PM lays foundation stone for IARI in Assam, says agriculture needs to be developed in line with the requirements of the 21st century
Farmers must benefit from the changing technology: PM Modi
PM highlights "Panch Tatva" - five elements to boost connectivity in the North-East

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నిర్మాణ పనులకు పునాదిరాయిని వేశారు.

ఈ సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని ప్రసంగించారు. అస్సామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ ను రాష్ట్రంలో వారు చేస్తున్న కృషికి గాను ప్రధాన మంత్రి వారిని అభినందించారు

భవిష్యత్తులో ఈ యావత్తు ప్రాంతాన్ని సకారాత్మకమైనటువంటి రీతిలో ప్రభావితం చేయగల శక్తి ఈ రోజు ఐఎఆర్ఐ కి వేసిన పునాదిరాయి కి ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. 21వ శతాబ్దం అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయదారులు మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని లాభపడి తీరాలి అని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక వ్యవసాయ రీతుల మరియు సాంకేతిక విజ్ఞాన శాస్త్ర సంబంధ నవకల్పనల ఆవిష్కారం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

2022 సంవత్సరం నాటికి భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జించుకొని 75 ఏళ్లు అవుతుందని చెబుతూ, అప్పటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తన ఆశయమని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో అనేక చర్యలు చేపట్టిందని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ సందర్భంలో ఆయన ‘భూ స్వస్థత కార్డు’లు, ‘‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’’ మరియు ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లను గురించి చెప్పుకొచ్చారు. భూమి స్వస్థత ప్రయోగ శాలల విస్తారమైనటువంటి ఒక నెట్ వర్క్ ను దేశమంతటా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రస్తావించారు. ఫసల్ బీమా యోజన వ్యవసాయదారులలో చక్కటి ఆదరణకు నోచుకొన్నదని ప్రధాన మంత్రి అన్నారు.

ఈశాన్య భారతం అనుసంధానానికి ఉత్తేజాన్ని అందించే రైల్వేలు, హైవేలు, ఎయిర్ వేస్, వాటర్ వేస్ మరియు ఐ- వేస్ ల గురించి ప్రధాన మంత్రి చెబుతూ, వాటిని ‘‘పంచ తత్వాలు’’గా అభివర్ణించారు. ఈ పంచ తత్వాల ద్వారా భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో సమృద్ధికి అండదండలను అందిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతున్నట్లు సభికులకు ఆయన వివరించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi