ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సూర‌త్ లో ప‌ర్య‌టించారు. సూర‌త్ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ భ‌వ‌నం విస్త‌ర‌ణ పకు ఆయ‌న పునాదిరాయి ని వేశారు. దీని తో సూర‌త్ లో, గుజ‌రాత్ లోని ద‌క్షిణ ప్రాంతం లో సంధానం పెరిగి, సమృద్ధి కి దారి తీయనుంది.

ఈ సంద‌ర్భం గా స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ‘‘వ్యాపారం నిర్వ‌హ‌ణ సుల‌భ‌త‌రం కావ‌డం కోసం ఈ దేశం లో మౌలిక స‌దుపాయాల ను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. మ‌రి సూర‌త్ విమానాశ్ర‌యం యొక్క విస్త‌ర‌ణ ఈ దిశ గా సాగుతున్న ఒక ప్ర‌య‌త్నం’’ అని పేర్కొన్నారు. 25,500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల కు పైబ‌డిన విస్తీర్ణం లో 354 కోట్ల రూపాయ‌ల నిర్మాణ వ్య‌యం తో సూర‌త్ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ భ‌వ‌నాన్ని విస్త‌రించ‌డం జ‌రుగుతోంది. ఇది సౌర శ‌క్తి ని వినియోగించుకొంటూ, ఎల్ఇడి కాంతుల తో ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర భ‌వ‌నం గా రూపుదిద్దుకోనుంది. నూత‌న ట‌ర్మిన‌ల్ ప‌నులు పూర్తి అయ్యాయంటే అది ఒక సంవ‌త్స‌ర కాలం లో 26 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ రాక పోక లు సాధ్యపడుతాయి. ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నం 4 ల‌క్ష‌ల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చుతోంది. ఎయర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్ల‌యిట్ త్వరలోనే సూర‌త్ ను శార్ జాహ్ తో జోడించనుంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. మొదట్లో వారానికి రెండు ఫ్ల‌యిట్ లు ఉంటాయి; త‌రువాత త‌రువాత ఇవి రెట్టింపు అయ్యి, ప్ర‌తి ఒక్క వారాని కి నాలుగు ఫ్ల‌యిట్ లకు చేరుకొంటాయి.

యుడిఎఎన్ (‘ఉడాన్’) ప‌థ‌కం లో భాగం గా గ‌గ‌న‌త‌ల సంధానాని కి ఒక ఉత్తేజాన్ని అందించ‌డం కోసం విమానాశ్ర‌యాల‌ ను కొత్త‌ గా నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇక ప్ర‌జ‌లు వారి వారి ప్రాంతాల నుండి ఎంతో దూరం లేకుండానే విమానాశ్రయానికి చేరుకోవచ్చని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ‘‘విమాన ప్ర‌యాణాల‌ ను ప్ర‌తి ఒక్క‌రి కి అందుబాటు లోకి తీసుకు రావాల‌ని మేం కోరుకొంటున్నాం. భార‌త‌దేశం లో గ‌గ‌న‌త‌ల సంధానాని కి ఉత్తేజాన్ని ఇవ్వ‌డం లో యుడిఎఎన్ గొప్ప‌ గా తోడ్ప‌డింది. భార‌త‌దేశ విమాన‌యాన చిత్ర ప‌టం లో 40 విమానాశ్ర‌యాల‌ ను యుడిఎఎన్ జోడించింది. దేశం అంత‌టా ఈ త‌ర‌హా విమానాశ్ర‌యాల‌ ను మ‌రిన్నింటి ని అభివృద్ధి ప‌ర‌చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు వేస్తోంది’’ అని ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌భుత్వం చేపట్టిన అభివృద్ధి ప‌నుల‌ ను గురించి ఆయ‌న ప్ర‌ముఖం గా ప్ర‌స్తావిస్తూ, పూర్తి సంఖ్యాధిక్యం ఉన్న ప్ర‌భుత్వం సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌ ను తీసుకో గ‌లుగుతుంద‌ని, దేశాభివృద్ధి కోసం స్వేచ్ఛ గా ప‌ని చేయ‌గ‌లుగుతుంద‌న్నారు. ‘‘మీరు మాకు సంఖ్యాధిఖ్యాన్ని ఇచ్చారు కాబ‌ట్టి మేం క‌ఠిన‌ నిర్ణ‌యాల‌ను తీసుకోగ‌లుగుతున్నాం. ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల లాగా కాకుండా ఎన్‌డిఎ ప్ర‌భుత్వం మ‌ధ్య‌ త‌ర‌గ‌తి కోసం కృషి చేస్తోంది’’ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

త‌న ప్ర‌భుత్వం యొక్క ప‌నితీరు ను యుపిఎ పనితీరు తో శ్రీ మోదీ పోల్చి చెప్తూ, ‘‘మా యొక్క నాలుగు సంవ‌త్స‌రాల పాల‌న లో మేం 1.30 కోట్ల గృహాల‌ ను నిర్మించాం. అదే యుపిఎ హ‌యాం లో వారు 25 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను క‌ట్టారు’’ అని వెల్ల‌డించారు. ‘‘2014వ సంవ‌త్స‌రం లో కేవ‌లం 80 పాస్‌పోర్ట్ కార్యాల‌యాలు ఉండేవి, ప్ర‌స్తుతం 400కు పైగా పాస్‌పోర్ట్ కార్యాల‌యాలు ఉన్నాయి’’ అని కూడా ఆయ‌న తెలిపారు.

సూర‌త్ లో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ల‌బ్దిదారులు కొంద‌రి కి ప్ర‌ధాన మంత్రి తాళం చెవుల‌ ను అందించారు. దేశం లోని పేద‌ల జీవితాల ను మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల‌ ను సుల‌భ‌త‌రం చేసే వైఖ‌రి ని అవ‌లంబిస్తూ ప్ర‌భుత్వం ఒక ఉద్య‌మం త‌ర‌హా లో కృషి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ‘‘న‌గ‌రాల‌ లో నివ‌సించే పేద‌ల కోసం గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల కాలం లో ప్ర‌భుత్వం 13 ల‌క్ష‌ల కు పైగా గృహాల‌ను నిర్మించింది. 37 ల‌క్ష‌ల ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది’’ అని కూడా ఆయ‌న వివ‌రించారు.

స్వాతంత్య్ర ఉద్యమం లో సూర‌త్ పోషించిన పాత్ర‌ ను శ్రీ మోదీ గుర్తు కు తెస్తూ, ఈ న‌గ‌రం పెట్టుబ‌డుల లో వృద్ధి ద్వారా ఒక ద‌శాబ్ది కాలం లో ప్ర‌పంచ వ్యాప్తం గా అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల లో ఒక‌టి గా అవ‌త‌రించ‌గ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి సూర‌త్ లో అత్యంత అధునాత‌న‌మైన సూప‌ర్ స్పెశాలిటీ హాస్పిట‌ల్ అయినటువంటి రసీలాబెన్ సేవంతిలాల్ శాహ్ వీనస్ ఆసుపత్రి ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భం గా ఆసుప‌త్రి లో స‌దుపాయాల‌ ను ఆయ‌న ప‌రిశీలించారు. స‌భికుల‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ప్ర‌జ‌ల‌ కు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ ను అందించ‌డం లో ‘ఆయుష్మాన్ భార‌త్’ ఏ విధం గా ఒక కీల‌క‌మైనటువంటి భూమిక‌ ను పోషించిందీ ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ కు ఎక్కువ సంఖ్య లో జన‌రిక్ ఔష‌ధాలు ల‌భ్య‌మ‌వుతున్నాయ‌ని, దీని ద్వారా ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌యం త‌గ్గ‌డ‌మే కాకుండా అనేక అమూల్య‌మైన ప్రాణాలు కాపాడ‌బ‌డుతున్నాయ‌ని’’ ఆయ‌న తెలిపారు.

దండి నుండి తిరిగి వ‌చ్చిన త‌రువాత సాయంత్రం పూట సూర‌త్ ఇండోర్ స్టేడియ‌మ్ లో ‘న్యూ ఇండియా యూత్ కాంక్లేవ్’ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించనున్నారు. దండి లో ఆయ‌న జాతీయ ఉప్పు స‌త్య‌ాగ్ర‌హ స్మార‌కాన్ని ప్రారంభిస్తారు. ఈ స్మార‌కం లో మ‌హాత్మ గాంధీ మరియు దండి ఉప్పు యాత్ర లో ఆయ‌న తో క‌ల‌సి న‌డ‌చిన 80 మంది స‌త్యాగ్ర‌హీ ల యొక్క విగ్ర‌హాలు ఉన్నాయి. వారంతా బ్రిటిషు పాల‌న‌ కు వ్య‌తిరేకం గా స‌ముద్ర‌పు నీటి నుండి ఉప్పు ను త‌యారు చేశారు. ఇక్కడ 24 కుడ్య చిత్రాలు 1930వ సంవ‌త్స‌రం లో చోటు చేసుకొన్న చారిత్ర‌క ఉప్పు సత్యాగ్రహం తాలూకు వివిధ ఘ‌ట్టాల‌ ను మరియు కథల ను వివరిస్తున్నాయి. భార‌త‌దేశ స్వాతంత్య్ర పోరాట చ‌రిత్ర లో చెప్పుకోద‌గిన‌టువంటి ఒక స‌న్నివేశం గా ఉప్పు సత్యాగ్రహం పేరు తెచ్చుకొంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi