ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌ను సందర్శించారు. అక్కడ ఆయన మహారాజా సుహెల్‌దేవ్ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. అలాగే ఘాజిపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఈరోజు ప్రారంభిస్తున్న వివిధ పథకాలు భవిష్యత్తులో పూర్వాంచల్‌ను మెడికల్ హబ్‌గా మార్చనున్నాయని, వ్యవసాయ పరిశోధనలకు ఈ ప్రాంతం కేంద్రంగా విలసిల్లనున్నదని చెప్పారు.
మహారాజా సుహెల్‌దేవ్ గొప్ప యోధుడని, ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తి గా నిలుస్తారని ప్రధానమంత్రి అన్నారు. మహారాజా సుహెల్‌దేవ్ పాలనా నైపుణ్యాలు, సైనిక ,వ్యూహాత్మక శక్తి గురించి ప్రధాని మాట్లాడారు. భారతదేశ రక్షణ, భద్రతా రంగానికి విశేష కృషి చేసిన మహనీయుల వారసత్వాన్ని , సామాజిక జీవనాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
కేంద్రప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల సున్నిత స్పందన కలిగి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ప్రజల గౌరవప్రదమైన జీవనానికి పూచీ పడే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రధాని చెప్పారు.
ఘాజీపూర్‌లో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ వల్ల ఈ ప్రాంతానికి ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఈ మెడికల్ కాలేజీకోసం డిమాండ్ చేస్తున్నారని ఇది త్వరలోనే సాకారం కానున్నదని ప్రధానమంత్రి చెప్పారు.
ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడంలో ఇదొక ప్రధాన ఆస్పత్రి అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో గోరఖ్‌పూర్, వారణాసిలలో ఆస్పత్రులు ఏర్పడనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా దేశంలో ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతటి ప్రాధాన్యత లభిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ యోజన, ద్వారా పేదలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్న విషయం ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద పట్టుమని 100 రోజులలో ఆరు లక్షల మంది లబ్ధి పొందినట్టు ప్రధానమంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్సూరెన్సు పథకం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. జీవనజ్యోతి,చ సురక్షా బీమా పథకాలలో సుమారు 20 కోట్ల మంది ప్రజలు చేరినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన పలు వ్యవసాయ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. వారణాసిలో అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం, వారణాసి, ఘాజిపూర్‌లలో కార్గో కేంద్రాలు, గోరఖ్‌పూర్‌లో ఎరువుల కర్మాగారం, బనసాగర్ నీటిపారుదల పథకంగురించి ప్రధాని ప్రస్తావించారు. ఇవి రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని వీటి ద్వారా వారి రాబడి పెరుగుతుందని చెప్పారు.
తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడే చర్యలు దేశ సమస్యలను పరిష్కరించజాలవని ప్రధానమంత్రి ప్రత్యేకించి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 22 పంటలకు వాటి ఖర్చుకు 1.5 రెట్లు ఉండే విధంగా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. వ్యవసాయరంగం ప్రగతికి తీసుకున్న పలు ఇతర చర్యలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.
ఇక వివిధ ప్రాంతాలమధ్య అనుసంధానతకు సంబంధించిన ప్రగతి గురించి వివరిస్తూ ప్రధానమంత్రి, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు శరవేగంతో జరుగుతున్నట్టు చెప్పారు. తరిఘాట్ – ఘాజిపూర్ – మావ్ బ్రిడ్జి పనులు పురోగతి లో ఉన్నట్టు ప్రధాని తెలిపారు. ఇటీవల వారణాసి- కోల్‌కతా మధ్య ప్రారంభించిన జలమార్గం ఘాజీపూర్‌కు కూడా ప్రయోజనం కలిగిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత వాణిజ్యం, వ్యాపారాన్ని వృద్ధి చేస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
उत्तर प्रदेश में मेरे आज के प्रवास के दौरान,
— PMO India (@PMOIndia) December 29, 2018
आज पूर्वांचल को देश का एक बड़ा मेडिकल हब बनाने,
कृषि से जुड़े शोध का महत्वपूर्ण सेंटर बनाने और
यूपी के लघु उद्योगों को मजबूत करने की दिशा में अनेक महत्वपूर्ण कदम उठाए जाएंगे: PM
आज पूर्वांचल और पूरे उत्तर प्रदेश का गौरव बढ़ाने वाला एक और पुण्य कार्य हुआ है।
— PMO India (@PMOIndia) December 29, 2018
महाराज सुहैलदेव की के योगदान को नमन करते हुए उनकी स्मृति में पोस्टल स्टैंप जारी किया गया है।
ये डाक टिकट लाखों की संख्या में देशभर के पोस्ट ऑफिस के माध्यम से देश के घर-घर में पहुंचेगा: PM
महाराज सुहैलदेव देश के उन वीरों में रहे हैं, जिन्होंने मां-भारती के सम्मान के लिए संघर्ष किया।
— PMO India (@PMOIndia) December 29, 2018
महाराज सुहैलदेव जैसे नायक जिनसे हर वंचित, हर शोषित, प्रेरणा लेता है, उनका स्मरण भी तो सबका साथ, सबका विकास के मंत्र को और शक्ति देता है: PM
देश के ऐसे हर वीर-वीरांगनाओं को, जिन्हें पहले की सरकारों ने पूरा मान नहीं दिया,
— PMO India (@PMOIndia) December 29, 2018
उनको नमन करने का काम हमारी सरकार कर रही है।
केंद्र सरकार का दृढ़ निश्चय है कि जिन्होंने भी भारत की रक्षा, सामाजिक जीवन को ऊपर उठाने में योगदान दिया है, उनकी स्मृति को मिटने नहीं दिया जाएगा: PM
आज गरीब से गरीब की भी सुनवाई होने का मार्ग खुला है।
— PMO India (@PMOIndia) December 29, 2018
समाज के आखिरी पायदान पर खड़े व्यक्ति को गरिमापूर्ण जीवन देने का ये अभियान अभी शुरुआती दौर में है।
अभी एक ठोस आधार बनाने में सरकार सफल हुई है।
इस नींव पर मजबूत इमारत तैयार करने का काम अभी बाकी है: PM
थोड़ी देर पहले जिस मेडिकल कॉलेज का शिलान्यास किया गया है उससे इस क्षेत्र को आधुनिक चिकित्सा सुविधा तो मिलेगी ही, गाजीपुर में नए और मेधावी डॉक्टर भी तैयार होंगे।
— PMO India (@PMOIndia) December 29, 2018
करीब 250 करोड़ की लागत से जब ये कॉलेज बनकर तैयार हो जाएगा तो, गाज़ीपुर का जिला अस्पताल 300 बेड का हो जाएगा: PM
गाज़ीपुर का नया मेडिकल कॉलेज हो,
— PMO India (@PMOIndia) December 29, 2018
गोरखपुर का AIIMS हो,
वाराणसी में बन रहे अनेक आधुनिक अस्पताल हों,
पुराने अस्पतालों का विस्तार हों,
पूर्वांचल में हज़ारों करोड़ की स्वास्थ्य सुविधाएं तैयार हो रही हैं: PM
जब सरकारें पारदर्शिता के साथ काम करती हैं,
— PMO India (@PMOIndia) December 29, 2018
जब जनहित स्वहित से ऊपर रखा जाता है,
संवेदनशीलता जब शासन का हिस्सा बनने लगती हैं,तब बड़े काम होते हैं,
जब लक्ष्य व्यवस्था में स्थाई परिवर्तन होता है, तब बड़े काम होते हैं,
तब दूर की सोच के साथ स्थाई और ईमानदार प्रयास किए जाते हैं: PM
अनेक काम हैं जो बीते 4 वर्षों से किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) December 29, 2018
जो छोटा किसान है उसको भी हमारी सरकार बैंकों से जोड़ रही है।
मंडियों में नया इंफ्रास्ट्रक्चर, नई सुविधाएं अब तैयार हो रही हैं।
नए कोल्ड स्टोरेज, मेगा फूड पार्क की चेन भी अब तैयार हो रही है: PM
पूर्वी उत्तर प्रदेश में रेलवे के महत्वपूर्ण काम हुए हैं। स्टेशन आधुनिक हो रहे हैं, लाइनों का दोहरीकरण हो रहा है, नई ट्रेनें शुरु हुई हैं।
— PMO India (@PMOIndia) December 29, 2018
गांव की सड़कें हों, नेशनल हाइवे हों या फिर पूर्वांचल एक्सप्रेसवे, जब तमाम प्रोजेक्ट पूरे हो जाएंगे तो क्षेत्र की तस्वीर बदलने वाली है: PM
आने वाला समय आपका है, आपके बच्चों का है।
— PMO India (@PMOIndia) December 29, 2018
आपके भविष्य को संवारने के लिए, आपके बच्चों का भविष्य बनाने के लिए,
आपका ये चौकीदार, बहुत ईमानदारी से, बहुत लगन के साथ, दिन-रात एक कर रहा है: PM
आप अपना विश्वास और आशीर्वाद इसी तरह बनाए रखिए।
— PMO India (@PMOIndia) December 29, 2018
क्योंकि चौकीदार की वजह से कुछ चोरों की रातों की नींद उड़ी हुई है।
मुझ पर आपका विश्वास और आशीर्वाद ही एक दिन इन चोरों को सही जगह तक लेकर जाएगा: PM