మణిపూర్ ప్రతి స్థాయిలో అభివృద్ధి మార్గంలో త్వరితంగా ముందుకు సాగుతోంది: ప్రధాని మోదీ
భారత గ్రామాల్ని విద్యుద్దీకరించడంపై చర్చ జరుగుతున్నప్పుడల్లా, మణిపూర్లోని లేఇసంగ్ గ్రామం పేరు కూడా వస్తుంది: ప్రధాని మోదీ
ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి స్వాతంత్య్రం యొక్క మార్గంగా నేతాజీ అభివర్ణించారు, ఇది ఇప్పుడు నవ భారతదేశ అభివృద్ధి కథ యొక్క మార్గంగా రూపాంతరం చెందుతోంది: ప్రధానమంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ఇంఫాల్ ను సంద‌ర్శించారు. మోరేహ్ లో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఆయ‌న ఒక పెద్ద జ‌న స‌భ లో ప్రారంభించారు. అలాగే, దోలాయీథాబీ బరాజ్ ప్రాజెక్టు కు, సావోంబంగ్ లో ఎఫ్‌సిఐ ఆహార నిల్వ గోదాములకు మ‌రియు నీటి స‌ర‌ఫ‌రా కు, ఇంకా ప‌ర్య‌ట‌న‌ కు సంబంధించిన ప‌థ‌కాల‌ ను కూడా ఆయన ప్రారంభించారు.

సిల్చర్-ఇంఫాల్ లైన్ యొక్క 400 కెవి సామ‌ర్ధ్యం క‌లిగిన డ‌బుల్ స‌ర్క్యూట్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు ఆయ‌న అంకితం చేశారు.

క్రీడ‌ల తో సంబంధం గ‌ల ప‌థ‌కాల‌ కు కూడా ఆయ‌న శంకు స్థాప‌న చేశారు.

జ‌న సమూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, మ‌ణిపుర్ కు చెందిన సాహ‌సిక స్వాతంత్య్ర యోధుల‌ కు, ప్ర‌త్యేకించి మ‌హిళా స్వాతంత్య్ర యోధుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టించారు. అవిభాజ్య భార‌త‌దేశం లో ప్ర‌థ‌మ తాత్కాలిక ప్ర‌భుత్వం ఏర్పాటైంది మ‌ణిపుర్ లోని మొయిరంగ్ లోనే అన్న సంగ‌తి ని ఆయన గుర్తు కు తెచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఈశాన్య ప్రాంత ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ను అందుకున్న విష‌యాన్ని ఆయ‌న జ్ఞ‌ప్తి కి తెచ్చారు. ‘న్యూ ఇండియా’ యొక్క వృద్ధి గాథ లో మ‌ణిపుర్ ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించవలసి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

నేటి కార్య‌క్ర‌మం లో 15 వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన ప్రాజెక్టులు అయితే ప్రారంభానికి నోచుకోవ‌డ‌మో, లేదా శంకు స్థాప‌న కు నోచుకోవడ‌మో జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు లు రాష్ట్ర ప్ర‌జ‌ల ‘‘జీవ‌న సౌల‌భ్యాన్ని’’ మెరుగు ప‌ర‌చ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల‌ లో స్వ‌యంగా తాను ఈశాన్య ప్రాంతాన్ని దాదాపు ముప్పై సార్లు సంద‌ర్శించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈశాన్య ప్రాంతం ప‌రివ‌ర్త‌న‌ కు లోన‌వుతోంద‌ని, ద‌శాబ్దాల త‌ర‌బ‌డి నిల‌చిపోయిన ప‌థ‌కాలు పూర్తి కావ‌స్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

మోరేహ్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు క‌స్ట‌మ్ క్లియ‌రెన్స్ కు, విదేశీ మార‌క ద్ర‌వ్య ఆదాన ప్ర‌దానాని కి, ఇమిగ్రేశన్ క్లియ‌రెన్స్ కు, త‌దిత‌ర ప‌నుల‌ కు మార్గాన్ని సుగ‌మం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ రోజు న ప్రారంభం అవుతున్న ప‌థకాలు అభివృద్ధి ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ కు అద్దం ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. దోలాయీథాబీ బరాజ్ ప్రాజెక్టు కు 1987 లో అంకురార్ప‌ణ జ‌రిగిన‌ప్ప‌టికీ 2014 వ సంవ‌త్స‌రం త‌రువాతే అది వేగ‌వంతం అయిద‌ని, మ‌రి ఇప్పుడు పూర్తి అయింద‌ని ఆయ‌న వివ‌రించారు. నేడు ప్రారంభం అవుతున్న ప‌ర్య‌ట‌క రంగ ప్రాజెక్టుల‌ ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్రాజెక్టు ల పూర్తి కి కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌టు వంటి మ‌రింత ఉత్సాహ పూర్వ‌క‌మైన, ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన విధానాన్ని గురించి ఆయ‌న విడ‌మ‌ర‌చి చెప్తూ, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం లో ఏర్పాటు చేసిన ‘ప్ర‌గ‌తి’ (PRAGATI) వ్య‌వ‌స్థ నిల‌చిపోయిన ప్రాజెక్టుల ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప‌ర్య‌వేక్షించేందుకు ఏ విధంగా వీలు క‌ల్పిస్తున్న‌దీ తెలియజేశారు. ఇంత వ‌ర‌కు సుమారు 12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన స్తంభించిపోయిన ప్రాజెక్టుల‌ కు సంబంధించిన స‌మ‌స్య‌ల ను ఈ ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలు ప‌రిష్క‌రించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

సావోంబంగ్ లో ఎఫ్‌సిఐ గోదాము ప‌నులు 2016 వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో మొద‌ల‌య్యాయ‌ని, ఆ ప‌నులు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయ‌ని ఆయ‌న చెప్పారు. వివిధ మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల విష‌యం లోనూ ఇదే త‌ర‌హా వివ‌ర‌ణ‌ల‌ ను ఆయన చాటిచెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం తో పాటు మణిపుర్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం ‘స‌బ్‌కా సాథ్‌ స‌బ్‌కా వికాస్‌’ దార్శ‌నిక‌త తో కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌టువంటి ‘‘గో టు హిల్స్, గో టు విలేజెస్‌’’ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రశంసించారు.

‘‘ట్రాన్స్‌ఫార్మేశ‌న్ త్రూ ట్రాన్స్‌పోర్టేశ‌న్’’ తాలూకు స‌మ‌గ్రమైన దార్శ‌నిక‌త ద్వారా ఈశాన్య ప్రాంతాని కి ఏ విధం గా ఉత్త‌మ‌మైన రోడ్డు, రైలు మ‌రియు గ‌గ‌న త‌ల సంధానాన్ని స‌మ‌కూర్చుతున్న‌దీ స‌భికుల‌ కు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

స్వ‌చ్ఛ్ భార‌త్, పారిశుధ్యం, ఇంకా మహత్త్వాకాంక్ష భరిత చండేల్ జిల్లా వికాసం సంబంధిత అంశాల‌ ను ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.

మ‌హిళ‌ల సాధికారిత రంగం లో మ‌ణిపుర్ ముందు వ‌రుస లో నిల‌చిందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. క్రీడారంగ ప్ర‌ముఖురాలు, మ‌ణిపుర్ కు చెందిన మేరీ కామ్ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, భార‌త‌దేశాన్ని క్రీడారంగం లో ఒక సూప‌ర్ ప‌వ‌ర్ గా తీర్చిదిద్ద‌డం లో ఈశాన్య ప్రాంతానికి ఒక కీల‌క భూమిక‌ ఉంద‌ని పేర్కొన్నారు. క్రీడాకారుల ఎంపిక లో మ‌రియు క్రీడాకారుల శిక్ష‌ణ లో పార‌ద‌ర్శ‌క‌త్వం అంత‌ర్జాతీయ క్రీడా పోటీల లో భార‌త‌దేశం క‌న‌బ‌రుస్తున్న ఉత్త‌మ‌ ప్ర‌ద‌ర్శ‌న‌ లలో ప్రతిబింబిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance