నోయెడా లో జరిగిన ‘పెట్రోటెక్ 2019’ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రారంభోపన్యాసం ఈ కింది విధం గా ఉంది.
నమస్తే,
ముందుగా నేను రవాణా పరమైన కారణాల వల్ల జాప్యం జరిగినందుకు క్షమాపణ కోరుకొంటున్నాను.
భారతదేశం యొక్క హైడ్రో కార్బన్ కాన్ఫరెన్స్ పదమూడో సంచిక అయినటువంటి ‘పెట్రోటెక్-2019’ లో పాలుపంచుకోవాలసింది గా మీకు అందరి కి స్వాగతం పలుకుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.
శక్తి రంగాని కి తోడ్పాటు అందించినందుకు మరియు భవిష్యత్తు కు సంబంధించిన దార్శనికత కు గాను శ్రేష్టులు, డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ ను కూడా నేను అభినందించదలచాను.
శక్తి రంగం లో మనకు ఎదురవుతున్న సవాళ్ళ కు పరిష్కారాల ను చర్చించేందుకు పెట్రోటెక్ గత 25 సంవత్సరాల కు పైగా ఒక వేదిక గా ‘పెట్రోటెక్’ ఉండింది.
మన దేశాలన్నింటి లో మన పౌరుల కు తక్కువ ఖర్చు లో, సమర్ధమైన, స్వచ్ఛమైన మరియు భరోసా తో కూడిన శక్తి ని సరఫరా చేయాలని మనం కోరుకుంటున్నాం.
అరవై కి పైగా దేశాల నుండి ఏడు వేల మంది ప్రతినిధులు ఇక్కడ కు తరలి రావడం ఒక ఉమ్మడి అన్వేషణ కు అద్దం పడుతోంది.
సామాజిక, ఆర్థిక వృద్ధి కి తోడ్పడేటటువంటి కీలక చోదకాల లో శక్తి ఒకటని ప్రజా జీవనం అనేక దశాబ్దాలు ఉన్న నేను ఒప్పుకొంటున్నాను. ఆర్థిక వ్యవస్థ సత్వర వృద్ధి కి తగిన ధర తో కూడిన, నిలకడతనం కలిగిన శక్తి సరఫరా ఎంతైనా అవసరం. సమాజం లో పేదలు మరియు ఆదరణ కు నోచుకోని వర్గాల వారికి ఆర్థిక లాభాల ను పొందడం లో తోడ్పడేది కూడా శక్తే.
స్థూల స్థాయి లో చూస్తే, శక్తి రంగం వృద్ధి కి ఒక ప్రధానమైనటువంటి ఇరుసు గా నిలుస్తోంది.
మిత్రులారా,
ప్రపంచ శక్తి యొక్క వర్తమానాన్ని మరియు భవిష్యత్తు ను గురించి చర్చించడం కోసం మనం ఇక్కడ కు విచ్చేశాం. అయితే, ఇదే కాలం లో ప్రపంచ శక్తి రంగం లో మార్పు యొక్క పవనాలు స్పష్టం గా గోచరిస్తున్నాయి.
శక్తి సరఫరా, శక్తి వనరులు మరియు శక్తి వినియోగం యొక్క తీరు తెన్ను లు మార్పు కు లోనవుతున్నాయి. బహుశా ఇది ఒక చరిత్రాత్మకమైన సంధి కాలం అని భావించవచ్చు.
పశ్చిమ దేశాల నుండి తూర్పు దేశాల వరకు చూసినట్లయితే శక్తి వినియోగం లో ఒక మార్పు కనబడుతోంది.
శేల్ విప్లవం అనంతరం ప్రపంచం లో కెల్లా అతిపెద్ద చమురు, ఇంకా గ్యాస్ ఉత్పత్తిదారు గా యునైటెడ్ స్టేట్స్ నిలచింది.
సౌర శక్తి, ఇంకా ఇతర నవీకరణ యోగ్య శక్తి వనరులు మరింత స్పర్ధాత్మకం గా మారాయి. అవి సాంప్రదాయక శక్తి రూపాల కు ఒక సుస్థిర ప్రత్యామ్నాయాలు గా రూపుదాల్చాయి.
సహజ వాయువు అత్యంత వేగం గా ప్రపంచ శక్తి మిశ్రణం లో అతి పెద్ద ఇంధనాల లో ఒకటి గా మారిపోతోంది.
తక్కువ ఖర్చు తో కూడిన నవీకరణ యోగ్య శక్తి, సాంకేతిక పరిజ్ఞానాలు మరియు డిజిటల్ అప్లికేశన్స్ మధ్య ఒక మేలు కలయిక పొడసూపుతోంది. ఇది అనేక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కు తోడ్పడే ఆస్కారం ఉంది.
జల, వాయు పరివర్తన సమస్య ను పరిష్కరించడం కోసం అన్ని దేశాలు ఒక్కటి అవుతున్నాయి. భారతదేశం మరియు ఫ్రాన్స్ లు ప్రోత్సహించినటువంటి అంతర్జాతీయ సౌర కూటమి (ISA) వంటి ప్రపంచ స్థాయి భాగస్వామ్యాల లో ఇది కనిపిస్తోంది.
ఘనతరమైనటువంటి శక్తి లభ్యత శకం లోకి మనం ప్రవేశిస్తున్నాం.
అయితే, ప్రపంచం అంతటా ఒక బిలియన్ కన్నా ఎక్కువ మంది ఇప్పటికీ విద్యుత్తు సదుపాయానికి నోచుకోకుండానే మిగిలారు. మరింత ఎక్కువ మంది కి స్వచ్ఛమైన వంట గ్యాస్ అందుబాటు లోకి రానే లేదు.
శక్తి లభ్యత తాలూకు సమస్య లను పరిష్కరించడం లో భారతదేశం నాయకత్వ పాత్ర ను వహించింది. మా యొక్క విజయం లో- శక్తి లభ్యత తాలూకు సమస్య లను తగు విధం గా ప్రపంచం పరిష్కరించుకోగలదన్న ఆశాభావాన్ని- నేను దర్శించగలుగుతున్నాను.
ప్రజలందరి కి స్వచ్ఛమైన, చౌకైన, నిలకడ కలిగిన మరియు సమాన స్థాయి శక్తి సరఫరా ఉండి తీరాలి.
శక్తి పరంగా న్యాయం తో కూడిన శకం ఆరంభం కావడం లో భారతదేశం యొక్క తోడ్పాటు ప్రముఖం గా ఉంది.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది. ఇదే సరళి రానున్న సంవత్సరాల లో కొనసాగుతుందని ఐఎంఎఫ్, ఇంకా వరల్డ్ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థ లు సూచిస్తున్నాయి.
అనిశ్చితి తో కూడిన ప్రపంచ ఆర్థిక వాతావరణం లో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు ఒక లంగరు వలె గొప్ప హుషారు ను ప్రదర్శించింది.
భారతదేశం ఇటీవలే ప్రపంచం లో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి ని అందుకొంది. ఇటీవలి ఒక నివేదిక కథనం ప్రకారం, 2030వ సంవత్సరానికల్లా భారతదేశం ప్రపంచం లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచేందుకు అవకాశం ఉంది.
మేము ప్రపంచం లో మూడో అతి పెద్ద శక్తి వినియోగదారుగా కూడా ఉన్నాం. మా దేశం లో డిమాండు ప్రతి ఏటా 5 శాతాని కి పైగా పెరుగుతోంది.
2040వ సంవత్సరానికల్లా శక్తి డిమాండు రెట్టింపు కు మించవచ్చన్న అంచనా తో భారతదేశం శక్తి కంపెనీ లకు ఒక ఆకర్షణీయ విపణి లాగా ఉంది.
మేము శక్తి ప్రణాళిక రచన దిశ గా ఒక ఏకీకృత దృక్పథాన్ని అనుసరిస్తున్నాం. 2016వ సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ‘పెట్రోటెక్’ సమావేశం లో నేను భారతదేశం యొక్క శక్తి భవితవ్యానికి నాలుగు స్తంభాలు.. శక్తి లభ్యత, శక్తి సంబంధిత సామర్ధ్యం, సుస్థిరమైన శక్తి మరియు శక్తి రంగం లోని భద్రత.. ను గురించి ప్రస్తావించాను.
మిత్రులారా,
శక్తి పరం గా న్యాయం అనేది కూడా నా వరకు ఒక కీలకమైన లక్ష్యమే. అంతే కాదు ఇది భారతదేశాని కి ఒక అగ్ర ప్రాధాన్యం కలిగిన అంశం కూడా ను. దీని ని దృష్టి లో పెట్టుకొని మేము ఎన్నో విధానాల ను రూపొందించి అమలు చేస్తున్నాం.
ఈ ప్రయత్నాల యొక్క ఫలితాలు ప్రస్తుతం స్పష్టమవుతున్నాయి.
విద్యుత్తు మా గ్రామీణ ప్రాంతాలన్నింటికీ అందింది. ఈ సంవత్సరం భారతదేశం లో వంద శాతం గృహ విద్యుదీకరణ లక్ష్యాన్ని సౌభాగ్య (SAUBHAGYA) పథకం ద్వారా సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకొన్నాం.
మేము ఉత్పత్తి ని పెంచుతూనే, ప్రసారం, ఇంకా పంపిణీ ల పరంగా నష్టాల ను తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నాం. ‘ఉదయ్ పథకం’ లో భాగంగా మేము ఈ లక్ష్యం దిశగా పయనిస్తున్నాం.
ప్రపంచ బ్యాంకు యొక్క విద్యుత్తు ను సులభం గా పొందే స్థానాల జాబితా లో భారతదేశం యొక్క స్థానం మెరుగైంది. ఇది 2014వ సంవత్సరం లో 111గా ఉన్నది కాస్తా 2018వ సంవత్సరం లో 29కి చేరుకొంది.
‘ఉజాలా పథకం’ (UJALA)లో భాగం గా దేశవ్యాప్తం గా ఎల్ఇడి బల్బుల ను పంపిణీ చేయడం తో ప్రతి ఏటా 17 వేల కోట్ల రూపాయలు, లేదా సుమారు 2.5 బిలియన్ డాలర్లు ఆదా అయింది.
శుద్ధమైన వంట ఇంటి ఇంధనం అందుబాటు లోకి రావడం ప్రధానమైన ప్రయోజనాల ను అందిస్తుంది. ప్రత్యేకించి మహిళలు మరియు బాలలు పొగ తాలూకు కాలుష్య ప్రమాదం బారి నుండి బయట పడతారు.
‘ఉజ్జ్వల పథకం’లో భాగం గా 6.4 కోట్ల కు పైగా కుటుంబాల కు ఎల్‌పిజి కనెక్షన్ లను మూడు సంవత్సరాల కన్నా తక్కువ కాలం లో ఇవ్వడం జరిగింది. ఒక ‘నీలి జ్వాల విప్లవం’ చోటుచేసుకొంటోంది. ఎల్ పిజి సదుపాయం అయిదు సంవత్సరాల క్రితం 55 శాతం మంది కి ఉండగా ఇప్పుడు 90 శాతాని కి పైగా మంది కి లభిస్తోంది.
పరిశుభ్రమైన రవాణా కు ప్రోత్సాహం లభిస్తోంది. మేము బిఎస్ IV నుండి 2020 వ సంవత్సరం ఏప్రిల్ కల్లా అమాంతం బిఎస్ VI కు ఎగబాకనున్నాము. ఇది యూరో VI ప్రమాణాల కు సమానం.
వంద శాతం విద్యుదీకరణ, ఎల్ పిజి సదుపాయం పరిధి విస్తరణ ల వంటి కార్యసాధన లు కేవలం ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యమవుతాయి. ప్రజలు వారి సమష్టి శక్తి పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే శక్తి న్యాయాన్ని అందించవచ్చు. ఈ నమ్మకాన్ని యథార్థంగా మలచడం లో ప్రభుత్వం ఒక సహాయకురాలి పాత్ర ను మాత్రమే పోషిస్తోంది.
గడచిన అయిదు సంవత్సరాలు భారతదేశం యొక్క చమురు మరియు గ్యాస్ రంగం లో ప్రధాన సంస్కరణల కు సాక్షీభూతమయ్యాయి. మేము మా యొక్క అప్‌స్ట్రీమ్ పాలిసీ లను పునర్ వ్యవస్థీకరించాము. మేము ఈ రంగం లో పారదర్శకత్వాన్ని, స్పర్ధాత్మకత ను తీసుకు రావడం కోసం హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేశన్ ఎండ్ లైసెన్సింగ్ పాలిసీ ని ప్రారంభించాము.
బిడ్డింగ్ ప్రమాణాన్ని ఆదాయ పంపిణీ పద్ధతి కి మార్చడం జరిగింది. ఇది ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం లో సహాయకారి గా నిలచింది. భారత క్షేత్రాల లో అన్వేషణ తాలూకు ప్రయోజనాన్ని పెంచడం లో ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలిసీ, ఇంకా నేశనల్ డేటా రిపోజిటరీ లు తోడ్పడుతున్నాయి.
గ్యాస్ ధరల నిర్ణయం సంబంధిత సంస్కరణ లను కూడా ప్రవేశపెట్టడమైంది. అప్‌స్ట్రీమ్ క్షేత్రాల ఉత్పాదకత ను మెరుగు పరచడం లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడాన్ని ఇన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీ పాలిసీ ప్రోత్సహించనుంది.
మా డౌన్ స్ట్రీమ్ సెక్టర్ ను పూర్తి గా సరళతరం చేయడం జరిగింది. విపణి చోదక పెట్రోల్, డీజిల్ ధర లు అంతర్జాతీయ ముడి చమురు ధర లోని మార్పు లను ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశం ప్రపంచం లో నాలుగో అతి పెద్ద శుద్ధి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశం. ఇది 2030వ సంవత్సరానికల్లా మరింతగా- సుమారు 200 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర- వృద్ధి చెందనుంది.
గత సంవత్సరం లో నేశనల్ బయో ఫ్యూయల్ పాలసీ కి శాసన రూపాన్ని ఇవ్వడమైంది. రెండో తరం బయో ఫ్యూయల్స్ కు మరియు మూడో తరం బయో ఫ్యూయల్స్ కు సంబంధించిన పరిశోధన ను ప్రోత్సహించడం జరుగుతోంది. పదకొండు రాష్ట్రాల లో రెండో తరానికి చెందిన బయో-రిఫైనరీస్ లు పన్నెండింటి ని నెలకొల్పడం జరుగుతోంది. ఎథనాల్ మిశ్రణం, ఇంకా బయో డీజిల్ కార్యక్రమం కర్బన ఉద్గారాల ను తగ్గిస్తూ, రైతుల ఆదాయాల ను పెంచుతున్నాయి. బయో ఏవియేశన్ టర్బైన్ ఫ్యూయల్ ను ఇప్పటికే మా పౌర విమానయాన రంగం లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడమైంది.
మా ప్రభుత్వం ఆయిల్ ఎండ్ గ్యాస్ వాల్యూ చైన్ అంతటా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. భారతదేశం ఎఫ్ డిఐ కి ఒక ఆకర్షణీయమైన గమ్య స్థానం గా రూపొందుతోంది. సౌదీ అరామ్ కో , ఎడిఎన్ఒసి, టిఒటిఎఎల్, ఎక్సాన్-మొబీల్, బిపి, ఇంకా శెల్ వంటి కంపెనీ లు వాల్యూ చైన్ అంతటా పెట్టుబడుల ను పెంచుకోవాలని చూస్తున్నాయి.
ఒక గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ గా రూపొందే దిశ గా భారతదేశం పెద్ద పెద్ద అడుగులు వేస్తోంది. పదహారు వేల కిలో మీటర్ల కు పైగా గ్యాస్ గొట్టపు మార్గాన్ని నిర్మించడం జరిగింది. అంతేగాక, మరో పదకొండు వేల కిలో మీటర్ల గ్యాస్ గొట్టపు మార్గం నిర్మాణాధీనం లో ఉంది.
భారతదేశం తూర్పు ప్రాంతాల లో 3,200 కి.మీ. గ్యాస్ గొట్టపు మార్గం తాలూకు పనులు మొదలయ్యాయి. ఇది భారతదేశ తూర్పు ప్రాంతాల ను నేశనల్ గ్యాస్ గ్రిడ్ తో సంధానిస్తుంది.
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ కోసం పదో విడత బిడ్ ఒక నెల రోజుల వ్యవధి లో పూర్తి కానుంది. ఇది నాలుగు వందల కు పైగా జిల్లాల కు ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పరిధి ని మా దేశ జనాభా లో 70 శాతాని కి పొడిగిస్తుంది కూడా ను.
మేము ఇండస్ట్రీ 4.0 కోసం సన్నద్ధం అవుతున్నాం. ఇది పరిశ్రమ పని చేసే తీరు ను కొత్త సాంకేతికత మరియు ప్రక్రియ ల సాయం తో మార్చనుంది. మా కంపెనీ లు సామర్ధ్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం, భద్రత ను పెంచుకోవడం కోసం, అలాగే వ్యయాల ను తగ్గించుకోవడం కోసం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాల ను అవలంబిస్తున్నాయి. అప్‌స్ట్రీమ్ ఆయిల్ ఎండ్ గ్యాస్ ప్రొడక్షన్, అసెట్ మెయిన్‌టెనెన్స్, ఇంకా రిమోట్ మానిటరింగ్ లతో పాటు డౌన్‌స్ట్రీమ్ రిటైల్ లో కూడా ఇదే పద్ధతి ని అనుసరిస్తున్నారు.
అంతర్జాతీయ శక్తి సంస్థ (IEC), ఇంకా ఒపిఇసి ల వంటి సంస్థ లలో ఇటీవల కొన్ని సంవత్సరాలు గా మేము మా యొక్క అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని గాఢతరం చేస్తున్నాం. మేము 2016 వ సంవత్సరం నుండి 2018 వ సంవత్సరం వరకు ఇంటర్‌నేశనల్ ఎనర్జీ ఫోరాని కి అధ్యక్షత వహించాం. మేము మా యొక్క కొనుగోలుదారు- అమ్మకందారు సాంప్రదాయక బంధాల ను ద్వైపాక్షిక పెట్టుబడుల ద్వారా వ్యూహాత్మకమైన భాగస్వామ్యాలు గా మార్చుకో గలిగాం. మేము నేపాల్, బాంగ్లాదేశ్, శ్రీ లంక, భూటాన్, ఇంకా మయన్మార్ లతో శక్తి బంధాన్ని పటిష్ట పరచుకోవడం ద్వారా మా ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ పాలిసీ ని ప్రోత్సహించుకున్నాము.
చమురు మరియు గ్యాస్ రంగం లో గ్లోబల్ సిఇఒ లతో నేను క్రమం తప్పక సంభాషిస్తున్నాను. ప్రపంచ నేతలు మరియు సిఇఒ లతో నేను జరిపే సంభాషణల లో చమురు మరియు గ్యాస్ కేవలం ఒక వాణిజ్య సరకు గానే కాక ఒక అవసరంగా కూడా ఉందని చెబుతూ వస్తున్నాను. సామాన్య మానవుడి వంట ఇంటి కి గాని, లేదా ఒక విమాన సముదాయాని కి గాని శక్తి అనేది అత్యవసరమైనది.
ప్రపంచం సుదీర్ఘకాలం పాటు ముడి చమురు ధరల లో హెచ్చుతగ్గుల ను చూస్తూ వచ్చింది. మనం అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు.. ఈ రెండు వర్గాల ప్రయోజనాల ను తుల తూచేటటువంటి ఒక బాధ్యతాయుతమైన ధరల నిర్ణయ విధానాని కి మళ్ళవలసిన అవసరం ఉంది. చమురు మరియు గ్యాస్.. ఈ రెంటికీ పారదర్శకమైన మరియు సరళతరమైన విపణుల దిశ గా కూడా సాగ వలసిన అవసరం కూడా ఉంది. అది జరిగిన పక్షం లోనే మనం మానవాళి యొక్క శక్తి అవసరాలను ఒక సర్వోత్తమమైన పద్ధతి లో తీర్చగలుగుతాము.
ప్రపంచం అంతా ఒక్కటవ్వాల్సిన మరొక కీలకమైన అంశం ఏదంటే జల వాయు పరివర్తన. ప్యారిస్ లో సిఒపి-21 లో నిర్దేశించుకొన్న లక్ష్యాల ను మనమంతా కలసికట్టుగా సాధించగలం. భారతదేశం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లో ఎంతో ముందుకు పయనించింది. మేము మా లక్ష్యాన్ని చేరుకొనే మార్గం లో ముందుకు పోతున్నాము.
శక్తి రంగం యొక్క భవిష్యత్తు ను గురించి వివేచన చేయడం లో పెట్రోటెక్ ఒక పరిపూర్ణ వేదిక గా నిలుస్తోంది. ఈ రంగం లో భావి పెట్టుబడుల ను మరియు విపణి స్థిరత్వాన్ని ప్రభావితం చేయడం లో నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, విధానాలు, సంధి కాలాలు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో అనేది అవగాహన చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక గా నిలుస్తోంది.
ఒక విజయవంతమైన మరియు ఫలప్రదమైన సమావేశం లో మీరు పాలుపంచుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మీ కు ఇవే నా ధన్యవాదాలు.
Winds of change are evident in the global energy arena.
— PMO India (@PMOIndia) February 11, 2019
Energy supply, energy sources & energy consumption patterns are changing. Perhaps, this could be a historic transition.
There is a shift in energy consumption from West to East: PM
There are signs of convergence between cheaper renewable energy, technologies & digital applications. This may expedite the achievement of sustainable development goals.
— PMO India (@PMOIndia) February 11, 2019
Nations are coming together to tackle climate change: PM
LPG connections have been given to over 64 million house-holds in just under three years under the Ujjwala Scheme.
— PMO India (@PMOIndia) February 11, 2019
A ‘Blue Flame Revolution’ is under-way. LPG coverage has reached more than 90% percent, from 55% five years ago: PM
For too long, the world has seen crude prices on a roller-coaster.
— PMO India (@PMOIndia) February 11, 2019
We need to move to responsible pricing, which balances the interests of both the producer and consumer.
We also need to move towards transparent and flexible markets for both oil and gas: PM
We need to move to responsible pricing, which balances the interests of both the producer and consumer.
— PMO India (@PMOIndia) February 11, 2019
We also need to move towards transparent and flexible markets for both oil and gas.
Only then can we serve the energy needs of humanity in an optimal manner: PM