We must demonstrate strong collective will to defeat terror networks that cause bloodshed and spread fear: PM
Silence and inaction against terrorism in Afghanistan and our region will only embolden terrorists and their masters: PM Modi
We should all work to build stronger positive connectivity between Afghanistan and other countries of the region: PM Modi
On India’s part, our commitment to our brave Afghan brothers and sisters is absolute and unwavering: PM Modi
The welfare of Afghanistan and its people is close to our hearts and minds: PM Modi
We also plan to connect Afghanistan with India through an air transport corridor: Prime Minister Modi

యువ‌ర్ ఎక్స్ లెన్సీ అఫ్గానిస్తాన్ అధ్య‌క్షులు డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ అశ్ రఫ్ గనీ,

యువ‌ర్ ఎక్స్ లెన్సీ అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి శ్రీ స‌లాహుద్దీన్ ర‌బ్బానీ,

నా స‌హ‌చ‌ర మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, విదేశాంగ‌ మంత్రులు, ప్ర‌తినిధి వర్గాల అధిపతులు, లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌,

న‌మ‌స్కార్‌. స‌త్ శ్రీ అకాల్‌.

‘సిక్స్త్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ఏశియా ఇస్తాంబుల్ ప్రాసెస్ ఆన్ అఫ్గానిస్తాన్’ ప్రారంభ కార్యక్రమంలో ఉపన్యాసమివ్వడం ఎంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన అవ‌కాశం.

భార‌త‌దేశ మిత్రుడు, భాగ‌స్వామి అయిన అఫ్గానిస్తాన్ అధ్య‌క్షులు డాక్ట‌ర్ అశ్ రఫ్ గనీ తో క‌లిసి ఈ స‌మావేశాన్ని ప్రారంభించ‌డం నాకు మ‌రింత సంతోష‌దాయ‌కంగా వుంది.

నా ఆహ్వానాన్ని మ‌న్నించి ఈ స‌మావేశంలో పాల్గొన‌డానికి వ‌చ్చినందుకు శ్రేష్ఠుడు డాక్ట‌ర్ గనీకి నా అభినంద‌న‌లు. సిక్కుల అత్యంత ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన స్వ‌ర్ణ దేవాల‌య నిల‌యం అమృత్‌స‌ర్ న‌గ‌రం. సరళతకు, అందానికి, ఆధ్యాత్మికత‌కు ప్ర‌తీక‌గా నిలిచిన న‌గ‌రం అమృత్ స‌ర్. ఈ న‌గ‌రంలోకి మీ అంద‌రికీ ఆహ్వానం ప‌ల‌క‌డం నాకు ల‌భించిన ఒక గొప్ప అవ‌కాశం.

ఇక్క‌డ ధ్యానం చేయ‌డం ద్వారా సిక్కు గురువులు ఈ ప్రాంతాన్ని ఎంతో ప‌విత్ర‌మ‌యం చేశారు. శాంతికి, మాన‌వ‌త్వానికి ఈ న‌గ‌రం నిల‌యం. అన్ని మ‌తాల‌ను, ఇత‌ర ప్రాంతాల‌ను ప్ర‌జ‌ల‌ను అక్కున చేర్చుకునే న‌గ‌ర‌మిది. ఈ న‌గ‌రంలోని ప్ర‌తి ఉద్యానవనం, ప్ర‌తి వీధి ధైర్యవంతుల క‌థ‌లను, త్యాగాల‌ను తెలియ‌జేస్తాయి.

ప్ర‌జ‌ల సేవాత‌త్ప‌ర‌త‌, దేశ‌ భ‌క్తి ఈ న‌గ‌ర స్వ‌భావాన్ని తీర్చిదిద్దాయి. అంతే కాదు ప్ర‌జ‌ల క‌ష్ట‌ప‌డే స్వ‌భావం, సృజ‌నాత్మ‌క‌త‌, నూతన కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డంలోని ఉత్సుక‌త ఈ న‌గ‌రాన్నినిర్మించాయి. అంతే కాదు అమృత్ స‌ర్ న‌గ‌రం, అఫ్గానిస్తాన్ తో చ‌క్క‌టి స్నేహ‌సంబంధాల‌ను క‌లిగి వుంది.

సిక్కుల మొద‌టి గురువు బాబా గురు నానక్ దేవ్ జీ మొద‌టి త‌రం శిష్యులలో అఫ్గాన్ దేశీయులు ఉన్నారు. ఆయ‌న 15వ శ‌తాబ్దంలో కాబూల్ లో ధార్మిక ఉప‌న్యాసాలిచ్చారు.

పంజాబ్ లో వెల‌సిన అఫ్గాన్ సూఫీ సాధువు బాబా హ‌జ‌ర‌త్ షేక్ పుణ్యక్షేత్రాన్ని అన్ని మ‌తాల‌కు చెందిన వారు ద‌ర్శించుకొంటున్నారు. అఫ్గానిస్తాన్ నుండి సందర్శ‌కులు వ‌స్తున్నారు.

ఆసియాలోని పురాత‌న‌మైన‌, పొడ‌వైన రోడ్డు మార్గం గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గం. ఇది అమృత్ స‌ర్ మీదుగా వెళ్తూ వాణిజ్యానికి, ప్ర‌జ‌ల ప్ర‌యాణానికి, వివిధ ఆలోచ‌న‌ల వెల్లువ‌కు కార‌ణమ‌వుతోంది. అఫ్గానిస్తాన్ ఆర్ధిక ప్ర‌గ‌తికి, స్థిర‌త్వానికి, అభివృద్ధికి ప్ర‌ధానంగా అవ‌స‌ర‌మ‌య్యే క‌నెన్టివిటీని అమృత్ స‌ర్ బలోపేతం చేస్తోంది.

శ్రేష్ఠులారా, లేడీస్‌, అండ్ జెంటిల్ మెన్‌,

ఈ శ‌తాబ్ద ప్రారంభం నుండి అంత‌ర్జాతీయ స‌మాజం అఫ్గానిస్తాన్ తో విస్తృతంగా సంబంధ బాంధ‌వ్యాల‌ను కొన‌సాగిస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల‌తో పాటు, ప్రాంతీయ దేశాలు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల మిత్ర దేశాలు ప‌లు కార్య‌క్ర‌మాల‌ ద్వారా ముఖ్యంగా రాజ‌కీయ‌, సామాజిక‌, సైన్య‌, ఆర్ధిక‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ ద్వారా అఫ్గానిస్తాన్ కు మ‌ద్ద‌తునిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్ లో స్థిర‌మైన శాంతి కోసం, రాజ‌కీయ‌ స్థిర‌త్వం కోసం అంత‌ర్జాతీయ స‌మాజం మ‌రో సారి త‌న నిబ‌ద్ద‌త‌ను చాట‌డానికి ఈ రోజున ఇక్క‌డ మ‌న స‌మావేశం కృషి చేస్తుంది. మ‌నం చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికి వీలుగా మ‌న మాట‌లు, చేత‌లు కేంద్రీకృత‌మై ఉండాలి.

అఫ్గానిస్తాన్‌కు సాయం అందించాలంటే:

* దేశ సామాజిక‌, రాజ‌కీయ‌, సంస్థాగ‌త వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయాలి.

* ఇత‌ర దేశాల‌నుంచి వ‌స్తున్న బెదిరింపుల‌నుంచి అఫ్గానిస్తాన్ ప్ర‌జ‌ల‌కు, దేశానికి భ‌ద్ర‌త క‌ల్పించాలి.

* దేశ ఆర్ధిక‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను బ‌లోపేతం చేయాలి.

* ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ సౌభాగ్యంగా, స్థిరంగా వుండేలా చూడాలి.

ఈ కార్య‌క్ర‌మం ముఖ్యోద్దేశం కూడా ఇదే. ఈ స‌మావేశానికి పెట్టిన పేరు “స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం, సౌభాగ్యాన్ని సాధించ‌డం” కూడా ఈ ఉద్దేశాన్నే చాటుతోంది.

ఈ స‌వాళ్ల ప‌రిమాణంపైన మ‌నంద‌రికీ స్ప‌ష్ట‌త ఉంది. దీనిని సాధించ‌డానికి మ‌నంద‌రంగా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాలి.

మ‌నంద‌రం క‌లిసి ఇంత‌వ‌ర‌కూ ఉమ్మ‌డిగా సాధించిన ఫ‌లితాలు ఎంతో క‌ష్ట‌ప‌డి సాధించుకున్న‌వి. అంతే కాదు, ముఖ్య‌మైన విజ‌యాల‌ను సాధించ‌డం జ‌రిగింది; అయితే, మ‌రెంతో సాధించాల్సి ఉంది.

మనం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే మ‌న కృషిని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డమే ఇప్పుడు మ‌న‌కు కావాల్సింది. గ‌త ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా సాధించిన ఫ‌లితాల‌ను సంర‌క్షించుకొంటూనే ముందుకు సాగాలి.

అభివృద్ధి దార్శ‌నిక‌త‌, ప్ర‌జాస్వామ్యం, లౌకిక‌త‌త్వంల‌పైన న‌మ్మ‌కం పెట్టుకున్న దేశం అఫ్గానిస్తాన్. ఇప్పుడు ఆ దేశ‌ భవిష్య‌త్ మాత్ర‌మే ప్ర‌మాదంలో లేదు. మొత్తం ఈ ప్రాంత స్థిర‌త్వం, శాంతి ప్ర‌మాదంలో ఉన్నాయి.

అఫ్గానిస్తాన్ ప్ర‌జ‌లు స్వంతంగా శాంతిని కాపాడుకోవ‌డానికి వీలుగా, ఆర్ధిక వృద్దిని సాధించ‌డానికి వీలుగా ఇంకా మ‌నం ఏం చేయాలి, ఏమేమీ చేయ‌కూడ‌ద‌నే అంశాల్ని ఈ సమావేశం త్వ‌రిత‌గ‌తిన రూపొందించాలి. స‌మాధానాలు మ‌న ముందే వున్నాయి. ఇక ప్ర‌శ్న ఏమంటే అంద‌రూ నిర్ణ‌యం తీసుకొని కార్యాచ‌ర‌ణ‌లోకి దూకాలి. మొద‌ట అంద‌రి క‌ర్త‌వ్యం అఫ్గానిస్తాన్‌కు, ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌థమ ప్రాధాన్య‌మివ్వ‌డ‌మే.

ఇందుకోసం, మొద‌ట‌గా, అఫ్గానిస్తాన్ నేతృత్వంలో, ఆ దేశ యాజ‌మాన్యంలో, ఆ దేశ నియంత్ర‌ణ‌లో శాంతి, ఆర్ధికాభివృద్ధి కార్య‌క్రమం ముఖ్య‌మైంది. ఈ ప‌రిష్కారం మాత్ర‌మే ఎక్కువ‌ కాలం నిలబ‌డుగలుగుతుంది.

ఇక రెండో అంశం, ర‌క్త‌పాతానికి కార‌ణ‌మ‌వుతూ ఈ ప్రాంత‌ంలో భ‌యోత్పాతాల‌ను సృష్టిస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ పైన‌ అంద‌రం క‌లిసిక‌ట్టుగా విజ‌యం సాధించాలి. అఫ్గానిస్తాన్ శాంతి, స్థిర‌త్వం, సౌభాగ్యాల‌కు ఉగ్ర‌వాదం, బయట నుండి మీద‌ ప‌డుతున్న అస్థిర‌త్వం ప్ర‌మాద‌క‌రంగా మారాయి. మ‌న మొత్తం ప్రాంతాన్ని ఉగ్ర‌వాద హింస పెను ప్ర‌మాదంలో ప‌డేసింది. ఇలాంటి ప‌రిస్థితులలో అఫ్గానిస్తాన్ లో శాంతి కాముకుల‌కు మ‌ద్ద‌తునివ్వ‌డమొక్కటే స‌రిపోదు.అఫ్గానిస్తాన్ కోసం బ‌ల‌మైన కార్యాచ‌ర‌ణ కావాలి. కేవ‌లం ఉగ్ర‌వాద మూక‌ల‌కు వ్య‌తిరేకంగానే కాదు..ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తుగా నిలిచి, వారికి నీడ‌నిస్తున్న‌, శిక్ష‌ణ ఇస్తున్న‌, ఆర్ధిక సాయం అందిస్తున్న వారికి వ్య‌తిరేకంగా కార్యాచ‌ర‌ణ ఉండాలి. అఫ్గానిస్తాన్ లోను, ప్రాంతీయంగాను చెల‌రేగుతున్న ఉగ్ర‌వాదం ప‌ట్ల నిశ్శ‌బ్దంగా, ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా ఉండ‌డ‌మంటే అది ఉగ్ర‌వాదుల‌కు, వారి నేత‌ల‌కు మ‌రింత బ‌లాన్నిస్తుంది.

ఇక మూడోది.. అఫ్గానిస్తాన్ కు చేసే అభివృద్ధిప‌ర‌మైన‌, మాన‌వ‌తాపూర్వ‌క స‌హాయానికి సంబంధించిన‌ ద్వైపాక్షిక, ప్రాంతీయ నిబద్ద‌త‌ల‌ను కొన‌సాగించ‌డ‌మే కాకుండా స‌హాయాన్ని పెంచాలి. అఫ్గానిస్తాన్ లో మ‌న‌ స‌హ‌కార కార్య‌క్ర‌మాల‌ వ‌ల్ల ఆ దేశ ప్రాథమిక సౌకర్యాల క‌ల్ప‌న జ‌ర‌గాలి. వ్య‌వ‌స్థాగ‌త‌మైన సామ‌ర్థ్యం పెంచాలి. వృద్ధికి సంబంధించిన స్వ‌యం చోద‌క వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ధి అయ్యేలా చూడాలి.

ఇక నాలుగోది.. ప్రాంతీయంగా అఫ్గానిస్తాన్ కు ఇత‌ర దేశాల‌కు మ‌ధ్య‌న బ‌ల‌మైన ధ‌నాత్మ‌క‌మైన సంబంధాల‌ను నిర్మించ‌డానికి మ‌నంద‌రం క‌లిసి క‌ట్టుగా కృషి చేయాలి.

ప్రాంతీయ దేశాల మ‌ధ్య‌ క‌నెన్టివిటీ నెట్ వ‌ర్కులలో అఫ్గానిస్తాన్ కు ప్రాధాన్య‌ం ఉండాలి త‌ప్ప దాని పాత్ర ఉప‌రిత‌లానికి ప‌రిమితం కాకూడదు. ఇక భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే, మా వ‌రకు ద‌క్షిణ ఆసియా, మ‌ధ్య ఆసియా ల మ‌ధ్య‌ క‌నెక్టివిటీ లింకుల‌ను బ‌లోపేతం చేసే ప్ర‌ధాన‌మైన కేంద్రం అఫ్గానిస్తాన్ .

ప్రాంతీయంగా జ‌రిగే వాణిజ్యం, పెట్టుబుడుల‌, ప్రాంతీయ విపణులతో అఫ్గానిస్తాన్ మ‌రింత‌గా అనుసంధానమయితే ఆ దేశ ఆర్ధిక వృద్ధి, ప్ర‌గ‌తి మ‌రింత ఖ‌చ్చితంగా కొన‌సాగుతుంది. ఈ ప్రాంతంలోని ఇత‌ర భాగ‌స్వాముల‌తో వాణిజ్య‌, ర‌వాణా లంకెల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ఇచ్చే ప్రాధాన్య‌ంపై నేను, ప్రెసిడెంట్ డాక్టర్ గనీ చ‌ర్చించుకొన్నాము.

శ్రేష్ఠులారా, లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌,

ఎంతో ధైర్య‌వంతులైన అప్ఘాన్ సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు భార‌త‌దేశం ఇచ్చే ప్రోత్సాహం పూర్తిగా, ఎలాంటి ఒడుదొడుకుల‌కు తావు లేకుండా ఉంటుంది. అఫ్గానిస్తాన్ ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్ల భార‌త‌దేశం ఎంతో చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తోంది.

అఫ్గానిస్తాన్ లో చేప‌ట్టిన ప్రాజెక్టులు చిన్న‌వి కావ‌చ్చు, పెద్ద‌వి కావ‌చ్చు వాటిని పూర్తి చేయ‌డంలో ఇరు దేశాల భాగ‌స్వామ్యం విజ‌య‌వంతమ‌వ‌డమే దీనికి ఉదాహ‌ర‌ణ‌. ఇరు దేశాల మ‌ధ్య‌ స‌హ‌కారంలోని ముఖ్య‌మైన కోణమ‌నేది ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌లే కేంద్రంగా ఉంటోంది.

ఇరు దేశాలు ఉమ్మ‌డిగా చేప‌ట్టే కార్యక్ర‌మాలు ఎలా ఉండాలంటే:

* అఫ్గానిస్తాన్ యువ‌త‌ను విద్యావంతుల‌ను చేసి వారిలోని నైపుణ్యాల‌ను పెంపొందించేలాగా వుండాలి;

* ఆరోగ్య‌సంరక్ష‌ణ అందించి వ్య‌వ‌సాయ‌రంగాన్ని అభివృద్ధి ప‌ర‌చాలి;

* ప్రాథమిక సౌక‌ర్యాల‌ను, సంస్థ‌ల‌ను నిర్మించ‌గ‌ల‌గాలి;

* అఫ్గానిస్తాన్ కు చెందిన వ్యాపారులు , చిరు వ‌ర్త‌కులు భార‌త‌దేశంలోని అపార‌మైన వాణిజ్య‌, ఆర్ధిక అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేలా చూడ‌గ‌ల‌గాలి.

అఫ్గానిస్తాన్ లోని అన్ని ప్రాంతాలకు విస్త‌రించి అంద‌రికీ ల‌బ్ధి చేకూర్చాలి. సల్మా డ్యామ్‌గా మ‌నం పిలుచుకునే భార‌త‌దేశ- అఫ్గానిస్తాన్ స్నేహ‌ సేతువు హెరాత్స్ డ్యామ్ కొన్ని నెల‌ల క్రిత‌మే ప్రారంభ‌మైంది. ఇది ఆ దేశంలోని ప్ర‌జ‌ల ఆర్ధిక కార్య‌క్ర‌మాల‌ను పెంపొందిప‌చేస్తుంది.

కాబుల్ లో నిర్మిత‌మైన పార్ల‌మెంటు భ‌వ‌నం అఫ్గానిస్తాన్ ప్ర‌జాస్వామ్య భ‌విత‌వ్యం ప‌ట్ల భార‌త‌దేశానికి ఉన్న నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం. జెరాంజ్‌-డెలె రామ్ హైవే, చాబాహార్ కు సంబంధించి భార‌త‌దేశం-అఫ్గానిస్తాన్‌-ఇరాన్ స‌హ‌కారం అనేవి ద‌క్షిణ ఆసియాతో పాటు,ద‌క్షిణ ఆసియేత‌ర ప్రాంతాల‌తో అఫ్గానిస్తాన్ ను, ఆ దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను క‌లప‌గ‌లుగుతాయి.

ఇక వైమానిక ర‌వాణా కారిడార్ ద్వారా అప్ఘినిస్థాన్ ను భార‌త‌దేశంతో క‌ల‌ప‌డానికి మేం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తాం.

ఇరు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి చేప‌ట్టాల్సిన అద‌న‌పు చ‌ర్య‌ల గురించి నేను ప్రెసిడెంట్ డాక్టర్ గనీతో చ‌ర్చించాను. అఫ్గానిస్తాన్ కు అద‌నంగా భార‌త‌దేశం అందిస్తున్న ఒక బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల వినియోగానికి సంబంధించి ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌గ‌తి సాధిస్తున్నాము.

అఫ్గానిస్తాన్ లో నీటి నిర్వ‌హ‌ణ‌, ఆరోగ్య‌రంగం, ప్రాథమిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, విద్యుత్‌, నైపుణ్యాల అభివృద్ధి రంగాల‌లో భార‌త‌దేశ స‌హాయం విస్త‌రిస్తుంది. భార‌త‌దేశంతో భావ సారూప్య‌ం క‌లిగి, అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం ముంద‌ుకు వ‌చ్చే దేశాల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాము.

ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ లో జ‌రిగిన బ్ర‌సెల్స్ స‌మావేశంలోను, జులై నెల‌లో జ‌రిగి నాటో యొక్క వార్సా శిఖ‌రాగ్ర స‌మావేశంలోను అంత‌ర్జాతీయ స‌మాజం ప్ర‌తిపాదించిన‌ స‌హాయ చ‌ర్య‌ల విష‌యంలో భార‌త‌దేశం చాలా సంతోషంగా ఉంది. అఫ్గానిస్తాన్ కు స‌హాయం చేయ‌డంలో మేము చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను, అంకిత‌భావాన్ని కొన‌సాగిస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను.

ఇరు దేశాలు క‌లిసి చేప‌ట్టిన ప్రాజెక్టుల ద్వారా వ‌చ్చిన అనుభ‌వాన్నించి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.

శ్రేష్ఠులారా, లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌,

అఫ్గానిస్తాన్ లో రాజ‌కీయంగాను, భ‌ద్ర‌తాప‌రంగాను, ఆర్ధిక‌రంగంలోను జ‌రిగే ప్ర‌గ‌తి కోసం మ‌నం చేసే స‌హాయం కేవ‌లం ఆ దేశానికి చేసే స‌హాయం మాత్ర‌మే కాదు.. అది ప్రాంతీయంగాను, ప్ర‌పంచ‌వ్యాప్తంగాను మ‌రింత శాంతిని నెల‌కొల్పుతుంది.

ఈ స‌మావేశంలో మీ చ‌ర్చ‌ల కార‌ణంగా మ‌నం చేపట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌కు నిర్మాణాత్మ‌క‌, ప్ర‌గ‌తిపూర్వ‌కంగా మార్గాలు ఏర్ప‌డ‌తాయ‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.

* సంక్షోభం స్థానంలో స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిద్దాము.

* అవ‌స‌ర‌మై చోట అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టి, ఉగ్ర‌వాద స్థానంలో భ‌ద్ర‌త‌ను పెంపొందిద్దాము.

శాంతికి నెల‌వైన దేశంగా అఫ్గానిస్తాన్ ను రూపొందించే కృషికి మ‌నంద‌రం పున‌రంకిత‌మ‌వుదాము. అఫ్గానిస్తాన్ ను స‌హేతుక‌త‌, శాంతి వ‌ర్ధిల్లే దేశంగా త‌యారు చేద్దాం. ఎక్క‌డైతే ప్ర‌గ‌తి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయో ప్ర‌జాస్వామ్యం, లౌకిక‌త‌త్వం విజ‌యం సాధిస్తాయి.

మీకు అంద‌రికీ ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi