The Awas Yojana is not merely about brick and mortar. It is about a better quality of life and dreams coming true: PM Modi
We are working towards ensuring that every Indian has a home by 2022, when India marks 75 years since Independence: PM Modi
We have been working to free the housing sector from middlemen, corruption and ensuring that the beneficiaries get their own home without hassles: PM
The housing sector is being invigorated with latest technology. This is enabling faster construction of affordable houses for the poor in towns and villages, says PM
PMAY is linked to dignity of our citizens, says PM Modi

దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌’ ల‌బ్దిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల‌ పరంపరలో ఈ సమావేశం మూడో స‌మావేశం.

‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ ల‌బ్దిదారుల‌తో సంభాషించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తూ, ఇటువంటి ముఖాముఖి స‌మావేశాలు ఈ ప‌థ‌కం యొక్క వేరు వేరు అంశాల‌ను అర్థం చేసుకోవ‌డంతో పాటు, ఎక్క‌డెక్క‌డ మెరుగులు దిద్దాలో కూడా తెలుసుకోవ‌డానికి స‌హాయ‌కారి అవుతాయ‌న్నారు. ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ అంటే కేవ‌లం ఇటుక‌లు మరియు సున్నం కాద‌ని, మెరుగైన జీవ‌న నాణ్య‌త‌ ను అందించ‌డం, ఇంకా క‌ల‌ల‌ను పండించ‌డం కూడాను అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ల‌బ్దిదారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, అంద‌రికీ గృహ వ‌స‌తిని క‌ల్పించే దిశ‌గా గ‌త 4 సంవ‌త్స‌రాల‌లో ఒక ఉద్య‌మ స్థాయి వైఖరిని ప్ర‌భుత్వం అవలంబిస్తోందన్నారు. భార‌త‌దేశం స్వాతంత్ర్యం సముపార్జించుకొని 75 సంవ‌త్స‌రాలను ఉత్సవాలను జ‌రుపుకోనున్న 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఒక ఇంటిని క‌లిగి వుండేట‌ట్లుగా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల‌లో దాదాపు మూడు కోట్ల గృహాలను, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ఒక కోటి గృహాల‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు వేసుకొంది. ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో 47 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ళ నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇచ్చింది. ఇది మునుప‌టి ప్ర‌భుత్వం 10 సంవ‌త్స‌రాల‌లో ఇచ్చిన అనుమ‌తుల క‌న్నా నాలుగింత‌లు ఎక్కువ‌. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల‌లో మునుప‌టి ప్ర‌భుత్వం త‌న ఆఖ‌రి 4 సంవ‌త్స‌రాల‌లో 25 ల‌క్ష‌ల అనుమ‌తుల‌ను మంజూరు చేయ‌గా ఇప్ప‌టి ప్ర‌భుత్వం ఒక కోటికి పైగా గృహాల‌ నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చింది. ఒక ఇంటిని నిర్మించ‌డానికి ప‌ట్టే కాలాన్ని కూడా 18 నెల‌ల నుండి 12 నెల‌ల‌కు ప్రభుత్వం కుదించ‌గ‌లిగింది. దీనితో గృహ నిర్మాణ కాలంలో దాదాపు 6 నెల‌లు ఆదా అయింది.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం పిఎమ్ఎవై లో తీసుకు వ‌చ్చిన మార్పుల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, ఇళ్ళ యొక్క సైజు ను 20 చ‌ద‌ర‌పు మీట‌ర్ల నుండి 25 చ‌ద‌ర‌పు మీట‌ర్ల‌కు పెంచిన‌ట్లు తెలిపారు. అంతేకాక ఈ ప‌థ‌కం కోసం ఇచ్చే ఆర్థిక స‌హాయాన్ని కూడా ఇదివ‌ర‌క‌టి కేటాయింపు అయినటువంటి రూ. 70,000 – 75,000 నుండి రూ. 1,25,000 కు పెంచడమైంది.

ఈ ముఖాముఖి క్ర‌మంలో, ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ పౌరుల యొక్క గౌర‌వం తో ముడిపడివుంద‌ని, మరింత మంది మ‌హిళ‌లు, దివ్యాంగ సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులు, ఎస్‌ సి, ఎస్‌ టి, ఒబిసి, ఇంకా అల్ప‌సంఖ్యాక సముదాయాలు గృహవసతిని పొందేలా చూడడంపై ఈ పథకం శ్రద్ధ వహిస్తోందని వివ‌రించారు.

లబ్ధిదారులతో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ పిఎమ్ఎవై అంద‌రికీ ఉపాధి అవ‌కాశాల‌ను అందించిందన్నారు. ఈ పథకాన్ని పటిష్టపరచడం కోసం ఇళ్ళ నిర్మాణం నాణ్యంగాను, వేగవంతంగాను జరిగేలా చూడడం కోసం నైపుణ్యాల అభివృద్ధి దిశ‌గా ప్రభుత్వం పాటుప‌డుతోంది. ఇందులో భాగంగా, ప్ర‌భుత్వం ఒక ల‌క్ష మంది తాపీ పనివారికి శిక్ష‌ణను ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది. దీనికి తోడు, ప్ర‌భుత్వం అనేక రాష్ట్రాల‌లో మ‌హిళా తాపీ పనివారికి కూడా శిక్ష‌ణ‌ను ఆరంభించింది. దీనితో మ‌హిళ‌లకు సాధికారిత‌ ను స‌మ‌కూర్చిన‌ట్ల‌యింది.

ప్ర‌ధాన మంత్రి సమక్షంలో త‌మ అభిప్రాయాల‌ను వెల్లడి చేసిన ల‌బ్దిదారులంతా ఒక ఇంటిని సొంత చేసుకోవ‌డం అనేది ఎప్ప‌టికీ ఒక క‌లా ఉండ‌గా అది ఇప్పుడిక నెర‌వేరింది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇది వారి యొక్క జీవ‌నాన్ని ఎలా మార్చివేసిందీ, వారి జీవ‌న నాణ్య‌త‌ను ఎలా మెరుగుప‌రచిందీ కూడా వారు ప్రధాన మంత్రి కి వివ‌రించారు.

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tributes to the Former Prime Minister Dr. Manmohan Singh
December 27, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the former Prime Minister, Dr. Manmohan Singh Ji at his residence, today. "India will forever remember his contribution to our nation", Prime Minister Shri Modi remarked.

The Prime Minister posted on X:

"Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation."