Unity in diversity is our pride, our identity: Prime Minister Modi
Today on the birth anniversary of Sardar Patel, I dedicate the decision to abrogate Article 370 from Jammu and Kashmir, to him: PM Modi
Now there will be a political stability in Jammu and Kashmir: PM Modi

భార‌త‌దేశం లో వేల సంవ‌త్స‌రాల నుండి వ‌ర్ధిల్లుతున్న సంప‌న్నమైన‌టువంటి వివిధత్వం దేశం లో ఏక‌త కు దోహ‌ద ప‌డింద‌ని, అంతేకాకుండా క‌ల‌సిక‌ట్టు గా నిల‌వాల‌న్న మ‌న సంక‌ల్పాని కి అండ‌ గా కూడా ఇది నిల‌బ‌డిందని చెప్తూ, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రశంస ను వ్యక్తం చేశారు.

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్ జ‌యంతి ని స్మరించుకోవడం కోసం ఈ రోజు న కేవ‌డియా లో  ‘రాష్ట్రీయ ఏక్ తా దివ‌స్’ ను నిర్వహించిన సంద‌ర్భం లో ప్రధాన మంత్రి ప్ర‌సంగించారు. 

‘మ‌న యొక్క వివిధత్వం లో ఏక‌త్వాన్ని చూసుకొని మనం గ‌ర్విస్తున్నాము.  దాని లో నుండి మ‌నం మ‌న యొక్క అస్తిత్వాన్ని మ‌రియు స‌మ్మానాన్ని పొందుతున్నాము’’ అని ఆయ‌న అన్నారు.

 ‘‘మ‌నం మ‌న యొక్క వివిధత్వం లోని ఏక‌త్వాన్ని వేడుక గా జ‌రుపుకొంటున్నాము.  మ‌నం మ‌న యొక్క వైవిధ్యం లో ఎటువంటి వైరుధ్యాల ను అన్వేషించం. అంతకన్న అందులో మ‌నం ఏక‌త్వం యొక్క బ‌ల‌మైన పాశాన్ని చూస్తున్నాము’’

 ‘‘వివిధత్వాన్ని ఒక ఉత్స‌వం మాదిరి గా జ‌రుపుకోవ‌డమంటే అది నిజాని కి మ‌న హృద‌యాల లో ఏక‌త్వం తాలూకు తంత్రి ని స్ప‌ర్శించేట‌టువంటిదే’’ అని ఆయ‌న అన్నారు.

 ‘‘ఎప్పుడ‌యితే జీవించే విభిన్న మార్గాల ను, సంప్ర‌దాయాల ను మనం ఆదరిస్తామో, అప్పుడు సోద‌ర భావం, ఇంకా స‌మరసత మ‌రింత గా పెంపొందుతాయి.  ఈ కార‌ణం గా, ప్ర‌తి ఒక్క ఘ‌డియ లో మ‌నం మ‌న యొక్క వైవిధ్యాన్ని, దేశ నిర్మాణ ప్ర‌క్రియ ను ఉద్దేశించిన సంబ‌రాలను చేసుకొనే తీరాలి’’ అని ఆయ‌న అన్నారు.

 ‘‘ఈ యొక్క వివిధత భార‌త‌దేశం లో ఒక శ‌క్తి గా ఉంటోంది.  ప్ర‌పంచం లో మ‌రెక్క‌డా కూడా దీని ని చూడ‌టం కుద‌ర‌దు.  ద‌క్షిణాది నుండి విచ్చేసిన ఆది శంక‌రుల వారు ఉత్త‌రాది న మ‌ఠాల ను స్థాపించారు.  బెంగాల్ కు చెందిన స్వామి వివేకానందుల వారు ద‌క్షిణాగ్రాన  క‌న్యకుమారి లో జ్ఞానాన్ని సిద్ధింపచేసుకొన్నారు.’’

 ‘‘గురు గోవింద్ సింహ్ ప‌ట్ నా లో జ‌న్మించి, పంజాబ్ లో ఖాల్‌సా పంథ్ ను ఏర్పాటు చేశారు.  రామేశ్వ‌రం లో పుట్టిన కీర్తిశేషులు ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్ ఢిల్లీ లో దేశం లోనే అత్యున్న‌త‌మైన ప‌దవి ని అధిష్ఠించారు’’ అని ఆయ‌న అన్నారు.

 ‘‘భార‌త‌దేశ రాజ్యాంగ పీఠిక లోని ‘‘వీ ద పీపల్ ఆఫ్ ఇండియా’’ ప‌ద బంధాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, ఇది రాజ్యంగం ఆరంభం లో క‌నుపించేటటువంటి ఒక ప‌ద బంధం మాత్రమే కాదు, భార‌త‌దేశం లో వేల సంవ‌త్స‌రాల నాటి జీవ‌న ప‌రంప‌ర కు ప్ర‌తినిధి గా ఉంది కూడాను’’ అన్నారు.

 ‘‘స‌ర్ దార్ ప‌టేల్ గారు 500కు పైగా సంస్థానాల ను భార‌త‌దేశం లో విలీనం చేసే బృహత్కార్యాన్ని భుజాని కి ఎత్తుకొన్న‌ప్పుడు చాలా మంది ని దేశం లోకి ఆక‌ర్షించిన‌టువంటిది ఈ అయ‌స్కాంత శ‌క్తే’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

 ‘‘ప్ర‌స్తుతం భిన్న దేశాల మధ్య సౌహార్దం లో భార‌త‌దేశం యొక్క ప్ర‌తిష్ట‌ మ‌రియు ప్ర‌భావం పెరుగుతున్నాయి, దీనికి కార‌ణం మ‌న‌లోని ఏక‌తే’’ అని ఆయ‌న చెప్పారు.

 ‘‘ఇవాళ యావ‌త్తు ప్ర‌పంచం భార‌త‌దేశాన్ని గంభీరం గా ప‌రిగ‌ణిస్తోంది, దీనికి కార‌ణం మ‌న జాతీయ ఐక్య‌తే’’ అని ఆయ‌న అన్నారు.  ప్ర‌పంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ల లో ఒక‌టి గా భార‌త‌దేశం ఉంది అంటే అందుకు కార‌ణం మ‌న జాతీయ ఐక్య‌త’’ అని ఆయ‌న చెప్పారు.

 ‘‘మ‌న‌తో యుద్ధాల‌ ను గెలువ‌ లేని వారు మ‌న ఏక‌త కు స‌వాలు ను విస‌రుతున్నారు.  అయితే, యుగాల త‌ర‌బ‌డి ప్రాకులాడినప్పటికీ ఎవ్వ‌రూ కూడాను మ‌న‌ లోని ఏక‌త స్ఫూర్తి పై  పైచేయి ని సాధించ‌లేక‌పోయార‌న్న సంగ‌తి ని వారు మ‌ర‌చిపోతున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 ‘‘స‌ర్ దార్ ప‌టేల్ గారి ఆశీస్సుల తో దేశం కొన్ని వారాల క్రితం అటువంటి వేర్పాటు శ‌క్తుల ను ప‌రాజ‌యం పాలు చేసేందుకు ఒక ప్ర‌ధాన నిర్ణ‌యాన్ని తీసుకొంది.. అదే 370వ అధికార‌ణాన్ని ర‌ద్దు చేయ‌డం’’ అని ఆయ‌న వెల్ల‌డించారు.

‘‘భార‌త‌దేశ రాజ్యాంగం లోని 370వ అధిక‌ర‌ణం జ‌మ్ము & క‌శ్మీర్ కు వేర్పాటువాదాన్ని మ‌రియు ఉగ్ర‌వాదాన్ని మాత్రం ఇవ్వ‌గ‌లిగింది’’ అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

‘‘ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఈ అధిక‌ర‌ణం యొక్క ఉనికి దేశం లో ఒకే సముదాయం లో పరస్పరం విరోధం పెట్టుకొనేటటువంటి దళాల ను ఏర్పరచే కృత్రిమ‌మైన గోడ ను నిలబెట్టింది’’ అని ఆయ‌న చెప్పారు.

 

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్ యొక్క జ‌యంతి ని స్మరించుకోవ‌డం కోసం కేవ‌డియా లో ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివ‌స్’ ను నిర్వ‌హించిన సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు.

‘‘రాజ్యాంగ 370వ అధిక‌ర‌ణం ఈ కృత్రిమ‌మైన కుడ్యాని కి అవ‌త‌లి వైపు న ఉన్న‌టువంటి మ‌న సోద‌రుల ను మ‌రియు మ‌న సోదరీమ‌ణుల‌ ను అవ్యవస్థితం చేసింది’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ గోడ ను ఇప్పుడు కూల్చివేయ‌డం జ‌రిగింది’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

 ‘‘యావ‌త్తు దేశం లో 370వ అధిక‌ర‌ణం ఒక్క జ‌మ్ము & క‌శ్మీర్ లో మాత్ర‌మే ఉనికి లో ఉంది’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

 ‘‘గ‌డ‌చిన మూడు ద‌శాబ్దాల కాలం లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల వ‌ల్ల 40,000 మంది కి పైగా ప్రాణాల ను కోల్పోయారు.  ఎంతో మంది మాతృమూర్తులు వారి పిల్ల‌ల ను, సోద‌రీమ‌ణులు వారి సోద‌రుల‌ ను, త‌ల్లిదండ్రులు వారి చిన్నారుల‌ ను కోల్పోయారు’’ అని ఆయ‌న అన్నారు.

‘‘జ‌మ్ము & క‌శ్మీర్ అంశాన్ని గనుక నాకు వ‌ద‌లి వేసిన‌ట్ల‌యితే దాని ని ప‌రిష్క‌రించ‌డాని కి ఇంత వ్య‌వ‌ధి ప‌ట్టేదే కాదు అని స‌ర్ దార్ ప‌టేల్ గారు ఒక‌ప్పుడు వ్యాఖ్యానించారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 ‘‘370వ అధిక‌ర‌ణం ర‌ద్దు నిర్ణ‌యాన్ని నేను స‌ర్ దార్‌ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న కు అంకితమిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ప్ర‌క‌టించారు.

‘‘మేము తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇక జ‌మ్ము– క‌శ్మీర్ ను మ‌రియు ల‌ద్దాఖ్ ను ఒక ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు దిశ గా, ప్ర‌గ‌తి మార్గం లో ముందుకు న‌డిపిస్తుంది అని నేను సంతోషిస్తున్నాను’’ అని ఆయ‌న అన్నారు.

జ‌మ్ము– క‌శ్మీర్ లో ఇటీవ‌ల జ‌రిగిన బ్లాక్ డివెలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘ఈ ఎన్నిక‌ల కు 98 శాతాని కి పైగా వోట‌ర్లు వచ్చారు.  పంచ్ లు మ‌రియు స‌ర్పంచ్ లు అయిన‌టువంటి ఆ వోట‌ర్లు వారి వోటు హ‌క్కు ను వినియోగించుకోవ‌డం కోసం పెద్ద సంఖ్య లో త‌ర‌లి వ‌చ్చారు.  ఇది ఒక భారీ సందేశాన్ని అందిస్తోంది’’ అని ఆయ‌న అన్నారు.

 ‘‘ఇప్పుడు జ‌మ్ము– క‌శ్మీర్ లో రాజ‌కీయ స్థిర‌త్వపు యుగం మొద‌ల‌వుతుంది.  వ్య‌క్తిగ‌త స్వార్ధప‌ర‌త్వ కార‌ణాల తో ప్ర‌భుత్వాల ను ఏర్పాటు చేసే ఆట ముగుస్తుంది.  ధార్మిక కార‌ణాల తో విచ‌క్ష‌ణ చూపే భావ‌న సైతం స‌న్న‌గిలుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 ‘‘ఈ ప్రాంతం లో స‌హ‌కారాత్మ‌క స‌మాఖ్య వాదం లో ఒక సిస‌లైన ప్రాతినిధ్య యుగం ఆరంభం అవుతుంది.  నూత‌న హైవేలు, నూత‌న రైలు మార్గాలు, నూత‌న పాఠ‌శాల‌ లు, నూత‌న క‌ళాశాల‌ లు, నూత‌నం గా ఏర్పాటు అయ్యే ఆసుప‌త్రులు.. జ‌మ్ము– క‌శ్మీర్ ను పురోగ‌తి లో కొత్త శిఖ‌రాల కు తీసుకు పోతాయి’’ అని ఆయ‌న అన్నారు.

ఈశాన్య ప్రాంతాల లో చోటు చేసుకొంటున్న ప్ర‌గ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘ప్ర‌స్తుతం ఈశాన్య ప్రాంతాల లో వేర్పాటువాద ధోర‌ణులు పురోగ‌తి, ఇంకా ఏకీక‌ర‌ణ దిశ గా ప‌య‌నిస్తున్నాయి.  ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కొన‌సాగిన స‌మ‌స్య‌ల కు ప్ర‌స్తుతం ప‌రిష్కారాలు దొరుకుతున్నాయి.  ద‌శాబ్దాల పాటు కొన‌సాగిన నిర్భందాల నుండి, హింస నుండి యావ‌త్తు ఈశాన్య ప్రాంతాలు ప్ర‌స్తుతం విముక్తం అవుతున్నాయి’’ అని వివ‌రించారు.

 ‘‘స‌ర్ దార్ ప‌టేల్ గారు స‌లిపిన కృషి నుండి మేము పొందిన ప్రేర‌ణ తో దేశం లో పూర్తి ఉద్వేగ భ‌రిత‌మైన‌, ఆర్థిక మ‌రియు రాజ్యాంగ‌ ప‌ర‌మైన ఏకీక‌ర‌ణ కు ఒక ఉత్తేజాన్ని అందిస్తున్నాము.  ఇది ఏ విధ‌మైన ప్ర‌య‌త్నమంటే ఇది లేకుండా మ‌నం 21వ శ‌తాబ్దం లో ఒక శ‌క్తిమంత‌మైన భార‌త‌దేశాన్ని ఊహించుకోలేము’’ అని ఆయ‌న అన్నారు.

స‌ర్ దార్ ప‌టేల్ ఆద‌ర్శాల ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘దేశ సుస్థిర‌త కోసం ల‌క్ష్యాల తాలూకు ఏక‌త‌, కృషి తాలూకు ఏక‌త‌, ఉద్దేశ్యం తాలూకు ఏక‌త అత్య‌వ‌స‌రం.  మ‌రి ఇదే స‌ర్ దార్ ప‌టేల్ గారి సిద్ధాంతం గా ఉండింది.  అంతేకాదు, మ‌నం మ‌న యొక్క ధ్యేయాల లో, గ‌మ్యాల లో స‌మాన‌త్వ వైఖ‌రి ని క‌లిగి ఉండాలి అనేది కూడాను’’ అన్నారు.

‘‘మ‌నం ఈ జాతీయ ఏక‌త బాట లో ముందుకు సాగిపోయిన‌ప్పుడు మాత్ర‌మే ‘‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ భార‌త్’’ ల‌క్ష్యాన్ని సాధించుకొంటాము అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

PM: अब से कुछ देर पहले ही राष्ट्रीय एकता का संदेश दोहराने के लिए राष्ट्रीय एकता दौड़ संपन्न हुई है।देश के अलग-अलग शहरों में, गावों में, अलग-अलग क्षेत्रों में लोगों ने इसमें हिस्सा लिया है। pic.twitter.com/J1qMwsSItX

— PMO India (@PMOIndia) October 31, 2019

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones