Quoteఉత్తరప్రదేశ్లో మొత్తం 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 81 ప్రాజెక్టుల ప్రారంభకార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
Quoteప్రజల జీవితాల్లో ఇబ్బందులను తగ్గించడం, జీవన మెరుగుదలను మెరుగుపర్చడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ
Quoteఉత్తరప్రదేశ్లో ఐదు నెలల వ్యవధిలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వేగంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు అత్యుత్తమమైనవి: ప్రధాని మోదీ
Quoteపెట్టుబడుల ప్రాజెక్టులు అనేక కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయి మరియు సమాజంలో వివిధ విభాగాలకు లాభం చేకూరుస్తాయి: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ల‌ఖ్ న‌వూ ను సంద‌ర్శించారు.  మొత్తం 60,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి తో కూడిన 81 ప్రాజెక్టుల‌కు జ‌రిగిన భూమి పూజ కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు.

రాష్ట్రం లోకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే, రాష్ట్రంలో పారిశ్రామికీక‌ర‌ణ ను ప్రోత్స‌హించే  ప్ర‌యాస లలో భాగంగా 2018 ఫిబ్ర‌వ‌రి లో నిర్వ‌హించిన యుపి ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ ముగిసిన కొద్ది నెల‌ల లోపే ఈ ప్రాజెక్టు లు కార్య‌రూపం దాల్చాయి. 

|

దేశం లోని కొన్ని ప్రాంతాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాలను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ప‌రిస్థితి ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, బాధిత ప్ర‌జ‌ల‌కు స‌హాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ తో క‌ల‌సి ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

శ్ర‌ద్ధ వ‌హిస్తున్న‌టువంటి ఒక ప్ర‌భుత్వంగా ప్ర‌జ‌ల జీవితాల‌లో ఇక్క‌ట్ల‌ను బాప‌డ‌ం తో పాటు ప్ర‌జా జీవ‌నంలో స‌ర‌ళ‌త్వాన్ని తీసుకొని రావ‌డమే స‌ర్కారు ధ్యేయమని ఆయ‌న చెప్పారు.  ఈ రోజు ఇక్క‌డికి త‌ర‌లివ‌చ్చిన జ‌న సందోహం రాష్ట్రం లో ప‌రివ‌ర్త‌న‌ను తీసుకురావ‌డానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌లో ఓ భాగ‌ం అని ఆయ‌న అన్నారు.  అయిదు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ప్రాజెక్టులు ప్ర‌తిపాద‌న స్థాయి నుండి భూమి పూజ ద‌శ కు వేగంగా చేరుకొన్న తీరు అసాధార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

|

ఈ కార్య సాధ‌న‌కు గాను రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు.  ఈ ప్రాజెక్టులు రాష్ట్రం లోని ఏ కొద్ది ప్రాంతాల‌కో ప‌రిమితం కాదని, స‌మ‌తుల్య అభివృద్ధి కి ఇవి దోహ‌దం చేస్తాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక కొత్త ప‌ని సంస్కృతి ని అనుస‌రిస్తోందని ఆయ‌న ప్ర‌శంసించారు.  రాష్ట్రం లో మారిన‌టువంటి పెట్టుబ‌డి సంబంధిత వాతావ‌ర‌ణం ఉద్యోగాలకు, వ్యాపారానికి, మంచి ర‌హ‌దారుల‌కు, చాలినంత స్థాయిలో విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు మ‌రియు ఉజ్వల భ‌విత‌ కు అవకాశాలను కల్పిస్తోంద‌ని ఆయ‌న వివరించారు.  ఈ ప్రాజెక్టులు అనేక నూత‌న ఉపాధి అవ‌కాశాల‌ను స‌మ‌కూర్చుతాయ‌ని, మ‌రి స‌మాజంలో వివిధ వ‌ర్గాల వారికి ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చుతాయ‌ని ఆయ‌న తెలిపారు.  ఈ ప్రాజెక్టుల ద్వారా డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా త‌దిత‌ర ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలకు ఒక పెద్ద ఉత్తేజం అందుతుందని ఆయ‌న వివ‌రించారు.

|

ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల‌లో విస్త‌రించిన‌ మూడు ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ లు స‌మ‌ర్ధ‌మైన మ‌రియు పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల‌ను అందిస్తూ ప‌ల్లెల‌లో జీవ‌న‌ స‌ర‌ళిని మార్చివేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అధికార యంత్రాంగంలో గిరి గీసుకొని ప‌ని చేసే ధోర‌ణి కి కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌లుకుతోందని, ప‌రిష్కార మార్గాలపైన శ్రద్ధను వహిస్తూ అనుసంధానిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ప్ర‌పంచం లో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ల ఉత్ప‌త్తిదారుగా భార‌త‌దేశం ఎదిగింద‌ని, మ‌రి ఈ త‌యారీ రంగ విప్ల‌వానికి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నాయ‌క‌త్వం వ‌హిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

|

అవ‌స్థాప‌న ప్రాజెక్టులు పూర్తి అయ్యే కొద్దీ, భార‌త‌దేశం లో వ్యాపారం చేయ‌డం మ‌రింత సుల‌భ‌త‌రంగా మార‌గ‌ల‌ద‌ని, ర‌వాణా పై పెట్టే వ్య‌యం త‌గ్గగలదని ప్ర‌ధాన మంత్రి చెప్పుకొచ్చారు.  డిజిట‌ల్ లావాదేవీల దిశ‌గా ప‌య‌నించాల‌ంటూ వ్యాపార‌స్తుల‌కు, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

దేశంలో విద్యుత్తు స‌ర‌ఫ‌రా ను మెరుగుప‌ర‌చ‌డం కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ఏక‌రువు పెట్టారు.  దేశం సాంప్ర‌దాయ‌క శ‌క్తి నుండి హ‌రిత శ‌క్తి వైపునకు ప్ర‌యాణిస్తోంద‌ని, మ‌రి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సౌర‌ శ‌క్తి కి ఒక నిల‌యంగా రూపుదిద్దుకోనుంద‌ని ఆయ‌న తెలిపారు.  భార‌త‌దేశం లో శ‌క్తి లోటు 2013-14 లో 4.2 శాతం ఉన్న‌ది కాస్తా ప్ర‌స్తుతం ఒక శాతం క‌న్నా త‌క్కువ‌కు క్షీణించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

|

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ను ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే సాకారం చేయ‌డ‌ం ‘న్యూ ఇండియా’ కు మార్గ సూచీ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.   

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
FY25 India pharma exports cross $30 billion, surge 31% in March

Media Coverage

FY25 India pharma exports cross $30 billion, surge 31% in March
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఏప్రిల్ 2025
April 18, 2025

Aatmanirbhar Bharat: PM Modi’s Vision Powers India’s Self-Reliant Future