PM Modi describes India’s democratic system of governance as a great teacher, which inspires over 125 crore people
The teachings of the Vedas, which describe the entire world as one nest, or one home, are reflected in the values of Visva Bharati University: PM
India and Bangladesh are two nations, whose interests are linked to mutual cooperation and coordination among each other: PM Modi
Gurudev Rabindranath Tagore is respected widely across the world; he is a global citizen: PM Modi
Institutions such as Visva Bharati University have a key role to play in the creation of a New India by 2022: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ బెంగాల్ లోని శాంతి నికేత‌న్ ను ఈ రోజు సంద‌ర్శించారు.

శాంతి నికేత‌న్ లో బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స్వాగ‌తం ప‌లికారు. ఉభ‌య నేత‌లు గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ కు శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టిస్తూ, సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో సంత‌కాలు చేశారు. ఆ త‌రువాత వారు విశ్వ‌ భార‌తి విశ్వ‌విద్యాల‌య స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, భార‌త‌దేశం లోని ప్ర‌జాస్వామయ తరహా పాల‌న వ్య‌వ‌స్థ ను ఒక గొప్ప గురువు గా అభివ‌ర్ణించారు. భార‌త‌దేశం లోని ప్ర‌జాస్వామయ తరహా పాల‌న వ్య‌వ‌స్థ 125 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌ల‌లో ప్రేర‌ణ‌ ను నింపుతోంద‌న్నారు. గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ జ‌న్మించిన ప‌విత్ర‌మైన భూమి మీద విద్యావంతుల స‌ర‌స‌న నిల‌వ‌డం తాను చేసుకొన్న సుకృత‌ం అని ఆయ‌న అన్నారు.

ఈ రోజున ప‌ట్టాల‌ను స్వీకరించిన విద్యార్థుల‌ను ఆయ‌న అభినందించారు. ఈ విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన వారంద‌రూ కేవ‌లం ఒక ప‌ట్టా ను అందుకోలేద‌ని, వారు ఒక మ‌హ‌నీయ వార‌స‌త్వానికి వార‌సులు కూడా అయ్యార‌ని ఆయ‌న చెప్పారు.

యావ‌త్తు ప్ర‌పంచాన్ని ఒక గూడు గానో, లేదా ఒకే ఇంటిగానో అభివ‌ర్ణిస్తున్నటువంటి వేదాల‌ లోని ప్ర‌బోధాలు విశ్వ భార‌తి విశ్వ‌విద్యాల‌యం యొక్క విలువ‌ల‌లో ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారికి స్వాగ‌తం పలుకుతూ, భార‌త‌దేశం మ‌రియు బాంగ్లాదేశ్ లు ఒక‌ దేశ ప్రయోజనాలు మరొక దేశ ప్రయోజనాలతో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం పెన‌వేసుకొని ఉన్నటువంటి రెండు దేశాలు అని ప్రధాన మంత్రి అన్నారు.

గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ ను ప్ర‌పంచవ్యాప్తంగా ఎంత‌గానో గౌర‌విస్తార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మూడు సంవ‌త్స‌రాల కింద తాజికిస్తాన్ లో గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ యొక్క విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం త‌న‌కు ద‌క్కిన‌ట్లు ఆయ‌న గుర్తుకు తెచ్చుకొన్నారు. టాగోర్ గారు ఈనాటికీ ప్ర‌పంచం అంత‌టా విశ్వ‌విద్యాల‌యాల‌లో ఒక అధ్య‌య‌న అంశంగా ఉన్నట్లు ఆయ‌న తెలిపారు. గురుదేవ్ ను ఒక విశ్వ పౌరుడుగా ఆయ‌న వ‌ర్ణించారు.

భార‌త‌దేశ విద్యార్థులు వారి లోప‌ల భార‌తీయ‌త‌ను ప‌దిల‌ప‌ర‌చుకొంటూనే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాగుతున్న ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకొంటూ ఉండాల‌ని గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ స‌దా ఆకాంక్షించే వారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప‌ల్లెల‌లో విద్య మ‌రియు నైపుణ్యాల అభివృద్ధి సంబంధిత కృషికి గాను విశ్వ‌ భార‌తి విశ్వ‌విద్యాల‌యాన్ని ఆయ‌న అభినందించారు. ఇదే కృషిని 2021వ సంవ‌త్స‌రంలో ఈ యూనివ‌ర్సిటీ శ‌త జ‌యంతిని జ‌రుపుకొనే సరికి 100 గ్రామాల‌కు విస్త‌రించాల‌ని చెప్తూ యూనివర్సిటీని ఆయన ప్రోత్స‌హించారు. ఈ 100 గ్రామాల స‌ర్వ‌తోముఖ వికాసం దిశ‌గా ప‌ని చేయ‌వ‌ల‌సిందిగా విశ్వవిద్యాలయానికి ఆయ‌న పిలుపునిచ్చారు.

2022 క‌ల్లా ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించ‌డంలో విశ్వ‌ భార‌తి విశ్వ‌విద్యాల‌యం వంటి సంస్థ‌లు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించ‌వ‌ల‌సి వుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. విద్య రంగంలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను గురించి ఆయ‌న వివ‌రించారు.

బాంగ్లాదేశ్ భ‌వ‌న్ ను ప్రారంభించిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాస‌మిస్తూ, ఈ భ‌వ‌నం భార‌తదేశానికి మ‌రియు బాంగ్లాదేశ్ కు మ‌ధ్య నెల‌కొన్న సాంస్కృతిక బంధాల‌కు ఒక ప్ర‌తీక అంటూ అభివ‌ర్ణించారు.

ఈ విశ్వ‌విద్యాల‌యానికి మ‌రియు ఇక్క‌డి ప‌విత్ర‌మైన నేలకు ఒక చ‌రిత్ర ఉంద‌ని, ఇటు భార‌త‌దేశం అటు బాంగ్లాదేశ్‌.. రెండింటి స్వాతంత్య్ర స‌మ‌రాలకు ఈ విశ్వ‌విద్యాల‌యం, ఇక్కడి నేల సాక్షులుగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఇరు దేశాల ఉమ్మ‌డి వార‌స‌త్వానికి ఒక చిహ్న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

బంగ‌బంధు శేఖ్ ముజిబుర్ రెహ‌మాన్ గారి ప‌ట్ల భార‌త‌దేశం లోను, బాంగ్లాదేశ్ లోను స‌మాన‌మైన ఆద‌ర‌ణ ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇదే విధంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌, స్వామీ వివేకానంద మ‌రియు గాంధీ మహాత్ముడు అంటే భార‌త‌దేశంలో ఎంత గౌర‌వం ఉందో అంతే గౌర‌వం బాంగ్లాదేశ్ లోనూ ఉంద‌ని ఆయ‌న అన్నారు.

మ‌రి ఇదే విధంగా, గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ భార‌త‌దేశానికి చెందిన వారు గానే బాంగ్లాదేశ్ కు కూడా చెందిన వారని ఆయ‌న అన్నారు. గురుదేవ్ ర‌వీంద్రనాథ్ టాగోర్ న‌మ్మిన సార్వ‌జ‌నీక మాన‌వ‌తావాదం కేంద్ర ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శ‌క సూత్రంగా ఉన్న ‘‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్’’ లో ప్ర‌తిఫ‌లిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. క్రూర‌త్వానికి, ఉగ్ర‌వాదానికి విరుద్ధంగా భార‌త‌దేశం మ‌రియు బాంగ్లాదేశ్ లు క‌ల‌సి చెప్పుకొన్న సంక‌ల్పం బాంగ్లాదేశ్ భ‌వ‌న్ సాక్షిగా భావి త‌రాల‌ వారికి స్ఫూర్తి ని అందిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. గ‌త సంవ‌త్స‌రం న్యూ ఢిల్లీ లో భార‌తీయ సైనికుల‌కు బాంగ్లాదేశ్ స‌న్మానం జ‌ర‌ప‌డాన్ని ఆయ‌న జ్ఞ‌ప్తి కి తెచ్చుకొన్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాల కాలం ఇరు దేశాల సంబంధాల‌లో ఒక స్వ‌ర్ణ యుగానికి గుర్తుగా నిలిచినట్ల ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. భూ స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ పరిష్కారం గురించి, వివిధ సంధాన ప‌థ‌కాలను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

రెండు దేశాలు పొంత‌న క‌లిగిన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొన్నాయ‌ని, వాటిని సాధించ‌డం కోసం దాదాపుగా పోలివుండేటటువంటి మార్గాల‌ను అనుస‌రిస్తున్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi