ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని పశు గణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ఎసిడిపి) మథుర లో నేడు ప్రారంభించారు.
పూర్తి గా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాయోజితం చేయబడే ఈ కార్యక్రమాని కి 12,652 కోట్ల రూపాయలు వ్యయమవుతాయి. ఈ రెండు వ్యాధుల ను తగ్గించే కృషి లో భాగం గా దేశ వ్యాప్తం గా 600 మిలియన్ కు పైగా పశువుల కు
టీకా లు వేయించనున్నారు.
ప్రధాన మంత్రి జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని మరియు టీకాలు వేయడం మరియు వ్యాధి నిర్వహణ, కృత్రిమ వీర్య నిక్షేపణం, ఇంకా ఉత్పాదకత అంశాల పై దేశం లో ఉన్న మొత్తం 687 జిల్లాల లో గల కృషి విజ్ఞాన్ కేంద్రాల (కెవికె స్)లో ఓ విస్తృతమైన కార్యశాల ను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాని కి పెద్ద సంఖ్య లో హాజరైన సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘పశుగణం మరియు పర్యావరణం అనేవి భారతదేశ తత్త్వ శాస్త్రం లోను, ఆర్థిక భావజాలం లోను కీలకం గా నిలుస్తూ వచ్చాయి. మరి ఈ కారణం గా అది స్వచ్ఛ్ భారత్ కావచ్చు, లేదా జల్ జీవన్ మిశన్ కావచ్చు లేదా వ్యవసాయాన్ని, పశు సంవర్ధకాన్ని ప్రోత్సహించడం కావచ్చు.. మనం ప్రకృతి కి మరియు ఆర్థిక వ్యవస్థ కు మధ్య ఒక సమతుల్యత ను కాపాడడం కోసం మేము సదా ప్రయత్నిస్తూ వస్తున్నాము. ఒక బలమైన ‘న్యూ ఇండియా’ను నిర్మించడాని కి మనకు తోడ్పడే అంశాలు ఇవి’’ అన్నారు.
దేశం లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడం పై శ్రద్ధ వహించేటటువంటి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఆయన తన ఉపన్యాసం లో “ఈ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ కల్లా మన ఇళ్ళు, కార్యాలయాలు, కార్య స్థలాల నుండి ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను పారద్రోలడాని కి మనం అందరమూ ప్రయత్నించాలి.”
‘‘ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను నిరోధించే ఈ ప్రచార ఉద్యమం లో చేరవలసింది గా అన్ని స్వయం సహాయక బృందాల కు, ఎన్‌జిఒ లకు, పౌర సమాజాని కి, మహిళల సంస్థలకు మరియు యువత సంస్థల కు, ప్రతి కళాశాల కు, ప్రతి పాఠశాల కు, ప్రతి ప్రభుత్వ- ప్రైవేటు సంస్థల కు, ప్రతి ఒక్క వ్యక్తి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’
“పోలిథీన్ బ్యాగుల కు చౌక అయిన మరియు సులభమైన ప్రత్యామ్నాయాల కోసం మనం అన్వేషించాలి. మన స్టార్ట్- అప్ ల ద్వారా అనేక పరిష్కార మార్గాల ను వెతుక వచ్చును” అని తెలిపారు.
పశుగణం యొక్క స్వస్థత కు, పౌష్టిక ఆహారాని కి మరియు పాడి పశువుల పెంపకానికి సంబంధించినటువంటి అనేక ఇతర కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
“రైతుల ఆదాయాన్ని పెంచడం లో పశు సంవర్ధకం తో పాటు ఇతర సంబంధిత కార్యకలాపాలు ఒక గొప్ప పాత్ర ను పోషించవలసివుంది. పశు సంవర్ధకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటివి వాటి లో పెట్టే పెట్టుబడులు అధిక ప్రతిఫలాల ను అందిస్తాయి.’’
“గడచిన అయిదు సంవత్సరాల కాలం లో మనం సాగు మరియు సంబంధిత కార్యకలాపాల దిశ గా ఒక నూతన దృక్పథం తో ముందుకు సాగాము. పశుగణం యొక్క, పాల ఉత్పత్తుల యొక్క నాణ్యత ను మెరుగు పరచడం కోసం, అలాగే వాటి ని వివిధీకరించడం కోసం మనం అవసరమైన చర్యల ను తీసుకొన్నాము.’’
‘‘పశుగణాని కి హరిత గ్రాసాన్ని, ఇంకా బలవర్ధక ఆహారాన్ని క్రమం తప్పక సరఫరా చేయడం కోసం ఒక సముచిత సమాధానాన్ని అన్వేషించవలసిన అవసరం ఉన్నది.’’
‘‘నూతన ఆవిష్కరణలు మరియు నవీన సాంకేతిక విజ్ఞానం భారతదేశం లో పాడి రంగాన్ని విస్తృత పరచడం కోసం తక్షణ అవసరాలు గా ఉన్నాయి. మన పల్లెల లో నుండి ఈ విధమైన నూతన ఆవిష్కరణ లు తెర మీద కు రావాలి, ఈ ఉద్దేశ్యం తోనే ‘‘స్టార్ట్-అప్ బ్రాండ్ చాలింజ్’’ను మేము ప్రారంభించాము.
‘‘నా యువ మిత్రుల కు నేను ఒక విషయం లో హామీ ని ఇవ్వదలచుకున్నాను. అది ఏమిటంటే వారి యొక్క ఆలోచనల ను ముందుకు తీసుకుపోయి, వాటి కోసం సముచిత పెట్టుబడి ని సమీకరించడం కోసం గంభీరం గా పట్టించుకోవడం జరుగుతుంది అని. ఇలా చేయడం ద్వారా ఉపాధి కి సంబంధించినటువంటి నూతన అవకాశాలు ఎదురవుతాయి’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
ब्रजभूमि ने हमेशा से ही पूरे विश्व को, पूरी मानवता को, जीवन को प्रेरित किया है।
— PMO India (@PMOIndia) September 11, 2019
आज पूरा विश्व पर्यावरण संरक्षण के लिए, रोल मॉडल ढूंढ रहा है।
लेकिन भारत के पास भगवान श्रीकृष्ण जैसा प्रेरणा स्रोत हमेशा से रहा है, जिनकी कल्पना ही पर्यावरण प्रेम के बिना अधूरी है: PM
पर्यावरण और पशुधन हमेशा से भारत के आर्थिक चिंतन का बहुत ही महत्वपूर्ण हिस्सा रहा है।
— PMO India (@PMOIndia) September 11, 2019
यही कारण है कि चाहे स्वच्छ भारत हो, जल जीवन मिशन हो या फिर कृषि और पशुपालन को प्रोत्साहन, प्रकृति और आर्थिक विकास में संतुलन बनाकर ही हम सशक्त औऱ नए भारत के निर्माण की तरफ आगे बढ़ रहे हैं: PM
थोड़ी देर पहले ‘स्वच्छता ही सेवा अभियान’ की शुरुआत की गई है।
— PMO India (@PMOIndia) September 11, 2019
नेशनल एनीमल डिजीज़ कंट्रोल प्रोग्राम को भी लॉन्च किया गया है। पशुओं के स्वास्थ्य, संवर्धन, पोषण और डेयरी उद्योग से जुड़ी कुछ अन्य योजनाएं भी शुरू हुई हैं: PM
इसके अलावा मथुरा के इंफ्रास्ट्रक्चर और पर्यटन से जुड़े कई प्रोजेक्ट्स का शिलान्यास और उद्घाटन भी आज हुआ है: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
हमें ये कोशिश करनी है कि इस वर्ष 2 अक्तूबर तक अपने घरों को, अपने दफ्तरों को, अपने कार्यक्षेत्रों को सिंगल यूज प्लास्टिक से मुक्त करें: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
मैं देश भर में, गांव-गांव में काम कर रहे हर सेल्फ हेल्प ग्रुप से, सिविल सोसायटी से, सामाजिक संगठनों से, युवक मंडलों से, महिला मंडलों से, क्लबों से, स्कूल और कॉलेज से, सरकारी और निजी संस्थानों से, हर व्यक्ति हर संगठन से इस अभियान से जुड़ने का आग्रह करता हूं: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
किसानों की आय बढ़ाने में पशुपालन और दूसरे व्यवसायों का भी बहुत बड़ा रोल है। पशुपालन हो, मछली पालन हो या मधुमक्खी पालन, इन पर किया गया निवेश, ज्यादा कमाई कराता है। इसलिए बीते 5 वर्षों में कृषि से जुड़े दूसरे विकल्पों पर हम एक नई अप्रोच के साथ आगे बढ़े हैं: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
पशुधन की गुणवत्ता और स्वास्थ्य से लेकर डेयरी प्रोडक्ट्स की वैरायटी को विस्तार देने के लिए जो भी जरूरी कदम थे वो उठाए गए हैं: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
भारत के डेयरी सेक्टर को विस्तार देने के लिए, हमें Innovation की ज़रूरत है, नई तकनीक की जरूरत है। ये इनोवेशन हमारे ग्रामीण समाज से भी आए, इसलिए आज Startup Grand Challenge की शुरुआत भी की गई है: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
हमें समाधान खोजने हैं कि हरे चारे की उचित व्यवस्था कैसे सुनिश्चित हो, उन्हें भी पोषक आहार कैसे मिले? प्लास्टिक की थैलियों का सस्ता और सुलभ विकल्प क्या हो सकता है? ऐसे अनेक विषयों का हल देने वाले स्टार्ट अप शुरू किए जा सकते हैं: PM
— PMO India (@PMOIndia) September 11, 2019
मैं अपने युवा साथियों को आश्वस्त करता हूं कि उनके Ideas पर गंभीरता से विचार होगा, उन्हें आगे बढ़ाया जाएगा और ज़रूरी निवेश की व्यवस्था भी की जाएगी। इससे रोज़गार के अनेक नए अवसर भी तैयार होंगे: PM
— PMO India (@PMOIndia) September 11, 2019