న్యూఢిల్లీలో పార్లమెంట్ హౌస్ అనెక్స్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది పలు పార్లమెంటరీ కమిటీల కార్యాలయాలను కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు శ్రీ అనంత్ కుమార్, శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ కూడా హాజరయ్యారు.