ఢిల్లీ లో అనాధికృత కాలనీల లో నివాసం ఉంటున్న 40 లక్షల మంది కి పైగా ప్రజల కు యాజమాన్య హక్కు, తనఖా హక్కు/బదిలీ హక్కు కల్పించాలన్న కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తూ ఆయా కాలనీవాసుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సత్కారం చేశారు.
ఈ సమావేశం లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, ఎంపీ లు శ్రీ మనోజ్ తివారీ, శ్రీ హన్స్ రాజ్ భరద్వాజ్, శ్రీ విజయ్ గోయెల్ లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సిద్ధాంతమే ఈ చర్య కు తనను ఉత్తేజితం చేసిందన్నారు. రాజకీయాల కు అతీతం గా ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు, రాజకీయ, మత ధోరణుల తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి కి లబ్ధి ని చేకూర్చాలన్నది దీని లక్ష్యంు అయినట్లు ఆయన వివరించారు. అన్ని సామాజిక వర్గాల కు చెందిన ప్రజలు, ప్రముఖులు, ఎంపీలు, ఎంఎల్ఏల ను సంప్రదించిన అనంతరం పిఎం- ఉదయ్ పథకాన్ని ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వాలు తమ జీవితాల లో మార్పులు తెస్తాయన్న ఆశల తో ఎంతో కాలంగా ప్రతి ఒక్క ప్రభుత్వాని కి సహకరిస్తూ వస్తున్న ప్రజలందరి విజయంఎ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కాలనీ ల ప్రజల జీవితాల లో అస్థిరత ను తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని, అందుకే వారందరి కి యాజమాన్య/బదిలీ హక్కుల ను కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకు రావాలని నిర్ణయించామని ఆయన వివరించారు. దశాబ్దాల తరబడి వారి జీవితాల లో నెలకొన్న అస్థిరత ను ఇది తొలగిస్తుందని, ఎవరు ఏ క్షణం లో వచ్చి ఖాళీ చేయిస్తారో అన్న భయం లేకుండా శాంతియుతం గా జీవించాలన్న వారి కల లు సాకారం అవుతాయని ఆయన చెప్పారు. ఇది ఢిల్లీ వాసులందరి తలరాత ను మార్చేస్తుంది. ఢిల్లీ వాసుల తలరాత మారిందంటే దేశం తలరాత కూడా మారినట్టే అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
దశాబ్దాలు గా సాగిన నైతిక విలువల పతనం అనంతరం దేశాని కి స్వాతంత్ర్యం వచ్చినా కూడా దేశం లో నిర్ణయ రాహిత్యం, నిర్ణయాల కు అవరోధాల ను కల్పించడం, సమస్యల ను పక్కదారి పట్టించడం వంటి కార్యకలాపాలు సాగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వైఖరులు మన జీవితాల లో అస్థిరత కు కారణం అవుతున్నాయని ఆయన చెప్పారు.
ఇందుకు జమ్ము & కశ్మీర్ నే ఉదాహరణ గా ప్రధాన మంత్రి చెప్తూ, అక్కడ తాత్కాలిక ప్రాతిపదిక న అమలు పరచిన రాజ్యాంగం లోని 370వ అధికరణం ఆ ప్రాంతం లో అస్థిరత ను, గందరగోళాన్ని నింపిందని అన్నారు. ట్రిపుల్ తలాక్ కూడా అలాంటి సమస్యే అని ఆయన చెప్తూ, ఇది గృహిణుల జీవితాల ను దుర్భరం చేసిందన్నారు. ప్రభుత్వం ఈ రెండు లోటుపాటుల ను సరిదిద్దిందని, అలాగే ఈ రోజు న ఈ కాలనీల కు చెందిన 40 లక్షల మంది ప్రజల జీవితాల లో తాము ఎప్పుడు ఇళ్ల ను ఖాళీ చేయవలసి వస్తుందో ఏమో అనే భయాన్ని తొలగించామని ప్రధాన మంత్రి అన్నారు.
దేశవ్యాప్తం గా మధ్యతరగతి కి చెందిన పౌరుల కోసం చేపట్టిన గృహనిర్మాణ పథకాలన్నిటి ని పునరుజ్జీవింపచేయాలన్న నిర్ణయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ నిర్ణయం 4.5 లక్షల మంది కి పైబడిన ఇంటి కొనుగోలుదారుల కు లాభాన్ని చేకూర్చుతుందని, వారు తిరిగి శాంతి తో జీవితం ప్రారంభించవచ్చని ఆయన అన్నారు.
పిఎం- ఉదయ్ ఢిల్లీ కి చెందిన లబ్ధిదారుల జీవితాల లో కొత్త వెలుగుల ను నింపుతుందని ఆయన అన్నారు. 2022వ సంవత్సరం కల్లా అందరికీ ఇల్లు ను అందుబాటు లోకి తేవాలన్న తమ ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
పిఎం- ఉదయ్ పూర్వాపరాలు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న అక్టోబర్ 23వ తేదీ న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అనధికారిక కాలనీల లో నివసించే ప్రజలందరి కి యాజమాన్య/బదిలీ హక్కులు అందించాలన్న ప్రతిపాదన ను ఆమోదించింది. అందుకు అనుగుణం గా అక్టోబర్ 29న ఒక నోటిఫికేశన్ ను జారీ చేశారు.
అనధికారిక కాలనీ వాసుల కు సార్వత్రిక పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఏ), విల్లు రాయడం, క్రయ విక్రయాల కు సంబంధించిన ఒప్పందాల ను కుదుర్చుకొనే హక్కు ను కల్పించడం, వారికే హక్కుల ను దఖలుపరచే పత్రాలను అందించడం కోసం రాబోయే పార్లమెంట్ సమావేశాల లో ఒక బిల్లు ను ప్రవేశపెట్టేందుకు కూడా మంత్రిమండలి ఆమోదాన్ని తెలిపింది.
రిజిస్ట్రేశన్ చార్జీ లు, స్టాంపు డ్యూటీ లు ప్రస్తుత చట్టం పరిధి లో ఆయా సర్కిళ్ల లో అమలు లో ఉన్న మొత్తాలు కాకుండా వీరి కోసం ప్రభుత్వం నిర్ణయించే నామమాత్రపు చార్జీల ను వసూలు చేసేందుకు కూడా ప్రతిపాదిత బిల్లు అనుమతించనుంది. అయితే ప్రస్తుతం ప్రకటించిన వెసులుబాటు లు ఏవైనా అనధికారిక కాలనీ వాసుల ప్‌తత్యేక పరిస్థితుల ను దృష్టి లో పెట్టుకొని తీసుకొన్న ఒకే సమయం లో వర్తించే చర్యలు మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.