We live in an era in which connectivity is all important: PM Modi
Governance cannot happen when the dominant thought process begins at 'Mera Kya' and ends at 'Mujhe Kya’: PM Modi
Atal Bihari Vajpayee Ji is the 'Bharat Marg Vidhata.' He has shown us the way towards development: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఈరోజు (డిసెంబ‌ర్ 25,2017) నోయిడా, ఢిల్లీ ల మ‌ధ్య కొత్త మెట్రో లింక్‌ను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు చెందిన మెజెంటా లైన్‌లో కొంత భాగం ప్రారంభోత్స‌వం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి బొటానిక‌ల్ గార్డెన్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఒక ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రించారు. ఈ లైన్ నోయిడాలోని బోటానిక‌ల్‌గార్డెన్‌నుద‌క్షిణ ఢిల్లీలోని కాల్కాజి మందిర్‌తో అనుసంధానం చేస్తుంది. ఈ సంద‌ర్బంగా ఏర్పాటైన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌డానిక వ‌చ్చే ముందు ప్ర‌ధాన‌మంత్రి కొద్ది దూరం ఈ మెట్రో రైలులో ప్ర‌యాణించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి , ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.ఈ రోజు ఇద్ద‌రు భార‌త ర‌త్న‌ల జ‌న్మ‌దినమ‌ని ప్ర‌ధాని తెలిపారు. ఇందులో ఒక‌రు పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ కాగా మ‌రొక‌రు మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి అని చెప్పారు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల వ‌ల్ల దేశం బ‌ల‌మైన , సుస్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని పొందింద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు త‌న‌పై చూపిన అభిమానానికి తాను ఎల్ల‌వేళ‌లా కృత‌జ్ఞుడినై ఉంటాన‌ని అన్నారు.

క‌నెక్టివిటీ ఎంతో ప్ర‌ధాన‌మైన శ‌కంలో మ‌నం జీవిస్తున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ప్ర‌స్తుతం ప్రారంభించిన మెట్రోలైను ప్ర‌స్తుత త‌రానికి మాత్ర‌మే కాకుండా భ‌విష్య‌త్ త‌రాల‌కు కూడా ఎంతో ఉప‌యోగిస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. 2022 నాటికి దేశం 75 వ‌సంతాల స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జ‌రుపుకునే నాటికి దేశంలోకి పెట్రోలు దిగుమ‌తులు బాగా త‌గ్గాల‌న్న‌ది త‌న ఆకాంక్ష అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ స్థితికి చేరుకోవాలంటే, జ‌న‌బాహుళ్య అధునాత‌న‌ ర‌వాణా సాధ‌నాలు త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. 2002 డిసెంబ‌ర్‌లో మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీ మెట్రో రైలులో ప్ర‌యాణించిన విష‌యాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్ప‌టి నుంచి దేశ రాజ‌ధాని ప్రాంతంలో మెట్రో నెట్‌వ‌ర్క్ గ‌ణ‌నీయంగా విస్త‌రించింద‌ని ఆయ‌న చెప్పారు.

ఎక్కుమంది ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం నాకేంటి తో మొద‌లై మ‌న‌కేంటితో అంత‌మైతే పాల‌న అనేది ఉండ‌ద‌ని, ఇలాంటి ధోర‌ణిని ఇప్పుడు మార్చ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం విష‌యానికి వ‌స్తే అది తీసుకుంటున్న నిర్ణ‌యాలు, జాతీయ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన‌వే కాని రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నాల‌తో కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

గ‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాలు చేయ‌డం ప్ర‌తిష్ఠగాభావించింద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నిర‌ర్ధ‌క‌ చ‌ట్టాల‌ను తొల‌గించే ప్ర‌భుత్వమ‌ని చెప్పారు. కాలం చెల్లిన చ‌ట్టాలు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అడ్డుత‌గిలేలా ఉంటే సుప‌రిపాల‌న సాధ్యం కాద‌ని ప్ర‌ధానమంత్రి చెప్పారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ను అభినందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, సుప‌రిపాల‌న‌పై యోగి ఆదిత్య‌నాధ్ పెట్టిన ప్ర‌త్యేక దృష్టి రాష్ట్రాన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకుపోతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ న‌గ‌రానికి రావ‌డం ద్వారా నోయిడాతో ముడిప‌డిన మూఢ‌న‌మ్మ‌కాన్ని పార‌ద్రోలిన ఘ‌న‌త ఆయ‌న‌కు ద‌క్కుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు.ఒక ప్ర‌దేశానికి వెళితే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఎంతో కాలం ఉంటుంద‌ని, మ‌రో ప్రాంతానికిపోతే ముఖ్య‌మంత్రి ప‌దవీకాలం తొంద‌ర‌గా ముగుస్తుంద‌ని ఎవ‌రైనా అనుకుంటే అలాంటి వ్య‌క్తి ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌డానికి అన‌ర్హుడ‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

రైల్వే మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ర‌హ‌దారినెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల రంగంలో ప్ర‌గ‌తి వంటి అంశాల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయిని ఆయ‌న భార‌త మార్గ విధాత‌గా సంబోధించారు. వారు అభివృద్ధి దిశ‌గా మార్గాన్ని చూపార‌ని కొనియాడారు.
అంత‌కు ముందు త‌న ప్ర‌సంగంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ‌యోగి ఆదిత్య‌నాథ్‌, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ప్రశంసించారు. ఈ దేశంలో రాజ‌కీయాల‌కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొత్త అర్థాన్నిఇచ్చార‌ని శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కొనియాడారు. మ‌నం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ఎప్పుడూ చెబుతుంటార‌ని ఆయ‌న అన్నారు.

Click here to read the full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage