ప్రయాగ్‌రాజ్ లో కుంభ్ మేళా లో పాలుపంచుకొన్న 188 దేశాల ప్రతినిధుల ను సత్కరించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేశన్స్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీ లోని ప్రవాసీ భారతీయ కేంద్రం లో నేడు నిర్వహించింది.
188 మంది ప్రతినిధుల తో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ లు ఒక చరిత్రాత్మక బృంద ఛాయాచిత్రం లో పాలుపంచుకొన్నారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రయాగ్‌రాజ్ లో కుంభ మేళా నుండి కొద్ది సేపటి క్రితమే తిరిగి వచ్చిన ప్రతినిధుల తో భేటీ కావడం తనకు సంతోషం గా ఉందని పేర్కొన్నారు.
ఎవరైనా కుంభ్ మేళా ను సందర్శించనంత వరకు అది ఎంతటి ఘన వారసత్వమో సంపూర్ణం గా ప్రశంసించజాలరు అని ఆయన అన్నారు. ఈ సంప్రదాయం వేలాది సంవత్సరాల నుండి నిరంతరాయం గా కొనసాగుతోందని ఆయన చెప్పారు.
కుంభ్ అనేది ఆధ్యాత్మికత కు సంబంధించినట్లుగానేసామాజిక సంస్కరణ తో కూడా తో ముడిపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రగతి ని పర్యవేక్షించడం తో పాటు భవిష్యత్తు కు ఒక మార్గసూచి ని తయారు చేసుకోవడం కోసం ఆధ్యాత్మిక నాయకులు మరియు సామాజిక సంస్కర్తలు చర్చించుకొనే వేదిక గా కుంభ్ నిలచిందని ఆయన తెలిపారు.
కుంభ్ మేళా లో ఆధునికత ను, సాంకేతిక విజ్ఞానాన్ని విశ్వాసం తోను, అలాగే ఆధ్యాత్మికతను సాంస్కృతిక స్పృహ తోను మిళితం చేసే ప్రయాస లు జరుగుతున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశాన్ని దాని యొక్క నవీనత్వం మరియు సుసంపన్న వారసత్వం కోసం ప్రపంచం ఆదరిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచం అంతటా వివిధ దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధుల కు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క భాగస్వామ్యం కుంభ్ సాఫల్యం లో ఒక ముఖ్యమైన భాగం గా ఉందన్నారు.
భారతదేశం లో పార్లమెంటరీ ఎన్నికల ను ‘‘ప్రజాస్వామ్యం యొక్క కుంభ్’’ అంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. కుంభ్ మేళా మాదిరిగానే భారతదేశం లో పార్లమెంటరీ ఎన్నికలు, వాటి యొక్క భారీ స్థాయి తో, సంపూర్ణ నిష్పాక్షికత తో యావత్తు ప్రపంచాని కి ఒక ప్రేరణాత్మక మార్గం గా నిలువగలుగుతాయని ఆయన అన్నారు.
ప్రపంచం నలు మూల ల నుండి ప్రజలు భారతదేశాని కి తప్పక తరలి వచ్చి ఇక్కడ జరిగే పార్లమెంటరీ ఎన్నిక లను గమనించాలి అని ఆయన అన్నారు.