ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లఖ్ నవూ ను సందర్శించారు. మొత్తం 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి తో కూడిన 81 ప్రాజెక్టులకు జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
రాష్ట్రం లోకి పెట్టుబడులను ఆకర్షించే, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ను ప్రోత్సహించే ప్రయాస లలో భాగంగా 2018 ఫిబ్రవరి లో నిర్వహించిన యుపి ఇన్వెస్టర్స్ సమిట్ ముగిసిన కొద్ది నెలల లోపే ఈ ప్రాజెక్టు లు కార్యరూపం దాల్చాయి.
దేశం లోని కొన్ని ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పరిస్థితి ని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలకు సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి పని చేస్తోందని ఆయన అన్నారు.
శ్రద్ధ వహిస్తున్నటువంటి ఒక ప్రభుత్వంగా ప్రజల జీవితాలలో ఇక్కట్లను బాపడం తో పాటు ప్రజా జీవనంలో సరళత్వాన్ని తీసుకొని రావడమే సర్కారు ధ్యేయమని ఆయన చెప్పారు. ఈ రోజు ఇక్కడికి తరలివచ్చిన జన సందోహం రాష్ట్రం లో పరివర్తనను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఓ భాగం అని ఆయన అన్నారు. అయిదు నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయి నుండి భూమి పూజ దశ కు వేగంగా చేరుకొన్న తీరు అసాధారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్య సాధనకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రం లోని ఏ కొద్ది ప్రాంతాలకో పరిమితం కాదని, సమతుల్య అభివృద్ధి కి ఇవి దోహదం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పని సంస్కృతి ని అనుసరిస్తోందని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం లో మారినటువంటి పెట్టుబడి సంబంధిత వాతావరణం ఉద్యోగాలకు, వ్యాపారానికి, మంచి రహదారులకు, చాలినంత స్థాయిలో విద్యుత్తు సరఫరాకు మరియు ఉజ్వల భవిత కు అవకాశాలను కల్పిస్తోందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులు అనేక నూతన ఉపాధి అవకాశాలను సమకూర్చుతాయని, మరి సమాజంలో వివిధ వర్గాల వారికి ప్రయోజనాన్ని చేకూర్చుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తదితర ప్రధాన కార్యక్రమాలకు ఒక పెద్ద ఉత్తేజం అందుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో విస్తరించిన మూడు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ లు సమర్ధమైన మరియు పారదర్శకమైన సేవలను అందిస్తూ పల్లెలలో జీవన సరళిని మార్చివేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
అధికార యంత్రాంగంలో గిరి గీసుకొని పని చేసే ధోరణి కి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోందని, పరిష్కార మార్గాలపైన శ్రద్ధను వహిస్తూ అనుసంధానిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రపంచం లో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ల ఉత్పత్తిదారుగా భారతదేశం ఎదిగిందని, మరి ఈ తయారీ రంగ విప్లవానికి ఉత్తర్ ప్రదేశ్ నాయకత్వం వహిస్తోందని ఆయన అన్నారు.
అవస్థాపన ప్రాజెక్టులు పూర్తి అయ్యే కొద్దీ, భారతదేశం లో వ్యాపారం చేయడం మరింత సులభతరంగా మారగలదని, రవాణా పై పెట్టే వ్యయం తగ్గగలదని ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు. డిజిటల్ లావాదేవీల దిశగా పయనించాలంటూ వ్యాపారస్తులకు, నవ పారిశ్రామికవేత్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో విద్యుత్తు సరఫరా ను మెరుగుపరచడం కోసం తీసుకున్న చర్యలను ప్రధాన మంత్రి ఏకరువు పెట్టారు. దేశం సాంప్రదాయక శక్తి నుండి హరిత శక్తి వైపునకు ప్రయాణిస్తోందని, మరి ఉత్తర్ ప్రదేశ్ సౌర శక్తి కి ఒక నిలయంగా రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. భారతదేశం లో శక్తి లోటు 2013-14 లో 4.2 శాతం ఉన్నది కాస్తా ప్రస్తుతం ఒక శాతం కన్నా తక్కువకు క్షీణించిందని ఆయన వెల్లడించారు.
ప్రజల ఆకాంక్షల ను ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం చేయడం ‘న్యూ ఇండియా’ కు మార్గ సూచీ అని ప్రధాన మంత్రి అన్నారు.
पांच महीने में ये दूसरी बार है जब उद्योग जगत से जुड़े साथियों के साथ मैं यहां लखनऊ में मिल रहा हूं।
— PMO India (@PMOIndia) July 29, 2018
इससे पहले फरवरी में यूपी इन्वेस्टर्स समिट के लिए भी आप आए थे।
मुझे प्रसन्नता है कि उस संकल्प को ज़मीन पर उतारने की कड़ी में आज बड़ा कदम उठ रहा है: PM
कुछ लोग इसे Ground Breaking सेरेमनी कह रहे हैं,
— PMO India (@PMOIndia) July 29, 2018
लेकिन मैं इसे Record Breaking सेरेमनी कहूंगा।
इतने कम समय में जिस प्रकार प्रक्रियाओं को तेज़ी से आगे बढ़ाया गया है,
पुराने तौर तरीकों को बदला गया है, ऐसा उत्तर प्रदेश में देखने को नहीं मिलता था: PM
मुझे खुशी है कि योगी जी के नेतृत्व में सरकार ने निवेशकों से संवाद बनाए रखा और
— PMO India (@PMOIndia) July 29, 2018
Intent को Investment में बदलने के लिए माहौल तैयार किया
Online MoU ट्रैकर हो या क्लीयरेंस के लिए निवेश मित्र जैसा डिजिटल प्लेटफॉर्म,
ये यूपी में बिजनेस के लिए बने अनुकूल वातावरण को दर्शाता है: PM
मैंने यूपी की 22 करोड़ जनता को वचन दिया था कि उनके प्यार को ब्याज़ समेत लौटाउंगा
— PMO India (@PMOIndia) July 29, 2018
यहां जो परियोजनाएं शुरु हो रही हैं वो उसी वचनबद्धता का हिस्सा हैं
ये प्रोजेक्ट्स उत्तर प्रदेश में आर्थिक और औद्योगिक असंतुलन को दूर करने में भी सहायक होंगे: PM
ये प्रोजेक्ट्स Digital India और Make in India को नया आयाम देने की दिशा में बहुत बड़े कदम सिद्ध होने वाले हैं
— PMO India (@PMOIndia) July 29, 2018
उत्तर प्रदेश में इंटरनेट सर्विस पहुंचाने के लिए फाईबर बिछाना हो या फिर
IT सेंटर स्थापित करना
डिजिटल इंफ्रास्ट्रक्चर यूपी के विकास को नई गति, नई दिशा देने वाला है: PM
एक ऐसी व्यवस्था खड़ी करना चाहते हैं जहां किसी प्रकार के भेदभाव की गुंजाइश ना हो,
— PMO India (@PMOIndia) July 29, 2018
प्रक्रियाओं में गति भी दिखे और संवेदनशीलता भी,
ना अपना,
ना पराया,
ना छोटा,
ना बड़ा,
सबके साथ समान व्यवहार।
यानि कुल मिलाकर सबका साथ, सबका विकास: PM
आज देश दुनिया के लिए Mobile Manufacturing का हब बनता जा रहा है
— PMO India (@PMOIndia) July 29, 2018
इस Manufacturing Revolution की अगुवाई उत्तर प्रदेश कर रहा है
यूपी में 50 से अधिक मोबाइल फोन बनाने वाली फैक्ट्रियां काम कर रही हैं
दुनिया की सबसे बड़ी Manufacturing Unit की भी शुरुआत यहां हो चुकी है: PM
सरकार Holistic vision, Inclusive Action की अप्रोच पर काम कर रही है।
— PMO India (@PMOIndia) July 29, 2018
यहां मौजूद आप सभी को और तमाम निवेशकों को भरोसा दिलाना चाहता हूं कि अभी तो ये शुरुआत है।
आप राष्ट्र निर्माण की एक महत्वपूर्ण इकाई हैं और आपके संकल्प, देश के करोड़ों नौजवानों को सपनों से भी जुड़े हुए हैं: PM
बिजली के क्षेत्र में जो भी Reforms किए गए हैं, उनसे देश और देश के सामान्य जन के हज़ारों करोड़ रुपयों की बचत हुई है।
— PMO India (@PMOIndia) July 29, 2018
उदय योजना ने डिस्ट्रिब्यूशन कंपनियों को नई लाइफलाइन दी है।
उजाला के LED बल्ब लगाए गए उससे 3 वर्षों के दौरान बिजली के बिल में करीब 50,000 करोड़ की बचत हुई है: PM
देश के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी कहते रहे हैं कि वो ऐसा भारत देखना चाहते हैं जो समृद्ध हो, सक्षम हो और संवेदनशील हो।
— PMO India (@PMOIndia) July 29, 2018
जहां गांव और शहरों के बीच खाई ना हो।
जहां केंद्र और राज्य में,
श्रम और पूंजी में,
प्रशासन और नागरिक में Gap ना हो: PM