ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు హరియాణా లో కురుక్షేత్ర ను సందర్శించారు. మహిళా సర్పంచుల తో ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ శక్తి-2019 సదస్సు లో ఆయన పాలుపంచుకొని, దేశవ్యాప్తం గా తరలి వచ్చిన మహిళా సర్పంచు లకు స్వచ్ఛ్ శక్తి-2019 పురస్కారాల ను అందజేశారు. కురుక్షేత్ర లో ఏర్పాటైన స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్ ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. హరియాణా లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు; మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ ఖట్టర్ మరియు పలువురు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
దేశం లోని వివిధ ప్రాంతాల నుండి స్వచ్ఛాగ్రహీ లు తరలిరావడం తో ఒక ‘న్యూ ఇండియా’ కోసం స్వచ్ఛ్ భారత్ ను ఆవిష్కరించే సంకల్పం బలోపేతం అయిందని ప్రధాన మంత్రి అన్నారు.
హరియాణా ప్రజల తో ఒక భావోద్వేగ భరితమైన బంధాన్ని ప్రధాన మంత్రి ఏర్పరచుకొంటూ, ఈ రాష్ట్రం ‘ఒక ర్యాంకు, ఒక పెన్శన్’ కు, బేటీ బచావో, బేటీ పఢావో కు మార్గదర్శకం కావడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం తొలి లబ్దిదారు గా హరియాణా కు చెందిన ఒక కుమార్తె నిలిచారని గుర్తు కు తెచ్చారు.
సాధికారిత ను సంతరించుకొన్న మహిళలే ఒక సాధికార సమాజాన్ని మరియు ఒక బలమైన దేశాన్ని ఆవిష్కరించగలుగుతారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. బేటీ బచావో బేటీ పఢావో, ఉజ్జ్వల యోజన, రాష్ట్రీయ పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రసూతి సెలవులు 12 వారాల నుండి 26 వారాలకు పొడిగింపు, ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా గృహాల యాజమాన్యాన్ని ముందుగదా మహిళల కు అప్పగించడం వంటి కార్యక్రమాలు మహిళల సశక్తీకరణ లో ఏ విధంగా ఒక కీలక పాత్ర ను పోషించిందీ ఆయన వివరించారు. ‘‘అత్యాచారాల కు మరణ శిక్షను విధించిన తొలి ప్రభుత్వం మేమే’’ అని కూడా ఆయన అన్నారు.
ముద్ర (MUDRA)లో భాగం గా మంజూరు చేసిన రుణాల లో దాదాపు 75 శాతం రుణాల ను మహిళా నవపారిశ్రామికుల కు ఇవ్వడమైందని ఆయన అన్నారు. సుమారు 6 కోట్ల మంది మహిళలు దీన్ దయాళ్ అంత్యోదయ పథకం లో భాగంగా స్వయం సహాయ బృందాల లో చేరినట్లు, మరి అలాగే ఆ విధమైన స్వయం సహాయ బృందాల కు 75 వేల కోట్ల రూపాయల కు పైగా రుణాల ను అందించడం జరిగినట్లు తెలిపారు. ఈ మొత్తం 2014వ సంవత్సరం కన్నా మునుపటి నాలుగు సంవత్సరాల లో కేటాయించిన దానికి రెండున్నర రెట్లు అధికమని వివరించారు.
‘‘ఆరోగ్యవంతమైన మరుగుదొడ్ల కొరత కారణంగా మన మాతృ మూర్తులు, పుత్రికలు నిరంతరం సంఘర్షణ కు లోనవడం నన్ను బాధించింది. మరి నేను ఎర్ర కోట బురుజుల మీది నుండి స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ ను స్వీకరించాను. స్వాతంత్య్రం సిద్ధించిన సుమారు 75 సంవత్సరాల లో స్వస్థత పరిధి దాదాపు 40 శాతం గా ఉండింది. అది ప్రస్తుతం 98 శాతాని కి చేరుకొంది. 10 కోట్ల కు పైగా విశ్రాంతి గదుల ను నాలుగున్నర సంవత్సరాల లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 జిల్లాల లో 5 లక్షల పల్లెలు బహిరంగ ప్రదేశాల లో మల మూత్ర విసర్జన కు తావు లేనివి గా మారాయి. ఇది వారి కి ఒక గౌరవ ప్రదమైన జీవనాన్ని ఇచ్చింది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
ఝజ్జర్ జిల్లా లో గల బాఢ్‌సా గ్రామం లో జాతీయ కేన్సర్ సంస్థ (ఎన్‌సిఐ)ని ప్రధాన మంత్రి కురుక్షేత్ర నుండే ప్రారంభించారు.
అందరికీ.. ప్రత్యేకించి ఆ సదుపాయం యొక్క వ్యయాన్ని భరించలేని వారికి, అందుకు ఎంతో ఖరీదు అవుతుందని తలచే వారికి.. ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని అందించాలని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. తన ప్రభుత్వం చేస్తున్న కృషి ని గురించి ఆయన మరింతగా వివరిస్తూ, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల మరియు సంస్థ ల సంఖ్య ను చెప్పుకోదగిన స్థాయి లో పెంచడం జరిగిందన్నారు. దేశం లో 21 ఎఐఐఎమ్ఎస్ లు కార్యకలాపాలు నిర్వహించడమో, లేదా శీఘ్ర గతి న నిర్మాణాధీనం లో ఉండటమో జరుగుతోందని ఆయన చెప్పారు. ఈ 21 ఎఐఐఎమ్ఎస్ లలో 14 ఎఐఐఎమ్ఎస్ లు 2014 వ సంవత్సరం తరువాత ఆరంభం అయ్యాయన్నారు. ప్రస్తుతం ఒకటిన్నర లక్షల వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు కావడం తో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మేము అందరికీ ఆరోగ్యం అందేటట్లుగా ఏక కాలం లో కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.
కురుక్షేత్ర లో శ్రీకృష్ణ ఆయుష్ యూనివర్సిటీ కి ప్రధాన మంత్రి పునాదిరాయి ని వేశారు. ఇది ప్రపంచం లోనే ఈ తరహా తొలి విశ్వవిద్యాలయం. ఇక్కడ ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, ఇంకా హోమియోపతి వైద్య పద్ధతుల లో విద్య ను బోధించడం తో పాటు చికిత్స ను అందించడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి ఈ సందర్భం గా కర్ నాల్ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ కు, పంచ్ కుల లో నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కు మరియు ఫరీదాబాద్ లో ఇఎస్ఐసి వైద్య కళాశాల మరియు ఆసుపత్రి కి శంకుస్థాపన లు చేశారు.
‘బాటిల్స్ ఆఫ్ పానీపత్ మ్యూజియమ్’కు ప్రధాన మంత్రి శంకు స్థాపన చేస్తూ, పానీపత్ సంగ్రామం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కు ఒక సజీవ ఉదాహరణ అంటూ అభివర్ణించారు.
ఈ పథకాలన్నీ హరియాణా పౌరుల జీవనాన్ని ఆరోగ్యకరం గా, సరళతరం గా మార్చివేయడమే కాక యువతీయువకుల కు ఉపాధి సంబంధిత నూతన అవకాశాల ను తీసుకువస్తాయని స్పష్టీకరించారు.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ ఏ విధంగా విస్తరించిందీ తెలుసుకోవడం కోసం ఈ పథకాన్ని నైజీరియా లో కూడా ఎలా అమలు చేయాలనేది ఆకళింపు చేసుకోవడం కోసం నైజీరియా కు చెందిన ప్రతినిధివర్గం అధ్యయన యాత్ర కు వచ్చిందంటూ ప్రధాన మంత్రి వెల్లడించి ఆ ప్రతినిధివర్గాన్ని ప్రశంసించారు.
नाइजीरिया का एक डेलीगेशन यहां मैं सामने देख सकता हूं।
— PMO India (@PMOIndia) February 12, 2019
I am told that you are here on a study tour since the past week to learn how the Swachh Bharat Mission achieved such dramatic success so quickly, and how it can be replicated in Nigeria. I sincerely wish you all success: PM
हरियाणा की धरती से हमने जो भी बड़े लक्ष्य तय किए, वो हासिल किए
— PMO India (@PMOIndia) February 12, 2019
वन रैंक, वन पेंशन का वादा यहीं से किया था और जो पूरा किया
बेटी बचाओ, बेटी पढ़ाओ की योजना यहीं से लॉन्च की थी और ये पूरे देश में जन आंदोलन के रूप में फैल गई
आयुष्मान भारत की पहली लाभार्थी भी हरियाणा की बिटिया है: PM
आज स्वास्थ्य और संस्कृति से जुड़ी परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया गया है।
— PMO India (@PMOIndia) February 12, 2019
झज्जर का नेशनल कैंसर इंस्टीट्यूट,
कुरुक्षेत्र में आयुष यूनिवर्सिटी,
करनाल में हेल्थ साइंस यूनिवर्सिटी,
पंचकुला में नेशनल इंस्टीट्यूट ऑफ आयुर्वेद,
फरीदाबाद में ESIC मेडिकल कॉलेज और अस्पताल: PM
ये तमाम प्रोजेक्ट हरियाणावासियों के जीवन को स्वस्थ और सुगम बनाने वाले हैं।
— PMO India (@PMOIndia) February 12, 2019
साथ ही यहां के युवाओं को रोज़गार के नए अवसर भी इन प्रोजेक्ट्स के माध्यम से मिलने वाले हैं: PM
बेटी बचाओ बेटी पढ़ाओ से बच्चियों की जनसंख्या में सुधार आया है,
— PMO India (@PMOIndia) February 12, 2019
उज्जवला योजना से बहनों को धुएं से मुक्ति मिली है,
राष्ट्रीय पोषण अभियान और प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान से प्रसूता माताओं के जीवन पर आने वाला खतरा कम हुआ है: PM
बेटियों पर बलात्कार जैसे अत्याचार करने वालों को फांसी तक की सज़ा का प्रावधान भी हमारी सरकार ने किया है।
— PMO India (@PMOIndia) February 12, 2019
प्रधानमंत्री आवास योजना के तहत जो घर दिए जा रहे हैं, उसमें भी महिलाओं के नाम घर की रजिस्ट्री हो, इसे प्राथमिकता दी जा रही है: PM
बेटियों को किचन के दायरे से बाहर योगदान देने के लिए प्रोत्साहित किया जा रहा है।
— PMO India (@PMOIndia) February 12, 2019
देश में पहली बार बेटियां फाइटर पायलट बनी हैं।
महिलाओं को अपने नवजात शिशुओं के अच्छी तरह लालन-पालन के लिए पर्याप्त समय मिल सके, इसके लिए मैटरनिटी लीव को 12 सप्ताह से बढ़ाकर 26 सप्ताह किया गया है: PM
मुद्रा योजना में 15 करोड़ ऋणों में से लगभग 75% ऋण महिला उद्यमियों को मिले हैं।
— PMO India (@PMOIndia) February 12, 2019
‘दीन दयाल अंत्योदय योजना’ के तहत लगभग 6 करोड़ महिलाएं स्वयं सहायता समूहों से जुड़ी हुई हैं।
ऐसे सेल्फ हेल्प गुप्स को 75 हजार करोड़ रुपए से अधिक ऋण उपलब्ध कराया गया है: PM
आज़ादी के लगभग 70 वर्षों में स्वच्छता का जो दायरा करीब 40% था, वो आज 98% तक पहुंच चुका है।
— PMO India (@PMOIndia) February 12, 2019
साढ़े 4 वर्षों में 10 करोड़ से अधिक टॉयलेट्स बनाए जा चुके हैं।
600 जिलों के साढ़े 5 लाख गांवों ने खुद को खुले में शौच से मुक्त कर दिया है: PM
स्वास्थ्य चाहे गरीब का हो या फिर मध्यम वर्ग के परिवार का, सरकार व्यापक रूप से प्रयास कर रही है।
— PMO India (@PMOIndia) February 12, 2019
चाहे बड़े अस्पतालों का नेटवर्क हो, देशभर के गांवों में डेढ़ लाख वेलनेस सेंटर बनाने का अभियान हो या फिर गरीब को मुफ्त इलाज देने वाली आयुष्मान भारत, एक साथ अनेक काम हो रहे हैं: PM
केंद्र सरकार देश में बड़े अस्पतालों का नेटवर्क किस तेज़ी से बिछा रही है,
— PMO India (@PMOIndia) February 12, 2019
इसका अंदाज़ा इसी बात से लगाया जा सकता है कि आज 21 AIIMS देश में या तो काम कर रहे हैं या फिर निर्माण का कार्य चल रहा है।
इनमें से 14 एम्स पर काम 2014 के बाद शुरु हुआ है: PM