Let us work together to build a new India that would make our freedom fighters proud: PM Modi
Government is committed to cooperative federalism, our mantra is ‘Sabka Sath Sabka Vikas’, says PM Modi
To prevent, control and manage diseases like cancer we need action from all sections of society including NGOs and private sector: PM
Under #AyushmanBharat, we will provide preventive and curative services at primary care level to people near their homes, says PM Modi

త‌మిళ నాడు గ‌వ‌ర్న‌ర్,

త‌మిళ నాడు ముఖ్యమంత్రి,

నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు,

త‌మిళ నాడు ఉప ముఖ్య‌మంత్రి,

వేదిక‌ను అలంక‌రించిన ఇత‌ర ప్ర‌ముఖులు,

మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విస్త‌రించిన త‌మిళ ప్ర‌జ‌ల‌కు త్వరలో ఏప్రిల్ 14వ తేదీ నాడు రానున్న విళంబి నామ త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా నేను సాద‌ర శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేస్తున్నాను. అడ‌యార్ లోని కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ కు విచ్చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది భార‌త‌దేశం లోని కేన్స‌ర్ సమగ్ర సంర‌క్ష‌ణ కేంద్రాలలో ఓ అత్యంత ప్రాచీన‌మైన కేంద్రమే కాకుండా, అత్యంత ముఖ్య‌మైన కేంద్రంగా కూడా ఉంది.

అసాంక్రామిక వ్యాధుల భారాన్ని మారుతున్న జీవ‌న‌శైలులు పెంచివేస్తున్నాయి. కొన్ని అంచ‌నాల ప్ర‌కారం, మ‌న దేశంలో సంభ‌విస్తున్న మొత్తం మ‌ర‌ణాల‌లో దాదాపు 60 శాతం మ‌ర‌ణాలు అసాంక్రామిక వ్యాధుల కార‌ణం గానే సంభ‌విస్తున్నాయి.

దేశంలోని వేరు వేరు ప్రాంతాల‌లో 20 స్టేట్ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ ల‌ను మ‌రియు 50 టర్శరి కేర్ కేన్స‌ర్ సెంట‌ర్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం పథ‌కాలు సిద్ధం చేసింది. స్టేట్ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ స్థాప‌న‌కు గాను 120 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు మ‌రియు టెర్ష‌రీ కేర్ కేన్స‌ర్ సెంట‌ర్ స్థాప‌న‌కు గాను 45 కోట్ల రూపాయ‌ల‌కు అర్హ‌త క‌లిగిన సంస్థ‌లు చేసే ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదించే అవకాశం ఉంది. 15 స్టేట్ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ లు మ‌రియు 20 టర్శరి కేర్ కేన్స‌ర్ సెంట‌ర్ల ను ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న‌లు ఇంతవరకు ఆమోదం పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. కేన్స‌ర్ కు సంబంధించిన వేరు వేరు కోణాలను అధ్య‌య‌నం చేయడంపై దృష్టి సారించే విధంగా 14 ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ను నూతనంగా ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.

ప్ర‌ధాన మంత్రి స్వాస్థ్య సుర‌క్ష‌ యోజ‌న లో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి 8 ఇన్ స్టిట్యూట్ లకు కేన్స‌ర్ అధ్య‌య‌న సేవ‌ల‌కు అవ‌కాశం ఉండేట‌ట్లుగా మెరుగులు దిద్దడం జ‌రుగుతోంది. ముందస్తు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాల‌ని 2017 సంవ‌త్స‌ర జాతీయ ఆరోగ్య విధానం స్ప‌ష్టం చేస్తోంది.

ఆయుష్మాన్ భార‌త్ లో నిర్దేశించుకొన్న స‌మ‌గ్ర ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ లో భాగంగా మేము ప్ర‌జ‌ల‌కు వారి ఇళ్ళ స‌మీపంలోనే నివార‌క మ‌రియు రోగ నాశ‌క సేవ‌ల‌ను అందిస్తాము.

మ‌ధుమేహం, ర‌క్త‌పోటు ఇంకా సాధార‌ణ కేన్స‌ర్ ల వంటి అసాంక్రామిక వ్యాధులను జ‌నాభా ప్రాతిప‌దిక‌న నివారించే, నియంత్రించే, త‌నిఖీ చేసే మ‌రియు నిర్వ‌హ‌ణ‌ను చేప‌ట్టేందుకు మేము చొర‌వ తీసుకొన్నాము.

ఆయుష్మాన్ భార‌త్ లో ప్ర‌ధాన మంత్రి జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ అభియాన్ కూడా ఒక భాగంగా ఉంటుంది.

ఇది పది కోట్లకు పైగా కుటుంబాల‌కు ర‌క్ష‌ణ‌ ను కల్పిస్తుంది. ఈ అభియాన్ ద్వారా దాదాపు 50 కోట్ల మంది ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ అభియాన్ లో భాగంగా- ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరానికి ద్వితీయ స్థాయి మ‌రియు తృతీయ స్థాయి సంర‌క్ష‌ణ సంబంధ హాస్పిటలైజేశన్ కోసం 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు బీమా ర‌క్ష‌ణ ను- స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది.

ఇది ప్రపంచంలోనే ప్ర‌భుత్వ నిధుల‌తో నడిచే అతి పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మం కాబోతోంది. ఈ ప‌థ‌కం యొక్క ప్ర‌యోజ‌నాలు దేశం న‌లుమూల‌లా అందుకోవ‌డానికి వీలు గా ఉంటాయి. ఎంపిక చేసిన ప్ర‌భుత్వ మ‌రియు ప్రైవేటు ఆసుప‌త్రుల‌లో ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కం తాలూకు లాభాలను పొంద‌గ‌లుగుతారు. ఆరోగ్యంగా ఉండడం కోసం జేబు నుండి పెట్టే ఖర్చును త‌గ్గించ‌డమే ఈ పథకం యొక్క ఉద్దేశం.

కేన్స‌ర్ వంటి వ్యాధుల‌ను నివారించ‌డానికి, నియంత్రించ‌డానికి మ‌రియు సంబాళించ‌డానికి ఎన్‌జిఒ లు మ‌రియు ప్రైవేటు రంగం స‌హా స‌మాజం లోని అన్ని వ‌ర్గాల కార్యాచ‌ర‌ణా అవ‌స‌రపడుతుంది.

చెన్నై లోని కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ (డ‌బ్ల్యుఐఎ) ఒక స్వ‌చ్ఛంద‌మైన దాన‌శీల సంస్థ‌. దివంగ‌త డాక్ట‌ర్ ముత్తు ల‌క్ష్మి రెడ్డి యొక్క స్ఫూర్తిదాయ‌క‌మైనటువంటి నేతృత్వంలో, స్వ‌చ్ఛంద మ‌హిళా కార్య‌క‌ర్త‌ల సామాజిక బృందమొకటి దీనిని నెల‌కొల్పింది.

ఈ సంస్థ ఒక చిన్న కుటీర వైద్య శాల గా మొద‌లైంది. ద‌క్షిణ భార‌త‌దేశం లో మొట్ట‌మొద‌టిదీ, దేశంలో రెండోదీ అయిన‌టువంటి కేన్స‌ర్ స్పెషాలిటీ హాస్ప‌ట‌ల్‌ ఇదే. ప్ర‌స్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్ లో 500 ప‌డ‌క‌ల‌తో కూడిన ఒక కేన్స‌ర్ ఆసుప‌త్రి ప‌ని చేస్తోంది. ఈ ప‌డ‌క‌ల‌లో 30 శాతం ప‌డ‌క‌ల‌ను ఉచితంగా, రోగుల వ‌ద్ద నుండి ఎటువంటి రుసుమునూ తీసుకోకుండా సమకూర్చుతున్నట్లు నాతో చెప్పారు.

ఈ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన మ‌లెక్యుల‌ర్ ఆంకాల‌జీ డిపార్ట్‌మెంట్ కు కేంద్ర ప్ర‌భుత్వం 2007 సంవ‌త్స‌రంలో “సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్” గా పేరు పెట్టింది. ఇది 1984వ సంవ‌త్స‌రంలో భార‌త‌దేశంలో ఏర్పాటు చేయ‌బ‌డిన ఒక‌టో సూప‌ర్ స్పెషాలిటీ కాలేజి. ఇవి మార్గ‌ద‌ర్శ‌క‌మైన మ‌రియు ప్ర‌శంసాయోగ్య‌మైన కార్య‌సాధ‌న‌లు.

డాక్ట‌ర్ శాంత తాను ఇచ్చిన ప్రారంభోప‌న్యాసంలో, ఇన్‌స్టిట్యూట్ కొన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్పుకొచ్చారు. ఆ ఇబ్బందుల‌ను మేము ప‌రిశీలిస్తామ‌ని ఆవిడ‌ కు నేను హామీని ఇవ్వ‌ద‌లచాను. అంతేకాదు, ఏమి చేయాలో చూడ‌వ‌ల‌సిందిగా తమిళ నాడు ముఖ్య‌మంత్రి ని అభ్య‌ర్ధిస్తాను కూడా. ఆఖరులో, గ‌త కొన్ని రోజులుగా కొన్ని స్వార్ధ‌ప‌ర శ‌క్తులు లేవ‌నెత్తిన ఒక అంశాన్ని గురించి నేను కొద్దిసేపు ప్ర‌స్తావిస్తాను.

15వ ఆర్థిక సంఘం ట‌ర్మ్‌స్ ఆఫ్ రిఫ‌రెన్స్ కొన్ని రాష్ట్రాల‌ పట్ల పక్షపాతం కలవిగానో, లేదా ఫ‌లానా ప్రాంతానికి వ్య‌తిరేకంగానో ఉన్నాయంటూ ఒక నిరాధార‌మైన ఆరోప‌ణ‌ ను తీసుకొస్తున్నారు. మా విమ‌ర్శ‌కులు ఏదో విష‌యాన్ని చేజార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని మీతో నేను చెప్తున్నాను. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో కృషి చేసిన రాష్ట్రాల‌కు ప్రోత్సాహ‌కాల‌ను అందించ‌డాన్ని గురించి ప‌రిశీలించ‌వ‌ల‌సిందిగా ఆర్థిక సంఘానికి కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న చేసింది. ఈ కొల‌బ‌ద్ద‌ను బ‌ట్టి చూస్తే, జ‌నాభా నియంత్ర‌ణ దిశ‌ గా ఎంతో కృషి చేసి, శ‌క్తి ని మరియు వ‌న‌రుల‌ను స‌మ‌ర్పించిన త‌మిళ నాడు వంటి రాష్ట్రం త‌ప్ప‌క ప్ర‌యోజనం పొందగలదు. ఇటువంటి ప‌రిస్థితి ఇదివరకు లేదు.

మిత్రులారా,

కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కార పూర్వక స‌మాఖ్య విధానానికి కంక‌ణ‌బ‌ద్ధురాలై వుంది. మా మంత్రం ఏమిటంటే, ‘స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్’. మ‌న‌మంతా క‌ల‌సి ఒక ‘న్యూ ఇండియా’ను- ఏదైతే మ‌న మ‌హ‌నీయ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు గ‌ర్వ‌ప‌డేటట్లు చేయ‌గ‌లదో- అటువంటి దానిని నిర్మించ‌డానికి కృషి చేద్దాం.

మీకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.