నీతి ఆయోగ్ భారతీయ ప్రవాసీ కేంద్రం లో ఈ రోజు నిర్వహించిన ‘‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ - ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా త్రూ జి2బి పార్ట్ నర్ షిప్’’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, యువ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సిఇఒ ల)తో సంభాషించారు. గత వారంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రధాన మంత్రి జరిపిన ముఖాముఖి సమావేశం అనంతరం, ఈ క్రమంలో ప్రధాన మంత్రి ఈ రోజు చేసిన ప్రసంగం రెండోది.
యువ సిఇఒ లతో కూడిన ఆరు బృందాలు ‘‘మేక్ ఇన్ ఇండియా’’; ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం’’; ‘‘ప్రపంచ శ్రేణి అవస్థాపన’’; ‘‘రేపటి నగరాలు’’; ‘‘ఆర్థిక రంగాన్ని సంస్కరించడం’’ ఇంకా ‘‘2022 కల్లా న్యూ ఇండియా’’ వంటి ఇతివృత్తాలపై తమ ఆలోచనలను ప్రధాన మంత్రి సమక్షంలో ఆవిష్కరించారు.
ముఖ్య కార్యనిర్వహణ అధికారులు సమర్పించిన అంశాలలో వారు చాటిన కొత్త కొత్త ఆలోచనలను, నవ కల్పనలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. దేశం బాగు కోసం సమయాన్ని వెచ్చించి విలువైన సూచనలను, సలహాలను ఇచ్చినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఆలోచనలను కీలక నిర్ణయాలు తీసుకొనే ప్రభుత్వ అధికారుల బృందం శ్రద్ధగా ఆలకించిందని, వారు నిర్ణయాలు చేసే పనిలో ఈ ఆలోచనలు తప్పక ఉపయోగపడతాయని ప్రధాన మంత్రి అన్నారు. యువ సిఇఒ ల ఆలోచనలు వారు ప్రస్తావించిన అంశాలపై సమగ్రమైనటువంటి దృష్టి కోణాన్ని కలిగివున్నాయని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రజా ప్రాతినిధ్యమనేది పాలనలో ఒక ముఖ్యమైన అంశమని ప్రధాన మంత్రి చెప్పారు. అదే విధంగా, ప్రభుత్వంతో సిఇఒ ల భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొనేందుకు చేపట్టినటువంటి ఈ ప్రయత్నం దేశ ప్రజల సంక్షేమం దిశగా వారి ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ధ్యేయంతో రూపొందిందని కూడా ఆయన అన్నారు.
భారత దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, భారతీయులందరినీ స్వాతంత్య్ర సైనికులుగా మహాత్మ గాంధీ తీర్చిదిద్దారని, వారంతా వారి సొంత పనులు చూసుకుంటూనే స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకొన్నారని శ్రీ మోదీ అన్నారు. ఆ విధంగా ఆయన స్వాతంత్య్ర పోరాటం ఓ సామూహిక ఉద్యమంగా మార్పు చెందడంలో తోడ్పడ్డారని శ్రీ మోదీ చెప్పారు.
ఇవాళ అభివృద్ధి సైతం ఒక సామూహిక ఉద్యమంగా రూపొంది తీరాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 2022 కల్లా భారతదేశానికి మనం ఏమి అందించాలో మనమంతా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఈ విధమైన ఒక స్ఫూర్తిని జాతిలో నింపాలని ఆయన అన్నారు. ‘మీరంతా నా జట్టు, మనం అందరం కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి పని చేయాల్సిన అవసరం ఉంది’ అని సిఇఒలకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
వ్యవసాయానికి విలువను జోడించే విషయాన్ని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేయడం వంటి ఆశించిన లక్ష్యాలను సాధించడం కోసం బహుముఖీన వైఖరిని అనుసరించడం అత్యవసరమని తెలిపారు. ఫూడ్ ప్రాసెసింగ్ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి నొక్కి పలుకుతూ, మౌలిక సదుపాయాలు లోపించడమనేది వ్యవసాయ రంగంలో భారీ నష్టాలకు దారి తీస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రాథమికమైన పరివర్తనను తీసుకువచ్చినటువంటి అనేక నిర్ణయాలు చేసిందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ వివరించారు. యూరియా ఉత్పత్తి మరియు లభ్యత కోసం, గ్యాస్ ప్రైస్ పూలింగ్, అధికోత్పత్తికి పారితోషికం వగైరా నిర్ణయాలను గురించి ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ చర్యలు 20 లక్షల టన్నుల యూరియాను అదనంగా ఉత్పత్తి చేయడానికి కారణమయ్యాయన్నారు. యూరియా పెద్ద ఎత్తున దారి మళ్ళుతుండటాన్ని యూరియాకు వేప పూత నిర్ణయం అరికట్టగలిగినట్లు ఆయన వివరించారు.
తక్కువ నగదును ఉపయోగించే సమాజంగా భారతదేశాన్ని మలచాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. దీనిలో జోరును పెంచేందుకు ప్రభుత్వంతో చేయి కలపవలసిందిగా సిఇఒ లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అదే మాదిరిగా, పండుగలు వంటి సందర్భాలలో కానుకలు అందించడం ద్వారా ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని, ఇది పేదలకు ఎంతో మేలు చేయగలదని ఆయన చెప్పారు. జీవితానికి సంబంధించిన ప్రతి పనిలోను పేదలను తోడు తీసుకొని సాగే పరిస్థితులను కల్పించి తీరాలని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి కావలసినవి సమకూర్చే పనిలో చిన్న వ్యాపారులు ఎలా విజయవంతంగా పోటీ పడగలుగుతున్నారో చాటి చెప్పేందుకు గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) ను ప్రధాన మంత్రి ఒక ఉదాహరణగా చెప్పారు. ఇంతవరకు GeM ద్వారా 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, ఈ ప్లాట్‌ఫామ్ కు 28,000 సరఫరాదారులు సహకరించారని ఆయన వివరించారు.
భారతీయులు వారి మాతృ దేశం పట్ల గర్వించాలని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లోపల దర్శనీయ స్థలాలకు తరచుగా వెళ్ళడాన్ని ప్రోత్సహించే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని, ఇదే సంప్రదాయాన్ని వారి వారి బంధుగణం స్వచ్ఛందంగా అనుసరించాలని ఆయన సూచించారు.
‘‘వ్యర్థం నుండి సంపద’’ను సృష్టిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గురించి ప్రధాన మంత్రి ఒక ఉదాహరణ చెబుతూ, ఇది ‘‘స్వచ్ఛ భారత్’’ ధ్యేయాలను సాధించడానికి దోహదం చేయడంతో పాటు, పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుస్తుందని చెప్పారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సులువైన సమస్యలను పరిష్కరించగలిగే ఉత్పత్తులను వారికి అందించడం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల, వ్యాపారస్తుల ధ్యేయం కావాలని ఆయన అన్నారు.
అనేక మంది కేంద్ర మంత్రులతో పాటు ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
In Government, the welfare of the people and the happiness of citizens is supreme: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
We are always thinking about where the nation will reach through our work: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
Every citizen must have a feeling that this country is mine & I have to work for the country, I want to add something towards its growth: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
Every person wanted India to be free but Gandhi ji did something unique- he made every person feel he or she is working for the nation: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
Mahatma Gandhi turned the freedom struggle into a mass movement and we saw the results: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
In the same spirit as what Mahatma Gandhi did for the freedom struggle, we need to make India's development a mass movement: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
When we work together, we can solve several problems the country faces: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
As industry leaders, think about what more you can do for the poorest of the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
There is no question of compromising on the quality of your product: PM @narendramodi to industry leaders
— PMO India (@PMOIndia) August 22, 2017
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి