ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కార్ నికోబార్ ను సందర్శించారు.
సునామీ స్మారకం వద్ద ఆయన ఒక పూలమాల ను సమర్పించారు. ‘వాల్ ఆఫ్ లాస్ట్ సోల్స్’ వద్ద ఒక కొవ్వొత్తి ని వెలిగించారు.
ఆయన ఆదివాసీ ప్రముఖుల తో ముఖాముఖి భేటీ అయి, వారితో సంభాషించారు. అలాగే, దీవుల లోని ప్రసిద్ధ క్రీడాకారులతోనూ ఆయన మాట్లాడారు.
ఒక సార్వజనిక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం గా అరోంగ్ లో ఐటిఐ ని మరియు ఒక అధునాతన క్రీడా భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.
మస్ రేవు కట్ట సమీపం లో తీర పరిరక్షణ పనుల కు శంకు స్థాపన చేశారు. అంతేకాక క్యాంప్ బే రేవు కట్ట యొక్క విస్తరణ పనుల కూ పునాది రాయి ని వేశారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ దీవుల యొక్క ఘనమైన ప్రాకృతిక శోభ ను, సంస్కృతి ని, కళలను మరియు సంప్రదాయాల ను గురించి వివరించారు. దీవుల యొక్క సముదాయం మరియు సమష్టి సంప్రదాయాల ను గురించి ఆయన చెప్తూ ఇది సంవత్సరాల తరబడి భారతీయ సమాజం యొక్క బలం గా ఉందని తెలిపారు.
‘వాల్ ఆఫ్ లాస్ట్ సోల్స్’ పేరు తో ఏర్పాటు చేసిన సునామీ స్మారక చిహ్నాన్ని ఈ కార్యక్రమాని కి తరలి వచ్చే కన్నా కొద్దిసేపటి క్రితం తాను సందర్శించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. నికోబార్ దీవుల లోని ప్రజల యొక్క స్ఫూర్తి ని, సునామీ తరువాత దీవుల పునర్ నిర్మాణం లో వారు పడిన శ్రమ ను ఆయన అభినందించారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధి, రవాణా, విద్యుత్తు, క్రీడలు, ఇంకా పర్యటన వంటి రంగాలను అభివృద్ధి పరచడం లో ఈ రోజు న ఆవిష్కరించిన పథకాలు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన అన్నారు.
అభివృద్ధి దిశ గా సాగే యాత్ర లో ఏ ఒక్కరినీ, లేదా దేశం లోని ఏ భాగాన్ని తన ప్రభుత్వం విడచి పెట్టే ప్రసక్తే లేదంటూ ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. దూరాలను తగ్గించివేసి హృదయాలలో సామీప్య భావన ను ప్రోది చేయడమే ధ్యేయం అని ఆయన అన్నారు.
సముద్రం వద్ద గోడ ను కట్టే పని ఒకసారి పూర్తి అయిందంటే గనుక కార్ నికోబార్ దీవి ని పరిరక్షించడానికి అది తోడ్పడగలుగుతుందని ఆయన అన్నారు. ఐటిఐ దీవి లోని యువతీ యువకులకు నైపుణ్యాలను సంతరించి వారి సాధికారితకు సహాయకారి కాగలదని ఆయన చెప్పారు. నికోబార్ దీవుల యువత లో క్రీడా సంబంధ సామర్ధ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఆధునిక క్రీడా భవన సముదాయం వారి నైపుణ్యాల కు సాన పట్టడం లో దోహదకారి అవుతుందని చెప్పారు. భవిష్యత్తు లో మరిన్ని క్రీడారంగ సంబంధిత మౌలిక సదుపాయాల ను సమకూర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు.
అండమాన్ మరియు నికోబార్ దీవుల లోని ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచే దిశ గా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దీవుల లోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల విస్తరణ ను గురించి కూడా ఆయన వివరించారు.
స్థానిక సంస్కృతి ని మరియు పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి వివరించారు.
వ్యవసాయ రంగం లో కొబ్బరి కి మద్దతు ధర పెంపుదల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. చేపల పెంపకం రంగం లో నిమగ్నమైన వారికి సాధికారిత ను కల్పించే దిశ గా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశం లో మత్స్య పరిశ్రమ రంగాన్ని మరింత లాభదాయకం గా తీర్చిదిద్దడం కోసం ఇటీవలే 7,000 కోట్ల రూపాయలకు ఆమోద ముద్ర వేసినట్లు ఆయన వివరించారు. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మన యొక్క నీలి విప్లవానికి కేంద్రాలు గా రూపుదిద్దుకొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. సీవీడ్ ఫార్మింగ్ ను ప్రోత్సహించడం జరుగుతోందని, అలాగే మత్స్యకారులు ఆధునిక పడవల కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారని ఆయన వివరించారు. సౌర శక్తి ని వినియోగించుకొనేందుకు భారతదేశం ఉమ్మడి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భం లో ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ ను గురించి ఆయన ప్రస్తావించారు. సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన లో బ్రహ్మాండమైన సామర్ధ్యాన్ని కలిగివుంటాయని ఆయన వివరించారు. ఈ దిశగా కార్ నికోబార్ లో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
నికోబార్ దీవుల తో పాటు, సమీపం లోని మలక్కా జలసంధి వనరుల పరంగా చూసినా, భద్రత పరంగా చూసినా ముఖ్యమైనవి అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ అంశాల ను దృష్టి లో పెట్టుకొని రవాణా సంబంధిత సముచిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధిపరచడం జరుగుతోందని ఆయన అన్నారు. మస్ రేవు కట్ట లోనూ, క్యాంప్ బెల్ బే రేవు కట్ట లోనూ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందని ఆయన వివరించారు.
ఈ దీవుల అభివృద్ధి కి తన ప్రభుత్వం దీక్షాబద్ధురాలై ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
मैं कल काशी में था और आज यहां विराट समंदर की गोद में आप सभी के बीच मौजूद हूं
— PMO India (@PMOIndia) December 30, 2018
मां गंगा अपनी पवित्रता से जिस प्रकार भारत के जन-मानस को आशीर्वाद देती रही है,
उसी प्रकार ये सागर अनंत काल से मां-भारती के चरणों का वंदन कर रहा है, राष्ट्र की सुरक्षा और सामर्थ्य को ऊर्जा दे रहा है: PM
आपके पास प्रकृति का अद्भुत खज़ाना तो है ही, आपकी संस्कृति, परंपरा, कला और कौशल भी बेहतरीन है।
— PMO India (@PMOIndia) December 30, 2018
थोड़ी देर पहले यहां पर जो नृत्य प्रस्तुत किया गया, बच्चों ने जो कला का प्रदर्शन किया, वो दिखाता है कि भारत की सांस्कृतिक संपन्नता हिंद महासागर जितनी ही विराट है: PM
ये देश के विकास के लिए हमारी उस सोच का विस्तार है, जिसके मूल में Infrastructure है, Connectivity है।
— PMO India (@PMOIndia) December 30, 2018
सबका साथ, सबका विकास, यानि विकास से देश का कोई नागरिक भी ना छूटे और कोई कोना भी अछूता ना रहे, इसी भावना का ये प्रकटीकरण है: PM
सुरक्षा के साथ-साथ कार-निकोबार में विकास की पंचधारा बहे, बच्चों को पढ़ाई, युवाओं को कमाई, बुजुर्गों को दवाई, किसानों को सिंचाई, जन-जन की सुनवाई, ये सभी सुविधाएं मिलें, इसके लिए भी काम किया जा रहा है: PM
— PMO India (@PMOIndia) December 30, 2018
कार-निकोबार के युवा पारंपरिक रोज़गार के साथ-साथ आज शिक्षा, चिकित्सा और दूसरे कामों में भी आगे बढ़ रहे हैं।
— PMO India (@PMOIndia) December 30, 2018
स्पोर्ट्स की स्किल तो यहां के युवा साथियों में रची-बसी है। कार-निकोबार फुटबॉल समेत अनेक खेलों में देश के बेहतरीन स्पोर्टिंग टैलेंट के लिए भी मशहूर हो रहा है: PM
केंद्र सरकार अंडमान और निकोबार में रहने वाले हर नागरिक के लिए जीवन से जुड़ी हर व्यवस्था को आसान करने में जुटी है।
— PMO India (@PMOIndia) December 30, 2018
सस्ता राशन हो, स्वच्छ पानी हो, गैस कनेक्शन हो, केरोसिन हो, हर सुविधा को आसान करने का प्रयास किया जा रहा है: PM
केंद्र सरकार हमारे मछुआरों को सशक्त करने में जुटी है।
— PMO India (@PMOIndia) December 30, 2018
हाल में ही देश में मछलीपालन को लाभकारी व्यवसाय बनाने के लिए 7 हज़ार करोड़ रुपए के एक विशेष फंड का प्रावधान किया गया है।
इसके तहत मछुआरों को उचित दरों पर ऋण उपलब्ध कराया जा रहा है: PM
कार-निकोबार के पर्यावरण को संरक्षित रखते हुए, सौर ऊर्जा की संभावनाओं को तलाशा जा रहा है, तराशा जा रहा है।
— PMO India (@PMOIndia) December 30, 2018
आज भारत दुनिया के उन देशों में है जहां सौर ऊर्जा का उत्पादन और उपयोग सबसे तेज़ी से बढ़ रहा है। सौर ऊर्जा से देश को सस्ती और ग्रीन एनर्जी देने के लिए हम प्रतिबद्ध हैं: PM
देश की ज़रूरतों को ध्यान में रखते हुए यहां Trans-shipment Port की आधारशिला आज रखी गई है। इस परियोजना से खाड़ी के दक्षिणी हिस्से में नए उद्यमों के लिए अवसर बनेंगे।
— PMO India (@PMOIndia) December 30, 2018
इसी के साथ सागरमाला योजना के तहत देशभर के समुद्री तटों को विकसित करने की बड़ी योजना चल रही है: PM
कार-निकोबार में कैंबल बे में करीब 50 करोड़ रुपए की लागत से कैंबल बे जेट्टी का विस्तार करीब डेढ़ सौ किलोमीटर तक किए जाने का निर्णय लिया गया है।
— PMO India (@PMOIndia) December 30, 2018
इसके साथ-साथ मूस जेट्टी की गहराई बढ़ाने के लिए भी योजना बनाई गई है, ताकि यहां बड़े जहाज़ों को रुकने में मुश्किल ना हो: PM