బుద్ధ జయంతి ని పురస్కరించుకొని న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో జరిగిన ఉత్సవాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ఆయన సంఘ్ దానాన్ని ప్రదానం చేశారు. సారనాథ్ లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ కు మరియు బోధ్ గయ లోని ఆల్ ఇండియా భిక్షు సంఘానికి వైశాఖ సమ్మాన్ ప్రశస్తి పత్రాన్ని కూడా అందజేశారు.
సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం ఒక విశిష్టమైన వారసత్వానికి నిలయమని, మానవాళి శ్రేయస్సే ఈ దేశంలో అన్నింటి కన్నా మిన్న అయినటువంటి ఆలోచనగా ఉంటూ వస్తోందని స్పష్టం చేశారు. బుద్ధ భగవానుని ప్రబోధాలు అనేక దేశాలను తీర్చిదిద్దాయని ఆయన చెప్పారు. భారతదేశం ఎన్నటికీ ఒక ఆక్రమణదారుగా ఉండని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బుద్ధ భగవానుడు చూపిన అష్టధర్మ సంఘ మార్గాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. మనం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
బుద్ధుడు అందించిన ప్రేమ మరియు కరుణ లతో కూడిన సందేశం నేటి ప్రపంచానికి ఎంతో లాభకారి కాగలుగుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. కాబట్టి, బుద్ధుని ఎడల నమ్మకం ఉన్న వారంతా వారి వారి శక్తులను ఏకం చేసి, ఈ పవిత్ర ఆశయ సాధన కు ముందుకు సాగాలని ఆయన అన్నారు.
బుద్ధ భగవానుడు చూపిన మార్గానికి అనుగుణంగా , ప్రజలకు సేవ చేయాలనే దయాళుత్వ భావనతో ప్రభుత్వం పని చేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే సువిశాల దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని, ఇందులో బుద్ధ భగవానునితో ముడివడినటువంటి వారసత్వం కూడా మిళితమై ఉందని ఆయన చెప్పారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం 360 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమోదించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
దేశం స్వాతంత్య్రాన్ని సముపార్జించుకొని 75 సంవత్సరాలు పూర్తి అయ్యే ఉత్సవాన్ని జరుపుకొనే 2022వ సంవత్సరం కల్లా ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ వారి వంతు తోడ్పాటు ను అందించాలని సభికులకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. ప్రతి ఒక్క వ్యక్తీ కొన్ని కార్యభారాలను గుర్తించాలని, వాటిని ఆ రోజు కల్లా సాధిస్తాననే సంకల్పాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.
समय की मांग है कि संकट से अगर विश्व को बचाने के लिए, बुद्ध का करुणा प्रेम का संदेश काम आता है तो बुद्ध को मानने वाली सभी शक्तियां सक्रिय होनी चाहिए।
— PMO India (@PMOIndia) April 30, 2018
भगवान बुद्ध ने भी कहा था कि इस रास्ते पर संगठित होकर चलने से ही सामर्थ्य प्राप्त होगा: PM
भगवान बुद्ध कहते थे कि किसी के दुख को देखकर दुखी होने से ज्यादा बेहतर है कि उस व्यक्ति को उसके दुख को दूर करने के लिए तैयार करो, उसे सशक्त करो।
— PMO India (@PMOIndia) April 30, 2018
मुझे प्रसन्नता हैं की हमारी सरकार करुणा और सेवाभाव के उसी रास्ते पर चल रही हैं जिस रास्ते को भगवान बुद्ध ने हमें दिखाया था: PM
गुलामी के कालखंड के बाद अनेक वजहों से हमारे यहां अपनी सांस्कृतिक विरासत को सहेजने का कार्य उस तरीके से नहीं हुआ, जैसे होना चाहिए था।
— PMO India (@PMOIndia) April 30, 2018
इसे ध्यान में रखते हुए हमारी सरकार अपनी सांस्कृतिक धरोहर और भगवान बुद्ध से जुड़ी स्मृतियों की रक्षा के लिए एक बृहद विजन पर भी काम कर रही है: PM
Buddhist Circuit के लिए सरकार 360 करोड़ रुपए से ज्यादा स्वीकृत कर चुकी है। इससे उत्तर प्रदेश, बिहार, मध्य प्रदेश, आंध्र प्रदेश और गुजरात में बौद्ध स्थलों का और विकास किया जा रहा है: PM
— PMO India (@PMOIndia) April 30, 2018
ये हम सभी का सौभाग्य है कि 2500 वर्ष बाद भी भगवान बुद्ध की शिक्षाएं हमारे बीच हैं। निश्चित तौर पर हमारे पहले जो लोग थे, इसमें उनकी बड़ी भूमिका रही है। ये हमसे पहले वाली पीढ़ियों का योगदान था,कि आज हम बुद्ध पूर्णिमा पर इस तरह के कार्यक्रम कर पा रहे हैं: PM
— PMO India (@PMOIndia) April 30, 2018
अब आने वाला मानव इतिहास आपकी सक्रिय भूमिका का इंतजार कर रहा है । मैं चाहता हूं कि आज जब आप यहां से जाएं, तो मन में इस विचार के साथ जाएं कि 2022 में, जब हमारा देश स्वतंत्रता के 75 वर्ष का पर्व मना रहा होगा, तब तक ऐसे कौन से
— PMO India (@PMOIndia) April 30, 2018
5 या 10 संकल्प होंगे, जिन्हें आप पूरा करना चाहेंगे: PM