ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా లో గల మగ్ హర్ ను ఈ రోజు సందర్శించారు.
మహా సాధువు మరియు కవి శ్రీ కబీర్ 500వ వర్ధంతి సందర్భంగా సంత్ కబీర్ సమాధి వద్ద ఆయన పుష్పాంజలి ని ఘటించారు. సంత్ కబీర్ మజార్ వద్ద చాదర్ ను కూడా సమర్పించారు. సంత్ కబీర్ గుహ ను సందర్శించి, సంత్ కబీర్ ప్రబోధాలను మరియు ఆలోచనలను చాటి చెప్పనున్న సంత్ కబీర్ అకాడెమీ కి శంకు స్థాపన సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఒక జన సభ లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మహా సాధువు శ్రీ కబీర్ కు శ్రద్ధాంజలి ఘటించడం ద్వారా కొన్ని సంవత్సరాలుగా తన లోపల ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరిందని తెలిపారు. సంత్ కబీర్, గురు నానక్ లతో పాటు బాబా గోరఖ్ నాథ్ ఆధ్యాత్మిక చర్చ లో పాలుపంచుకొన్న ప్రదేశమే మగ్ హర్ అని చరిత్ర చెబుతోంది.
దాదాపు 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమయ్యే సంత్ కబీర్ అకాడెమీ సంత్ కబీర్ యొక్క వారసత్వం, అలాగే ఉత్తర్ ప్రదేశ్ లో ప్రాంతీయ మాండలికాలు, ఇంకా జానపద కళలను పరిరక్షించేందుకు ఒక సంస్థ ను ఏర్పాటు చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం యొక్క ఆత్మ సారానికి సంత్ కబీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సంత్ కబీర్ కులాల యొక్క అడ్డుగోడలను ఛేదించారని, సామాన్యులు, గ్రామీణ భారతీయులు మాట్లాడే భాష లో ఆయన సంభాషించే వారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో ఆయా కాలలకు అనుగుణంగా సాధువులు, సంతులు ఆవిర్భవించి సంఘం లోని చెడు లను పారదోలడంలో సమాజానికి మార్గాన్ని చూపారని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లోని వేరు వేరు ప్రాంతాలలో వివిధ శకాలలో ఆవిర్భవించిన సాధువుల పేర్లను ప్రధాన మంత్రి వల్లె వేస్తూ, ఈ క్రమంలో బాబా సాహెబ్ ఆంబేడ్కర్ గురించి చెబుతూ భారతదేశం లో ప్రతి ఒక్క పౌరుడికీ రాజ్యాంగం ద్వారా సమానత్వం లభించేటట్లుగా శ్రద్ధ వహించారని పేర్కొన్నారు.
రాజకీయ అవకాశ వాదానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి ఒక బలమైన ప్రకటనను చేస్తూ, ప్రజల భావాలను మరియు బాధలను అర్ధం చేసుకున్న వారే ఆదర్శప్రాయమైన పాలకులు అని పలికిన సంత్ కబీర్ ప్రబోధాన్ని జ్ఞప్తికి తెచ్చారు. ప్రజల మధ్య వివక్షను ప్రదర్శించిన సామాజిక వ్యవస్థలను అన్నింటినీ సంత్ కబీర్ తూర్పారబట్టారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సమాజం లోని పేదలకు, అణగారిన వర్గాల వారికి సాధికరిత ను ఇచ్చే కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను గురించి ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు. వీటిలో జన్ ధన్ యోజన, ఉజ్జ్వల యోజన, బీమా పథకాలు, మరుగుదొడ్ల నిర్మాణం మరియు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ల వంటివి ఉన్నాయి. రహదారులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ల వంటి వేరు వేరు అవస్థాపన రంగాలలో పెరుగుదలను గురించి కూడా ఆయన వివరించారు. భారతదేశం లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను అందుకొనేటట్లుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
‘న్యూ ఇండియా’ యొక్క దార్శనికతకు ఒక స్వరూపాన్ని ఇవ్వడంలో సంత్ కబీర్ ప్రబోధాలు తోడ్పడుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
आज मेरी बरसों की कामना पूरी हुई है..
— PMO India (@PMOIndia) June 28, 2018
संत कबीर दास जी की समाधि पर फूल चढ़ाने का,
उनकी मजार पर चादर चढ़ाने का, सौभाग्य प्राप्त हुआ।
मैं उस गुफा में भी गया, जहां कबीर दास जी साधना करते थे: PM
आज ज्येष्ठ शुक्ल पूर्णिमा है..
— PMO India (@PMOIndia) June 28, 2018
आज ही से भगवान भोलेनाथ की यात्रा शुरु हो रही है।
मैं तीर्थयात्रियों को सुखद यात्रा के लिए शुभकामनाएं भी देता हूं।
कबीर दास जी की 500वीं पुण्यतिथि के अवसर पर आज से ही यहां कबीर महोत्सव की शुरूआत हुई है: PM
थोड़ी देर पहले यहां संत कबीर अकादमी का शिलान्यास किया गया है।
— PMO India (@PMOIndia) June 28, 2018
यहां महात्मा कबीर से जुड़ी स्मृतियों को संजोने वाली संस्थाओं का निर्माण किया जाएगा।
कबीर गायन प्रशिक्षण भवन, कबीर नृत्य प्रशिक्षण भवन, रीसर्च सेंटर,
लाइब्रेरी,
ऑडिटोरियम,
हॉस्टल,
आर्ट गैलरी विकसित किया जाएगा: PM
कबीर की साधना ‘मानने’ से नहीं, ‘जानने’ से आरम्भ होती है..
— PMO India (@PMOIndia) June 28, 2018
वो सिर से पैर तक मस्तमौला, स्वभाव के फक्कड़
आदत में अक्खड़
भक्त के सामने सेवक
बादशाह के सामने प्रचंड दिलेर
दिल के साफ
दिमाग के दुरुस्त
भीतर से कोमल
बाहर से कठोर थे।
वो जन्म के धन्य से नहीं, कर्म से वंदनीय हो गए: PM
वो धूल से उठे थे लेकिन माथे का चन्दन बन गए।
— PMO India (@PMOIndia) June 28, 2018
वो व्यक्ति से अभिव्यक्ति और इससे आगे बढ़कर शब्द से शब्दब्रह्म हो गए।
वो विचार बनकर आए और व्यवहार बनकर अमर हुए।
संत कबीर दास जी ने समाज को सिर्फ दृष्टि देने का काम ही नहीं किया बल्कि समाज को जागृत किया: PM
कबीर ने जाति-पाति के भेद तोड़े,
— PMO India (@PMOIndia) June 28, 2018
“सब मानुस की एक जाति” घोषित किया,
और अपने भीतर के अहंकार को ख़त्म कर उसमें विराजे
ईश्वर का दर्शन करने का रास्ता दिखाया।
वे सबके थे, इसीलिए सब उनके हो गए: PM
ये हमारे देश की महान धरती का तप है, उसकी पुण्यता है कि समय के साथ, समाज में आने वाली आंतरिक बुराइयों को समाप्त करने के लिए समय-समय पर ऋषियों, मुनियों, संतों का मार्गदर्शन मिला।
— PMO India (@PMOIndia) June 28, 2018
सैकड़ों वर्षों की गुलामी के कालखंड में अगर देश की आत्मा बची रही, तो वो ऐसे संतों की वजह से ही हुआ: PM
कुछ दलों को शांति और विकास नहीं, कलह और अशांति चाहिए
— PMO India (@PMOIndia) June 28, 2018
उनको लगता है जितना असंतोष और अशांति का वातावरण बनाएंगे
उतना राजनीतिक लाभ होगा।
सच्चाई ये है ऐसे लोग जमीन से कट चुके हैं
इन्हें अंदाजा नहीं कि संत कबीर, महात्मा गांधी, बाबा साहेब को मानने वाले हमारे देश का स्वभाव क्या है: PM
समाजवाद और बहुजन की बात करने वालों का सत्ता के प्रति लालच आप देख रहे हैं
— PMO India (@PMOIndia) June 28, 2018
2 दिन पहले देश में आपातकाल को 43 साल हुए हैं। सत्ता का लालच ऐसा है कि आपातकाल लगाने वाले और उस समय आपातकाल का विरोध करने वाले एक साथ आ गए हैं।
ये समाज नहीं, सिर्फ अपने और अपने परिवार का हित देखते हैं: PM
जनधन योजना के तहत उत्तर प्रदेश में लगभग 5 करोड़ गरीबों के बैंक खाते खोलकर,
— PMO India (@PMOIndia) June 28, 2018
80 लाख से ज्यादा महिलाओं को मुफ्त गैस कनेक्शन देकर,
करीब 1.7 करोड़ गरीबों को बीमा कवच देकर,
1.25 करोड़ शौचालय बनाकर,
गरीबों को सशक्त करने का काम किया है: PM
14-15 वर्ष पहले जब पूर्व राष्ट्रपति अब्दुल कलाम जी यहां आए थे, तब उन्होंने इस जगह के लिए एक सपना देखा था।
— PMO India (@PMOIndia) June 28, 2018
उनके सपने को साकार करने के लिए,
मगहर को अंतरराष्ट्रीय मानचित्र में सद्भाव-समरसता के मुख्य केंद्र के तौर पर विकसित करने का काम अब किया जा रहा है: PM