PM Modi inaugurates first National Tribal Carnival in New Delhi
Despite several challenges, the tribal communities show us the way how to live cheerfully: PM
It is necessary to make the tribal communities real stakeholders in the development process: PM
Government is committed to using modern technology for development which would minimize disturbance to tribal settlements: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ ఆదివాసీ ఉత్సవాన్ని ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఆకర్షణీయమైన ఉత్సవ కవాతును తిలకించిన అనంతరం ఆయన ప్రసంగించారు. దేశమంతటి నుండి విచ్చేసిన ఆదివాసీ బృందాలు ఈ సారి దీపావళి పర్వదిన వేళ ఢిల్లీ లో ఉండడమనేది ఇదే మొట్టమొదటి సారి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ రాజధాని నగరంలో జరుగుతున్న ఆదివాసీ ఉత్సవం ఆదివాసీ సముదాయాల సామర్థ్యాల ప్రదర్శనకు ఒక వేదిక కాగలదని ప్రధాన మంత్రి చెప్పారు.

భారతదేశం ఒక గొప్ప భిన్నత్వానికి నిలయం అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ వైవిధ్యానికి ఈ రోజు ఉత్సవంలో సమర్పించిన కవాతు ఒక ఉదాహరణమాత్రంగా అద్దం పట్టినట్లు ఆయన అభివర్ణించారు.

ఆదివాసీ సముదాయాల జీవనం అత్యంత సంఘర్షణతో కూడుకొన్నదని, అయినప్పటికీ కూడా ఆదివాసీ సముదాయాలు సామూహిక జీవన ఆదర్శాలను ఒంటబట్టించుకొన్నారని, కష్టాలు ఉన్నా సంతోషంగా జీవిస్తున్నారని ప్రధాన మంత్రి చెప్పారు.

తాను తన యవ్వనంలో ఆదివాసీల మధ్య ఉంటూ సంఘ సేవ చేసే అవకాశాన్ని దక్కించుకొన్నానని, ఇది తన భాగ్యమని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. వారి నోట ఏదైనా ఫిర్యాదు వెలువడకుండా జారిపోవడమనేది జరగడం కష్టం అని ఆయన గుర్తుచేసుకొన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు.. ఆదివాసీల నుండి ప్రేరణను పొందవచ్చన్నారు.

స్థానిక పదార్థాల నుండి కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేయగల నైపుణ్యాలు ఆదివాసీలకు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. వీటిని సరిగ్గా విక్రయించిన పక్షంలో, వీటికి గొప్ప గిరాకీ ఏర్పడి చక్కని ఆర్థిక అవకాశం లభించగలదని ఆయన చెప్పారు. ఆదివాసీ సముదాయాల జీవనంలో ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని చూపిన నూతన ఉత్పత్తుల గురించిన అనేక ఉదాహరణలను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత ప్రభుత్వంలో ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘనత పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయికి దక్కుతుందని ఆయన చెప్పారు.

ఆదివాసీ సముదాయాల జీవన స్థితగతులలో మార్పు పై నుండి ఇచ్చే ఆదేశాలతో రాదు అని, అభివృద్ధి ప్రక్రియలో ఆదివాసీ సముదాయాలను నిజమైన భాగస్వాములుగా చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంలో ఆయన ‘వనబంధు కల్యాణ్ యోజన’ ను గురించి పేర్కొన్నారు.

వనాల సంరక్షణలో ఆదివాసీ సముదాయాలు పోషిస్తున్న పాత్రను ప్రధాన మంత్రి అభినందించారు. మన సహజ వనరులలో ఎక్కువ భాగం సహజ వనరుల జాడను దేశంలో ఆదివాసీ సముదాయాలు నివసిస్తున్న ప్రాంతాలలోనే కనుగొనడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. వనరులను ఉపయోగంలోకి తీసుకురావలసిందేనని, అయితే ఆదివాసీలను స్వార్ధానికి ఉపయోగించుకోవడాన్ని అనుమతించకూడదన్నారు. గత కేంద్ర బడ్జెట్టులో సంకల్పించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఆదివాసీ సముదాయాల వికాసానికి నిధులను మళ్లించడంలో తోడ్పడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ నిర్ణయం ఖనిజ సంపదతో అలరారుతున్న జిల్లాల పురోగతికి భారీ మొత్తాలలో డబ్బును అందుబాటులోకి తీసుకువస్తుందని ఆయన తెలిపారు.

భూగర్భ తవ్వకాలు, కోల్ గ్యాసిఫికేషన్ ల వంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫలితంగా ఆదివాసీ గ్రామాలలో కల్లోలాలను కనీస స్థాయికి తగ్గించడం సాధ్యపడుతుందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ వివరించారు. అలాగే తన ప్రసంగంలో ఆయన గ్రామీణ వృద్ధి కేంద్రాల వికాసంపై దృష్టి సారించగల ‘రూర్బన్ మిషన్’ ప్రసక్తిని కూడా తీసుకువచ్చారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi