ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గ్రేట‌ర్ నోయెడా ను సంద‌ర్శించి, వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ ను ప్రారంభించారు.

పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాల‌జి లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి వీడియో లింక్ ద్వారా మెట్రో తాలూకు నోయెడా సిటీ సెంట‌ర్- నోయెడా ఇలెక్ట్రానిక్ సిటీ సెక్ష‌న్ ప్రారంభ సూచ‌కం గా జెండా ను చూపారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ఖుర్జా లో మ‌రియు బిహార్ లోని బ‌క్స‌ర్ లో రెండు 1320 మెగా వాట్ సామ‌ర్ధ్యం క‌లిగిన థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటు ల నిర్మాణాని కి కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.

పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాల‌జి ని ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఆ సంస్థ ఆవ‌ర‌ణ లో పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ యొక్క విగ్ర‌హాన్ని ఆయ‌న ఆవిష్క‌రించి, విగ్రహానికి పుష్పాంజ‌లి ని సమర్పించారు. ఆ త‌రువాత సంస్థ ఆవ‌ర‌ణ లో గ‌ల దీన్ ద‌యాళ్ వ‌స్తు సంగ్ర‌హాల‌యాన్ని కూడా ఆయ‌న సంద‌ర్శించారు.

జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, నోయెడా పూర్తి ప‌రివ‌ర్త‌న కు లోనైంద‌న్నారు. నోయెడా ప్ర‌స్తుతం అభివృద్ధి కి మారుపేరు అయిందని మ‌రియు యువ‌త‌కై ఉద్యోగావ‌కాశ‌ల ను సృష్టిస్తోంద‌ని ఆయన చెప్పారు. దేశం లో ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రం గా నోయెడా ను తీర్చిదిద్దడం జ‌రుగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్భం గా నోయెడా లోని వేరు వేరు ఇలెక్ట్రానిక్ కంపెనీ లను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌పంచం లో కెల్లా అత్యంత పెద్ద‌దైన మొబైల్ క‌ర్మాగారం కూడా ఈ కంపెనీ లలో ఉంది.

దేశం లో కెల్లా అత్యంత పెద్ద‌దైన విమానాశ్ర‌యాన్ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని జేవ‌ర్ లో నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఇది నిర్మాణం పూర్తి అయితే గ‌నుక జీవించ‌డం లో సౌల‌భ్యాన్ని తీసుకొని రావ‌డం ఒక్క‌టే కాకుండా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు ఆర్థికం గా లాభ‌దాయ‌కం గా కూడా ఉంటుంద‌ని పేర్కొన్నారు. దేశం అంత‌టా నిర్మాణాధీనం లో ఉన్న వివిధ విమానాశ్ర‌యాల ను గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు. యుడిఎఎన్ (‘ఉడాన్’) యోజ‌న ద్వారా చిన్న న‌గ‌రాల కు గ‌గ‌న త‌ల సంధానాన్ని స‌మ‌కూర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లో విద్యుత్తు రంగాన్ని మెరుగుప‌ర‌చే దిశ గా ప్ర‌భుత్వం అమలుచేస్తున్న కార్య‌క్రమాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, త‌న ప్ర‌భుత్వం విద్యుత్తు ఉత్పాద‌న లో అన్ని అంశాల ను.. అంటే ఉత్ప‌త్తి, ప్ర‌సారం, పంపిణీ, మ‌రియు క‌నెక్ష‌న్ ల పై.. శ్ర‌ద్ధ వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ విధ‌మైన దృక్ప‌థం విద్యుత్తు రంగాన్ని సంపూర్ణం గా మార్చి వేసింద‌ని, మ‌రి ‘వ‌న్ నేశ‌న్‌, వ‌న్ గ్రిడ్’ ప్ర‌స్తుతం వాస్త‌వ రూపాన్ని దాల్చింద‌ని ఆయ‌న అన్నారు. న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగాని కి కూడా ప్ర‌భుత్వం స‌రైన‌టువంటి ఊతాన్ని ఇచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ‘వ‌న్ వ‌ర‌ల్డ్‌, వ‌న్ స‌న్‌, వ‌న్ గ్రిడ్’ అనేది తన స్వప్నం అని ఆయ‌న వివ‌రించారు.

ఖుర్జా లో, బ‌క్స‌ర్ లో ప్రారంభ‌మైన థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటు లు భార‌త‌దేశం యొక్క వృద్ధి ని వేగ‌వంతం చేయ‌గ‌ల‌వ‌ని, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, బిహార్‌, ఇంకా ఇత‌ర ఇరుగు పొరుగు రాష్ట్రాల‌ లో విద్యుత్తు ల‌భ్య‌త స్థితిగ‌తుల‌ ను మార్చివేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కాలం లో విద్యుత్తు ఉత్పాద‌న లో భారీ ఎదుగుద‌ల ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాల‌జీ ని ప్రారంభిస్తూ ఈ సంస్థ విద్యార్థుల‌కు మరియు ప‌రిశోధ‌క విద్యార్థుల‌కు ఆధునిక స‌దుపాయాల‌ ను అందుబాటు లోకి తీసుకురాలగదద‌న్నారు.

ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఇది 125 కోట్ల మంది భార‌తీయులు ఇచ్చిన మ‌ద్ద‌తుతోను, శ‌క్తి తోను సాధ్య‌ప‌డిందని ఆయ‌న అన్నారు. దేశం లో అవినీతి ని నిర్మూలించేందుకు ప్ర‌భుత్వం దీక్షాబ‌ద్ధురాలైంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఉగ్ర‌వాదుల కు దీటైన స‌మాధానాన్ని ఇవ్వ‌డం లో సైనికులు క‌న‌బ‌ర‌చిన సాహ‌సాని కి ప్ర‌ధాన మంత్రి ప్రణామం చేస్తూ, ఉగ్ర‌వాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం దృఢమైన నిర్ణ‌యాల‌ ను తీసుకొంటూనేవుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India