వారాణసీ లో కొవిడ్ టీకామందు కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను, టీకా వేసిన వారి తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.
వారాణసీ ప్రజల కు, ఈ టీకామందు కార్యక్రమం లో పాల్గొన్న వైద్యులకు, వైద్య సిబ్బంది కి, పారా-మెడికల్ సిబ్బంది కి, ఆసుపత్రుల లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య శ్రామికుల తో పాటు కరోనా టీకామందు తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. కోవిడ్ కారణం గా ఈ సందర్భం లో ప్రజల మధ్యకు తాను రాలేకపోయినందుకు ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన టీకాకరణ కార్యక్రమం ప్రస్తుతం మన దేశం లో అమలవుతోంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఒకటో, రెండో దశల లో భాగం గా 30 కోట్ల మందికి టీకామందు ను ఇప్పించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం దేశం తన స్వంత టీకా మందును తయారు చేసుకొనే సంకల్ప శక్తి ని కలిగివుందని ఆయన అన్నారు. దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతానికి టీకా మందు శర వేగం గా చేరుకొనేటందుకు వీలు గా ప్రయత్నాలు జరిగాయి అని ఆయన అన్నారు. ప్రపంచానికి అతి పెద్ద అవసరం ఎదురైన సందర్భం లో, ఈ విషయం లో భారతదేశం పూర్తి స్వయంసమృద్ధం గా ఉంది, అంతేకాదు, అనేక దేశాల కు కూడా భారతదేశం సాయపడుతోంది అని ఆయన చెప్పారు.
వారాణసీ లో, వారాణసీ చుట్టుపక్కల ప్రాంతాల లో గత ఆరు సంవత్సరాల లో వైద్య సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన లో ఒక మార్పు చోటు చేసుకొందని, ఇది కరోనా కాలం లో యావత్తు పూర్వాంచల్ కు సహాయకారి అయిందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం లో సైతం వారాణసీ సమాన వేగాన్ని కనబరుస్తోంది అని కూడా ఆయన అన్నారు. వారాణసీ లో 20 వేల మంది కి పైగా ఆరోగ్య రంగ వృత్తి నిపుణులకు టీకామందు ను ఇప్పించడం జరుగుతుందన్నారు. దీనికోసం 15 వ్యాక్సినేశన్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏర్పాట్లను చేసినందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ని, ఆయన సహచరుల ను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు.
నేటి సంభాషణ ఉద్దేశ్యంటీకాకరణ కోసం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నదీ తెలుసుకోవడంతో పాటు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనేది అడిగి తెలుసుకోవడం కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న వారితో ఆయన మాట్లాడారు. వారాణసీ లో వ్యక్తం అయ్యే ప్రతిస్పందన లు మరెక్కడైనా గానీ ఇదే విధమైన కార్యక్రమం లో ఎదురయ్యే స్థితి ని అర్థం చేసుకోవడం లో సహాయపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి వైద్యుల తోను, ఎఎన్ఎమ్ వర్కర్ లతోను, మేట్రన్ తోను, ల్యాబ్ టెక్నీషియన్స్ తోను సంభాషించారు. వారికి దేశం పక్షాన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. మునుల వలె అంకిత భావం తో కృషి చేసినందుకు ప్రధాన మంత్రి శాస్త్రవేత్తల ను కూడా ఆయన అభినందించారు. ఒక పరిశుభ్రమైనటువంటి సంస్కృతి ని ఆవిష్కరించిన స్వచ్ఛత అభియాన్ లో చేపట్టిన చర్యల కారణం గా దేశం మహమ్మారి కి ఎదురొడ్డి నిలవడానికి మెరుగైన స్థితి కి చేరుకొందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మహమ్మారి గురించి, టీకా ను వేసే కార్యక్రమం గురించి పక్కా సమాచారాన్ని అందించే అంశం లో కరోనా వారియర్స్ పోషిస్తున్న పాత్ర కు గాను వారిని ప్రధాన మంత్రి అభినందించారు.
PM Modi applauds doctors, Medical Staff, Para-Medical Staff, sanitation workers in hospitals and everyone associated with Corona Vaccine
PM Modi complements Corona warriors for their authentic communication about the pandemic and vaccination
World's largest vaccination programme is going on in our country today: PM Modi
Login or Register to add your comment
The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.
Shri Modi said that their win will motivate upcoming athletes.
The Prime Minister posted on X:
"A phenomenal accomplishment!
Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."
A phenomenal accomplishment!
— Narendra Modi (@narendramodi) November 21, 2024
Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes.