యునైటెడ్ కింగ్ డమ్ లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన, శ్రీ బిల్ గేట్స్ ను కలిశారు.
భారతదేశంలో బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని, ప్రధానమంత్రి ప్రశంసించారు. మిషన్ ఇన్నోవేషన్ పురోగతిని బిల్ గేట్స్ ప్రధానమంత్రి కి వివరించారు. మిషన్ ఇన్నోవేషన్ కింద భారతదేశంలో కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై వారు చర్చించారు.
గ్రీన్ హైడ్రోజన్, విమాన ఇంధనాలు, బ్యాటరీ నిల్వ తో సహా, వ్యాక్సిన్ పరిశోధన వంటి రంగాల్లో మంచి అవకాశాల గురించి కూడా వారు చర్చించారు.
Had an excellent meeting with @BillGates at the @COP26 Summit. We discussed a wide range of subjects including ways to strengthen global efforts towards overcoming climate change. pic.twitter.com/aUlQjRU45W
— Narendra Modi (@narendramodi) November 2, 2021