ఆశా కార్యకర్తలకు, ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌ కు పారితోషికం లో పెంపుద‌ల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి
టెక్నాలజీ శక్తి ద్వారా, ఆశ, ఏఎన్ఎం మరియు అంగన్వాడీ కార్యకర్తల శిక్షణను సరళీకరించడం జరిగింది: ప్రధాని మోదీ
హర్యానాలోని కర్నాల్ కు చెందిన చిన్న బాలిక, కరిష్మా ఆయుష్మన్ భారత్ నుండి మొదట లబ్ది పొందారు. ఆరోగ్య రంగానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది: ప్రధాని
ఆశ, ఏఎన్ఎం మరియు అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది: ప్రధాని మోదీ ని

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎఎస్‌హెచ్ఎ (‘ఆశా’) కార్యకర్తల మ‌రియు ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల పారితోషికం లో ఒక మహత్త్వపూర్ణమైనటు వంటి పెరుగుద‌ల‌ ను ఈ రోజు ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల నుండి అమ‌లు లోకి రానున్న ఈ ప్రకటన ను నేడు ల‌క్ష‌లాది ఆశా కార్యకర్తలు, ఆంగ‌న్ వాడీ కార్యకర్తలు మ‌రియు ఎఎన్ఎమ్ కార్య‌క‌ర్త‌ల‌ తో వీడియో మాధ్య‌మం ద్వారా జ‌రిపిన ముఖాముఖి స‌మావేశ క్రమం లో వెలువ‌రించడం జరిగింది.

ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం క్రమబద్ధంగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహ‌కాల‌ను రెట్టింపు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. దీనికి తోడు ఆశా కార్య‌క‌ర్త‌లంద‌రితో పాటు వారి స‌హాయ‌కుల‌కు కూడా ‘ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న’ మ‌రియు ‘ప్రైమ్ మినిస్ట‌ర్ సుర‌క్ష బీమా యోజ‌న’ ల‌లో భాగంగా ఉచితంగా బీమా ర‌క్ష‌ణ ను స‌మ‌కూర్చ‌నున్నారు.

ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చే గౌరవ వేతనం లో చెప్పుకోద‌గ్గ పెరుగుద‌ల‌ను సైతం ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఇంత కాలం 3000 రూపాయ‌లు అందుకొంటున్న‌వారు ఇక మీద‌ట 4500 రూపాయ‌లను అందుకొంటారు. అదే విధంగా 2200 రూపాయ‌లు అందుకొంటున్న‌ వారు ఇక‌ పై 3500 రూపాయ‌లను అందుకోనున్నారు. ఆంగ‌న్ వాడీ స‌హాయ‌కుల‌ గౌర‌వ భృతి ని కూడా 1500 రూపాయ‌ల నుండి 2250 రూపాయ‌ల‌కు పెంచ‌డ‌మైంది.

కామ‌న్ అప్లికేష‌న్ సాఫ్ట్ వేర్ (ఐసిడిఎస్-సిఎఎస్) వంటి టెక్నిక్ ల‌ను వినియోగించుకొంటున్న ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు మ‌రియు స‌హాయ‌కులు సైతం అద‌న‌పు ప్రోత్సాహ‌కాల‌ను పొందుతార‌ంటూ ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టన చేశారు. ప‌నితీరు ఆధారంగా ప్రోత్సాహ‌కాలు 250 రూపాయ‌లు మొద‌లుకొని 500 రూపాయ‌ల మధ్య ఉండబోతున్నాయి.

మూడు ‘ఎ’ బృందాలు – ఆశా కార్య‌క‌ర్త‌లు, ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు మ‌రియు ఎఎన్ఎమ్ – లతో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి సంభాషించారు. వారు ఆరోగ్యం, ఇంకా పోష‌కాహారం సంబంధిత సేవ‌ల‌ను మెరుగు ప‌ర‌చ‌డం కోసం మ‌రియు దేశం లో ఆహార లోపం వల్ల శుష్కించే ధోరణులను త‌గ్గించాల‌న్న ‘పోష‌ణ్ అభియాన్’ యొక్క ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం కొత్త కొత్త సాధనాలను, సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకొంటూ క‌ల‌సిక‌ట్టుగా ప‌రిశ్ర‌మిస్తున్నందుకు వారిని ఆయ‌న ప్రశంసించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy

Media Coverage

From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 డిసెంబర్ 2024
December 31, 2024

India in 2024 – Citizens Appreciate PM Modis efforts to ensure Viksit Bharat