We will break the backbone of terrorism in Jammu and Kashmir and fight it with all our might: PM Modi
Our government is committed to restore dignity of displaced Kashmiri Pandits: PM Modi
PM Modi congratulates people of Jammu Kashmir for making the state Open Defecation Free

జ‌మ్ము & కశ్మీర్‌ లో ఉగ్ర‌వాదాన్ని పురికొల్పేందుకు య‌త్నిస్తున్న‌ వారికి దేశం త‌గిన విధం గా బుద్ధి చెప్తుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. శ్రీ‌న‌గ‌ర్‌ లో ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్ర‌సంగిస్తూ, ‘‘మేం ప్ర‌తి ఉగ్ర‌వాది కి త‌గిన‌ విధం గా బుద్ధి చెప్తాం. జ‌మ్ము & కశ్మీర్‌ లో ఉగ్ర‌వాదం యొక్క వెన్ను ను మేం విరిచివేసి ఉగ్రవాదం తో పోరాడటం కోసం మా యొక్క స‌ర్వ‌శ‌ క్తుల‌ను ఒడ్డుతాం” అన్నారు.

ఉగ్ర‌వాదుల‌ తో పోరాటం లో ప్రాణ‌ త్యాగం చేసిన అమ‌రుడు న‌జీర్ అహ్మ‌ద్ వ‌ని కి ప్ర‌ధానమంత్రి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘అమ‌రుడు న‌జీర్ అహ్మ‌ద్ వానీ, దేశం కోసం, శాంతి కోసం ప్రాణాలు అర్పించిన అమ‌ర జ‌వానులందరి కి ఇవే నా ఘ‌న నివాళులు అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. న‌జీర్ అహ్మ‌ద్ వానీ అశోక చ‌క్ర తో సత్కరించబడ్డారు. ఆయన పరాక్రమం, సాహ‌సం జ‌మ్ము & కశ్మీర్‌ యువ‌త‌ తో పాటు యావత్తు దేశ ప్ర‌జ‌లకు దేశం కోసం జీవించేందుకు మార్గం చూపుతోంది’’ అన్నారు.

ప్ర‌ధాన‌ మంత్రి కొత్త‌ గా ఎన్నికైన స‌ర్పంచ్‌ ల‌తో ముచ్చ‌టించారు. రాష్ట్రం లో ఎన్నో సంవత్సరాల కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ లు జ‌రిగాయ‌ని తెలిసి ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ప‌రిస్థితులు అనుకూలంగా లేకున్నప్పటపికీ వోటు వేసేందుకు ముందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. ఇది ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల ప్ర‌జ‌ల‌ లో ఉన్న విశ్వాసాని కి, రాష్ట్రాభివృద్ధి పట్ల త‌ప‌న‌ కు అద్దం ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్ర స‌ర్వ‌తోముఖ వికాసాని కి త‌న ప్రాధాన్య‌ాల‌ ను గురించి ప్రధాన మంత్రి వివ‌రిస్తూ, 6,000 కోట్ల రూపాయ‌ల విలువ‌ గ‌ల ప్రాజెక్టుల‌ ను ప్రారంభించ‌డానికి నేను ఇక్కడ కు వ‌చ్చాను అన్నారు. ఈ ప్రాజెక్టులు అన్నీ శ్రీ‌న‌గ‌ర్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌నాన్ని మ‌రింత సుఖ‌మయం చేస్తాయి అని ఆయన చెప్పారు.

జ‌మ్ము & కశ్మీర్‌ కు సంబంధించిన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టు ల‌ను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌న‌గ‌ర్‌ లో ప్రారంభించారు. ప్ర‌ధాన‌ మంత్రి పుల్ వామా లో అవంతీపురా ఎఐఐఎంఎస్ కు శంకుస్థాప‌న చేశారు. ఇది రాష్ట్రం లో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ని ఆయుష్మాన్ భార‌త్‌ తో అనుసంధానం చేస్తారు. ఆయుష్మాన్‌ భార‌త్ ప్ర‌పంచం లోనే అతి పెద్ద ఆరోగ్య ప‌థ‌కం. ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు దీని ద్వారా ల‌బ్ధి ని పొందారు. ఈ ప‌థ‌కం లో ఒక్క జ‌మ్ము & కశ్మీర్‌ నుండే 30 ల‌క్ష‌ల‌ మంది ప్ర‌యోజ‌నాన్ని పొందుతున్నారు.

తొలి గ్రామీణ బిపిఒ ను బాందీపురా లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఇది బాందీపోరా, ఇరుగు పొరుగు జిల్లాల యువ‌త‌ కు ఉపాధి అవ‌కాశాల‌ను పెంచుతుంద‌ని ఆయన చెప్పారు. బాందీపోరా గ్రామీణ బిపిఒ ఈ ప్రాంత యువ‌త‌ కు అవ‌కాశాల‌ కు ద్వారాలను తెరుస్తుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

కశ్మీర్‌ నుండి వ‌ల‌స వెళ్ళిన‌వారు తిరిగి వ‌చ్చి మామూలు జీవ‌నాన్ని సాగించాల‌నుకుంటే వారు తిరిగి రావ‌చ్చ‌ని, అలాంటి వారి కి ప్రభుత్వం పూర్తి భ‌ద్ర‌త ను క‌ల్పిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. కాశ్మీరీ వ‌ల‌స ఉద్యోగుల‌కు ట్రాన్సిట్ వ‌స‌తి ని క‌ల్పించేందుకు 700 ట్రాన్సిట్ ఫ్లాట్‌ లను నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి వివరించారు. కశ్మీర్‌ నుండి నిరాశ్ర‌యులైన వారి ని 3000 పోస్టుల‌ లో నియ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయన్నారు.

ఈ సంద‌ర్భం గా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన‌ మంత్రి వివిధ ప్రాంతాల‌ నుండి వ‌చ్చిన విద్యార్థుల‌ తో ముఖాముఖి మ‌ట్లాడారు. రాష్ట్రీయ ఉచ్చ‌త‌ర్ శిక్షా అభియాన్ (ఆర్‌యుఎస్‌ఎ) ను మీట నొక్కి డిజిట‌ల్ ప‌ద్ధ‌తి లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభించ‌డం ఈ కార్య‌క్ర‌మాల‌లో మ‌రో ఆక‌ర్ష‌ణ‌ గా నిలచింది. జ‌మ్ము & కశ్మీర్‌ లోని కిశ్త్ వాద్, కుప్ వాడా, బారాముల్లా లలో మూడు ఆద‌ర్శ‌ డిగ్రీ క‌ళాశాల‌ ల‌కు ప్ర‌ధాన‌ మంత్రి శంకుస్థాప‌న చేశారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ జ‌మ్ము లో ఆంత్రప్రిన్యోర్‌ శిప్‌, ఇనవేశన్‌, కెరియర్‌ హ‌బ్‌కు కూడా ప్ర‌ధాన‌ మంత్రి శంకుస్థాప‌న‌ చేశారు.

అలాగే 400 కెవి డి/సి జాలంధ‌ర్‌- సాంబా- రాజౌరి-శోపియాన్‌- అమ‌ర్‌నాథ్ (సోపోర్‌) ప్రసార మార్గాన్ని కూడా ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు జ‌మ్ము & కశ్మీర్‌ లో గ్రిడ్ సంధానాన్ని పెంచింది.

ఈ సంద‌ర్భం గా జ‌రిగిన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, గ‌త ప్ర‌భుత్వ హ‌యాం లో ప‌లు ప‌థ‌కాలు ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్‌ నుండి ప్రారంభ‌మయ్యేవని, ఎన్‌ డిఎ పాల‌న‌ లో వివిధ ప్రాంతాల‌ నుండి ప్రారంభోత్స‌వాలు జ‌రుపుకుంటున్నాయ‌న్నారు. ‘‘మా ప్ర‌భుత్వం ఆయుష్మాన్ భార‌త్‌ ప‌థ‌కాన్ని ఝార్ ఖండ్‌ నుండి ప్రారంభించింద‌ని, ఉజ్వ‌ల ప‌థ‌కాన్ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ నుండి ప్రారంభించింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి భ‌ద్ర‌త బీమా యోజ‌న‌ ప‌శ్చిమ బెంగాల్‌ నుండి ప్రారంభ‌ం అయింద‌ని, చేనేత ప్ర‌చారం త‌మిళ‌ నాడు నుండి ప్రారంభ‌ం అయింద‌ని, బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో హ‌రియాణా నుండి ప్రారంభ‌ం అయింది’’ అని ప్ర‌ధాన‌ మంత్రి వివరించారు.

జ‌మ్ము & కశ్మీర్‌ 2018 సెప్టెంబ‌ర్‌ నాటికే బహింర‌గ మ‌ల మూత్రాదుల విస‌ర్జ‌న ర‌హిత ప్రాంతం (ఒడిఎఫ్)గా చేసినందుకు రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌ను ఆయన అభినందించారు.

భారతదేశం లో నూతన ఆవిష్కరణ లు, ఇంక్యుబేశన్‌, స్టార్ట్- అప్ ల జోరు కొన‌సాగుతోంద‌ని, స్టార్ట్- అప్ అభియాన్ మంచి ఊపు అందుకుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. 3-4 సంవ‌త్స‌రాల‌ వ్యవధి లో భారతదేశం లో 15,000 స్టార్ట్- అప్ లు కార్యకలాపాలు జరుపుతున్నాయ‌ని, వాటిలో సగం స్టార్ట్- అప్ లు ఒకటో అంచె, రెండో అంచె ప‌ట్ట‌ణాల‌ లో ఉన్నాయ‌ని ఆయన అన్నారు.

గాందర్ బల్‌ లోని సేఫోరా లో బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌ర ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ని ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభించారు. ఇండోర్ క్రీడ‌లు ఆడేందుకు ఈ స్టేడియం యువ‌త‌ కు ఎంతో ఉప‌యుక్తం కానుంది. ప్రతిభ ను అన్వేషించేందుకు మరియు క్రీడా సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు

ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం పరిధి లోకి జ‌మ్ము & కశ్మీర్‌ లోని 22 జిల్లాల‌ ను తీసుకు రావడమైందని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

ప్ర‌తిష్ఠాత్మ‌క డల్ స‌ర‌స్సు ను ప్ర‌ధాన‌ మంత్రి సంద‌ర్శించి, అక్క‌డి సదుపాయాలను ప‌రిశీలించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక రోజంతా రాష్ట్రం లో జరిపిన ప‌ర్య‌ట‌న‌ లో భాగంగా లేహ్‌, జ‌మ్ము మరియు శ్రీ‌న‌గ‌ర్.. ఈ మూడు ప్రాంతాల‌నూ సందర్శించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi