ప్రధాన మంత్రి గోరఖ్‌పుర్ మరియు ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతాల కు సంబంధించిన అభివృద్ధి పథకాల ను కూడా ఆవిష్కరించారు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు గోరఖ్‌పుర్ నుండి ప్రారంభించారు.
నేటి ఈ శుభారంభం తో ఎంపిక చేసిన కొంత మంది లబ్దిదారు రైతుల బ్యాంకు ఖాల లోకి 2,000 రూపాయల తొలి వాయిదా నేరు గా జమ కానుంది.
‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ప్రారంభం అయినందుకు ప్రధాన మంత్రి రైతుల కు అభినందనలు తెలిపారు. అలాగే, పాడి ఉత్పత్తులు మరియు మత్స్య పాలన లో నిమగ్నమైన రైతు కుటుంబాల కు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. దీనికి కారణం, ఈ రైతు కుటుంబాల కు ఇక కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటు లోకి రానున్నాయి.
కార్యక్రమానికి తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రైతుల కు సంబంధించిన అతి పెద్ద పథకం ఈ రోజు న ప్రారంభం కావడం తో నేటి రోజు చరిత్ర లో చెరిగిపోని విధంగా నమోదు అయినట్లు పేర్కొన్నారు.
సమర్ధులు గా, సాధికారిత కలిగిన వారు గా రైతుల ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అని ప్రధాన మంత్రి అన్నారు. రైతుల ఆదాయం 2022వ సంవత్సరాని కల్లా రెట్టింపు అయ్యేటట్లుగా వారికి తగిన సాధనాలన్నింటినీ సమకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు.
దాదాపుగా 12 కోట్ల మంది రైతుల కు పిఎం-కిసాన్ నుండి ప్రయోజనం సమకూరనుందన్న అంచనా ఉంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 75 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల లోకి బదలాయించడం జరుగుతుందని ప్రధాన మంత్రి వెల్లడించారు. లబ్దిదారు రైతుల జాబితా ను కేంద్ర ప్రభుత్వాని కి వీలైనంత త్వరగా పంపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే, రైతులు ఈ పథకం తాలూకు ప్రయోజనాన్ని సకాలం లో పొందగలుగుతారని ఆయన వివరించారు.
ఇదివరకటి ప్రభుత్వాలు ఆయా సమయాల లో ప్రకటించిన రుణ మాఫీ లు రైతుల కు దీర్ఘకాలిక ఉపశమనాన్ని గాని, లేదా సమగ్రమైన ఉపశమనాన్ని గానీ అందించ లేదని, పిఎం-కిసాన్ వారి కి ఉపశమనాన్ని కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో ఒక బృహత్తరమైన పెట్టుబడి కి గుర్తు గా కూడా నిలచి పోనుందని ప్రధాన మంత్రి వివరించారు.
పిఎం-కిసాన్ ప్రత్యక్ష బదిలీ పై ఆధారపడుతుందని, మరి ఈ కారణం గా మొత్తం సొమ్ము లబ్దిదారు కు చేరుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.
దీర్ఘకాలం గా నిలచిపోయినటువంటి సాగు నీటి పారుదల పథకాల ను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల ను పెట్టుబడి గా పెడుతోందని, దీని తో దేశం లోని అనేక ప్రాంతాల లో రైతుల కు ఘనమైనటువంటి మరియు చిరకాలం నిలచిపోయేటటు వంటి సహాయం అందుతుందని ఆయన తెలిపారు. ఆయన తన ప్రసంగం లో 17 కోట్ల భూసార కార్డు లు, యూరియా కు వేప పూత, 22 పంటల కు ఉత్పత్తి ఖర్చు కన్నా 50 శాతం వంతున అధిక ఎంఎస్ పి, పిఎం ఫసల్ బీమా యోజన మరియు ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) ప్లాట్ ఫారమ్ లను గూర్చి ప్రస్తావించారు.
రైతులు ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 1.60 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చునని ప్రధాన మంత్రి అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఇతర సంక్షేమ పథకాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం అంతా కూడాను శీఘ్ర గతిన పరివర్తన కు లోనవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. పరిశ్రమ, సంధానం మరియు ఆరోగ్య రంగాలు ఈ మార్పు కు సాక్షులు గా ఉన్నాయని ఆయన అన్నారు.
గోరఖ్‌పుర్ మరియు ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు అయితే ప్రారంభానికి నోచుకోవడమో, లేదా వాటికి సంబంధించిన శంకుస్థాపన లు జరగడమో నేడు పూర్తి అయిందని కూడా ఆయన చెప్పారు. ఈ పథకాలు జీవించడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచనున్నాయని పేర్కొన్నారు. పిఎం ఆవాస్ యోజన, ఉజ్జ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ ల వంటి పథకాలు సబ్‌కా సాథ్- సబ్‌కా వికాస్’ స్ఫూర్తి కి ప్రతీకలు గా ఉన్నట్లు ఆయన చెప్పారు.
करोड़ों पशुपालकों, दूध के व्यवसाय से जुड़े किसान परिवारों और मत्स्य पालन और उसके व्यवसाय से जुड़े बहन-भाइयों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जुड़ने के लिए बहुत-बहुत बधाई: PM
— PMO India (@PMOIndia) February 24, 2019
देश के 1 करोड़ 1 लाख किसानों के बैंक खातों में इस योजना की पहली किश्त ट्रांसफर करने का सौभाग्य मुझे मिला है।
— PMO India (@PMOIndia) February 24, 2019
मुझे बताया गया है कि देश के 21 राज्यों-केंद्र शासित प्रदेशों के किसान इसमें शामिल हैं।
इन किसानों को 2 हजार 21 करोड़ रुपए अभी ट्रांसफर किए गए हैं: PM#PMKisan
ये तो अभी शुरुआत है।
— PMO India (@PMOIndia) February 24, 2019
इस योजना के तहत हर वर्ष लगभग 75 हज़ार करोड़ रुपए किसानों के खातों में सीधा पहुंचने वाले हैं।
देश के वो 12 करोड़ छोटे किसान, जिनके पास 5 एकड़ या उससे कम भूमि है, उन्हें इसका लाभ मिलेगा: PM#PMKisan
जिन किसानों को आज पहली किश्त नहीं मिली है, उन्हें आने वाले हफ्तों में पहली किश्त की राशि मिल जाएगी।#PMKisan के तहत जो पैसे किसानों को दिए जाएंगे, वह केंद्र सरकार की तरफ से दी जाएगी।
— PMO India (@PMOIndia) February 24, 2019
राज्य सरकारों को इस योजना का लाभ उठाने वाले किसानों की लिस्ट केंद्र सरकार को भेजनी है: PM
साथियों, हमारे लिए भी बहुत आसान था कर्जमाफी का फैसला।
— PMO India (@PMOIndia) February 24, 2019
हमारी सरकार प्रधानमंत्री कृषि सिंचाई योजना पर ही करीब 1 लाख करोड़ रुपए खर्च कर रही है।
इतनी बड़ी राशि हम लगा रहे हैं ताकि देश में जो सिंचाई परियोजनाएं 30-40 साल से अधूरी थीं, लटकी हुई थीं, उन्हें पूरा किया जा सके: PM
हमने देशभर की 99 ऐसी परियोजनाएं चुनीं थीं जिसमें से 70 से ज्यादा अब पूरी होने की स्थिति में आ रही हैं।
— PMO India (@PMOIndia) February 24, 2019
इन परियोजनाओं की वजह से किसानों को लाखों हेक्टेयर जमीन पर सिंचाई की सुविधा मिल रही है।
ये वो काम है जो किसानों की आने वाली कई पीढ़ियों तक को लाभ देगा: PM
सिंचाई परियोजनाओं को पूरा न करके, कर्जमाफी करना आसान रास्ता था।
— PMO India (@PMOIndia) February 24, 2019
लेकिन कि कर्जमाफी से सिर्फ ऊपरी स्तर के कुछ किसानों का ही फायदा हो पाता।
वो भी ऐसे किसान जिन्होंने बैंक से लोन लिया है, उन करोड़ों किसानों के बारे में कौन सोचता, जो बैंक के बजाय किसी दूसरे से कर्ज लेते हैं: PM
ये नया भारत है।
— PMO India (@PMOIndia) February 24, 2019
इसमें केंद्र सरकार जितना पैसा किसान के लिए भेजती है, वो पूरा पैसा उसके खाते में पहुंचता है।
अब वो दिन गए जब सरकार 100 पैसा भेजती थी, तो बीच में 85 पैसा दलाल और बिचौलिए खा जाते थे।
#PMKisan को भी फूल प्रूफ बनाया गया है ताकि किसान का अधिकार कोई छीन न सके: PM
जो बातें लोग पहले नामुमकिन समझते थे, उन्हें मुमकिन कर रही है।
— PMO India (@PMOIndia) February 24, 2019
पिछले साढ़े चार वर्षों में सरकार द्वारा दो चरणों में 17 करोड़ से ज्यादा सॉयल हेल्थ कार्ड दिए जा चुके हैं।
यूरिया की 100% नीम कोटिंग का फैसला लेकर हमने खाद का दुरुपयोग रोका है: PM
ये हमारी सरकार ही है जिसने MSP पर किसानों की बरसों पुरानी मांग को पूरा किया।
— PMO India (@PMOIndia) February 24, 2019
रबी और खरीफ की 22 फसलों का समर्थन मूल्य लागत का 50% से अधिक तय किया गया है।
मौसम की मार से किसानों को बचाने के लिए प्रधानमंत्री फसल बीमा योजना भी बनाई गई है: PM
किसानों को उपज का उचित मूल्य मिले और उसकी लागत कम हो इसके लिए अनेक प्रयास किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) February 24, 2019
e-NAM प्लेटफॉर्म से देशभर की सैकड़ों मंडियों को जोड़ने का काम चल रहा है।
इससे किसानों को सीधे देशभर की किसी भी मंडी में ऑनलाइन अपनी उपज बेचने का विकल्प मिलेगा: PM
किसान ऊर्जा सुरक्षा एवं उत्थान अभियान को इसी हफ्ते सरकार ने मंजूरी दी है।
— PMO India (@PMOIndia) February 24, 2019
इसके तहत किसानों को 17 लाख से अधिक सोलर पंप लगाने में मदद की जाएगी,
ताकि उनको सिंचाई पर होने वाले बिजली या डीजल के खर्च से मुक्ति मिले: PM
इसके अलावा 10 लाख सोलर पंपों को बिजली ग्रिड से जोड़ने में किसानों की मदद की जाएगी, जिससे वो सिंचाई तो मुफ्त में कर ही पाएंगे, बची हुई बिजली बेच भी पाएंगे।
— PMO India (@PMOIndia) February 24, 2019
ये अन्नदाता को ऊर्जादाता बनाने के हमारे व्यापक अभियान का हिस्सा है: PM