ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ న ఝార్‌ఖండ్ లోని హజారీబాగ్ ను సందర్శించారు. ఝార్‌ఖండ్ లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల లో ఝార్‌ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి శ్రీ జయంత్ సిన్హా మరియు ఝార్‌ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకున్నారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఝార్‌ఖండ్ కు చెందిన సాహస పుత్రుడు శ్రీ విజయ్ సోరేంగ్ కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాల సంరక్షణ కోసం మనం సకల చర్యలు తీసుకోవాలి’’ అని తెలిపారు.
హజారీబాగ్, దుమ్‌కా, ఇంకా పలామూ లలో వైద్య కళాశాల ల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కళాశాల లకు 2017వ సంవత్సరం లో ప్రధాన మంత్రే శంకుస్థాపన చేశారు. కొత్త వైద్య కళాశాల లను 885 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడమైంది. ప్రతి ఒక్క కళాశాల ఆవరణ ను దివ్యాంగుల కు మైత్రీ పూర్వకంగా తీర్చిదిద్దడం జరిగింది. అధునాతన వైద్య సదుపాయాలు ఝార్‌ఖండ్ లోని 11 జిల్లాల కు చెందిన 1.5 కోట్ల మంది ప్రజల కు లబ్ది ని చేకూర్చుతాయి. ‘‘ఝార్‌ఖండ్ కు చెందిన వేల మంది ప్రజల తో పాటు భారతదేశం అంతటా లక్షల ప్రజల కు ప్రయోజనాన్ని అందించేటటువంటి ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ఆరంభమైంది ఈ ఝార్‌ఖండ్ గడ్డ మీదనే. మరి రాష్ట్రం లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం కోసం నిరంతర కృషి జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ఆయన హజారీబాగ్, దుమ్ కా, పలామూ, ఇంకా జంషెడ్‌పూర్ లలో 500 పడకల ఆసుపత్రు లు నాలుగింటి నిర్మాణాని కి శంకు స్థాపన చేశారు.
ఆరోగ్యం మరియు సురక్షితమైన త్రాగునీరు ఒకదాని నుండి మరొకటి విడదీయలేనివి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఝార్‌ఖండ్ లో ఆవిష్కరించినటువంటి నీటి పథకాలు ఈ రాష్ట్రం యొక్క ప్రజల కు చక్కని ఆరోగ్యాన్ని అందించగలుగుతాయని కూడా ఆయన చెప్పారు. రాంగఢ్, ఇంకా హజారీబాగ్ జిల్లాల లో నాలుగు గ్రామీణ నీటి సరఫరా పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల లో మరో ఆరు గ్రామీణ నీటి సరఫరా పథకాల కు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, మరీ ముఖ్యం గా బలహీన ఆదివాసీ బృందాలు ఆవాసాన్ని ఏర్పరచుకొన్న ప్రాంతాల కోసం నీటి సరఫరా పథకాల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. హజారీబాగ్ లో పట్టణ నీటి సరఫరా పథకాని కి సైతం ఆయన పునాది రాయి ని వేశారు. 500 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే ఈ పథకం హజారీబాగ్ లో 56,000 కుటుంబాల కు రక్షిత త్రాగునీటిని అందించనుంది.
ప్రధాన మంత్రి సాహిబ్‌గంజ్ మురుగునీటి శుద్ధి ప్లాంటు ను మరియు మధుసూదన్ ఘాట్ ను నమామీ గంగే కార్యక్రమం లో భాగం గా ప్రారంభించారు.
రైతులు మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేయడం కోసం డిబిటి పథకం ప్రారంభోత్సవాని కి గుర్తు గా ఎంపిక చేసిన కొద్ది మంది లబ్ధిదారుల కు ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) లో భాగం గా చెక్కు లను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ‘‘ఈ పథకం 27 లక్షల మంది రైతుల కు లబ్ధి ని చేకూర్చనుంది. స్మార్ట్ ఫోన్ ల సహాయం తో వారు వాతావరణ సంబంధ సమాచారాన్ని పొందడమే కాకుండా పంటల ధరలు, ప్రభుత్వ పథకాలు, ఇంకా కొత్త సాగు పద్ధతుల సమాచారాన్ని కూడా తెలుసుకో గలుగుతారని’’ ప్రధాన మంత్రి చెప్పారు.
రాంగఢ్ లో ప్రత్యేకంగా మహిళల కు ఉద్దేశించిన ఇంజినీరింగ్ కళాశాల ను డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రారంభించారు. భారతదేశ తూర్పు ప్రాంతం లో ఈ తరహా ప్రథమ కళాశాల ఇదే, అంతేకాదు కేవలం మహిళలు ఇంజినీరింగ్ విద్య ను ఆర్జించే మూడో కళాశాల కూడా ఇదే అని ప్రధాన మంత్రి వెల్లడించారు. హజారీబాగ్ లోని ఆచార్య వినోబా భావే విశ్వవిద్యాలయం లో ఆదివాసీ అధ్యయనాల కేంద్రం నిర్మాణానికి ప్రధాన మంత్రి పునాది రాయిని వేశారు. ఈ సంస్థ ఆదివాసీ ల జీవన సరళి మరియు వారి సంస్కృతి తాలూకు జ్ఞానాన్ని సమీకరించడం మరియు వ్యాప్తి చేయడం లో సహాయకారి కాగలదని ఆయన తెలిపారు. సమాజం లోని పేదలు, మహిళలు, యువజనులు, ఇంకా ఆదివాసీ వర్గాలన్నింటి కీ సాధికారిత కల్పన ను ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కు లక్ష్యం గా నిర్దేశించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. మహిళల కు మరియు ఆదివాసీ లకు కళాశాల స్థాపన అనేది ఈ దిశ గా సాగుతున్న కృషే అని ఆయన చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు లకు కాన్హా క్షీర పథకాన్ని ప్రారంభించడాని కి గుర్తు గా ఎంపిక చేసిన కొద్ది మంది బడి పిల్లల కు పాల ప్యాకెట్ల ను ప్రధాన మంత్రి పంచి పెట్టారు. విద్యార్థులు ప్రతి రోజూ 200 మిల్లీ లీటర్ల పాల ను అందుకోనున్నారు. ఈ పథకం పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి తోడ్పనుంది. ‘‘ప్రతి ఒక్క చిన్నారి తన పూర్తి శక్తియుక్తుల ను తెలుసుకొని దేశాని కి గర్వకారణం గా మారాలని నేను ఆశిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
మన స్వాతంత్య్ర పోరాటం లో పాలుపంచుకొన్న ఆదివాసీ వీరుల జ్ఞాపకాల ను వస్తు సంగ్రహాలయాలు, ఇంకా స్మారకాల లో పదిలపరచడం ద్వారా వాటిని పరిరక్షించడానికి మరియు సమర్ధించడానికి తన ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కోవ లో ఝార్‌ఖండ్ లోని బిర్సా ముండా వస్తు సంగ్రహాలయం ఒక ఉదాహరణ అని ఆయన తెలిపారు.
जो काम किया जा रहा है उसको और गति देने के लिए आया हूं।
— PMO India (@PMOIndia) February 17, 2019
मेडिकल कालेज बिल्डिंग, अस्पताल,
इंजीनिरयिंग कालेज,
पानी की समस्या से मुक्ति दिलाने वाली पाइप-लाइन,
नमामि गंगे के प्रोजेक्ट्स के शिलान्यास और लोकार्पण से यहां मूलभूत सुविधाओं के इंफ्रास्ट्रक्चर को ताकत मिलने वाली है: PM
देवघर में एम्स के बाद आज दुमका, हजारीबाग और पलामू में मेडिकल कालेज का उद्घाटन इन्हीं प्रयासों
— PMO India (@PMOIndia) February 17, 2019
का विस्तार है।
सिर्फ तीन साल पहले की स्थिति ये थी कि झारखंड में 3 मेडिकल कॉलेज थे।
अब आज देखिए, एक ही दिन में 3 मेडिकल कॉलेज खुल रहे हैं: PM
स्कूली शिक्षा हो या फिर उच्च शिक्षा आदिवासी समाज के युवा साथियों को हर प्रकार की सहायता दी जा रही है।
— PMO India (@PMOIndia) February 17, 2019
आचार्य विनोबा भावे विश्व-विद्यालय में सेंटर फॉर ट्राइबल स्टडीज बनने से यहां के समाज और संस्कृति को जानने और आने वाली पीढ़ियों तक समाज के संस्कारों को पहुंचाने में मदद मिलेगी:PM
झारखंड सहित देश के तमाम आदिवासी क्षेत्रों में एकलव्य मॉडल स्कूल खोले जा रहे हैं।
— PMO India (@PMOIndia) February 17, 2019
झारखंड में ऐसे करीब दो दर्जन स्कूल शुरु हो चुके हैं और 70 नए स्कूल खोलने पर काम चल रहा है: PM
झारखंड में बन रहा बिरसा मुंडा संग्रहालय महान स्वतंत्रता सेनानी बिरसा मुंडा की पहचान को समृद्ध करेगा।
— PMO India (@PMOIndia) February 17, 2019
ऐसे संग्राहालय देश के कई राज्यों में बनाए जा रहे हैं, जिसमें केंद्र सरकार मदद दे रही है।
ये म्यूजियम आदिवासी नायकों की याद तो दिलाएंगे ही, साथ में पर्यटन के केंद्र बनेंगे: PM