ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ప్రదర్శన శకటాల కళాకారులతో, ఆదివాసి అతిథులు, ఎన్ సిసి కాడెట్ లు, ఎన్ ఎస్ఎస్ వలంటీర్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.
తీన్‌మూర్తి భవన్ వెలుపల పచ్చిక మైదానంలో ఎన్ సిసి కాడెట్ లతో కలసి నడుస్తూ భారతదేశంలో భిన్నత్వాన్ని గురించి వారితో సంభాషించారు. ఒకరి నుండి మరొకరు నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఈ సందర్భంగా సూచించారు. మన చుట్టూ చోటుచేసుకొంటున్న మార్పులను సానుకూలంగా స్వీకరించడం ఎంత ముఖ్యమో నొక్కిపలికారు.
జాతిలో పరివర్తనాత్మక మార్పును దేశ యువత తీసుకురాగలదని ఆయన స్పష్టం చేశారు.
దేశం మన సాయుధ బలగాలను చూసి ఎంతగానో గర్వపడుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. ఇదే స్ఫూర్తితో, దేశానికి సేవలను అందిస్తున్న సాహసిక వ్యక్తులను గురించి మనం మరిన్ని విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బంది ఎంతో మంది ఉన్నారంటూ వారి త్యాగాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అలాగే పరిశుభ్రతకు గల ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. స్వచ్ఛ భారతం కోసం మహాత్మ గాంధీ కన్న కలలను నెరవేర్చడం మన కర్తవ్యం అని ఆయన చెప్పారు.
పది దేశాల అధినేతలు ఈసారి గణతంత్ర దిన వేడుకలలో మనతో భుజం భుజం కలిపి నిలచిన కారణంగా, ప్రస్తుత గణతంత్ర దినం మనకు ప్రత్యేకమైన రోజు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
Our nation is so diverse and there is so much to learn from one another: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
It is important to embrace changes happening around us. Blind faith is not proper: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
The youth of India can bring transformative changes in the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
We are immensely proud of our armed forces. In that spirit, we should seek to know more about the brave individuals who are serving the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
There are several police personnel who have given their lives for our nation, it is important to know about their sacrifices: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
It is our duty to fulfil Mahatma Gandhi's dream of a Swachh Bharat: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018
This #RepublicDay we were fortunate to have leaders of 10 nations join us for the celebrations: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 27, 2018