QuoteHIRA model of development - Highway, I Way, Railway, Airway is on in Tripura, says PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రోజంతా అస‌మ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌రియు త్రిపుర ల ప‌ర్య‌ట‌న‌ లో భాగం గా మూడో మరియు చివరి చరణం లో అగ‌ర్త‌లా ను సంద‌ర్శించారు. ఆయ‌న రాష్ట్రం లో గార్జీ – బెలోనియా రైలు మార్గాన్ని, ఇంకా ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించారు.

అగ‌ర్త‌లా లోని మ‌హారాజా బీర్ బిక్ర‌మ్ విమానాశ్ర‌యం లో మ‌హారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ మాణిక్య బహదూర్ విగ్ర‌హాన్ని ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించారు. మ‌హారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ పోషించిన‌టువంటి పాత్ర ను ప్రధాన మంత్రి ప్ర‌శంసిస్తూ, త్రిపుర కై మ‌హారాజా తనకంటూ ఒక దార్శనికత ను కలిగివుండే వారని, అగ‌ర్త‌లా న‌గ‌ర నిర్మాణం కోసం ఆయన గొప్ప తోడ్పాటు ను అందించార‌న్నారు. ఆయ‌న యొక్క విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం త‌న‌ కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

|

త్రిపుర లో అభివృద్ధి ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ప్ర‌స్తుతం పురోగ‌తి ఒక కొత్త ప‌య‌న గ‌తి ని అందుకొంద‌న్నారు. త్రిపుర అభివృద్ధి కోసం గ‌త నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో చాలిన‌న్ని నిధుల‌ ను ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్లు తెలిపారు. చ‌రిత్ర లో మొట్ట‌మొద‌టిసారిగా పంట‌ల ను ఎంఎస్‌పి ధ‌ర‌ల వ‌ద్ద సేకరించ‌డం జ‌రిగింద‌ని తాను విన్న‌ానని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స్థానిక స్వామి వివేకానంద స్టేడియ‌మ్ లో ఒక ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించ‌డం ద్వారా గార్జీ-బెలోనియా రైలు మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేశారు. ఈ రైలు మార్గం దక్షిణ ఆసియా కు మ‌రియు ఆగ్నేయ ఆసియా కు ముఖ ద్వారం గా త్రిపుర ను మ‌ల‌చ‌నుంది. న‌ర్సింగ్ గ‌ఢ్ లో త్రిపుర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ యొక్క నూత‌న భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఎన్నిక‌ల కాలం లో తాను ఇక్క‌డ‌ కు వ‌చ్చిన‌ప్పుడు హైవే, ఐ వే, రైల్వే, ఇంకా ఎయిర్ వే.. హెచ్ఐఆర్ఎ న‌మూనా అభివృద్ధి ని గురించి సూచించిన‌ట్లు గుర్తు కు తెచ్చారు. అగ‌ర్త‌లా- స‌బ్‌రూమ్ నేశ‌న‌ల్ హైవే, హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్, అగ‌ర్త‌లా దేవ్‌ ఘర్ ఎక్స్‌ప్రెస్‌, అగ‌ర్త‌లా లో నూత‌న ట‌ర్మిన‌ల్ ఈ న‌మూనా లో భాగం గా ఉన్నాయ‌ని వివ‌రించారు.

|

న‌కిలీ ల‌బ్దిదారుల క్షాళన ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, ఇదివ‌ర‌కు అభివృద్ధి కేవ‌లం కాగితం మీదే ఉండేద‌ని చెప్పారు. ‘‘ఒక్క త్రిపుర లోనే సుమారు 62 వేల మంది ల‌బ్దిదారులు ఉన్నార‌ని నేను విన్నాను. వారు మీ డ‌బ్బు ను తీసుకొంటుండే వారు’’ అని ఆయ‌న అన్నారు. అయితే గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో దాదాపు 8 కోట్ల మంది న‌కిలీ ల‌బ్దిదారుల‌ ను వ్య‌వ‌స్థ లో నుండి బ‌య‌ట‌కు పంపించ‌డం జ‌రిగింద‌న్నారు.

రైతులు మ‌రియు సాంప్రదాయక రంగం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌ ను ప్ర‌ధాన మంత్రి చెప్తూ, ‘ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్ ధ‌న్ పెన్ష‌న్ యోజ‌న’ ద్వారా అసంఘ‌టిత రంగం లోని శ్రామికులు 60 ఏళ్ళ వ‌య‌స్సు వ‌చ్చిన త‌రువాత నెల‌ కు 3 వేల రూపాయ‌ల పింఛ‌ను ను అందుకుంటార‌న్నారు. 5 ఎక‌రాల క‌న్నా త‌క్కువ భూమి ని క‌లిగి వున్న రైతులు ‘పిఎం-కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న’ ద్వారా సంవ‌త్స‌రానికి 6 వేల రూపాయ‌ల వంతున వారి యొక్క బ్యాంకు ఖాతాల లో డ‌బ్బు ను అందుకుంటార‌ని చెప్పారు.

మ‌త్స్య ప‌రిశ్రమ కోసం ఒక ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయ‌డం మ‌త్స్య‌కారుల‌ కు ఎంతో ల‌బ్ది ని చేకూర్చుతుందని వివ‌రించారు. ఈ చ‌ర్య‌లు అన్నీ ప్ర‌భుత్వ ఉద్దేశాని కి అద్దం ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

|

మూడు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌ లో ఒక రోజంతా ప‌ర్య‌టించిన అనంత‌రం ప్ర‌ధాన మంత్రి తిరిగి న్యూ ఢిల్లీ కి చేరుకోనున్నారు. ఆయ‌న రేప‌టి రోజు న ఆంధ్ర ప్ర‌దేశ్‌, త‌మిళ నాడు మ‌రియు క‌ర్నాట‌క ల‌ను సంద‌ర్శించనున్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India first country to launch a Traditional Knowledge Digital Library: WHO

Media Coverage

India first country to launch a Traditional Knowledge Digital Library: WHO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూలై 2025
July 12, 2025

Citizens Appreciate PM Modi's Vision Transforming India's Heritage, Infrastructure, and Sustainability