Ayurveda isn’t just a medical practice. It has a wider scope and covers various aspects of public and environmental health too: PM
Government making efforts to integrate ayurveda, yoga and other traditional medical systems into Public Healthcare System: PM
Availability of affordable healthcare to the poor is a priority area for the Government: PM Modi
The simplest means to achieve Preventive Healthcare is Swachhata: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అఖిల భార‌తీయ ఆయుర్వేద సంస్థ (ఎఐఐఎ)ను ఈ రోజు న్యూ ఢిల్లీలో దేశ ప్ర‌జ‌లకు అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ధ‌న్వంత‌రి జ‌యంతిని ‘‘ఆయుర్వేద దివ‌స్’’ గా జ‌రుపుకొనేందుకు గుమికూడిన స‌భికుల‌ను అభినందించారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ను స్థాపించినందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ను ఆయ‌న ప్రశంసించారు.

దేశాలు వాటి చ‌రిత్ర‌ను మ‌రియు వార‌స‌త్వ విలువ‌ల‌ను మదిలో పదిలపరచుకోనిదే పురోగ‌మించ‌ జాల‌వ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. వార‌స‌త్వాన్ని వెనుకపట్టు పట్టించే దేశాలు వాటి యొక్క గుర్తింపును కోల్పోక తప్పదని కూడా ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం స్వ‌తంత్ర దేశంగా లేని కాలంలో ఆ దేశం యొక్క విజ్ఞానం మ‌రియు యోగా, ఇంకా ఆయుర్వేద వంటి సంప్ర‌దాయాల‌ను విలువ త‌క్కువ చేసి చూడ‌డం జ‌రిగినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. వాటిపై భార‌తీయుల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో ఈ ప‌రిస్థితి చాలా వరకు మారినట్లు, మ‌న వార‌స‌త్వ హితం కోసం దాని ప‌ట్ల ప్ర‌జ‌ల‌ న‌మ్మ‌కాన్ని పున‌రుద్ద‌రించ‌డం జ‌రుగుతున్నట్లు ఆయ‌న తెలిపారు. ‘‘ఆయుర్వేద దివ‌స్’’ లేదా ‘‘యోగా దివ‌స్’’ కోసం ప్ర‌జ‌లు తరలివచ్చిన తీరే మ‌న వార‌స‌త్వం ప‌ట్ల మ‌న‌కు ఉన్న అభిమానాన్ని ప్ర‌తిబింబిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఆయుర్వేదం కేవ‌లం ఒక వైద్య ప‌ద్ధ‌తి కాదు, ప్ర‌జారోగ్యాన్ని మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ సంబంధ స్వ‌స్థ‌త‌ను అది ప‌రివేష్టించి ఉంది కూడా అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ కార‌ణంగానే ప్ర‌భుత్వం ఆయుర్వేదం, యోగా మ‌రియు ఇత‌ర ఆయుష్ వ్య‌వ‌స్థ‌ ల‌ను ప్ర‌జా ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ లో మిళితం చేయ‌డానికి ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంద‌ని తెలిపారు.

దేశంలోని ప్ర‌తి ఒక్క జిల్లాలో ఒక ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేసే దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వెల్ల‌డించారు. గ‌డ‌చిన మూడేళ్ళలో 65కు పైగా ఆయుష్ ఆసుత్రుల‌ను అభివృద్ధిప‌ర‌చ‌డం జ‌రిగినట్లు ఆయ‌న వివ‌రించారు.

మూలిక‌లు, ఓష‌ధీ మొక్క‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక చెప్పుకోద‌గ్గ ఆదాయ వ‌న‌రుగా ఉంటున్నాయ‌ని, ఈ విష‌యంలో భార‌త‌దేశం త‌న శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను స‌ద్వినియోగ ప‌ర‌చుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ విధానాల‌లో 100 శాతం ఎఫ్‌డిఐ ని కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

పేద‌ ప్రజల‌కు అందుబాటులో ఉండే ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను స‌మ‌కూర్చ‌డం పై ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వహిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. నివార‌ణాత్మ‌క ఆరోగ్య సంర‌క్ష‌ణ కు, త‌క్కువ వ్య‌య‌మ‌య్యే చికిత్సలకు మ‌రియు చికిత్స సేవ‌ల ల‌భ్య‌తకు పెద్ద పీట వేస్తున్నామ‌న్నారు. స్వ‌చ్ఛ‌తను కాపాడుకోవడం నివార‌ణాత్మ‌క ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సులువైన మార్గ‌ం అని ఆయ‌న స్పష్టంచేశారు. కేంద్ర ప్ర‌భుత్వం మూడు సంవ‌త్స‌రాల‌లో 5 కోట్ల మ‌రుగుదొడ్ల‌ను నిర్మింపచేసిన‌ట్లు ఆయన వివ‌రించారు.

ప్ర‌జ‌లు ఉత్త‌మ‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందుకోవ‌డంలో సహాయపడేటందుకు ఉద్దేశించిన‌వే నూత‌నంగా నెల‌కొల్పుతున్న ఎఐఐఎమ్ఎస్ లు అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. స్టెంట్ల మ‌రియు మోకాలి చిప్ప మార్పిడి చికిత్స‌ల ధ‌ర‌ల‌కు ఒక ప‌రిమితిని విధించేటటువంటి చ‌ర్య‌లతో పాటు భ‌రించ‌గ‌లిగే ధ‌ర‌ల‌కు మందుల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ‘జ‌న్ ఔష‌ధీ కేంద్రాల’ ఏర్పాటు వంటి చ‌ర్య‌ల‌ను గురించి ఆయన ప్ర‌స్తావించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 డిసెంబర్ 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare