QuoteYoungsters are filled with energy and enthusiasm... What they need is encouragement, mentorship and institutional support: PM Modi 
QuoteIntent leads to ideas, ideas have the power to drive innovation and innovation ultimately will lead to the creation of a New India: PM Modi 
QuoteNever stop dreaming and never let the dreams die. It is good for children to have high curiosity quotient: PM 
QuoteNeed of the hour for is to innovate and come up with solutions to the problems the world faces. Innovate to transform lives of the commons: PM Modi to youngsters 
QuoteThank PM of Israel for the desalinisation motorable machine, it will benefit people in border areas: PM Modi

అహ‌మ‌దాబాద్ శివార్ల‌లో ఏర్పాటైన ఐక్రియేట్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెతన్యాహూ నేడు దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఆహార భ‌ద్ర‌త‌, నీరు, అనుసంధానం, సైబ‌ర్ సెక్యూరిటీ, ఐటీ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, శ‌క్తి, బ‌యో- మెడిక‌ల్ ఎక్విప్ మెంట్, ఇంకా ఉప‌క‌ర‌ణాల వంటి ప్ర‌ధాన అంశాల‌కు సంబంధించిన పరిష్కారాలను కనుగొనేందుకు నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, ఆస‌రాగా చేసుకొని సృజ‌నాత్మ‌క‌తను, ఇంజినీరింగ్‌ ను, ప్రోడ‌క్ట్ డిజైన్ ల‌ మేళ‌నంతో నవ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు తోడ్ప‌డాల‌నే ల‌క్ష్యంతో నెల‌కొల్పిన ఒక స్వ‌తంత్ర కేంద్ర‌మే ఐక్రియేట్‌. సిద్ధహ‌స్తులైన న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేయ‌డం కోసం భార‌త‌దేశంలో ఒక అనువైన వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి ప‌ర‌చాల‌న్న‌దే ఐక్రియేట్ ధ్యేయం.

|

వివిధ రంగాల‌లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, నూత‌న ఆవిష్కారాల‌ను కళ్లకు కట్టిన ఎగ్జిబిష‌న్ లోని వేరు వేరు స్టాల్స్ ను ఇరువురు నేత‌లు సంద‌ర్శించారు.

|

ఈ సంద‌ర్భంగా స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, భార‌త‌దేశ ప్రజలను, ఇజ్రాయ‌ల్ ప్ర‌జ‌ల‌ను మ‌రింత స‌న్నిహితంగా తీసుకురావ‌డంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ కీల‌కమైన పాత్రను పోషిస్తుంద‌న్నారు. ఇజ్రాయ‌ల్ సాంకేతిక సామ‌ర్ధ్యాన్ని, సృజ‌నాత్మ‌క‌తను యావ‌త్ ప్ర‌పంచం గ‌మ‌నించింద‌ని ఆయ‌న అన్నారు.

|

భార‌త‌దేశ యువ‌త లో శ‌క్తికి, ఉత్సాహానికి లోటు లేద‌ని ఆయ‌న అన్నారు. యువ‌త‌కు అవ‌స‌ర‌మైంద‌ల్లా కొద్దిపాటి ప్రోత్సాహ‌ం, సంస్థాప‌ర‌మైన తోడ్పాటులే అని ఆయ‌న వివ‌రించారు.

|

యావత్తు వ్యవస్థను నూతన ఆవిష్కరణలకు అనువుగా ఉండేటట్టు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. తత్ఫలితంగా ఉద్దేశం ఆలోచనలను అంకురింపచేస్తుందని, ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు దారి తీస్తాయని, నూతన ఆవిష్కరణలు ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించ‌డంలో స‌హాయ‌ప‌డతాయని ఆయన వివరించారు.

|

విజ‌యానికి ముంద‌స్తుగా కావ‌ల‌సింది ధైర్యం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఐక్రియేట్ లో కొత్త కొత్త కార్య‌క్ర‌మాల‌లో నిమ‌గ్న‌మైన సాహ‌సికులైన యువ‌త‌ను ఆయ‌న అభినందించారు.

|

కాళీదాస చెప్పిన మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెస్తూ, సంప్ర‌దాయానికి, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌కు మ‌ధ్య సందిగ్ధావ‌స్థ‌ను గురించి ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌లు నేడు ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌ను అధిగ‌మించి, సామాన్య మాన‌వుడి జీవ‌నంలో నాణ్య‌త‌ను అతి త‌క్కువ ఖ‌ర్చులో మెరుగుప‌రచేందుకు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకు రావలసిందిగా భార‌త‌దేశ యువ‌తీ యువ‌కులకు ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

|

ఆహారం, జ‌లం, ఆరోగ్యం, ఇంకా శ‌క్తి ల వంటి రంగాల‌లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కోసం భార‌త‌దేశానికి, ఇజ్రాయ‌ల్ కు మ‌ధ్య స‌హ‌కారాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావించారు. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఈ స‌హ‌కారం 21వ శ‌తాబ్దపు మాన‌వాళి చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించ‌గ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

|

 

|

 

|

 

|

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Economy delivers a strong start to the fiscal with GST, UPI touching new highs

Media Coverage

Economy delivers a strong start to the fiscal with GST, UPI touching new highs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 మే 2025
May 02, 2025

PM Modi’s Vision: Transforming India into a Global Economic and Cultural Hub