భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ యార్క్ లో 20 రంగాల‌ కు చెందిన పరిశ్రమల సారథులు 42 మంది తో ప్ర‌త్యేకం గా ఏర్పాటైన రౌండ్ టేబుల్ చ‌ర్చా కార్య‌క్ర‌మాని కి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ చర్చ లో పాలు పంచుకొన్న కంపెనీ ల మొత్తం సంపత్తి 16.4 ట్రిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు కాగా ఇందులో భార‌త‌దేశం లోని ఈ కంపెనీ ల మొత్తం సంపత్తి 50 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు గా ఉంది.

స‌భికుల లో ఐబిఎమ్ చైర్ ప‌ర్స‌న్‌, ప్రెసిడెంట్‌ మరియు సిఇఒ గిన్నీ రోమెటీ, వాల్‌ మార్ట్ ప్రెసిడెంట్‌ మరియు సిఇఒ శ్రీ డ‌గ్ల‌స్ మెక్‌ మిల‌న్, కోకా-కోలా చైర్ మ‌న్‌ మరియు సిఇఒ శ్రీ జేమ్స్ క్విన్సీ, లాక్‌ హీడ్ మార్టిన్ సిఇఒ మార్లిన్‌ హ్యూస‌న్‌, జెపి మోర్గన్ చైర్ మ‌న్ మరియు సిఇఒ శ్రీ జెమీ డిమోన్, అమెరిక‌న్ ట‌వ‌ర్ కార్పొరేశన్ సిఇఒ మ‌రియు ఇండియా- యుఎస్‌ సిఇఒ ఫోర‌మ్ స‌హ అధ్య‌క్షుడు శ్రీ జేమ్స్ డి. టెస్‌ లెట్‌ ల‌తో పాటు యాపిల్‌, గూగల్, వీజ, మాస్ట‌ర్ కార్డ్‌, 3ఎమ్‌, వార్‌ బ‌ర్గ్ పిన్‌ క‌స్‌, ఎఇసిఒఎమ్‌, రేథియోన్‌, బ్యాంక్ ఆఫ్ అమెరికా, పెప్సీ వంటి కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు కూడా ఉన్నారు.

ఇన్ వెస్ట్ ఇండియా మ‌రియు డిపిఐఐటి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ముఖాముఖి చర్చ లో కేంద్ర వాణిజ్యం మరియు ప‌రిశ్ర‌మ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్, డిపార్ట్‌ మెంట్ ఆఫ్ ప్ర‌మోశన్ ఆఫ్ ఇండ‌స్ట్రీ ఎండ్ ఇంట‌ర్‌ న‌ల్ ట్రేడ్ సీనియర్ అధికారులు మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

చ‌ర్చ‌ లో పాల్గొన్న‌ వారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశ గా భార‌త‌దేశం తీసుకొన్న ప్ర‌ధానమైన చ‌ర్య‌ల ను ప్ర‌శంసించారు. ప‌లు సంస్క‌ర‌ణ‌ లు ఇన్వెస్ట‌ర్ లకు సానుకూల వాతావ‌ర‌ణాన్ని ఏర్పార‌చాయ‌ని వారు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తూ, భార‌త‌దేశాన్ని పెట్టుబ‌డుల కు మ‌రింత స్నేహ‌పూర్వ‌క‌మైనటువంటి దేశం గా రూపొందిస్తున్నందుకు ప్ర‌ధాన మంత్రి ని వ్యాపార రంగ ప్ర‌ముఖులు అభినందించారు. త‌మ కంపెనీ లు భార‌త‌దేశ వృత్తి గాథ కు తోడ్ప‌డాల‌ని కంక‌ణం క‌ట్టుకోవ‌డ‌మే కాకుండా భార‌త‌దేశం లో వాటి యొక్క పాద ముద్ర‌ ను పెంపొందించుకొనే ధ్యేయం తో కూడా ప‌ని చేస్తున్నాయ‌ని వారు వివ‌రించారు.

సిఇఒలు భార‌త‌దేశానికి సంబంధించిన వారి నిర్దిష్ట ప్ర‌ణాళిక‌ల‌ ను గురించి ఈ సంద‌ర్భం గా క్లుప్తం గా వెల్లడించారు. నైపుణ్య అభివృద్ధి, డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, సమ్మిళిత వృద్ధి, హ‌రిత శ‌క్తి మ‌రియు అన్ని వ‌ర్గాల‌ కు ఆర్థిక సేవ‌ల అంద‌జేత.. ఈ దిశ గా భార‌త‌దేశం చేస్తున్న కృషి కి దోహ‌దించే తమ సూచనల‌ను కూడా వారు ప్ర‌ధాన మంత్రి కి వివరించారు.

సిఇఒ ల వ్యాఖ్య‌ల పట్ల ప్ర‌ధాన మంత్రి ప్రతిస్పందిస్తూ రాజ‌కీయ స్థిర‌త్వం కొన‌సాగ‌డాన్ని, ముంద‌స్తు గా అంచ‌నా వేసే రీతి కి సరిపోలుతున్న విధానాల ను, అభివృద్ధి కి ఊతం ఇచ్చేట‌టువంటి మ‌రియు వృద్ధి కి తోడ్ప‌డేట‌టువంటి విధానాల‌ ను అనుస‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప‌ర్య‌ట‌క రంగ అభివృద్ధి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వ్య‌వ‌సాయ రంగం లో, ప్ర‌త్యేకించి రైతుల కోసం మ‌రిన్ని అవ‌కాశాల‌ ను క‌ల్పించేటట్టు ఎమ్ఎస్ఎమ్ఇ ల వ్యాపారాన్ని పెంపొందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. పౌష్టిక ఆహారం, వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌ ల వంటి సవాళ్లతో కూడిన అంశాల తో పాటు ఒక్క భార‌త‌దేశాని కే కాకుండా ప్ర‌పంచ దేశాల కు ఉపయోగపడే పరిష్కారాల ను అన్వేషించడం కోసం ఇత‌ర దేశాల భాగస్వామ్యం తో స్టార్ట్-అప్ ఇండియా ఇన‌వేశ‌న్ ప్లాట్ ఫార్మ్ స్ తాలూకు లాభాల ను వినియోగించుకోవ‌ల‌సింది గా కంపెనీల కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

 
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India