ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు (జూలై 14,2018) వారణాసిలో సుమారు 900 కోట్ల రూపాయల విలువగల పలు ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులలో వారణాసి సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు, వారణాసి- బాలియా మెమూ రైలు ప్రాజెక్టు ఉన్నాయి.శంకుస్థాపన చేసిన వాటిలో పంచకోషి పరిక్రమ మార్గ్ , స్మార్ట్‌సిటీ మిషన్, నమామి గంగే పథకం కింద చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వారణాసిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌కు కూడా ప్రధానమంత్ర శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని, ముందుగా యువ క్రీడాకారిణి హిమాదాస్ , అండర్ 20,వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
కాశీ ప్రాచీన గుర్తింపునకు ఏమాత్రం భంగకరం కాని రీతిలో ,21 శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాశీని అభివృద్ధి చేయడానికి గత నాలుగు సంవత్సరాలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఆథ్యాత్మికత, ఆధునికతల మేళవింపుతో నూతన బనారస్‌ను నూతన భారతావనికోసం అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ నూతన బనారస్ ప్రస్తుతం చుట్టూరా కంటికి కనిపిస్తోందని ఆయన అన్నారు.గత నాలుగు సంవత్సరాల కాలంలో వారణాసి అభివృద్ధికి చెప్పుకోదగిన స్థాయిలో ఖర్చుపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. సుమారు 1000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడమో లేక శంకుస్థాపన చేయడమో జరిగిందని, ఇది వారణాసి అభివృద్ధికి కొనసాగుతున్నప్రక్రియలో భాగంగా చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు.
రవాణా రంగం అభివృద్ధి ద్వారా మార్పునకు సంబంధించిన దార్శనికత గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈరోజు అజాంఘడ్ వద్ద శంకుస్థాపన చేసిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు ఈ దర్యలలో భాగమేనని ఆయన అన్నారు.
వారణాసి ఈ ప్రాంతంలో మెడికల్ సైన్స్ కు కేంద్రంగా అవతరిస్తోందని ఆయన చెప్పారు. బి.హెచ్.యు ఎయిమ్స్‌తో కలిసి ప్రపంచ ప్రమాణాలు కలిగిన హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు ప్రధాని చెప్పారు.
వారణాసి, ఈ ప్రాంతంలో మెరుగైన అనుసంధానతకు చేపట్టిన చర్యల గురించి ప్రధాని వివరించారు. కాశీ ప్రధానమైన అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటున్నదని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈరోజు శంకుస్థాపన చేసిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ గురించి ఆయన ప్రస్తావించారు. వారణాసి ప్రజలకు బహుమతిగా దీనిని సమకూరుస్తున్న జపాన్ ప్రధానమంత్రి షింజో అబేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక రంగం, స్వచ్చభారత్ అభియాన్‌కు సంబంధించి ప్రజలు, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. నాలుగు సంవత్సరాల క్రితం వారణాసిలో రోడ్లు, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేవి కావని ఆయన అన్నారు. వారణాసి నగరం నుంచి వచ్చే వ్యర్థాలు గంగా నదిలో కలిసేవని అన్నారు. కాని నేడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని, గంగానదిని గంగోత్రినుంచి, అది సముద్రంలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గంగా ప్రక్షాళనకు మురుగునీటి శుద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ఆయన వివరించారు. భవిష్యత్తులో ఈచర్యలు సత్ఫలితాలనివ్వనున్నాయని ఆయన చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాంండ్ , కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటుకు పనులు వరవేగంతో జరుగుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. అది వారణాసిని స్మార్ట్ సిటీగా చేస్తుందన్నారు.
స్మార్ట్ సిటీల అభివృద్ధికి సంబంధించిన చర్యలు కేవలం ఆయా నగరాలలో మౌలిక సదుపాయాల అబివృద్ధికి సంబంధించినవి మాత్రమే కావని, ఇవి భారతదేశానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టేవని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కల్పించినందుకు అభినందనలు తెలిపారు. వీటికి సంబంధించిన ఫలితాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఇటీవల నోయిడాలో ప్రారంభమైన శాంసంగ్ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. మొబైల్ తయారీ యూనిట్లు లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు.
వారణాసి నగర గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, వారణాసిలోని 8000 ఇళ్లకు పైపు ద్వారా వంట గ్యాస్ అందుతోందని చెప్పారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థకు సిఎన్‌జి వాడకం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.
వారణాసి నగరం జపాన్ ప్రధానమంత్రి షింజో అబేకు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు ఎలా స్వాగతం పలికిందో ప్రధాని ఒకసారి గుర్తుచేశారు. ఆతిథ్యానికి సంబంధించి తన గొప్పతనాన్నిప్రదర్శించే మరో అవకాశం, 2019 జనవరిలో జరగనున్న ప్రవాసి భారతీయ దివస్ రూపంలో త్వరలోనే ఈ నగరానికి రానున్నదని ఆయన అన్నారు.
New India के लिए एक नए बनारस का निर्माण हो रहा है, जिसकी आत्मा तो पुरातन ही होगी लेकिन काया नवीनतम।
— PMO India (@PMOIndia) July 14, 2018
जिसमें आध्यात्म भी होगा और आधुनिकता भी।
जहां के कण-कण में संस्कृति और संस्कार होंगे लेकिन व्यवस्थाएं स्मार्ट होगी।
बदलते हुए बनारस की ये तस्वीर अब चौतरफा दिखने लगी है: PM
सभास्थल के पास ही पेरिशेबल कार्गो केंद्र है जो अब बनकर तैयार है
— PMO India (@PMOIndia) July 14, 2018
इसका शिलान्यास भी मेरे द्वारा किया गया था और लोकार्पण का सौभाग्य भी मुझे मिला है
ये कार्गो सेंटर यहां के किसानों के लिए बड़ा वरदान साबित होने वाला है
अब फल-सब्जियों के सड़ने-गलने से नुकसान नहीं उठाना पड़ेगा: PM
देश और दुनिया से भोले के जो भक्त यहां काशी आते हैं उनको असुविधा ना हो इसकी व्यवस्था की जा रही है
— PMO India (@PMOIndia) July 14, 2018
आस्था और सांस्कृतिक महत्व के जितने भी स्थान काशी में हैं, उनको जोड़ने वाली दो दर्जन सड़कों को या तो सुधारा गया है या फिर नए सिरे से निर्माण किया गया है: PM
काशी की महानता, उसकी ऐतिहासिकता को बनाए रखने के लिए आप जो कर रहे हैं, वो अतुलनीय है
— PMO India (@PMOIndia) July 14, 2018
लेकिन हमें चार वर्ष पहले का वो समय भी नहीं भूलना चाहिए, जब वाराणसी की व्यवस्थाएं संकट में थीं
हर तरफ कचरा-गंदगी, खराब सड़कें, ओवरफ्लो होता सीवर, खंबों से लटकते तार, जाम से परेशान पूरा शहर: PM
बनारस ही नहीं बल्कि गंगोत्री से लेकर गंगा सागर तक एक साथ प्रयास चल रहे हैं।
— PMO India (@PMOIndia) July 14, 2018
सिर्फ साफ सफाई ही नहीं, बल्कि शहरों की गंदगी गंगा में ना गिरे इसका भी प्रबंध किया जा रहा है।
इसके लिए अब तक लगभग 21 हजार करोड़ की 200 से अधिक परियोजनाओं को स्वीकृति दी जा चुकी है: PM
ये जो भी काम आज हो रहा है वो बनारस को Smart City में बदलने वाला है।
— PMO India (@PMOIndia) July 14, 2018
यहां Integrated Command और Control Centre पर तेज़ी से काम चल रहा है।
पूरे शहर के प्रशासन का, पब्लिक सुविधाओं का नियंत्रण यहीं से होने वाला है। ऐसे लगभग 10 प्रोजेक्ट्स पर आज काम चल रहा है: PM
Make in India के साथ-साथ Digital India भी रोज़गार का प्रभावी माध्यम सिद्ध हो रहा है।
— PMO India (@PMOIndia) July 14, 2018
इसी कड़ी में आज यहां पर TCS के BPO की शुरुआत हुई है।
ये केंद्र बनारस के युवाओं के लिए रोजगार के नए अवसर लेकर आएगा: PM