రాబోయే 150 వ జయంతి సందర్భంగా గాంధీజీకి నివాళిగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌లను వారి జీవితాల నుండి తొలగించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
పర్యావరణ పరిరక్షణపై భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ప్రేరేపించింది మరియు ఇప్పుడు భారతదేశం ప్రపంచాన్ని ఉదాహరణగా నడిపించి మన పర్యావరణాన్ని పరిరక్షించే సమయం: ప్రధాని మోదీ
ఈ రోజు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు మధురలో పర్యాటకాన్ని పెంచుతాయి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశం లోని ప‌శు గ‌ణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్‌ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ ప‌శు రోగ నియంత్ర‌ణ కార్య‌క్ర‌మాన్ని (ఎన్ఎసిడిపి) మ‌థుర లో నేడు ప్రారంభించారు.

పూర్తి గా కేంద్ర ప్ర‌భుత్వ‌ం ద్వారా ప్రాయోజితం చేయ‌బడే ఈ కార్య‌క్ర‌మాని కి 12,652 కోట్ల‌ రూపాయ‌లు వ్యయమవుతాయి. ఈ రెండు వ్యాధుల ను త‌గ్గించే కృషి లో భాగం గా దేశ వ్యాప్తం గా 600 మిలియ‌న్ కు పైగా ప‌శువుల కు
టీకా లు వేయించనున్నారు.  

ప్ర‌ధాన మంత్రి జాతీయ కృత్రిమ వీర్య నిక్షేప‌ణం కార్య‌క్ర‌మాన్ని మరియు టీకాలు వేయ‌డం మ‌రియు వ్యాధి నిర్వ‌హ‌ణ‌, కృత్రిమ వీర్య నిక్షేప‌ణం, ఇంకా ఉత్పాద‌క‌త అంశాల పై దేశం లో ఉన్న మొత్తం 687 జిల్లాల లో గ‌ల కృషి విజ్ఞాన్ కేంద్రాల  (కెవికె స్)లో ఓ విస్తృత‌మైన కార్యశాల ను కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమాని కి పెద్ద సంఖ్య‌ లో హాజ‌రైన స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ‘‘ప‌శుగ‌ణం మ‌రియు ప‌ర్యావ‌ర‌ణం అనేవి భార‌త‌దేశ త‌త్త్వ శాస్త్రం  లోను, ఆర్థిక భావ‌జాలం లోను కీల‌కం గా నిలుస్తూ వ‌చ్చాయి.  మ‌రి ఈ కార‌ణం గా అది స్వ‌చ్ఛ్ భార‌త్ కావ‌చ్చు, లేదా జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ కావ‌చ్చు లేదా వ్య‌వ‌సాయాన్ని, ప‌శు సంవ‌ర్ధ‌కాన్ని ప్రోత్స‌హించ‌డం కావ‌చ్చు.. మ‌నం ప్ర‌కృతి కి మ‌రియు ఆర్థిక వ్య‌వ‌స్థ కు మ‌ధ్య ఒక స‌మ‌తుల్య‌త ను కాపాడడం కోసం మేము స‌దా ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నాము.  ఒక బ‌ల‌మైన ‘న్యూ ఇండియా’ను నిర్మించ‌డాని కి మ‌న‌కు తోడ్ప‌డే అంశాలు ఇవి’’ అన్నారు.

 

 

దేశం లో ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ ఉప‌యోగాన్ని త‌గ్గించ‌డం పై శ్ర‌ద్ధ వ‌హించేట‌టువంటి స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు.

ఆయన తన ఉపన్యాసం లో “ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 2వ తేదీ క‌ల్లా మ‌న ఇళ్ళు, కార్యాల‌యాలు, కార్య స్థ‌లాల‌ నుండి ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను పారద్రోలడాని కి మ‌నం అందరమూ ప్ర‌య‌త్నించాలి.”

‘‘ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ ను నిరోధించే ఈ ప్ర‌చార ఉద్య‌మం లో చేర‌వ‌ల‌సింది గా అన్ని స్వ‌యం స‌హాయ‌క బృందాల కు, ఎన్‌జిఒ ల‌కు, పౌర స‌మాజాని కి, మ‌హిళ‌ల సంస్థలకు మ‌రియు యువ‌త సంస్థ‌ల కు, ప్ర‌తి క‌ళాశాల కు, ప్ర‌తి పాఠ‌శాల కు, ప్ర‌తి ప్ర‌భుత్వ- ప్రైవేటు సంస్థల కు, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’

“పోలిథీన్ బ్యాగుల‌ కు చౌక అయిన మ‌రియు సుల‌భ‌మైన ప్ర‌త్యామ్నాయాల కోసం మ‌నం అన్వేషించాలి. మ‌న స్టార్ట్‌- అప్ ల ద్వారా అనేక ప‌రిష్కార మార్గాల ను వెతుక‌ వ‌చ్చును” అని తెలిపారు.

ప‌శుగ‌ణం యొక్క స్వ‌స్థ‌త కు, పౌష్టిక ఆహారాని కి  మ‌రియు పాడి పశువుల పెంప‌కానికి సంబంధించినటువంటి అనేక ఇత‌ర కార్య‌క్ర‌మాల ను కూడా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు.

“రైతుల ఆదాయాన్ని పెంచ‌డం లో ప‌శు సంవ‌ర్ధ‌కం తో పాటు ఇత‌ర సంబంధిత కార్య‌క‌లాపాలు ఒక గొప్ప పాత్ర ను పోషించ‌వ‌ల‌సివుంది.  ప‌శు సంవ‌ర్ధ‌కం, చేప‌ల పెంప‌కం, తేనెటీగ‌ల పెంప‌కం వంటివి వాటి లో పెట్టే పెట్టుబ‌డులు అధిక ప్ర‌తిఫ‌లాల‌ ను అందిస్తాయి.’’

“గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో మ‌నం సాగు మ‌రియు సంబంధిత కార్య‌క‌లాపాల దిశ గా ఒక నూత‌న దృక్ప‌థం తో ముందుకు సాగాము.  ప‌శుగ‌ణం యొక్క, పాల ఉత్ప‌త్తుల యొక్క నాణ్య‌త‌ ను మెరుగు ప‌ర‌చ‌డం కోసం, అలాగే వాటి ని వివిధీక‌రించ‌డం కోసం మ‌నం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల ను తీసుకొన్నాము.’’

 

‘‘ప‌శుగ‌ణాని కి హ‌రిత గ్రాసాన్ని, ఇంకా బ‌ల‌వ‌ర్ధ‌క‌ ఆహారాన్ని క్ర‌మం త‌ప్ప‌క స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం ఒక స‌ముచిత సమాధానాన్ని అన్వేషించ‌వలసిన అవసరం ఉన్నది.’’

‘‘నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌రియు న‌వీన సాంకేతిక విజ్ఞానం భార‌త‌దేశం లో పాడి రంగాన్ని విస్తృత ప‌ర‌చ‌డం కోసం త‌క్ష‌ణ అవ‌స‌రాలు గా ఉన్నాయి.  మ‌న ప‌ల్లెల లో నుండి ఈ విధమైన నూత‌న ఆవిష్క‌ర‌ణ లు తెర మీద కు రావాలి, ఈ ఉద్దేశ్యం తోనే ‘‘స్టార్ట్-అప్ బ్రాండ్ చాలింజ్’’ను మేము ప్రారంభించాము.

‘‘నా యువ మిత్రుల కు నేను ఒక విష‌యం లో హామీ ని ఇవ్వ‌ద‌ల‌చుకున్నాను.  అది ఏమిటంటే వారి యొక్క ఆలోచ‌న‌ల ను ముందుకు తీసుకుపోయి, వాటి కోసం సముచిత పెట్టుబడి ని సమీకరించడం కోసం గంభీరం గా ప‌ట్టించుకోవ‌డం జ‌రుగుతుంది అని.  ఇలా చేయడం ద్వారా ఉపాధి కి సంబంధించినటువంటి నూత‌న అవ‌కాశాలు ఎదురవుతాయి’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi