ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్‌పుర్ ను నేడు సందర్శించారు. ప్రధాన మంత్రి లఖ్‌నవూ మెట్రో రైలు పథకాన్ని ప్రారంభించడం తో పాటు, ఆగ్రా మెట్రో రైల్ పథకాని కి శంకుస్థాపన చేశారు. పన్ కీ థర్మల్ పవర్ ప్లాంటు కు ఆయన పునాదిరాయి ని వేశారు. అలాగే, కాన్‌పుర్ లో గల నిరాలా నగర్ లో వివిధ అభివృద్ధి పథకాల కు ప్రారంభ సూచకం గా ఫలకాల ను ఆయన ఆవిష్కరించారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కాన్ పుర్ దేశం కోసం విస్తృత సేవల ను అందించినటువంటి ఎంతో మంది సాహసిక నాయకుల కు జన్మస్థలం గా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు న ప్రారంభమైన పథకాలు కాన్‌పుర్ ప్రజల యొక్క మరియు ఉత్తర్ ప్రదేశ్ ప్రజల యొక్క జీవితాల లో పరివర్తన ను తీసుకు రానున్నాయని ఆయన చెప్పారు.
కాన్‌పుర్ లో విద్యుత్తు లభ్యత ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కఠోరం గా శ్రమించాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం గా పన్ కీ థర్మల్ పవర్ ప్లాంటు ను గురించి ఆయన ప్రస్తావించి, ఇది కాన్‌పుర్ లో, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న విద్యుత్తు లోటు స్థితి ని మార్చివేయగలదన్నారు. ‘సౌభాగ్య పథకం’లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో 76 లక్షల పైగా ఉచిత విద్యుత్తు కనెక్షన్ లను సమకూర్చడం జరిగిందని ఆయన వెల్లడించారు.
గంగా నది శుద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గంగానది ని శుద్ధి చేయడం అసాధ్యమని ఇదివరకు అనుకొనే వారని, అయితే అసాధ్యమైన దానిని ప్రస్తుతం తన ప్రభుత్వం సాధ్యమైంది గా చేస్తోందని ఆయన చెప్పారు. ఈ నది లోకి చేరే మురుగు నీటి ని శుద్ధి చేయడం కోసం, ఈ నది లో కలిసే మురుగు కాల్వల ను ఆపి వేయడం కోసం అనేక చర్యల ను తీసుకొన్నట్లు ప్రధాన మంత్రి వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఆవిర్భవిస్తున్న రక్షణ కారిడోర్ కాన్‌పుర్ ప్రజల కు ఘనమైన లబ్ధి ని చేకూర్చనుందని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో రహదారులు, గగనతల మార్గాలు, ఇంకా రైలు మార్గాల వంటి ప్రధానమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం జరుగుతోందని, వివిధ మెట్రో పథకాల ను ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ పథకాలు ఉత్తర్ ప్రదేశ్ లో పరివర్తన ను తీసుకు వస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.
2022వ సంవత్సరాని కల్లా దేశం లోని ప్రతి ఒక్క కుటుంబం ఒక ఇంటి ని కలిగి ఉంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా దేశం లో ఇంతవరకు సుమారు ఒకటిన్నర కోట్ల గృహాల ను నిర్మించడం జరిగినట్లు ఆయన తెలిపారు.
పుల్‌వామా దాడి ఘటన లో, బడ్ గామ్ ప్రమాద ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారిలో కాన్‌పుర్ కు చెందిన సాహసిక జవాను లకు ప్రధాన మంత్రి వందనమాచరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
దేశం లో ‘ఏకత’తో కూడిన వాతావరణాన్ని పరిరక్షించడం ముఖ్యం అని ప్రధాన మంత్రి చెప్పారు. ఇటీవల కశ్మీరీల పై దాడి చేసిన వారి విషయం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న తక్షణ చర్యల ను ఆయన ప్రశంసించారు. అటువంటి చేష్ట లకు ఒడిగట్టిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవలసిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
आज से लगभग 6 हज़ार करोड़ रुपए की लागत से पनकी विद्युत परियोजना के विस्तारीकरण का काम शुरु हो जाएगा।
— PMO India (@PMOIndia) March 8, 2019
इससे जो बिजली बनेगी वो आधे से भी कम कीमत में उपलब्ध हो पाएगी और प्रदूषण में भी कमी आएगी: PM
आज से लगभग 6 हज़ार करोड़ रुपए की लागत से पनकी विद्युत परियोजना के विस्तारीकरण का काम शुरु हो जाएगा।
— PMO India (@PMOIndia) March 8, 2019
इससे जो बिजली बनेगी वो आधे से भी कम कीमत में उपलब्ध हो पाएगी और प्रदूषण में भी कमी आएगी: PM
कानपुर में गंगा जी की जो स्थिति को देखकर लोग कहते थे कि स्थिति को बदल पाना नामुमकिन है। लेकिन हमारी सरकार ने ये विश्वास दिलाया है कि नामुमकिन अब मुमकिन है.
— PMO India (@PMOIndia) March 8, 2019
गंगा जी में जो गंदगी नालों के माध्यम से बह रही थी, उसको बंद करने और नालों के पानी को ट्रीट करने का अभियान चलाया है: PM
एशिया के सबसे बड़े नालों में से एक सीसामऊ नाले के गंदे पानी को सीधे गंगा जी में जाने से रोकने का काम पूरा हो गया है।
— PMO India (@PMOIndia) March 8, 2019
जाजमऊ टेनरी के पानी को ट्रीट करने का काम भी आज से शुरु हो रहा है: PM
हमारी सरकार ने नमामि गंगे अभियान के तहत यहां के चमड़ा उद्योग के लिए भी एक विशेष योजना बनाई है।
— PMO India (@PMOIndia) March 8, 2019
इस योजना के तहत आज चमड़ा उद्योगों से निकलने वाले पानी को साफ करने के लिए बहुत बड़े प्लांट की आधारशिला रखी गई है।
इससे हर दिन 2 करोड़ लीटर गंदा पानी गंगा में जाने से रुकेगा: PM
पूरे यूपी में सड़कों, हाईवे, एक्सप्रेसवे, रेलवे, एयरवे का जाल बिछाया जा रहा है।
— PMO India (@PMOIndia) March 8, 2019
वहीं शहरों के भीतर मेट्रो की सुविधाएं तैयार की जा रही हैं।
कानपुर मेट्रो समेत यूपी में अनेक मेट्रो प्रोजेक्ट्स को केंद्र सरकार मंज़ूरी दे चुकी है: PM
पुलवामा हमले के बाद हमारे वीरों ने जो पराक्रम दिखाया, वो देश ने देखा है।
— PMO India (@PMOIndia) March 8, 2019
लेकिन बहुत दुखद है कि हमारे घर में ही सेना के पराक्रम को नीचा दिखाने का लगातार प्रयास किया जा रहा है।
पाकिस्तान को पसंद आएं, ऐसी बातें कही जा रही हैं: PM
आज जब पाकिस्तान पर पूरी दुनिया का दबाव है, तो ऐसे समय में पाकिस्तान की मदद करने वाले बयान क्यों दिए जा रहे हैं?
— PMO India (@PMOIndia) March 8, 2019
क्या उनको ऐसा करना शोभा देता है? मत भूलिए, आपके बयानों को आधार बनाकर पाकिस्तान दुनिया में भ्रम फैला रहा है: PM
सीमापार आतंकियों के खिलाफ निर्णायक लड़ाई के बीच, आतंकी बहुत बौखलाए हुए हैं। इसी का परिणाम है कि जम्मू में फिर आतंकी हमला हुआ है।
— PMO India (@PMOIndia) March 8, 2019
जिस प्रकार हमारी सरकार सख्त कार्रवाई कर रही है, वो और बौखलाएंगे।
हमें सतर्क रहते हुए राष्ट्र के प्रति अपने दायित्वों को निभाने की जरूरत है: PM
देश में एकता का वातावरण बनाए रखना बहुत अहम है।
— PMO India (@PMOIndia) March 8, 2019
लखनऊ में कुछ सिरफिरे लोगों ने हमारे कश्मीरी भाइयों के साथ जो हरकत की थी, उस पर यूपी सरकार ने त्वरित कार्रवाई की है।
मैं अन्य राज्य सरकारों से भी आग्रह करूंगा कि जहां भी ऐसी हरकत करने की कोई कोशिश करे, उस पर कठोर कार्रवाई की जाए:PM