QuotePM Modi lays the foundation stone of Pune metro.
QuoteIndia is urbanising at a very quick pace & thus, its essential to work in 2 directions. 1st is to improve quality of life in villages: PM
QuoteGrowth of our cities must be adequately planned: PM
QuoteThe Government of India is actively working on the Rurban Mission: PM
QuoteWe need to invigorate our villages with good facilities while preserving their character & spirit: PM
QuoteAfter 8th November, urban local bodies' income has increased which can be allocated towards development: PM
QuoteIn this nation everybody is equal before the law and everyone has to follow the law: PM
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ)కు పునాదిరాయి వేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశంలో చాలా త్వరితగతిన పట్టణీకరణ చోటుచేసుకొంటోందని, అందువల్ల రెండు దిశలలో కృషి చేయవలసి ఉందన్నారు; వాటిలో- పల్లె ప్రజల జీవనంలోని నాణ్యతను మెరుగుపరచడం ఒకటి కాగా మన పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటన్న దానిపై దీర్ఘ కాల ప్రాతిపదికన ఆలోచించడం రెండోది అని ఆయన వివరించారు. ఇలా ఆలోచిస్తే ఆ సవాళ్లను తగ్గించడం సాధ్యపడగలదని ఆయన చెప్పారు.
|
ప్రతి ఒక్కదానినీ కూడా రాజకీయాల దృష్టికోణంలో నుండే చూడజాలమని, మనం భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మనం మన నగరాల పురోభివృద్ధి కోసం తగిన ప్రణాళికలను రచించుకోవాలని కూడా ఆయన అన్నారు.

ఎదుగుతున్న మరియు శీఘ్రంగా పట్టణీకరణకు నోచుకొంటున్న ప్రాంతాల అవసరాలను తీర్చే రూర్బన్ మిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
|
ప్రస్తుత ప్రయోజనాలు ముఖ్యమైనవేనని, కానీ భవిష్యత్తు యొక్క ఆకాంక్షలను నెరవేర్చగలిగే వ్యవస్థలు కూడా మనకు అవసరమేనని ప్రధాన మంత్రి అన్నారు. చేపట్టిన ప్రాజెక్టులు ఏవైనప్పటికీ వాటిని నిర్ణీత కాల క్రమంలో పూర్తి చేయడం కోసం ప్రభుత్వ పరిశ్రమిస్తుందని ఆయన వివరించారు.

ప్రభుత్వం గ్యాస్ గ్రిడ్ లు, వాటర్ గ్రిడ్ లు, డిజిటల్ నెట్ వర్క్ ల దిశగా కృషి చేస్తోందని, రైతులకు చేయూతనిచ్చేందుకు అంతరిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ఊతంగా తీసుకొంటూ, ఇంకా సాంకేతిక విజ్ఞ‌ానాన్ని కూడా వినియోగించుకొంటున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
|
ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి చట్టం దృష్టిలో సమానమే అని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని అనుసరించవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకవేళ అవినీతి మరియు నల్లధనం అనే రెండు దుష్కర్మలను ఇంతకు ముందు నిర్మూలించి ఉంటే గనక తాను తీసుకొన్న నిర్ణయాలను తీసుకొనే వాడిని కాదు అని ప్రధాన మంత్రి చెప్పారు.

పుణె ఒక పాండిత్య నగరమని ప్రధాన మంత్రి చెబుతూ, ఆన్ లైన్ బ్యాంకింగ్ ను అక్కున చేర్చకోవడంలోను మరియు లభ్యమవుతున్న సదుపాయాలను అన్వేషించడంలోను ఈ నగరం నాయకత్వం వహించాలని ఉద్బోధించారు.

ఈ దేశంలో 125 మంది భారతీయుల వాణి వినవస్తుందని, ఈ స్వరాన్ని ఏ కొద్ది మందో నష్టపరచజాలరని ప్రధాన మంత్రి అన్నారు.
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
CPI inflation plummets! Retail inflation hits over 6-year low of 2.10% in June 2025; food inflation contracts 1.06%

Media Coverage

CPI inflation plummets! Retail inflation hits over 6-year low of 2.10% in June 2025; food inflation contracts 1.06%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Uttarakhand meets Prime Minister
July 14, 2025

Chief Minister of Uttarakhand, Shri Pushkar Singh Dhami met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“CM of Uttarakhand, Shri @pushkardhami, met Prime Minister @narendramodi.

@ukcmo”