మన ప్రభుత్వం నీటి సంరక్షణను దాని ప్రధమ ప్రాధాన్యతలలో ఒకటిగా మార్చింది మరియు ప్రతి ఇంటికి నీటి సరఫరాను నిర్ధారించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము: ప్రధాని మోదీ
ఈ రోజు జార్ఖండ్‌లో ప్రారంభించిన మరియు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ దేశ అభివృద్ధి పట్ల మనకున్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి: ప్రధాని మోదీ
ఈ ప్రభుత్వం 100 రోజుల్లోపు మన ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను బలోపేతం చేసినప్పుడు ఉగ్రవాదంపై పోరాడటంలో దేశం మొత్తం మన ధృడ నిశ్చయానికి సాక్ష్యమిచ్చింది: ప్రధానిమోదీ

రైతుల జీవనాని కి భ‌ద్ర‌త ను క‌ల్పించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాజ‌ధాని రాంచీ లో ప్ర‌ధాన మంత్రి కిసాన్ మాన్ ధ‌న్ యోజ‌న ను ఈ రోజు న ప్రారంభించారు. 5 కోట్ల మంది చిన్న రైతులు మ‌రియు నామమాత్ర రైతు లకు ఈ ప‌థ‌కం ద్వారా జీవనం సురక్షితం కాగలదు. వారి కి 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పూర్తి కావడం తోనే కనీసం 3,000 రూపాయ‌ల వంతున ప్ర‌తి నెలా పింఛ‌ను ను క‌ల్పించడం జరుగుతుంది.

వ్యాపారులు మ‌రియు స్వ‌తంత్రోపాధి  క‌లిగిన‌ వ్యక్తుల కోసం జాతీయ పెన్శ‌న్ ప‌థ‌కాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం ఏమిటి అంటే 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చిన తరువాత చిన్న వ్యాపారులు మ‌రియు స్వ‌తంత్రోపాధి క‌లిగిన‌ వ్యక్తుల కు కనీసం 3,000 రూపాయ‌ల వంతున ప్రతి నెలా పింఛ‌ను ను ఇవ్వడం జరుగుతుంది.

ఈ ప‌థ‌కం ద్వారా దాదాపు గా 3 కోట్ల మంది చిన్న వ్యాపారులు లబ్ధి ని పొందుతారు.

ఇది మీరు పెట్టుకొన్న ఆశ‌ల ను నెర‌వేర్చే ఒక బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఇచ్చినటువంటి ఎన్నిక‌ల వాగ్ధానాన్ని నెర‌వేర్చ‌డం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

నేను ‘‘నూత‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత దేశం లోని ప్ర‌తి ఒక్క రైతు కుటుంబం పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి తాలూకు ల‌బ్ధి ని పొందుతుంది’’ అని చెప్పాను.  ఈ రోజు న దేశం లో ఆరున్న‌ర కోట్ల రైతు కుటుంబాల ఖాతా లలో 21,000 కోట్ల కు పైగా రాశి ని జ‌మ చేయ‌డమైంది.  ఝార్‌ ఖండ్ లో ఇటువంటి 8 ల‌క్ష‌ల మంది రైతు కుటుంబాల ఖాతాల లో 250 కోట్ల రూపాయ‌లు జ‌మ అయ్యాయి.’’

‘‘మా ప్ర‌భుత్వం భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి సామాజిక భ‌ద్ర‌త క‌వ‌చాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.’’  

‘‘ఆప‌న్నుల కు ప్ర‌భుత్వం సహ‌చ‌రుని వ‌లె అండ గా నిలబడుతోంది.  ఈ సంవ‌త్స‌రం లో మార్చి నెల నుండి దేశం లో కోట్లాది అవ్య‌వ‌స్థీకృత రంగ శ్రామికుల కోసం ఇదే తరహా పెన్శ‌న్ ప‌థ‌కం అమ‌ల‌వుతున్నది.’’

‘‘శ్ర‌మ‌యోగి మాన్ ధ‌న్ యోజ‌న లో 32 ల‌క్ష‌ల మంది కి పైగా శ్రామికులు చేరారు.  ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి యోజ‌న‌ లోను, ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న లోను 22 కోట్ల మంది కి పైగా చేరారు.  వారి లో 30 ల‌క్ష‌ల మంది కి పైగా ల‌బ్ధిదారులు ఒక్క ఝార్‌ఖండ్ నుండే ఉన్నారు.  ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న లో కూడా దాదాపు గా 44 ల‌క్ష‌ల మంది పేద రోగులు ల‌బ్ధి ని పొందారు.  వారి లో సుమారు 3 ల‌క్ష‌ల మంది ఝార్‌ఖండ్ కు చెందిన వారే.’’

అంద‌రికీ సాధికారిత ను క‌ల్పించే క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి దేశం లోని ఆదివాసీ జ‌న బాహుళ్య ప్రాంతాల లో 462 ఏక‌ల‌వ్య మోడల్ స్కూల్స్ ను ఈ రోజున ప్రారంభించారు.  ఈ పాఠ‌శాల ల్లో ఆయా ప్రాంతాల ఎస్‌టి విద్యార్థుల కు నాణ్య‌మైన ప్రాథ‌మికోన్న‌త విద్య, మాధ్య‌మిక విద్య మ‌రియు సీనియ‌ర్ సెకండ‌రీ స్థాయి విద్య ను బోధించ‌డం పై శ్ర‌ద్ధ వ‌హించడం జరుగుతుంది.

‘‘ఈ ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌ లు ఆదివాసీ చిన్నారుల కు కేవలం విద్యా బోధ‌న మాధ్య‌మం గా ఉప‌యోగ‌ప‌డ‌టమే కాక, క్రీడ‌ల కోసం ఉద్దేశించిన స‌దుపాయాల తో పాటు స్థానిక క‌ళ‌లు, సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ  మ‌రియు నైపుణ్యాభివృద్ధి సంబంధిత స‌దుపాయాలు కూడా ఈ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.  ఈ పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి ఒక్క ఆదివాసీ విద్యార్థి మీద ప్ర‌భుత్వం ఒక సంవ‌త్స‌రం లో ఒక ల‌క్ష రూపాయ‌ల కు మించి వెచ్చిస్తుంది.’’

సాహిబ్‌గంజ్ లో మ‌ల్టి-మోడ‌ల్ ట్రాన్స్‌పోర్ట్ ట‌ర్మిన‌ల్ ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.  

‘‘సాహిబ్‌గంజ్ లో మ‌ల్టి-మోడ‌ల్ ట్రాన్స్‌పోర్ట్ ట‌ర్మిన‌ల్ ను ప్రారంభించే భాగ్యం కూడా ఈ రోజు న నాకు ద‌క్కింది.  ఇది మ‌రొక ప‌థ‌కం మాత్రమే కాదు, ఇది ఈ ప్రాంతం అంత‌టి కీ ఒక నూత‌న ర‌వాణా ఐచ్ఛికం గా కూడా ఉంటుంది.  ఈ జ‌ల మార్గం ఝార్‌ఖండ్ ను యావ‌త్తు దేశం తో సంధానించడమే కాక విదేశాల తో కూడా జోడిస్తుంది.  ఈ ట‌ర్మిన‌ల్ నుండి ఇక్క‌డి ఆదివాసీ సోద‌రీమ‌ణులు ఆదివాసీ సోద‌రులు మ‌రియు రైతులు వారి ఉత్ప‌త్తుల ను ఇక మీద‌ట దేశం లోని ఇతర విపణుల కు ఇట్టే చేర‌వేయ‌గ‌లుగుతారు’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ప్ర‌ధాన మంత్రి ఝార్‌ఖండ్ యొక్క నూతన విధాన స‌భ భవ‌నాన్ని సైతం ప్రారంభించారు.

‘‘రాష్ట్రం ఆవిర్భ‌వించి సుమారు రెండు ద‌శాబ్దాలు గ‌డచిన అనంత‌రం నేడు ఝార్‌ ఖండ్ లో ప్ర‌జాస్వామ్య దేవాల‌యం ప్రారంభానికి నోచుకొంది.  ఈ భ‌వ‌నం ఝార్‌ఖండ్ ప్ర‌జ‌ల సువ‌ర్ణ‌ భ‌విత కు పునాది ని వేయ‌డం మాత్రమే కాక వర్తమాన తరాల మరియు భావి త‌రాల స్వ‌ప్నాల ను నెర‌వేర్చేది గా కూడా ఉంటుంది’’ అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

స‌చివాల‌యం తాలూకు నూత‌న భ‌వ‌నాని కి కూడాను ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఒక‌ సారి వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించాల‌ని దేశ ప్ర‌జ‌ల కు పిలుపునిచ్చారు.

2019వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 11వ తేదీ న ప్రారంభమైన స్వ‌చ్ఛ‌తా హీ సేవా కార్య‌క్ర‌మాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘దేశం లో స్వ‌చ్ఛ‌తా హీ సేవా  ప్ర‌చార ఉద్య‌మం నిన్న‌టి నుండి ఆరంభ‌ం అయింది.  ఈ ప్ర‌చార ఉద్య‌మం లో భాగం గా అక్టోబ‌రు 2వ తేదీ క‌ల్లా మ‌నం మ‌న ఇళ్ళు, పాఠ‌శాల‌లు, కార్యాల‌యాల‌ లో ఒక‌సారి వాడిన ప్లాస్టిక్ ను సేక‌రించ‌వ‌ల‌సివుంది.  అక్టోబ‌రు 2వ తేదీ కల్లా- ఏ రోజున అయితే గాంధీ జీ 150వ జ‌యంతి వ‌స్తోందో- అప్ప‌టిక‌ల్లా మ‌నం ప్లాస్టిక్ కుప్ప ను నిర్మూలించవలసివుంది’’ అన్నారు.  

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi