QuotePM Modi launches the MSME ‘Support and Outreach Programme’ in Delhi
QuotePM Modi also announced twelve major decisions to accelerate growth in the MSMEs of India.
QuoteThese 12 decisions are ‘Diwali Gifts’ from the government to the MSMEs of India: PM Modi
QuotePM unveils 12 key initiatives
Quote59 minute loan portal to enable easy access to credit for MSMEs
QuoteMandatory 25 percent procurement from MSMEs by CPSEs
QuoteOrdinance for simplifying procedures for minor offences under Companies Act

సూక్ష్మ, ల‌ఘు, ఇంకా మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగానికి స‌హాయాన్ని అందించే మ‌రియు త‌త్సంబంధిత ప్ర‌చారాన్ని నిర్వ‌హించే ఓ చ‌రిత్రాత్మ‌క‌ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా దేశం అంతటా ఎమ్ఎస్ఎమ్ఇ ల వృద్ధి కి, విస్త‌ర‌ణ కు మ‌రియు సౌల‌భ్యానికి తోడ్ప‌డేట‌టువంటి 12 కీల‌క‌మైన కార్య‌క్ర‌మాల‌ ను సైతం ప్ర‌ధాన మంత్రి ఆవిష్కారించారు.

|

ఈ రోజున తాను ప్ర‌క‌టిస్తున్న 12 నిర్ణ‌యాలు  ఎమ్ఎస్ఎమ్ఇ రంగం లో ఓ నూత‌నాధ్యాయానికి సూచిక‌ గా నిలుస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఎమ్ఎస్ఎమ్ఇ లు భార‌త‌దేశం లో ప్ర‌ధాన ఉపాధి క‌ల్ప‌న మార్గాల్లో ఒక‌ మార్గం గా  ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డిస్తూ, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రంగం లో భార‌త‌దేశం భ‌వ్య‌మైన సంప్ర‌దాయాల‌ ను క‌లిగివుంద‌ని గుర్తుకు తెచ్చారు.  ఈ సంద‌ర్భంగా లుధియానా కు చెందిన హొజియరి తయారీ, వారాణ‌సీ కి చెందిన చీర‌ ల త‌యారీ ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

నాలుగు సంవ‌త్స‌రాల లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ ల సాఫ‌ల్యాన్ని “వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం సంబంధిత స్థానాల”లో భార‌త‌దేశం 142 వ స్థానం నుండి 77 వ స్థానానికి ఎగ‌బాక‌డం ద్వారా గ్ర‌హించ‌వ‌చ్చని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి మార్గాన్ని సుగ‌మం చేయ‌డం లో అయిదు కీల‌క‌మైన అంశాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  వీటి లో ప‌ర‌ప‌తి ల‌భ్య‌త‌, విప‌ణుల యొక్క అందుబాటు, సాంకేతిక విజ్ఞానం స్థాయి పెంపుద‌ల, వ్యాపారం చేయ‌డం లో స‌ర‌ళ‌త్వం ల‌తో పాటు ఉద్యోగుల‌ కు భ‌ద్ర‌త భావన ఉన్నట్లు ఆయ‌న తెలిపారు.  తాను చేస్తున్నటువంటి ఈ 12 ప్ర‌క‌ట‌న‌ల‌ ను ఈ రంగానికి ఒక దీపావ‌ళి బ‌హుమ‌తి వంటివని, ఐదు కేటగిరీలకు చెందిన వీటి లోని ప్రతి ఒక్కటీ కూడాను స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాలుగా ఉంటాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

|

ప‌ర‌ప‌తి ల‌భ్య‌త‌

ఒక‌టో ప్ర‌క‌ట‌న గా ఎమ్ఎస్ఎమ్ఇ ల‌కు ప‌ర‌ప‌తి సౌక‌ర్యం సుల‌భం గా అందుబాటు లోకి వ‌చ్చేందుకు  59 నిమిషాల్లో రుణం మంజూరయ్యే ఓ పోర్ట‌ల్ ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణాల‌ కు ఈ పోర్ట‌ల్ ద్వారా సూత్ర‌ప్రాయ ఆమోదాన్ని కేవ‌లం 59 నిమిషాల లో మంజూరు చేయ‌డం జరుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.  ఈ పోర్ట‌ల్ కు ఒక లింకు ను జిఎస్‌టి పోర్ట‌ల్ ద్వారా స‌మ‌కూర్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  ‘న్యూ ఇండియా’ లో, బ్యాంకు శాఖ ను ప‌లు మార్లు సంద‌ర్శించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ని ఎవ్వరికీ కల్పించకూడద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  

ఇక రెండో ప్ర‌క‌ట‌న గా జిఎస్‌టి లో న‌మోదైన అన్ని ఎమ్ఎస్ఎమ్ఇ ల‌కు స‌రికొత్త రుణాలకు లేదా ఉప రుణాల‌ కు వడ్డీ లో 2 శాతం త‌గ్గింపు ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  శిప్‌మెంట్ కు పూర్వం, శిప్‌మెంట్ కు అనంతర కాలాల్లో రుణాల‌ ను స్వీక‌రించే ఎగుమ‌తిదారు సంస్థ‌ లకై వ‌డ్డీ రాయితీ ని 3 శాతం నుండి 5 శాతానికి పెంచుతున్నట్లు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.

ప్ర‌ధాన మంత్రి చేసిన మూడో ప్ర‌క‌ట‌న 500 కోట్ల రూపాయ‌ల‌ కు మించిన ట‌ర్నోవ‌ర్ ను క‌లిగివుండే అన్ని కంపెనీలు ట్రేడ్ రిసీవ‌బుల్స్ ఇ-డిస్‌కౌంటింగ్ సిస్ట‌మ్ (టిఆర్ఇడిఎస్- TReDS) లో త‌ప్ప‌నిస‌రి గా చేరాలన్నది.  ఈ పోర్ట‌ల్ లో చేరిక వల్ల న‌వ పారిశ్రామికులు వారి భావి రిసీవ‌బుల్స్ ప్రాతిప‌దిక‌ న బ్యాంకుల నుండి ప‌ర‌ప‌తి ని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.  న‌గ‌దు ప్ర‌వాహం సంబంధిత స‌మ‌స్య‌ల‌ ను ఇది తీరుస్తుంది.

విప‌ణుల అందుబాటు

న‌వ పారిశ్రామికుల కు విప‌ణుల‌ను అందుబాటు లోకి తెచ్చే అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ దిశ గా అనేక చ‌ర్య‌ల‌ను తీసుకొంద‌న్నారు.  ఈ సంద‌ర్భం లో ఆయ‌న త‌న నాలుగో ప్ర‌క‌ట‌న ను చేస్తూ  ప్ర‌భుత్వ రంగ కంపెనీల‌ ను వాటి మొత్తం కొనుగోళ్ళ లో భాగంగా ఎమ్ఎస్ఎమ్ఇ ల నుండి జ‌రిపే కొనుగోళ్ళ‌ను 20 శాతానికి బ‌దులు గా 25 శాతం మేర‌కు త‌ప్ప‌నిస‌రిగా జ‌ర‌పాల్సిందిగా ఆదేశించ‌డమైంద‌న్నారు.

ఇక ప్ర‌ధాన మంత్రి త‌న అయిదో ప్ర‌క‌ట‌న‌ మ‌హిళా న‌వ‌ పారిశ్రామికుల‌ కు సంబంధించిదని తెలియ‌జేశారు.  ఎమ్ఎస్ఎమ్ఇ ల నుండి విధి గా జ‌ర‌ప‌వ‌ల‌సిన 25 శాతం కొనుగోళ్ళ లో నుండి 3 శాతం కొనుగోళ్ళ ను మ‌హిళా న‌వ పారిశ్రామికుల కోసం ప్ర‌త్యేకించి తీర‌వ‌ల‌సిందేన‌ని ఆయన పేర్కొన్నారు.

జిఇఎమ్ (GeM) లో న‌మోదైన 1.5 ల‌క్ష‌ల‌ కు పైగా స‌ర‌ఫ‌రాదారు సంస్థ‌ ల‌లో 40 వేల సంస్థ‌ లు ఎమ్ఎస్ఎమ్ఇ లే న‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  జిఇఎమ్ ద్వారా ఇంత వ‌ర‌కు 14 వేల కోట్ల రూపాయల‌ కు పైగా విలువైన లావాదేవీలు జ‌రిగాయ‌న్నారు.  

ఆయ‌న త‌న ఆరో ప్ర‌క‌ట‌న‌గా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ లు ప్ర‌స్తుతం జిఇఎమ్ లో ఒక భాగమై తీరాల‌న్నారు.  ఆ సంస్థ లు  వాటి యొక్క విక్రేత సంస్థ లు కూడా జిఇఎమ్ లో తమ పేర్లను న‌మోదు చేసుకొనేట‌ట్లుగా చూడాల‌ని ఆయ‌న చెప్పారు.

|

సాంకేతిక విజ్ఞానం స్థాయి పెంపుద‌ల‌

సాంకేతిక విజ్ఞాన సంబంధిత స్థాయి ని పెంచుకోవ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, దేశవ్యాప్తం గా ఉన్న‌టువంటి టూల్ రూమ్ లు ఉత్ప‌త్తి, ఆకృతి రూప‌క‌ల్ప‌న లో ఒక కీల‌క‌మైన భాగమ‌ని పేర్కొన్నారు.  

దేశమంతటా 20 కేంద్రాల ను (హ‌బ్స్‌) ఏర్పరుస్తామని, అలాగే టూల్ రూమ్స్ రూపం లో 100 స్పోక్స్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌నేది ఆయన చేసిన ఏడో ప్రకటన.  

‘వ్యాపారం చేయ‌డం లో స‌ర‌ళ‌త్వం’

‘వ్యాపారం  చేయ‌డంలో సౌల‌భ్యం’ అనే అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, త‌న ఎనిమిదో ప్ర‌క‌ట‌న ఔష‌ధ కంపెనీల‌ కు సంబంధించింద‌ని తెలిపారు.  ఔష‌ధ రంగం లోని ఎమ్ఎస్ఎమ్ఇ ల‌తో క్ల‌స్ట‌ర్ ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.   ఈ క్ల‌స్ట‌ర్ ల‌ను ఏర్పాటు చేసేందుకు అయ్యే వ్య‌యం లో 70 శాతం వ్య‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌భుత్వ ప్ర‌క్రియ‌ల ను స‌ర‌ళ‌త‌రం చేయ‌డం త‌న తొమ్మిదో ప్ర‌క‌ట‌న అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  దీనిలో భాగంగా 8 కార్మిక శాస‌నాలు మ‌రియు 10 యూనియ‌న్ నిబంధ‌న‌ల లో భాగంగా రిట‌ర్న్ ల‌ను ఇక‌ మీదట సంవ‌త్స‌రం లో ఒక‌సారి మాత్ర‌మే దాఖ‌లు చేయ‌వ‌ల‌సి ఉంటుంద‌ని వివ‌రించారు.

ప్ర‌ధాన మంత్రి త‌న ప‌దో ప్ర‌క‌ట‌న ను గురించి చెబుతూ ఇన్‌స్పెక్ట‌ర్ సంద‌ర్శించ‌వ‌ల‌సిన ఎస్టాబ్లిష్‌మెంట్ ల‌ను కంప్యూట‌ర్ జరిపే యాదృచ్ఛిక  కేటాయింపు ద్వారా నిర్ణయించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

ఒక యూనిట్ ను నెల‌కొల్ప‌డం లో భాగంగా ఏ న‌వ పారిశ్రామిక‌వేత్త కైనా రెండు ర‌కాల అనుమ‌తులు అవ‌స‌రం అవుతాయ‌ని, వాటిలో ఒక‌టో అనుమతి ప‌ర్య‌ావర‌ణ సంబంధిత ఆమోదం కాగా రెండో అనుమతి స‌ద‌రు సంస్థ ఏర్పాటు కు సమ్మ‌తి అని ప్ర‌ధాన మంత్రి విశ‌దీక‌రించారు.  ఆయన తన ప‌ద‌కొండో ప్ర‌క‌ట‌న ను గురించి చెప్తూ ఇది వాయు కాలుష్యం, ఇంకా జ‌ల కాలుష్యం సంబంధిత శాస‌నాల్లో భాగం గా ఈ రెండు అనుమ‌తుల‌ను ఇక పై ఒకే స‌మ్మ‌తి గా విలీనపరచడం జ‌రిగింద‌న్నారు.  అలాగే, రిట‌ర్న్ లను స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌ద్ధ‌తి లో స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 

|

ప‌న్నెండో ప్ర‌క‌ట‌న లో భాగంగా ప్ర‌ధాన మంత్రి ఒక ఆర్డినెన్స్ ను తీసుకురావ‌డాన్ని గురించి ప్ర‌స్తావించారు.  ఇందులో భాగం గా కంపెనీల చ‌ట్టం ప‌రిధి లోని చిన్న ఉల్లంఘ‌న‌ల విష‌యం లో న‌వ పారిశ్రామికవేత్త ఇక పై న్యాయ స్థానాల‌ను ఆశ్ర‌యించ‌న‌క్క‌ర లేద‌ని, స‌ర‌ళ‌ ప్ర‌క్రియ‌ ల ద్వారా వాటిని దిద్దుబాటు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ఎమ్ఎస్ఎమ్ఇ రంగ ఉద్యోగుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌

ప్ర‌ధాన మంత్రి ఎమ్ఎస్ఎమ్ఇ రంగ ఉద్యోగుల‌కు సామాజిక భ‌ద్ర‌త ను గురించి కూడా వివ‌రించారు.  వారు జ‌న్ ధ‌న్ అకౌంట్ లను, భ‌విష్య నిధి (పిఎఫ్) ని, ఇంకా బీమా ను క‌లిగివుండేట‌ట్లుగా శ్ర‌ద్ధ వ‌హించేందుకు ఒక ఉద్య‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

భార‌త‌దేశం లో ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని ప‌ట్టిష్ట ప‌ర‌చ‌డం లో ఈ నిర్ణ‌యాల‌న్నీ ఎంత‌గానో తోడ్ప‌డుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  ఈ విధ‌మైన ప్ర‌చార కార్య‌క్ర‌మం అమ‌లు తీరును రాగ‌ల 100 రోజుల పాటు ముమ్మ‌ర స్థాయి లో ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న  చెప్పారు.

 

 

Click here to read full text of speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Google CEO Sundar Pichai meets PM Modi at Paris AI summit:

Media Coverage

Google CEO Sundar Pichai meets PM Modi at Paris AI summit: "Discussed incredible opportunities AI will bring to India"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఫెబ్రవరి 2025
February 12, 2025

Appreciation for PM Modi’s Efforts to Improve India’s Global Standing