Quote14 April is an important day for the 125 crore Indians, says PM Modi on Babasaheb’s birth anniversary
QuoteI salute the security personnel who are playing an important role in infrastructure development in Chhattisgarh: PM Modi in Bijapur
QuoteOur government is committed to the dreams and aspirations of people from all sections of the society: PM Modi
QuoteIf a person from a backward society like me could become the PM, it is because of Babasaheb Ambedkar’s contributions: PM Modi in Bijapur
QuoteCentral government is working for the poor, the needy, the downtrodden, the backward and the tribals, says PM Modi
QuoteThe 1st phase of #AyushmanBharat scheme has been started, in which efforts will be made to make major changes in primary health related areas: PM

నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.

|

ఒక గంట సేపటికి పైగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, అనేక మంది ప్రజలతో ప్రధాన మంత్రి భేటీ అయ్యారు. డివెలప్ మెంట్ హబ్ లో అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆయన దృష్టికి అధికారులు తీసుకు వ‌చ్చారు.

హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆయన ఆశా వర్కర్ లతో సంభాషించారు. ఒక ఆంగన్ వాడీ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఆంగన్ వాడీ వర్కర్ లతోను మరియు పోషణ్ అభియాన్ లబ్ధిదారులైన బాలలతోను ఆయన మాట్లాడారు. హాట్ బజార్ హెల్త్ కియోస్క్ ను ఆయన సందర్శించి, హెల్త్ వర్కర్ లతో ముచ్చటించారు. జాంగ్ లా లో ఒక బ్యాంకు శాఖను ఆయన ప్రారంభించారు. ముద్ర పథకం తాలూకు రుణ మంజూరు పత్రాలను ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రదానం చేశారు. రూరల్ బిపిఒ ఉద్యోగులతో కూడా ఆయన భేటీ అయ్యారు.

|

తదనంతరం ప్రధాన మంత్రి, జన సభ జరిగే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆయన ‘వన్ ధన్ యోజన’ ను ప్రారంభించారు. ఈ పథకం ఆదివాసీ సముదాయాలకు సాధికారిత కల్పన కోసం ఉద్దేశించిన పథకం. ఇది కనిష్ఠ మద్దతు ధర ద్వారా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎమ్ఎఫ్ పి) యొక్క మార్కెటింగ్ కు ఒక యంత్రాంగాన్ని, అలాగే ఎమ్ఎఫ్ పి కి ఒక వేల్యూ చైన్ ను కూడా నెలకొల్పాలని సూచిస్తోంది.

|
|

ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా, భానుప్రతాప్ పుర్- గుదుమ్ రైలు మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. ఆయన దల్లీ రాజ్ హరా మరియు భానుప్రతాప్ పుర్ ల మధ్య ఒక రైలుకు ప్రారంభ సూచకంగా జెండాను చూపారు. ఆయన బీజాపుర్ ఆసుపత్రిలో ఒక రక్త శుద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.

|

ప్రధాన మంత్రి ఎల్ డబ్ల్యు ఇ ప్రాంతాలలో పిఎమ్ జిఎస్ వై లో భాగంగా 1988 కి.మీ. రహదారుల నిర్మాణ పనులతో పాటు ఎల్ డబ్ల్యు ఇ ప్రాంతాలలో ఇతర రహదారి అనుసంధాన పథకాలకు, బీజాపుర్ లో నీటి సరఫరా పథకానికి, ఇంకా రెండు వంతెనలకు శంకుస్థాపన చేశారు.

|

ఉత్సాహంగా పాల్గొన్న సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, బ్రిటిషు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతం నుండి ప్రాణ సమర్పణం చేసినటువంటి అమర వీరులకు శ్రద్ధాంజలిని ఘటించారు. అలాగే ఈ ప్రాంతంలో నక్సల్-మావోయిస్టు దాడులలో ప్రాణాలు త్యాగం చేసిన భద్రతదళ సిబ్బందికి కూడా ఆయన శ్రద్ధాంజలిని ఘటించారు.

|

కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు రెండు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిశన్ , ప్రధాన మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన.. లను ఛత్తీస్ గఢ్ నుండే ప్రారంభించిందని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ఈ రోజు, ఆయుష్మాన్ భారత్ ను మరియు గ్రామ్ స్వరాజ్ అభియాన్ ను ఈ రాష్ట్రం నుండి ప్రారంభించడం జరుగుతోందని ఆయన అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ సమాజం లోని పేదలను మరియు ప్రయోజనాలు అందుకోక ఆవల ఉండిపోయినటువంటి వర్గాలను చేరే విధంగా గ్రామ్ స్వరాజ్ అభియాన్ చూస్తుందని ఆయన వివరించారు. గ్రామ్ స్వరాజ్ అభియాన్ ను ఈ రోజు నుండి మే నెల 5వ తేదీ వరకు పొడిగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

|

కోట్లాది ప్రజల హృద‌యాల లోను, మస్తిష్కాల లోను మహత్త్వాకాంక్ష ను రగిలించడంలో బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ ఒక కీలకమైన పాత్రను పోషించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని ఇవాళ బీజాపుర్ లో జరపడం లోని ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, బీజాపుర్ దేశంలో మహత్త్వాకాంక్ష కలిగినటువంటి 100కు పైగా జిల్లాలలో ఒక జిల్లా అని, అభివృద్ధి ప్రయాణంలో ఈ జిల్లాలు వెనుకపట్టు పట్టాయన్నారు. ఈ జిల్లాలను ఇంతవరకు ‘‘వెనుకబడినవి’’ అంటూ ముద్ర వేయడం జరిగిందని, వీటిని మహత్త్వాకాంక్ష కలిగిన మరియు అభ్యుదయేచ్ఛ కలిగిన జిల్లాలుగా మార్చాలని తాను కోరుకొంటున్నానని ఆయన వెల్లడించారు. ఈ జిల్లాలు ఇక ఎంతమాత్రం ఆధారపడినవిగాను, వెనుకబడినవిగాను ఉండబోవు అని ఆయన స్పష్టంచేశారు. జిల్లా పాలనయంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు ఒక సామూహిక ఉద్యమంగా చేతులు కలిపితే, అటువంటప్పుడు, ఇదివరకు ఎరుగని ఫలితాలను సాధించ వచ్చని ఆయన చెప్పారు. ఈ 115 జిల్లాల విషయంలో ప్రభుత్వం ఒక వ్యత్యాసభరితమైనటువంటి విధానంతో పనిచేస్తోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్క జిల్లా తనదైన స్వీయ సవాళ్లను ఎదుర్కొంటోంది, ప్రతి ఒక్క జిల్లా విషయంలో ఒక విభిన్నమైన వ్యూహం అవసరపడుతుంది అని ఆయన చెప్పారు.

|

సామాజిక అసమానతకు స్వస్తి పలకడంలోను, దేశంలో సామాజిక న్యాయం జరిగేలాగా చూడడంలోను ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతగానో తోడ్పడగలదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ఒకటో దశలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లో సమూల మార్పును తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతుందని ఆయన చెప్పారు. దేశంలో 1.5 లక్షల చోట్ల ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాలను ఇప్పుడు ఇక హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యభారాన్ని 2022 కల్లా పూర్తి చేయాలన్నదే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లు పేదలకు ఒక కుటుంబ వైద్యుని వలె పనిచేస్తాయి అని ఆయన వివరించారు.

పేదలకు వైద్య చికిత్స కోసం 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడం ఆయుష్మాన్ భారత్ తదుపరి లక్ష్యం అని ఆయన చెప్పారు.

|

గత పద్నాలుగు సంవత్సరాలకు పైగా ఛత్తీస్ గఢ్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింహ్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. మరీ ముఖ్యంగా, దక్షిణాది జిల్లాలైన సుక్ మా, దంతెవాడ, ఇంకా బీజాపుర్ జిల్లా లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మెచ్చుకొన్నారు. బస్తర్ త్వరలోనే ఒక ఆర్థిక కేంద్ర బిందువుగా గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు. ప్రాంతీయ అసమానతలను అంతమొందించాలంటే అనుసంధానానికి ప్రాముఖ్యం కట్టబెట్టాలని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రారంభం జరిగిన అనుసంధాన పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు సమాజంలోని పేదలు మరియు బలహీన వర్గాల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంగా వన్ ధన్ యోజన ను గురించి, ఇంకా ఆదివాసీ సముదాయాల ప్రయోజనాల కోసం తీసుకొన్నటువంటి ఇతర నిర్ణయాలను గురించి ఆయన ప్రస్తావించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్, బేటీ బచావో- బేటీ పఢావో మరియు ఉజ్జ్వల యోజన వంటి మహిళలకు మేలు చేసిన పథకాలను గురించి చెప్పుకొచ్చారు.

ప్రజల భాగస్వామ్యాన్ని పంచుకోవడం ప్రభుత్వానికి శక్తిని ఇస్తుందని, 2022 కల్లా న్యూ ఇండియా ను ఆవిష్కరించడంలో ప్రజా భాగస్వామ్యం తోడ్పడగలుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive