తమిళ నాడు గవర్నర్,
లోక్ సభ డిప్యూటీ స్పీకర్,
తమిళ నాడు ముఖ్యమంత్రి,
తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి,
నా మంత్రివర్గ సహచరులు,
ప్రముఖ సందర్శకులు,
మిత్రులారా,
మీ అందరికీ శుభోదయం.
ఇది డిఫ్- ఎక్స్‌పో 10 వ సంచిక.
మీలో కొందరు ఇంతకు ముందు ఈ కార్యక్రమానికి అనేక సార్లు హాజరు అయివుంటారు. మరికొందరయితే ఈ ఎక్స్ పో మొదలు అయినప్పటి నుండే దీనికి హాజరవుతూ వుండి ఉంటారు.
కానీ నాకు మాత్రం, డిఫ్- ఎక్స్‌పో లో పాల్గొనడం ఇది ఒకటో సారి. గొప్ప రాష్ట్రమైన తమిళ నాడు లో చారిత్రక ప్రాధాన్యం గల కాంచిపురం లో ఇక్కడ ఇంత మంది ప్రముఖులను చూసి ఎంతో ఆనందంగా ఉంది.
చోళులు పరిపాలించిన ఈ గడ్డ కు నేను రావడం నాకు మహదానందంగా ఉంది. చోళులు వాణిజ్యం మరియు విద్య ద్వారా భారతదేశ నాగరకతను సుసంపన్నం చేశారు. ఘనమైన నౌకావాణిజ్యానికి ఘనమైన వారసత్వం కలిగినటువంటి ప్రాంతం ఇది.
ఇక్కడ నుండి భారతదేశం వేల సంవత్సరాల క్రితమే ప్రాగ్దిశా వీక్షణం చేయడమే కాకుండా ఆ దిశ గా చర్యలను కూడా చేపట్టింది.
మిత్రులారా,
ఇక్కడకు ఐదు వందలకు పైగా భారతీయ కంపెనీలు, నూట యాభై కి పైగా విదేశీ కంపెనీలు తరలిరావడం చూస్తే ఎంతో ఆనందం కలుగుతోంది.
నలభై కి పైగా దేశాలు తమ అధికార ప్రతినిధివర్గాలను పంపాయి కూడా.
భారతదేశ రక్షణ అవసరాల గురించి చర్చించడమే కాకుండా, తొలి సారి గా భారతదేశ స్వీయ రక్షణ తయారీ సామర్ధ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు లభించిన మహదవకాశం కూడాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయుధ బలగాలకు సరఫరా వలయంలో ఉన్న ప్రాధాన్యం బాగా తెలుసును. యుద్ధ రంగం లోనే కాదు, రక్షణ రంగానికి చెందిన తయారీ సంస్థల కార్యాలయాల లోనూ వ్యూహాత్మక నిర్ణయాలు జరుగుతాయి.
ఇవాళ మనం అనుసంధానిత ప్రపంచంలో ఉన్నాం. ఏ తయారీ సంస్థలో అయినా సరఫరా వలయం సామర్ధ్యమే అత్యంత కీలకం. అందువల్ల మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా కార్యక్రమాలకు, ప్రపంచానికి వివిధ ఉత్పత్తులు సరఫరా చేయడానికి వ్యూహాత్మక ఆవశ్యకత ఇంతకు ముందు కంటే ఎంతో బలంగా ఉంది.
మిత్రులారా,
మనం ఏ దేశ భూభాగాన్నీ కోరుకోలేదని వేల సంవత్సరాల మన చరిత్ర తెలియజేస్తోంది. యుద్ధాల ద్వారా దేశాలను గెలుచుకోవడం కంటే, ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న దానిని భారతదేశం విశ్వసిస్తోంది. వేద కాలం నుండీ కూడా ఈ పవిత్ర భూమి నుండే శాంతి సందేశం, విశ్వసోదరభావం సందేశం విశ్వవ్యాప్తం అయ్యాయి.
ప్రపంచంలో బౌద్ధం వెలుగులు ఈ గడ్డ నుండే పరివ్యాప్తం అయ్యాయి. అంతే కాదు, అశోకుడి కాలం, ఇంకా ఆ ముందు నుండే మానవతావాదం యొక్క అత్యున్నత విలువల పరిరక్షణకు తన బలాన్ని ఉపయోగించడాన్ని విశ్వసిస్తూ వస్తోంది.
ఆధునిక కాలంలో జరిగిన ప్రపంచ యుద్ధాలలో 133 వేల మంది భారతీయ సైనికులు గత శతాబ్దంలో వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఏదైనా భూభాగం కోసం ఈ పని ని వారు చేయలేదు. మానవ విలువలను స్థాపించడానికి, ఆయా ప్రాంతాలలో శాంతి స్థాపనకు భారతీయ సైనికులు కృషి చేశారు. భారతదేశం అత్యధిక సంఖ్యలో ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలను ప్రపంచం లోని అన్ని ప్రాంతాలకు పంపింది.
అలాగే, తన ప్రజలను రక్షించడం అనేది ప్రభుత్వం ప్రధాన బాధ్యత. ప్రముఖ వ్యూహకర్త , ఆలోచనాపరుడైన కౌటిల్యుడు రెండువేల సంవత్సరాల క్రితమే అర్థశాస్త్రాన్ని రాశాడు. రాజు లేదా పాలకుడు తన ప్రజలను రక్షించాలని చెప్పాడు. యుద్ధాని కంటే శాంతికే ప్రాధాన్యం ఇవ్వాలన్నాడు. భారతదేశ రక్షణ సన్నద్ధతకు ఈ ఆలోచనలే మార్గనిర్దేశం చేస్తున్నాయి. శాంతికి ఎంతగా కట్టుబడి ఉన్నామో, మన ప్రజల రక్షణకూ, మన భూ భాగ రక్షణకూ అంతే కట్టుబడి ఉన్నాము. ఇందుకు , సాయుధ బలగాలను బలోపేతం చేయడానికి ప్రత్యేకించి వ్యూహాత్మక స్వతంత్ర రక్షణ పారిశ్రామిక పార్కు ను ఏర్పాటు చేయడంతో పాటు ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం.
మిత్రులారా,
రక్షణ సంబంధిత పారిశ్రామిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం అంత సులభమైన విషయం కాదని మాకు తెలుసు. ఇందుకు ఎంతో చేయాలని మేము ఎరుగుదుము. పజిల్ లో ఎన్నో ముక్కలను ఒక చోట చేర్చటానికి ప్రయత్నించినట్టు అన్నింటినీ ఒక చోటుకు చేర్చవలసిన అవసరం ఉందని మాకు తెలుసు. ప్రభుత్వ ప్రమేయం విషయంలో రక్షణ ఉత్పత్తి రంగం ప్రత్యేకమైందని మాకు తెలుసు. తయారీ దారుకు అనుమతిని మంజూరు చేయడానికి మీకు ప్రభుత్వం అవసరం. భారతదేశం లో ప్రభుత్వం ఒక్కటే రక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారు. ఇందుకు ఆర్డర్ ఇవ్వడానికీ ప్రభుత్వమే అవసరం.
అలాగే, ఎగుమతులకు అనుమతిని ఇవ్వాలన్నా ఆ పని ని ప్రభుత్వమే చేయాలి.
అందువల్ల గడచిన కొద్ది సంవత్సరాలుగా మేం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం. రక్షణ తయారీ లైసెన్సులు, రక్షణ రంగ ఎగుమతుల క్లియరెన్సులు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రక్షణ సేకరణ రంగంలో సంస్కరణలు, ఇలా మేం ఎన్నో చర్యలు తీసుకువచ్చాం.
ఈ అన్ని రంగాలలో, మన నియంత్రణలు, ప్రక్రియలు అన్నింటినీ పరిశ్రమలకు హితకరంగా, పారదర్శకతతో అంచనా వేయడానికి వీలుగా ఉండేటట్టు, మరింతగా ఫలితాలు సాధించేలాగున చర్యలు తీసుకోవడం జరిగింది. లైసెన్సుల జారీకి సంబంధించిన డిఫెన్సు ఉత్పత్తులకు సంబంధించిన జాబితాను సవరించడం జరిగింది. పరిశ్రమకు ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రవేశ అడ్డంకులు తగ్గించడానికి జాబితా నుండి చాలా వరకు విడిభాగాలు, ఉప వ్యవస్థలు, పరీక్షా పరికరాలు, ఉత్పత్తి పరికరాలను తొలగించడం జరిగింది.
ఈ రంగానికి సంబంధించి ప్రాథమిక పారిశ్రామిక లైసెన్సును మూడు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచాం. దీనిని మరో మూడు సంవత్సరాలు పెంచడానికీ వీలు కల్పించాం. ఆఫ్‌సెట్ మార్గదర్శకాలను ఆఫ్ సెట్ భాగస్వాములు, ఆఫ్‌సెట్ కాంపొనంట్ లలో మార్పులకు వీలుగా రూపొందించడం జరిగింది. ఇప్పటికే కుదుర్చుకున్న కాంట్రాక్టులకూ దీనిని వర్తింప చేయనున్నారు.
విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఇండియన్ ఆఫ్‌సెట్ భాగస్వాముల గురించి, ఉత్పత్తుల గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఆఫ్‌సెట్ డిశ్చార్జికి మార్గంగా మేం సేవలను తిరిగి ప్రారంభించాం.
ఎగుమతుల ఆథరైజేషన్‌కు ప్రమాణీకృత ఆపరేటింగ్ ప్రక్రియ ను సులభతరం చేసి దానిని పబ్లిక్ డమేన్ లో ఉంచాం. విడిభాగాలు, నాన్ సెన్సిటివ్ మిలిటరీ స్టోర్స్‌కు సంబంధించి సబ్ అసెంబ్లీల విషయంలో ప్రభుత్వం ఎండ్ యూజర్ సంతకం చేయాలన్న నిబంధనను ఎత్తివేయడం జరిగింది.
మే 2001 వరకు ప్రైవేటు రంగానికి రక్షణ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి లేదు. తొలిసారిగా శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించింది.
మేం దీనిని మరింత ముందుకు తీసుకుపోయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 26 శాతం నుండి 49 శాతానికి ఆటోమేటిక్ రూట్‌లో కేస్- టు- కేస్ ప్రాతిపదికన 100 శాతం వరకు అనమతించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను కూడా సవరించి, దేశీయ రక్షణ పరిశ్రమ ప్రగతికి వీలు కల్పించే ప్రత్యేక నిబంధనలు చేర్చడం జరిగింది.
గతంలో ఆయుధ కర్మాగారాలు మాత్రమే తయారు చేసే కొన్ని ఐటమ్ లను కూడా మేం డి- నోటిఫై చేశాం. దీనివల్ల ప్రైవేటు రంగం, ప్రత్యేకించి ఈ రంగం లోకి చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలు ప్రవేశించడానికి వీలు కలుగుతుంది.
రక్షణ రంగంలో సూక్ష్మ , చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి, 2012 లో నోటిఫై చేసిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్ పాలసీని 2015 ఏప్రిల్ నుండి తప్పనిసరి చేయడం జరిగింది. ఫలితంగా మనం కొన్ని ప్రోత్సాహక ఫలితాలను సాధించాం.
2014 మే నెలలో మొత్తం జారీ అయిన రక్షణ లైసెన్సులు 215. కేవలం నాలుగు సంవత్సరాలలో మరింత పారదర్శకతతో, తగిన ప్రక్రియ ద్వారా మరో 144 లైసెన్సులు జారీ చేశాం.
2014 మే నెల నాటికి మెత్తం రక్షణ ఎగుమతుల అనుమతులు 118. వీటి మొత్తం విలువ 577 మిలియన్ డాలర్లు. కాగా పట్టుమని నాలుగేళ్ల వ్యవధిలో మేం 794 అదనపు ఎగుమతి పర్మిషన్ లను సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువ గల వాటిని మంజూరు చేశాం. 2007 నుండి 2013 వరకు టార్గెటెడ్ ఆఫ్‌సెట్స్ ఆబ్లిగేషన్ 1.24 బిలియన్ డాలర్లు. ఇందులో 0.79 బిలియన్ డాలర్ల విలువ గల ఆఫ్‌సెట్‌లు వాస్తవానికి డిశ్చార్జ్ చేయబడ్డాయి. ఇది 63 శాతం సాఫల్యత రేటు మాత్రమే.
2014 నుండి 2017 వరకు లక్షిత ఆఫ్‌సెట్ ఆబ్లిగేషన్ లు 1.79 బిలియన్ డాలర్లు. ఇందులో 1.42 బిలియన్ డాలర్ల విలువ గల ఆఫ్‌సెట్‌లు రియలైజ్ కాబడ్డాయి. ఇది 80 శాతం సాఫల్యత రేటు కు దగ్గరగా ఉంది. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, ఆయుధ కర్మాగారాలు సూక్ష్మ, చిన్న తరహా సంస్థల నుండి సేకరించిన ఉత్పత్తులు 2014-15 సంవత్సరంలో 3300 కోట్ల రూపాయలు ఉండగా, 2016-2017 సంవత్సరం నాటికి అది 4250 కోట్ల రూపాయలకు చేరింది. ఇది సుమారు 30 శాతం పెరుగుదల.
రక్షణ రంగ ఉత్పత్తి ప్రక్రియ కు చిన్న, మధ్యతరహా రంగానికి చెందిన సంస్థలు అందించిన తోడ్పాటు గత నాలుగు సంవత్సరాలలో 200 శాతం పెరగడం ఉత్సాహపరుస్తోంది.
మరి, అవి గ్లోబల్ సరఫరా వలయం లో భాగస్వాములు కావడం కూడా అధికం అవుతోంది.
డిఫెన్స్ కేపిటల్ వ్యయం ద్వారా పొందిన ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ లలో భారతీయ విక్రేతల వాటా 2011-14లో 50 శాతం నుండి గత మూడు సంవత్సరాలలో 60 శాతానికి పైగాపెరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
రాగల సంవత్సరాలలో ఇది తప్పక మరింత మెరుగుపడగలదని నేను ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా,
ముందే ప్రస్తావించినట్టు, ఇంకా మేం చేయవలసింది ఎంతో ఉందని నాకు తెలుసు. అందుకు మేం కట్టుబడి ఉన్నాం కూడా.
రక్షణ రంగ పారిశ్రామిక భవన సముదాయాన్ని నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నాం. అందులో ప్రభుత్వరంగానికి, ప్రైవేటు రంగానికి, అలాగే విదేశీ సంస్థలకు కూడా అవకాశం ఉంటుంది.
మేం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్ లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాం. అందులో ఒకటి తమిళ నాడు లో, మరొకటి ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ రక్షణ పారిశ్రామిక కారిడార్ లు, ఈ ప్రాంతం లోని ప్రస్తుత రక్షణ తయారీ వాతావరణాన్ని ఉపయోగించుకొంటూ మరింత వృద్ధి లోకి రానున్నాయి.
ఈ కారిడార్ లు దేశంలో రక్షణ పారిశ్రామిక పునాది పటిష్టతకు, ప్రగతికి, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఉండనున్నాయి. రక్షణ ఉత్పత్తి రంగంతో ముడిపడిన పెట్టుబడి దారులకు సహాయపడేందుకు మేం డిఫెన్స్ ఇన్వెస్టర్ సెల్ ను కూడా ఏర్పాటు చేశాం.
మిత్రులారా,
రక్షణ రంగంలో సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు, పరిశోధన మరియు అభివృద్ధి విషయంలో ప్రభుత్వ మద్దతు అత్యవసరం.
రక్షణ రంగ పరిశ్రమలు తగిన ప్రణాళిక ను రూపొందించుకోవడానికి, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, భాగస్వామ్యాలు, ఉత్పత్తి ఏర్పాట్లకు సంబంధించి సహాయపడేందుకు సాంకేతిక విజ్ఞాన దార్శనిక పత్రం, సామర్ధ్యాల భవిష్యత్ సూచీని విడుదల చేయడం జరిగింది.
ఇటీవలి కాలంలో మేం నూతన ఆవిష్కరణ లను, వాణిజ్యతత్వాన్ని భారతదేశ వ్యాపార రంగంలో మరింతగా ప్రోత్సహించేందుకు, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్- అప్ ఇండియా, అటల్ ఇనవేశన్ మిషన్ వంటి ఎన్నో చర్యలు తీసుకొన్నాం.
ఇవాళ, మనం ఇనవేశన్ ఫర్ డిఫెన్స్ ఎక్సె లెన్స్ పథకాన్ని ప్రారంభించుకున్నాం. ఇది రక్షణ రంగంలో స్టార్ట్- అప్ లకు తయీరీ సంబంధిత మద్దతును క ల్పించడం, అవసరమైన ఇన్ క్యుబేషన్ సదుపాయాలను కల్పించడానికి దేశవ్యాప్తంగా డిఫెన్స్ ఇనవేశన్ హబ్‌లను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
డిఫెన్స్ రంగంలో ప్రైవేటు వెంచర్ కేపిటల్ ప్రత్యేకించి స్టార్ట్- అప్ ల విషయంలో ప్రోత్సహించడం జరుగుతోంది.
ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ల వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు భవిష్యత్తులో రక్షణ రంగ సామర్ధ్యాలను నిర్ణయించనున్నాయి.
ఇన్ఫర్ మేశన్ టెక్నాలజీ రంగంలో నాయకత్వ స్థానంలో ఉన్న భారతదేశం, దీనిని తనకు అనుకూలంగా మలచుకోగలదు.
మిత్రులారా,
పూర్వ రాష్ట్రపతి భారతదేశానికి, తమిళ నాడుకు గొప్ప పుత్రుడైన భారత రత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ మన అందరికీ ఒక పిలుపును ఇచ్చారు. అది.. ‘‘కలలు కనండి, కలలు కనండి కలలు కనండి.. ఆ కలలు ఆలోచనలు గా, ఆలోచనలు కార్యరూపంగా మారుతాయి’’ అని.
రక్షణ ఉత్పత్తి రంగంలో కొత్త, సృజనాత్మక వాతావరణాన్ని అభివృద్ధి చేయడం మన కల..
ఇందుకోసం, రాగల వారాలలో మేం సంబంధిత వర్గాల వారితో విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నాం. ఇందుకు భారతదేశ కంపెనీలు, విదేశీ కంపెనీలతో రక్షణ ఉత్పత్తులు, రక్షణ సేకరణ విధానానికి సంబంధించి సంప్రదింపులు జరపనున్నాం. మా లక్ష్యం కేవలం చర్చలు జరపడం కాదు, వీటి నుండి సరైన పాఠాలను నేర్చుకోవడం. మా ఉద్దేశం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, వినడం. మా లక్ష్యం కేవలం ఏదో చిన్న చిన్న మార్పులు చేయడం కాదు; పరివర్తన ను తీసుకురావడం..
మిత్రులారా,
మేం వేగంగా ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ఇందుకు మేం దగ్గరి దారులను చూడడం లేదు.
విధానపరమైన స్తబ్దత కారణంగా గతంలో పాలన కు సంబంధించిన పలు అంశాలతో పాటు, రక్షణ సన్నద్ధత వంటి కీలక అంశాలకు కూడా అవరోధాలు ఏర్పడ్డాయి.
బద్ధకం, అసమర్ధత, ఏవో ఇతర ఉ ద్దేశాలు వంటివి దేశానికి ఎంత నష్టం కలిగిస్తాయో మనం చూశాం.
ఇప్పుడే కాదు, ఇంకెంత మాత్రం అలా ఉండడానికి వీలు లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని అంశాలు ఇప్పుడు పరిష్కారానికి నోచుకొంటున్నాయి.
భారతీయ జవాన్ లకు బులిట్ ఫ్రూఫ్ జాకెట్ లను సమకూర్చే నిర్ణయం ఎన్ని సంవత్సరాలు అలా ఒక నిర్ణయమనేది తీసుకోకుండా ఉండిపోయిందో మీరు చూశారు.
మరి, దానిని విజయవంతమైన ముగింపునకు మేం తీసుకురావడాన్ని కూడా మీరు గమనించారు. ఈ కాంట్రాక్టు దేశంలో రక్షణ ఉత్పత్తుల రంగానికి గొప్ప ఊతాన్ని ఇవ్వనుంది. అలాగే ఫైటర్ ఎయర్‌క్రాఫ్ట్ లను సమకూర్చుకోవడానికి సంబంధించిన సుదీర్ఘ ప్రక్రియ ఏనాటికీ ముగింపునకు రాని విషయాన్నీ మీరు చూశారు.
మేం మన తక్షణ కీలక అవసరాలకు సంబంధించి అవసరమైన గొప్పనిర్ణయాలను తీసుకోవడమే కాకుండా, 110 ఫైటర్ ఎయర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవడానికి నూతన ప్రక్రియను ప్రారంభించాం. ఎలాంటి ఫలితం లేకుండా పది సంవత్సరాల కాలాన్ని చర్చలలోనే గడపాలని మేం అనుకోం. మన దేశ రక్షణ సన్నద్ధతకు సంబంధించి వారు అత్యాధునిక వ్యవస్థలను కలిగి వుండేలా చూడడంతో పాటు ఈ లక్ష్య సాధనకు దేశీయంగా తయారీ వాతావరణాన్నికల్పించే లక్ష్యసాధనకు అకుంఠిత సంకల్పంతో పనిచేస్తాం. మా చర్యలన్నీ మీతో కలసి భాగస్వాములు కావడంలో సమర్థతను, సామర్ధ్యాన్నిసాధించేందుకు ఉద్దేశించినవే. సమున్నత ఆదర్శాలైన సమగ్రత, రుజువర్తనాల మార్గ నిర్దేశంలో మేం ముందుకుపోతున్నాం.
మిత్రులారా,
ఈ పవిత్ర భూమి ప్రముఖ తమిళ కవి, చింతనాపరుడు తిరువళ్లువార్ గారి మాటలను గుర్తుకు తెస్తున్నది.
వారు అన్నారు :
“ఇసుక నేలలో, మీరు మరింత లోతు కు తవ్వుకొంటూ వెళ్తే గనక, మీరు దాని అడుగున నీటి చెలమలను చేరుకొంటారు; అలా మీరు మరింతగా పోయిన కొద్దీ జ్ఞాన ప్రవాహం పెల్లుబుకుతుంది” అని.
రక్షణ రంగం లోని వారు, పరిశ్రమ వర్గాల వారు కలుసుకొని సైనిక పారిశ్రామిక వాణిజ్య సంస్థల అభివృద్ధికి కృషి చేసేందుకు ఈ డిఫ్- ఎక్స్‌పో అవకాశాన్ని కల్పించగలదని నేను విశ్వసిస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.