హరిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్ర‌మం ప్రారంభ సూచ‌కంగా ఈ రోజు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాల్గొని, స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భార‌త‌దేశంలో ఆధ్యాత్మిక సంస్థ‌లు సామాజిక సంస్క‌ర‌ణ‌ల వ్యాప్తికి కేంద్రాలుగా ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప‌ర్య‌ట‌న అనేది భార‌త‌దేశంలో ఒక ప్రాచీన‌మైన భావ‌నే కాక‌, ఒక ఆధ్యాత్మిక సంప్ర‌దాయం కూడా అని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ రోజు ప్రారంభమ‌వుతున్న ఆశ్ర‌మం హ‌రిద్వార్‌కు వ‌చ్చే యాత్రికుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. యాత్ర చేయాల‌న్న ఆలోచ‌న మ‌న సంస్కృతిలో ఒక అవిభాజ్య భాగం అని ఆయ‌న చెప్పారు. మ‌నం దేశంలో మ‌రే విధంగాను ఎన్న‌టికీ చూడ‌లేన‌టువంటి వేరు వేరు ప్రాంతాల‌తో ప‌రిచ‌యాన్ని యాత్ర ద్వారా పొంద‌వ‌చ్చున‌ని ఆయ‌న వివరించారు.

|

ఉమియా మాత భ‌క్తులు చేస్తున్న‌టువంటి కార్య‌క్ర‌మాలు అనేక మంది ప్ర‌జ‌ల జీవితాల‌ను స్ప‌ర్శించాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఆ కార్య‌క్ర‌మాలు స్త్రీ, పురుష స‌మాన‌త్వాన్ని గురించిన జాగృతిని చాటి చెప్పాయ‌న్నారు. ఆయ‌న ‘‘భేటీ బ‌చావో, భేటీ ప‌డావో’’ సందేశాన్ని ముందుకు తీసుకుపోయిన మెహ్ సానా జిల్లా మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఉమియా మాత భ‌క్తులంద‌రూ స్వ‌చ్ఛాగ్ర‌హులుగా మారి, స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్‌కు మ‌రింత శ‌క్తిని జోడించాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 100K internships on offer in phase two of PM Internship Scheme

Media Coverage

Over 100K internships on offer in phase two of PM Internship Scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 ఫెబ్రవరి 2025
February 20, 2025

Citizens Appreciate PM Modi's Effort to Foster Innovation and Economic Opportunity Nationwide