10 కోట్ల కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య రక్షణ కల్పించనున్న ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధాని మోదీ ప్రారంభించారు
కుల,మత వర్గ భేదాలు లేకుండా #AyushmanBharat ఆరోగ్య సంరక్షణ పథకం ప్రయోజనాలు అందరికీ అందుతాయి: ప్రధాని మోదీ
#AyushmanBharat అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాష్ట్ర నిధితో ఉన్న ఆరోగ్య బీమా పథకం: ప్రధాని మోదీ
#AyushmanBharat యొక్క లబ్ధిదారుల సంఖ్య, యురోపియన్ యూనియన్ లేదా అమెరికా కెనడా మరియు మెక్సికో జనాభాకు దాదాపుగా సమానంగా ఉంటుంది: ప్రధాన మంత్రి
#AyushmanBharat యొక్క మొదటి దశ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతినాడు ప్రారంభించగా, ఇప్పుడు పిఎం జన్ ఆరోగ్య యోజనను దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క జయంతికి రెండు రోజుల ముందు ప్రారంభించాము: ప్రధాని మోదీ
క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులకు పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య చికిత్స లభిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్య
#AyushmanBharat: రూ. 5 లక్షలలో అన్ని పరిశోధనలు, ఔషధం, ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు మొదలైనవి. ఇది ముందుగా ఉన్న అనారోగ్యాలను కూడా కవర్ చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు
దేశవ్యాప్తంగా 13,000 కన్నా ఎక్కువ ఆసుపత్రులు #AyushmanBharat:లో చేరాయి: ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 2,300 వెల్నెస్ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటిని 1.5 లక్షలకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాము: ప్రధాని మోదీ
ఆరోగ్య రంగం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సంపూర్ణ పద్ధతితో పనిచేస్తోంది. "సరసమైన ఆరోగ్య సంరక్షణ" మరియు "నిరోధిత ఆరోగ్య సంరక్షణ"ల పై ప్రభుత్వం దృష్టి సారించింది: ప్రధాని మోదీ
పిఎంజేఏవై లో ఉన్నవారి ప్రయత్నాల ద్వారా, వైద్యులు, నర్సులు, హెల్త్కేర్ ప్రొవైడర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల అంకిత భావంతోనే#AyushmanBharat విజయవంతం అవుతుంది: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝార్ ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ లో ఆరోగ్య హామీ పథకం… ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన (PMJAY)ను ప్రారంభించారు. భారీ సంఖ్య లో ప్రజలు హాజరైన సభా వేదికపై ఈ పథకాన్ని ప్రారంభించే ముందు దీనిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ఇదే వేదికపైనుంచి చాయీబసా, కోడెర్మా నగరాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అలాగే 10 ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను ప్రారంభించారు. 

అనంతరం సభలో మాట్లాడుతూ- దేశంలోని నిరుపేదలు, సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, చికిత్సలను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన ఆరోగ్య సంరక్షణ హామీనివ్వడం ఈ పథకం ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. దీనివల్ల 50 కోట్లమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఇది ప్రపంచంలో అత్యంత భారీ ఆరోగ్య హామీ పథకమని చెప్పారు. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఐరోపా సమాఖ్యలోని దేశాలన్నిటి జనాభా లేదా అమెరికా, కెనడా, మెక్సికో వంటి దేశాల ఉమ్మడి జనసంఖ్యకు దాదాపు సమానమని ప్రధాని వివరించారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో తొలి అంచె… ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతినాడు ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. అలాగే రెండో అంచెగా ఆరోగ్య హామీ పథకానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతికి రెండు రోజులముందు శ్రీకారం చుట్టామని చెప్పారు. పిఎంజెఎవై ఎంత సమగ్రమైనదో వివరిస్తూ- దీని పరిధిలో కేన్సర్, గుండెజబ్బులవంటి తీవ్ర అనారోగ్య సమస్యలుసహా 1,300 రకాల రుగ్మతలకు చికిత్స లభిస్తుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా భాగస్వాములుగా ఉంటాయన్నారు. 

ఈ పథకం కింద అందే రూ.5 లక్షల ఆరోగ్య హామీలో అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆస్పత్రిలో చేరకముందు ఖర్చులు వగైరాలు కూడా ఇమిడి ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ఈ పథకంలో చేరడానికి ముందున్న అనారోగ్య సమస్యలకూ వైద్యం లభిస్తుందని పేర్కొన్నారు. పిఎంజెఎవై గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే 14555 నంబరుకు ఫోన్ చేయవచ్చునని లేదా సమీపంలోని సామూహిక సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చునని ప్రధాని సూచించారు.

పిఎంజెఎవై లో భాగస్వాములైన రాష్ట్రాల్లోని ప్రజలు ఆ రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ పథకం కింద సేవలు లభ్యమవుతాయని ఆయన చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 13వేలకుపైగా ఆస్పత్రులు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రారంభించిన 10 ఆరోగ్య-శ్రేయో కేంద్రాల గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ- వీటితో దేశవ్యాప్తంగాగల ఇలాంటి కేంద్రాల సంఖ్య 2300కు చేరిందన్నారు. అయితే, మరో నాలుగేళ్లలో ఈ కేంద్రాల సంఖ్య 1.5 లక్షలకు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

దేశంలో ఆరోగ్య రంగ సంపూర్ణ ప్రగతి దిశగా ప్రభుత్వం సమగ్ర కృషిచేస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఆరోగ్య సంరక్షణ లభ్యత, వ్యాధినిరోధక ఆరోగ్య సంరక్షణ’’లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. 

పిఎంజెఎవై లో భాగస్వాములందరి సమష్టి కృషితోపాటు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ సేవా ప్రదాతలు, ఆశా (ASHA) కార్యకర్తలు, ANM ల అంకితభావం ఫలితంగా ఈ పథకం విజయంతం కాగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage