌వానుడు భ‌గ‌వ‌ద్గీత రూపం లో ఇచ్చిన సందేశ‌మే దీనికి నిద‌ర్శ‌నం. 

ఓం ద్యౌ: శాంతిరంత‌రిక్షం శాంతి:, పృథ్వీ శాంతిరాప:
శాంతిరోష‌ధయ‌:  శాంతి: 
వ‌నస్ప‌త‌య‌:  శాంతిర్ విశ్వ‌ే దేవా:  శాంతిర్ బ్ర‌హ్మా శాంతి, స‌ర్వ: శాంతి:,  శాంతిరేవ్ శాంతి, సా మా శాంతిరేధి..
ఓం శాంతి:  శాంతి:  శాంతి:

దీనికి –

ఆకాశంలో రోదసి లో ప్రతి చోటా శాంతి మనగలుగుగాక

మన భూగ్రహం అంతటా, ప్రకృతి లోనూ.

శాశ్వతమైన శాంతి వర్ధిల్లుగాక – అని భావం.

వ్య‌క్తిగ‌త‌మైన ల‌క్ష్యాల‌ను ప‌క్క‌న పెట్టి స‌మాజ హితాన్ని కోరుకునే ప్ర‌జ‌లంద‌రికీ ద‌క్కిన అవార్డు గా దీన్ని భావిస్తున్నాను.  మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి ఉత్స‌వాల ను జ‌రుపుకొంటున్న ఈ సంవత్సరం లో నాకు ఈ అవార్డు ను అందించడం గౌర‌వం గా భావిస్తున్నాను.  ఈ అవార్డు తో పాటు అందిస్తున్న ఒక కోటీ ముప్ఫై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ను న‌మామి గంగే కార్య‌క్ర‌మాని కి అందించ‌బోతున్నాను.  న‌మామి గంగే కార్య‌క్ర‌మం ద్వారా భార‌తీయుల‌ కు ఎంతో ప‌విత్ర‌మైన గంగాన‌ది ని ప్ర‌క్షాళ‌న చేయ‌డం జ‌రుగుతోంది.  కోట్లాది మంది భార‌తీయుల‌ కు గంగాన‌ది ఆర్థిక ప్రాణదాయిని కూడాను.

మిత్రులారా,
 
1988వ సంవత్సరం లో నిర్వ‌హించిన 24వ వేస‌వి ఒలంపిక్స్ విజ‌వంత‌మ‌యినందుకు, ఆ స్ఫూర్తి ని చాటేలా సియోల్ శాంతి బ‌హుమ‌తి ని నెలకొల్పడమైంది.  భార‌త‌దేశాని కి ఈ క్రీడ‌లు బాగా గుర్తున్నాయి. ఎందుకంటే అవి మ‌హాత్ముని జ‌యంతి రోజు న ముగిశాయి.  నాడు జ‌రిగిన క్రీడ‌లు కొరియా సంస్కృతి లోని గొప్ప‌తనాన్ని చాటాయి.  కొరియా దేశ ఆతిథ్యం లోని విశిష్ట‌త‌ను, దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ విజ‌యాన్ని చాటాయి. అంతే కాదు, ఇక్క‌డ ఒక విష‌యాన్ని మ‌రచిపోవ‌ద్దు.  ఆ క్రీడలు అంతర్జాతీయం గా నూత‌న శ‌క్తివంత‌మైన దేశాన్ని ప్ర‌పంచాని కి అందించాయి.  ప్ర‌పంచ చ‌రిత్ర‌ లో ముఖ్య‌మైన మైలురాయి గా నిలచిపోయిన క్రీడ‌లు అవి. 
 ప్ర‌పంచ‌ వ్యాప్తం గా అనేక మార్పులు సంభ‌విస్తున్న త‌రుణం లో 1998 ఒలంపిక్స్ క్రీడ‌ల ను నిర్వ‌హించడం జ‌రిగింది.  అప్పుడే ఇరాన్‌- ఇరాక్ యుద్ధం ముగిసింది.  ఆ ఏడాది ఆరంభం లో అఫ్గానిస్తాన్‌ స్థితిగ‌తుల‌ కు సంబంధించిన జెనీవా ఒప్పంద పత్రాల మీద సంత‌కాల కార్య‌క్ర‌మం ముగిసింది.  ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం సమాప్తమైంది.  త్వ‌ర‌లోనే ఒక నూత‌న స్వ‌ర్ణ‌ యుగం మొదలవుతుంద‌నే ఆశ అంద‌రిలో ఉండేది.  కొంత కాలం అలా జ‌రిగింది.  గ‌తం తో పోల్చితే 1988వ సంవత్సరం లో కంటే ఇప్పుడు ప్ర‌పంచం ప‌లు అంశాల లో మెరుగు గా ఉంది.  అంత‌ర్జాతీయం గా పేద‌రికం క్ర‌మ‌క్ర‌మం గా త‌గ్గుముఖం ప‌డుతోంది.  ఆరోగ్య‌ం, విద్య రంగాల లో ఫలితాలు మెరుగ‌వుతున్నాయి.  అయిన‌ప్ప‌టికీ అనేక క్లిష్ట‌మైన అంత‌ర్జాతీయ స‌వాళ్లు అలాగే ఉన్నాయి.  వీటిలో కొన్ని పాత‌వి.  మ‌రికొన్ని కొత్త‌వి.  సియోల్ ఒలంపిక్స్ కంటే కొన్ని నెల‌ల ముందు జల వాయు పరివర్తన ను గురించి మొద‌టి సారి గా బ‌హిరంగ హెచ్చ‌రిక‌లు వెలువ‌డ్డాయి.  జల వాయు పరివర్తన ఇప్పుడు మాన‌వాళి కి పెను ప్ర‌మాదంగా మారింది.  సియోల్ ఒలంపిక్స్‌ కంటే కొన్ని వారాల ముందు అల్- ఖైదా సంస్థ ఏర్ప‌డింది.  ఈ రోజు న తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ప్రపంచ‌ం అంతటా విస్త‌రించాయి.  అవి అంత‌ర్జాతీయ శాంతి కి, భ‌ద్ర‌త‌ కు పెను స‌వాళ్ల‌ ను విసురుతున్నాయి.  ప్ర‌పంచ‌ వ్యాప్తం గా ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు నాణ్య‌మైన ఆహారానికి, త‌గినంత ఆహారానికి దూరంగానే ఉన్నారు.  వారికి స‌రైన నివాసం, ఆరోగ్య‌ భ‌ద్ర‌త‌, పారిశుధ్యం, విద్యుత్తు మొద‌లైనవి క‌రువ‌య్యాయి.  అన్నింటి క‌న్నా ముఖ్యంగా వారు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌లేక‌పోతున్నారు.  కాబ‌ట్టి మ‌నం చేయాల్సింది చాలా ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌ం అవుతోంది.  మ‌నం ఎదుర్కొంటున్నఈ తీవ్ర‌ స‌మ‌స్య‌ల‌ కు ప‌రిష్కారం మ‌నం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డంలోనే ఉంది.  ఈ విష‌యం లో భార‌త‌దేశం త‌న క‌ర్త‌వ్యాన్ని తాను నిర్వ‌ర్తిస్తోంది.  ప్ర‌పంచ జ‌నాభా లో 6 శాతం గా ఉన్నారు భార‌తీయులు.  భార‌తీయుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ కు మేం ప‌లు కార్య‌క్ర‌మాలను అమ‌లు చేస్తున్నాం.  బ‌ల‌మైన ఆర్ధిక పునాదుల ను క‌లిగిన భార‌త‌దేశం ఈ రోజు న శ‌ర‌వేగం గా అభివృద్ధ‌ి చెందుతున్న దేశం గా ప్ర‌శంస‌లు పొందుతోంది.  ఆర్ధిక‌ రంగం లో అనేక మార్పు చేర్పుల ను ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మ‌వుతోంది.  మా ప్ర‌భుత్వం చేప‌ట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిట‌ల్ ఇండియా’, ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ల కార‌ణం గా సామాజిక, ఆర్ధిక రంగాల లో అభివృద్ధి స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది.  అన్ని వ‌ర్గాల‌ వారికి ఆర్ధిక సేవ‌ల ను అందించ‌డం పైన దృష్టి సారించాం.  అందుబాటు లో రుణ సౌక‌ర్యం, డిజిట‌ల్ లావాదేవీ లు, మారుమూల ప్రాంతాల‌ కు సేవ‌లు, చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ కు మ‌ద్ద‌తు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల కార‌ణం గా అభివృద్ధి దేశం అంతటా విస్త‌రించింది.  అది భార‌తదేశ ప్ర‌జ‌ల‌ ను ఆర్ధికం గా బ‌లోపేతం చేస్తోంది.  స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ తో భార‌త‌దేశం లో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త విస్త‌రిస్తోంది.  2014వ సంవ్సతరం లో దేశ‌ వ్యాప్తం గా 38 శాతం గా మాత్ర‌మే ఉన్న పారిశుధ్య కార్య‌క్ర‌మం ఇప్పుడు 98 శాతాని కి చేరుకొంది.  వాతావ‌ర‌ణ హిత‌కరమైన‌ వంటగ్యాసు ను ఉజ్వ‌ల యోజ‌న ద్వారా అందించ‌డం వ‌ల్ల గ్రామీణ మ‌హిళ‌ల జీవితాలు మెరుగుపడుతున్నాయి.  దేశం లో 500 మిలియ‌న్ మంది పేద‌లు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ కు ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ద్వారా ఆరోగ్య భ‌ద్ర‌త‌ ను స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతోంది.  ఇటువంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌ ద్వారా దేశ‌వ్యాప్తం గా స‌మ‌గ్ర‌ అభివృద్ధి ని సాధించ‌డం జ‌రుగుతోంది.  దీని ద్వారా భార‌త‌దేశం ఐక్య‌ రాజ్య‌ స‌మితి నిర్దేశించిన సుస్థిర‌ అభివృద్ధి ల‌క్ష్యాల దిశ‌ గా పయనిస్తోంది.   మేం ఏ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినా మ‌హాత్మ గాంధీ బోధ‌న‌ల ను ఆద‌ర్శం గా తీసుకొని ముందుకు సాగుతున్నాం.  మ‌నం చూసిన అత్యంత పేద‌వాడి ముఖచిత్రాన్ని ఒక‌సారి మ‌న‌నం చేసుకొని మ‌నం చేయ‌బోయే కార్య‌క్ర‌మాలు వారికి ఏమైనా ల‌బ్ధి ని చేకూరుస్తాయా అనే విష‌యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలని మ‌హాత్ముడు చెప్పే వారు. 

మిత్రులారా,

భార‌త‌దేశ వృద్ధి గాథ‌ అనేది ఒక్క భార‌తీయుల‌కే మేలు చేయ‌దు.  యావత్తు ప్ర‌పంచానికి ఇది మేలు చేస్తుంది.  ఇప్ప‌డు ప్ర‌పంచ‌వ్యాప్తం గా అంద‌రం బంధాన్ని క‌లిగివున్నాం.  ప్ర‌పంచం లోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ ను క‌లిగిన దేశం భార‌తదేశం.  భార‌త‌దేశం అభివృద్ధి, సౌభాగ్యం త‌ప్ప‌కుండా ప్ర‌పంచ వృద్ధి కి, అభివృద్ధి కి దోహ‌దం చేస్తాయి.  శాంతియుత‌మైన‌, సుస్థిర‌మైన‌, ఆర్ధికంగా ముడిప‌డివున్నటువంటి ప్ర‌పంచాన్ని సాధించ‌డం కోసం మేం నిబ‌ద్ధత‌ తో ప‌ని చేస్తున్నాం.  అంత‌ర్జాతీయ స‌మాజం లో భార‌త‌దేశం బాధ్య‌తాయుత‌మైనటువంటి స‌భ్యురాలు గా ఉంది.  జల వాయు పరివర్తన తాలూకు సంక్షోభాని కి వ్య‌తిరేకం గా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా జరుగుతున్న స‌మైక్య పోరాటం లో భార‌త‌దేశం ముందంజ‌ లో ఉంది.  జల వాయు పరివర్తన ను ఎదుర్కోవ‌డానికి జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ పోరాటం లో అతి త‌క్కువ కర్బ‌న ఉద్గారాల దేశమైన భార‌త‌దేశం కీల‌క‌ పాత్ర ను పోషిస్తోంది.  ఇందుకోసం భార‌త‌దేశం లో జాతీయ ప్ర‌ణాళిక‌ ను అమ‌లు చేస్తున్నాం. దాని ద్వారా కర్బ‌న ఉద్గారాల‌ ను త‌గ్గించి, అడ‌వుల విస్త‌ర‌ణ‌ ను ప్రోత్స‌హిస్తున్నాం.  నవీకరణ యోగ్య శక్తి వినియోగాన్ని పెంచ‌డం ద్వారా సంప్ర‌దాయ బొగ్గు ఇంధనాల‌ ను ప‌క్క‌న పెట్టాం.  అంత‌ర్జాతీయం గా తీసుకుంటే భార‌త‌దేశం ఒక‌డుగు ముందుకు వేసి భావ‌ సారూప్య‌ం గ‌ల దేశాల‌ తో క‌లసి అంత‌ర్జాతీయ సౌర వేదిక‌ (ఐఎస్ఎ)ను ఏర్పాటు చేసింది. స్వ‌చ్ఛ‌మైన‌, అప‌రిమిత‌మైన సౌర శ‌క్తి ని త‌యారు చేసుకుంటే అది జీవ ఇంధనాని కి ప్ర‌త్యామ్నాయం గా నిలుస్తుంది.  ఐక్య‌ రాజ్య‌ స‌మితి శాంతి బృందాల‌ కు అత్య‌ధికం గా స‌భ్యుల‌ను పంపుతున్న దేశం గా భార‌త‌దేశం గుర్తింపు పొందింది.  కొరియా ద్వీప‌క‌ల్పం లో శాంతి నెల‌కొన‌డానికి కృషి చేసిన దేశం గా మా దేశం గా గ‌ర్వ‌ప‌డుతున్న‌ది.  స‌హాయం కోసం ఎదురు చూస్తున్న దేశాల‌ కు చేయూత‌ ను అందించాం.  ప్ర‌పంచ‌ వ్యాప్తం గా మాన‌వీయ కార్య‌క్ర‌మాల్లో, ప్ర‌కృతి విప‌త్తుల సాయాన్ని అందించ‌డంలో భార‌త‌దేశం అంద‌రి కంటే ముందు ఉంటోంది.  అంత‌ర్జాతీయ సంక్షోభ ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు అక్క‌డ‌ నుండి భార‌తీయుల‌నే కాదు ఇత‌ర దేశాల ప్ర‌జ‌ల‌ ను కూడా కాపాడ‌డం జ‌రిగింది.  అభివృద్ధి చెందుతున్న దేశాల లో అభివృద్ధి కార్య‌క్రమాలు కొన‌సాగేందుకు వీలు గా భాగ‌స్వామ్యం నెల‌కొల్పుకొని భార‌త‌దేశం ప‌ని చేస్తోంది.  మేం రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలు భాగ‌స్వామ్య దేశాల భౌతిక‌, సామాజిక మౌలిక వ‌స‌తుల‌ ను అభివృద్ధి ప‌రుస్తున్నాయి.
 
మేం తీసుకుంటున్న ఈ చ‌ర్య‌ల‌ ద్వారా అంత‌ర్జాతీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌కుండా అంద‌రికీ అందేలా చూస్తున్నాం.  గత కొన్ని సంవ‌త్స‌రాలు గా మా ప్ర‌భుత్వం చేసిన కృషి కార‌ణం గా ఖండాల మ‌ధ్య‌ సంబంధాలు పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకొన్నాయి.  నూత‌న భాగ‌స్వామ్యాలు ఏర్ప‌డ్డాయి.  తూర్పు ఆసియా అంశాన్నే తీసుకుంటే ఆ ప్రాంతం లోని దేశాల‌ తో మా సంబంధ బాంధ‌వ్యాల‌ ను పున‌ర్ నిర్వచించాం.  యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో భాగం గా రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా తో క‌లుపుకొని ప‌లు దేశాల‌తో బంధాలు పటిష్టం అయ్యాయి.  అధ్య‌క్షులు మాన్య శ్రీ మూన్ చెప్పిన నూత‌న ద‌క్షిణ ప్రాంత విధానం లో మా విధానాలు ప్ర‌తిఫ‌లించ‌డం నాకు సంతోషం గా ఉంది.

మిత్రులారా, 

భార‌త‌దేశం పురాత‌న కాలం నుండి శాంతియుత దేశం గా ప్ర‌సిద్ధి చెందింది.  భార‌తీయులు వేల సంవ‌త్స‌రాల తరబడి శాంతి ని ఆచ‌రిస్తూ, సామ‌ర‌స్య‌పూర్వ‌కం గా జీవిస్తూ వ‌చ్చారు.  వంద‌లాది భాష‌లు, మాండ‌లికాలను క‌లిగివున్న భార‌త‌దేశం అనేక రాష్ట్రాల తో, ప‌లు ముఖ్య‌మైన మ‌తాల తో ప్ర‌పంచం లోనే అత్యంత వైవిధ్య‌మైన దేశం గా గుర్తింపు తెచ్చుకొంది.  అన్ని న‌మ్మ‌కాలు, విశ్వాసాలు, స‌మాజాలను క‌లిగిన భార‌త‌దేశం సౌభాగ్య‌వంతమైన దేశం గా ఎద‌గ‌గ‌ల‌గ‌డం మాకు గ‌ర్వ‌కార‌ణం.  భార‌త‌దేశం స‌హ‌నం పునాది గా మాత్ర‌మే కాదు.. భిన్నాభిప్రాయాల‌ ను, విభిన్న సంస్కృతుల‌ ను గౌర‌వించే దేశం అని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.
 
మిత్రులారా, 

కొరియా లాగానే భార‌త‌దేశం కూడా స‌రిహ‌ద్దుల సంక్షోభాల‌ తో ఇబ్బంది ప‌డుతోంది.  స‌రిహ‌ద్దుల‌ ను అతిక్ర‌మిస్తూ పెరిగిపోతున్న ఉగ్ర‌వాదమ‌నేది శాంతి సౌభ్రాతృత్వాల కోసం మేం చేస్తున్న కృషి ని అప‌హాస్యం చేస్తోంది.  గ‌త న‌ల‌భై సంవ‌త్స‌రాలు గా స‌రిహ‌ద్దు తీవ్ర‌వాదాని కి భార‌త‌దేశం బ‌లి అవుతూనే ఉంది.  స‌రిహ‌ద్దుల‌ కు విలువ‌ను ఇవ్వ‌ని దేశాల‌న్నీ ఇప్పుడు ఈ ప్ర‌మాదాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.  మాన‌వాళి మీద న‌మ్మ‌కం ఉన్న‌ వారంద‌రూ చేతులు క‌ల‌పవలసిన స‌మ‌యం ఆస‌న్న‌ం అయింది. అంద‌ర‌ం ఐక్యం గా నిలచి ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ ల‌ను ధ్వంసం చేయాలి.  వారికి సాయం అంద‌కుండా చూడాలి.  ఉగ్ర‌వాద‌ భావ‌జాలాన్ని, ప్ర‌చారాల‌ ను ఉమ్మ‌డి గా ఎదుర్కోవాలి.  అలా చేస్తేనే ద్వేషం స్థానం లో సామ‌ర‌స్యం వెల్లివిరుస్తుంది.  విధ్వ‌సం పోయి అభివృద్ధి వ‌స్తుంది.  హింస‌, ప్ర‌తీకారాలు తొల‌గిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం వెల్లివిరుస్తుంది. 

మిత్రులారా,

కొరియా ద్వీప‌క‌ల్పం లో గ‌త ఏడాదిగా కొన‌సాగుతున్న శాంతి ప్ర‌గ‌తి ప్ర‌శంస‌నీయ‌మైన‌ది.  అధ్యక్షులు మాన్య శ్రీ మూన్ కు ఈ ఘ‌న‌త ద‌క్కుతుంది.  ఇరు దేశాల మ‌ధ్య‌ త‌రాల కొద్దీ ఉన్న ప‌ర‌స్ప‌ర అప‌న‌మ్మ‌కాన్ని తొల‌గించ‌డం లో ఆయ‌న కీల‌కమైన పాత్ర ను పోషించారు. డిపిఆర్ కె కు, అంత‌ర్జాతీయ స‌మాజాని కి మ‌ధ్య‌ ఈ అప‌న‌మ్మ‌కం, అనుమానాలు చాలా కాలం ఉన్నాయి.  వాటిని తొల‌గించి చ‌ర్చ‌లను ప్రారంభింప‌చేశారు.  ఇది సామాన్య‌మైన విజ‌యం కాదు.  రెండు కొరియాల‌ మ‌ధ్య‌, అమెరికా, డిపిఆర్ కె మ‌ధ్య‌ కొన‌సాగుతున్న చ‌ర్చ‌ల కు మా ప్ర‌భుత్వం బ‌ల‌మైన మ‌ద్ద‌తు తెలుపుతోంది.
 
కొరియా లో ప్ర‌జాద‌ర‌ణ పొందిన 

Shichagi Bhanida 

అనే నానుడి ఉంది.  

దీనికి ‘‘ఆరంభం స‌రిగ్గా ఉందంటే స‌గం యుద్ధం గెలిచిన‌ట్లే’’ అని భావం. 

కొరియా ప్ర‌జ‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తున్న కృషి కార‌ణం గా కొరియా ద్వీప‌క‌ల్పం లో త్వ‌ర‌లోనే శాంతి వాతావ‌ర‌ణం వేళ్లూనుకోగలుగుతుంది. 
మిత్రులారా,

1988 ఒలంపిక్స్ ను ప్ర‌తిఫ‌లించే గీతాన్ని ఉద‌హ‌రిస్తూ నా ఉప‌న్యాసాన్ని ముగిస్తాను.  ఎందుకంటే మ‌నంద‌రికీ కావల‌సిన మెరుగైన భ‌విష్య‌త్తు కోసం అవ‌స‌ర‌మైన ఆశావ‌హ స్ఫూర్తి ని అది ప్ర‌తిఫ‌లిస్తోంది.  చేయి చేయి క‌లిపి ప్ర‌పంచ‌ం అంతా ఏక‌మవుదాం.  మ‌నం నివ‌సించే ఈ నేల‌ ను మెరుగైన ఆవాసం గా మార్చుకుందాం.

Gamsa Hamnida ! 

మీకు ధన్యవాదాలు.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"