Innovation, integrity and inclusion have emerged as key mantras in the field of management: PM
Focus is now on collaborative, innovative and transformative management, says PM
Technology management is as important as human management: PM Modi

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ఐఐఎం సంబ‌ల్‌పూర్ శాశ్వ‌త క్యాంప‌స్ ఒడిషా సాంస్కృతిక వైభ‌వాన్ని, వ‌న‌రుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మేకాక మేనేజ్‌మెంట్‌లో ఒడిషాకు అంత‌ర్జాతీయ గుర్తింపును ఇవ్వ‌నున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.ఇత‌ర దేశాల‌నుంచి బ‌హుళ‌జాతి సంస్థ‌లు మ‌న‌దేశంలోకి వ‌చ్చే ట్రెండ్‌కు భిన్నంగా ఇటీవ‌ల మ‌న దేశ బ‌హుళ జాతి సంస్థ‌ల ట్రెండ్‌మొద‌లైంద‌ని ఆయ‌న అన్నారు. ఇండియాలో టైర్ 2, టైర్ 3 న‌గ‌రాలు స్టార్ట‌ప్‌ల‌ను చూస్తున్నాయ‌ని, ఇటీవ‌లి సంక్షోభ స‌మ‌యంలో మ‌రిన్నియూనికార్న్‌లు చూశాయ‌ని ఆయ‌నన్నారు. వ్య‌వ‌సాయ రంగంలో శ‌ర‌వేగంతో సంస్క‌ర‌ణ‌లు చోటుచేసుకుంటున్నాయ‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో విద్యార్ధులు త‌మ కెరీర్‌ను దేశ ఆకాంక్ష‌ల‌తో అనుసంధానం చేసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు.

 

ఈ నూత‌న ద‌శాబ్దంలో భార‌త‌దేశానికి అంత‌ర్జాతీయ గుర్తింపునివ్వ‌డం విద్యార్ధుల బాధ్య‌త అని ఆయ‌న వారితో అన్నారు.
స్థానికంగా ఉండే సంస్థ‌ల‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ల‌డంలో విద్యార్ధుల పాత్ర గురించి ప్ర‌ధాన‌మంత్రి విస్తృతంగా చ‌ర్చించారు. సంబంల్‌పూర్ ప్రాంతంలో గ‌ల అద్భుత స్థానిక శ‌క్తిసామ‌ర్ధ్యాల నేప‌థ్యంలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసే ఆలోచ‌న‌ల‌పై ప‌నిచేయాల్సిందిగా ఆయ‌న విద్యార్ధుల‌ను కోరారు. స్థానిక హ‌స్త‌క‌ళాఖండాలు, దుస్తులు, గిరిజ‌న క‌ళాకృతులు వంటి స్థానిక ఉత్ప‌త్తుల‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్రాంతంలోని అపార ఖ‌నిజ సంప‌ద‌ను మ‌రింత మెరుగ్గా నిర్వ‌హించే అంశంపై ప‌నిచేయాల‌ని ఇవ‌న్నీ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని

ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఐఐఎం విద్యార్దులు స్థానిక ఉత్ప‌త్తులను అంత‌ర్జాతీయ ‌స్థాయికి తీసుకువెళ్లేందుకు వినూత్న‌ప‌రిష్కారాల‌ను క‌నుగొనాల‌ని ప్రధాన‌మంత్రి పిలుపునిచ్చారు. వారు ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ మిష‌న్‌, స్థానిక ఉత్ప‌త్తులు, అంత‌ర్జాతీయ కొలాబ‌రేష‌న్‌ల మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌లుగా ప‌నిచేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఇన్నొవేష‌న్‌, ఇంటిగ్రిటి, ఇన్‌క్లూసివ్‌నెస్ మంత్ర తో మీరు మీరు మీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించాలి ” అని ప్ర‌ధాని విద్యార్ధుల‌కు ఉద్భోధించారు.

మారుతున్న ప‌ని తీరు మేనేజ్‌మెంట్ నైపుణ్యాల‌ను కోరుకుంటున్న‌ద‌ని, టాప్‌డౌన్ లేదా టాప్ హెవీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాల స్థానంలో స‌మ‌ష్టి, వైవిధ్యంతో కూడిన‌, ప‌రివ‌ర్త‌నాత్మ‌క మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు చోటుచేసుకుంటున్నాయ‌ని ఆయ‌న అన్నారు. బాట్స్‌, ఆల్గోరిథ‌మ్స్ రంగంలోకి వ‌చ్చాయ‌ని, మాన‌వ నిర్వ‌హ‌ణ‌తోపాటు సాంకేతికత నిర్వ‌హ‌ణ కూడా స‌మాన ప్రాధాన్య‌త క‌లిగి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

ఇండియాలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై ప‌రిశోధ‌న చేయాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి విద్యార్ధుల‌ను కోరారు. అంత స్వ‌ల్ప కాలంలో స‌మ‌ర్ధ‌త‌, సామర్ధ్యాల‌ను పెంపొందించిన తీరును అధ్య‌య‌నం చేయాల్సిందిగా ఆయ‌న సూచించారు. దేశం స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో స్వ‌ల్ప‌కాలిక విధానాల‌ను అనుస‌రించే ప‌ద్ధ‌తి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాల‌పై ఎలా దృష్టి పెడుతున్న‌దీ ఆయ‌న వివ‌రించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న జ‌న్‌ధ‌న్ ఖాతాల అనుభ‌వం, ఎల్‌.పి.జి క‌నెక్ష‌న్ల క‌వ‌రేజ్ దేశంలో 2014లో 55 శాతం ఉండ‌గా అది ఇవాళ 98 శాతానికి చేరిన విష‌యాన్ని ఆయ‌న తెలియ‌జేశారు. “ మేనేజ్‌మెంట్ అంటే పెద్ద కంపెనీల‌ను నిర్వ‌హించ‌డం మాత్ర‌మే కాద‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా”, ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

మంచి మేనేజ‌ర్లు కావాలంటే, దేశం ముందున్న స‌వాళ్ల‌ను అర్ధం చేసుకోవ‌డం ముఖ్య‌మని ఆయ‌న అన్నారు. ఇందుకు, ఉన్న‌త విద్యా సంస్థ‌లకు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని , కేవ‌లం వాటి నైపుణ్యాల‌పైనే దృష్టి పెట్ట‌డం కాక మ‌రింత విస్తృత దృష్టి క‌లిగి ఉన్నాయ‌న్నారు. జాతీయ విద్యావిధానం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి,ఇది విస్తృత ప్రాతిప‌దిక తో మ‌ల్టీ డిసిప్లిన‌రీ క‌లిగి ఉంద‌ని, కొంత‌కాలంగా వృత్తివిద్య‌లో ఏర్ప‌డిన‌ వివిధ అడ్డంకుల‌ను ఇది తొల‌గిస్తుంద‌ని అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage