QuoteIn an effort to connect all the capitals of North East states, Itanagar has also been connected with the Railways: PM
QuoteNot just airports, the lives of people in Arunachal Pradesh will improve vastly with new and improved rail and road facilities: PM Modi
QuoteArunachal Pradesh is India's pride. It is India's gateway, Centre will not only ensure its safety and security, but also fast-track development in the region: PM

ప్రగతిద్వారానే నవభారత నిర్మాణం సాధ్యమని స్పష్టీకరణ 

ఇటాన‌గ‌ర్‌లో కొత్త విమానాశ్రయం, సెలా సొరంగం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
దూరదర్శన్ అరుణ్ ప్రభ చానెల్ ప్రారంభోత్సవం… అరుణాచల్ ప్రదేశ్
రాష్ట్రంలో రూ.4వేల కోట్ల విలువైన పథకాల ఆవిష్కరణ
   అరుణాచల్ ప్రదేశ్, అసోం, త్రిపుర రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటానగర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొత్త విమానాశ్రయం, సెలా సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  దీంతోపాటు దూరదర్శన్ అరుణ్ ప్రభ చానెల్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా అరుణాచల్ ప్ర‌దేశ్‌లోని ఇటాన‌గ‌ర్‌లో ఐజీ పార్క్ సహా అనేక అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. అనంతరం లాయిన్ లూమ్ కార్యకలాపాలను ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ-  అరుణాచల్ సూర్యోదయ రాష్ట్రమని, దేశానికి ఆత్మవిశ్వాసమని అభివర్ణించారు. ‘‘ఇవాళ ఇక్కడ రూ.4,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో రూ.13,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అరుణాచల్ సహా ఈశాన్య భారత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమ 55 నెలల పాలనను గడచిన 55 ఏళ్ల ఇతర ప్రభుత్వాల పాలనతో పోల్చి చూడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

|

   ఆశించిన వేగంతో అభివృద్ధి జరగలేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ‘‘మునుపటి ప్రభుత్వాలు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను నిర్లక్ష్యం చేశాయి. మేము పాలన బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితిని మారుస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. ఈశాన్య భారతం ప్రగతి సాధించినప్పుడు మాత్రమే నవభారత నిర్మాణం సాధ్యమని స్పష్టీకరించారు. అభివృద్ధి అన్నది ప్రాంతాలు, ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గడచిన 55 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలకు ఏనాడూ నిధుల కొరత రానివ్వలేదని గుర్తుచేశారు. ‘‘మా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రూ.44,000 కోట్లు కేటాయించింది. మునుపటి ప్రభుత్వాలన్నీ ఇచ్చిన నిధులకన్నా ఇది రెట్టింపు అధికం’’ అని ఆయన వివరించారు.
   హలోంగిలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు పునర్నిర్మించిన తేజూ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కాగా, హలోంగిలో రూ.955 కోట్ల వ్యయంతో 4,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ నిర్మా0ణం చేపడుతున్నారు. ఇది పూర్తయితే గంటకు 200 మంది ప్రయాణికుల కదలికలకు వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఇక మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ప్రస్తుతం విమానంలో ఇటానగర్ రావాలంటే గువహటి మార్గం ఒక్కటే శరణ్యమని గుర్తుచేశారు. అక్కడి విమానాశ్రయంలో దిగి, రోడ్డుమార్గాన లేదా హెలికాప్టర్ ద్వారా మాత్రమే ఇటానగర్ చేరడం సాధ్యమని వివరించారు. ‘‘తేజు విమానాశ్రయాన్ని 50 ఏళ్లకిందట నిర్మించారు. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ రాష్ట్ర ప్రజలకు సంధానం గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే, మా ప్రభుత్వం ఈ చిన్న విమానాశ్రయాన్ని రూ.125 కోట్లతో విస్తరించింది’’ అని ప్రధాని వివరించారు. ఇప్పుడీ విమానాశ్రయం అరుణాచల్ ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉడాన్ పథకం చౌక విమానయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాలు మాత్రమేగాక రైలు, రోడ్డు సదుపాయాలు కూడా అందుబాటులోకి రావడం వల్ల ప్రజల జీవితాలు కూడా విస్తృతంగా మెరుగుపడతాయన్నారు.
   అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో సెలా సొరంగం నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తియితే తవాంగ్ లోయకు అన్ని కాలాల్లోనూ అనుసంధానం పెరగడంతోపాటు తవాంగ్ ప్రయాణ సమయం గంటవరకూ తగ్గుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దాదాపు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. అసోం పరిధిలో నిర్మించిన బోగీబీల్ రోడ్డు-రైలు వంతెనవల్ల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన భూభాగంతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రానికి అనుసంధానం మెరుగు కోసం ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్లదాకా నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. గడచిన రెండేళ్లలో వెయ్యిదాకా గ్రామాలను రోడ్లద్వారా అనుసంధానించామన్నారు. అరుణాచల్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం కూడా కొనసాగుతున్నదని గుర్తుచేశారు. ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను అనుసంధానించే  కృషిలో భాగంగా రైలు మార్గంతో ఇటానగర్ సంధానం కూడా పూర్తయిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు నహర్లగన్ నుంచి అరుణాచల్ ఎక్స్ ప్రెస్ వారానికి రెండుసార్లు నడుస్తున్నదని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలగుండా రైలు మార్గాల నిర్మాణానికి అధ్యయనం చేపట్టగా, మూడు చోట్ల పూర్తయిందని తెలిపారు. వీటన్నిటితోపాటు తవాంగ్ ను కూడా రైలుమార్గంతో సంధానించే యోచన ఉందని ప్రధాని చెప్పారు.

|

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో సౌభాగ్య యోజన కింద 100 శాతం కుటుంబాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 110 మెగావాట్ల పారీ జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ‘‘మేం విద్యుదుత్పాదనపై శ్రద్ధపెట్టాం. ఆ మేరకు 110 మెగావాట్ల సామర్థ్యంగల 12 జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించాం. వీటివల్ల అరుణచాల్ ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమేగాక పరిసర రాష్ట్ర్ర ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ‘‘నేను ఇక్కడ పర్యటించిన అనుభవం మేరకు ఈశాన్య భారతాన్ని సందర్శించిన వారంతా తమ పర్యటన ఫొటోలను అందరితోనూ పంచుకోవాల్సిందిగా నిన్న పిలుపునిచ్చాను. ఆ తర్వాత కొద్ది సెకన్లలోనే విదేశీయులుసహా అనేకమంది భారతీయులు వెయ్యిదాకా ఫొటోలను ట్వీట్ చేయడం విశేషం’’ అన్నారు. నేడు ఇక్కడ ఆవిష్కరించిన ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలోని ప్రజల జీవన సౌలభ్యానికి తోడ్పడతాయని, అంతేకాకుండా పర్యాటకరంగం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని పేర్కొన్నారు.
      అరుణాచ‌ల్ ప్రదేశ్ లో 50 ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఈ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కేంద్రాలతోపాటు ప్రధానమంత్రి జనారోగ్య యోజన (PMJAY) కింద ఈ ప్రాంతంలో ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని చప్పారు. ఈ పథకాలను ప్రారంభించాక కేవలం 150 రోజుల్లోనే దాదాపు 11 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. 

|

ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో ఐదెకరాల కన్నా తక్కువ భూమిగల రైతులు ఏటా రూ.6,000 మేర లబ్ధి పొందగలరని పేర్కొన్నారు. ఈ మొత్తం ఏటా మూడు వాయిదాలలో లబ్ధిదారుల ఖాతాలో జమ కాగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా అరుణాచల్ ప్రదేశ్ చేపడుతున్న చర్యలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతిస్తుందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం ప్రత్యేకంగా దూరదర్శన్ పరిధిలో ‘అరుణ్ ప్రభ’ టీవీ చానెల్ ను ఇటానగర్ లోని ఐజీ పార్కులో ప్రధానమంత్రి నిన్న ప్రారంభించి, జాతికి అంకింతం చేశారు. దూర‌ద‌ర్శ‌న్ నిర్వ‌హించే చానెళ్ల‌లో ఇది 24వ‌ది అవుతుంది. ఈ చానెల్ ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల స‌మాచారం కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. దీన్ని జాతికి అంకింత చేసిన సందర్భంలోనే భార‌త చ‌ల‌న‌చిత్ర‌, టీవీ శిక్ష‌ణ సంస్థ (FTII)) శాశ్వ‌త ప్రాంగ‌ణాన్ని జోట్ ప‌ట్ట‌ణంలో ప్రారంభించారు. ‘‘అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణం. ఇది దేశానికి ముఖ‌ద్వారం.. ఈ నేప‌థ్యంలో అరుణాచ‌ల్ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌ల‌కేగాక అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తామ‌ని కూడా నేను హామీ ఇస్తున్నాను’’ అని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.

Click here to read PM's speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India's services sector 'epochal opportunity' for investors: Report

Media Coverage

India's services sector 'epochal opportunity' for investors: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2025
July 09, 2025

Appreciation by Citizens on India’s Journey to Glory - PM Modi’s Unstoppable Legacy